అంజన్నా.. కరుణించన్నా..
జాతరకు తరలివచ్చిన భక్తజనం
ప్రత్యేక అలంకరణలో స్వామివారు
దుద్యాల్: అంజన్నా.. కరుణించన్నా అంటూ భక్తులు అడవిలో వెలసిన ఆంజనేయస్వామిని వేడుకున్నారు. దుద్యాల్ మండలం చిలుముల మైల్వార్ గ్రామ శివారులో కొలువుదీరిన మామిడికుంట ఆంజనేయస్వామి జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. బుధవారం అర్ధరాత్రి స్వామివారి రథోత్సవం నిర్వహించారు. గురువారం తెల్లవారుజామున ప్రత్యేక పూజలు, హోమాలు, అభిషేకాలు చేశారు. మధ్యాహ్నం పల్లకీ సేవ, సాయంత్రం పెరుగు బసంతం వేడక నిర్వహించారు. దుద్యాల్, బొంరాస్‌పేట్, కొడంగల్, కోస్గి, దౌల్తాబాద్ మండలాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. మొక్కులు చెల్లించుకున్నారు. మహిళల భజన ఆకట్టుకుంది. ఏటా రెండు సార్లు జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
అంజన్నా.. కరుణించన్నా..


