ప్రమాణస్వీకారాన్ని ఆపేయండి
తాండూరు రూరల్: గాజీపూర్‌లో ఈనెల 11న నిర్వహించిన పంచాయతీ ఎన్నికల్లో అవకతవకలు చోటుచేసుకున్నాయని గ్రామస్తులు ఆరోపించారు. ఈ మేరకు సర్పంచ్ ప్రమాణ స్వీకారాన్ని ఆపేయాలని కోరుతూ గురువారం ఎన్నికల కమిషనలో లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. అనంతరం తీన్మార్ మల్లన్నను కలిసి, మద్దతుకోరారు. వీరిలో ఎంపీటీసీ మాజీ సభ్యుడు తిప్పన్నచారి, మాజీ సర్పంచులు ఈడ్గి సాయిలుగౌడ్, తలారి వీరప్ప, ఉప సర్పంచ్ గడ్డమీది ఏల్లప్ప, వార్డు సభ్యులు మంగళి భీమప్ప, కారుకొండ అనిల్ తదితరులు ఉన్నారు.
గాజీపూర్‌వాసుల ఫిర్యాదు


