జనం మెచ్చిన సర్పంచ్‌లు | - | Sakshi
Sakshi News home page

జనం మెచ్చిన సర్పంచ్‌లు

Dec 12 2025 5:48 PM | Updated on Dec 12 2025 5:48 PM

జనం మ

జనం మెచ్చిన సర్పంచ్‌లు

కొలువుదీరనున్న 225 మంది సర్పంచ్‌లు మంచిరోజు చూసుకొని బాధ్యతలు చేపట్టే అవకాశం విజేతలకు శుభాకాంక్షల వెల్లువ అభివృద్ధిపై ఫోకస్‌ చేస్తామంటున్న ‘కొత్త’ పాలకులు ఎనిమిది మండలాల్లో 81.21 శాతం పోలింగ్‌

వికారాబాద్‌: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తొలి అంకం ముగిసింది. మొదటి విడతలో నిర్వహించిన ఎనిమిది మండలాల్లో పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలో మొత్తం 594 గ్రామ పంచాయతీలు ఉండగా తాండూరు రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని తాండూరు, పెద్దేముల్‌, బషీరాబాద్‌, యాలాల, కొడంగల్‌, దౌల్తాబాద్‌, బొంరాస్‌పేట్‌, దుద్యాల్‌ మండలాల్లో గురువారం ఎన్నికలు జరిగాయి. ఈ మండలాల్లో 262 జీపీలు ఉండగా 37ఏకగ్రీవమయ్యాయి. మిగతా వాటికి పోలింగ్‌ నిర్వహించారు. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంటల పోలింగ్‌ సాగింది. 2 గంటలకు కౌటింగ్‌ ప్రక్రియను ప్రారంభించారు. చిన్న పంచాయతీల్లో సాయంత్రం 4 గంటల నుంచే ఫలితాలు వెలువడ్డాయి.

81.21 శాతం పోలింగ్‌

తొలి విడత ఎన్నికల్లో 81.21 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. బొంరాస్‌పేట మండలంలో అత్యధికంగా 84.50 శాతం, బషీరాబాద్‌లో అత్యల్పంగా 77.45 శాతం ఓటింగ్‌ నమోదైంది. చలి తీవ్రత కారణంగా ఉదయం కాస్త మందకొడిగా ప్రారంభమైన పోలింగ్‌ 9 గంటలకు పుంజుకుంది. ఒంటి గంట వరకు పోలింగ్‌ కేంద్రం ఆవరణలో ఉన్న వారందరికీ ఓటు వేసే అవకాశం కల్పించారు. ఉదయం 9 గంటలకు 20.19 శాతం, 11 గంటలకు 52.19 శాతం, మధాహ్నం ఒంటి గంట 73.82 శాతం నమోదైంది. నడవలేని వృద్ధులను, దివ్యాంగులను కుర్చీలు, వీల్‌ చైర్లలో పోలింగ్‌ కేంద్రానికి తీసుకొచ్చి ఓట్లు వేయించారు. మొదటి విడత ఎన్నికలు జరగనున్న ఎనిమిది మండలాల పరిధిలో 2,16,212 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 1,28,943 మంది పురుషులు,1,37,301 మంది మహిళలు ఉన్నారు. వీరి లో 1,06,110 మంది పురుషులు(82.29 శాతం), 1,10,098 మంది మహిళలు(80.19 శాతం) ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇతరలు ఎనిమిది మంది ఉండగా నలుగురు ఓటు వేశారు.

పోలింగ్‌ సరళిని పర్యవేక్షించిన ఉన్నతాధికారులు

తొలి విడత పోలింగ్‌ సరళిని ఉన్నతాధికారులు ఎప్పటికప్పడు పరిశీలించారు. ఎన్నికల సాధారణ పరిశీలకులు యాస్మిన్‌ బాషా పలు పోలింగ్‌ కేంద్రాలను సందర్శించారు. పోలింగ్‌ తీరు, వసతు లపై ఆరా తీశారు. కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌ కలెక్టరేట్‌ నుంచి వెబ్‌ కాస్టింగ్‌ ద్వారా పోలింగ్‌ సరళిని పరిశీలించారు. ఎస్పీ స్నేహమెహ్ర కొడంగల్‌, తాండూరు నియోజకవర్గాల్లో పర్యటించారు. భద్రతా ఏర్పాట్లు పరిశీలించారు. పోలింగ్‌ ప్రక్రియ ప్రశాంతంగా ముగియడంతో జిల్లా యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. ఎన్నికల్లో చివరి నిమిషం వరకు పోరాడి ఓడిపోయిన వాళ్లు ప్రజా తీర్పును గౌరవిస్తున్నట్లు ప్రకటించి మౌనంగా అక్కడి నుంచి తప్పుకోగా, గెలుపొందిన అభ్యర్థులు సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు విజయోత్సవాల్లో ముగిని తేలారు.

మండలాల వారీగా పోలింగ్‌ వివరాలు

మండలం పురుషులు మహిళలు మొత్తం ఓటు పోలైనవి శాతం

తాండూరు 17,828 19,071 36,901 28,672 77.70

బషీరాబాద్‌ 18,299 20,193 38,492 29,811 77.45

యాలాల 16,093 17,807 33,901 27,287 80.49

పెద్దేముల్‌ 18,449 19,499 37,948 31,362 82.64

కొడంగల్‌ 15,066 15,666 30,732 25,583 83.25

దౌల్తాబాద్‌ 19,416 20,339 39,760 32,530 81.82

బొంరాస్‌పేట్‌ 14,055 14,418 28,473 24,061 84.50

దుద్యాల్‌ 9,737 10,308 20,045 16,906 84.34

మొత్తం 1,28,943 1,37,301 2,66,252 2,16,212 81.21

తాండూరు మండలంలో ఆరు పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. బషీరాబాద్‌లో 5, యాలాలలో 10, పెద్దేముల్‌లో 5, కొడంగల్‌లో 01, దౌల్తాబాద్‌లో 03, బొంరాస్‌పేట్‌లో 7, దుద్యాల్‌ మండలంలో రెండు పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి.

మొదటి విడత పోలింగ్‌ ప్రశాంతం

యునానిమస్‌ పంచాయతీలు

జనం మెచ్చిన సర్పంచ్‌లు1
1/1

జనం మెచ్చిన సర్పంచ్‌లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement