మూడో విడత ర్యాండమైజేషన్ పూర్తి
ఎన్నికల సిబ్బందికి విధుల కేటాయింపు
అనంతగిరి: రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మూడో విడత ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తయ్యింది. గురువారం కలెక్టరేట్ సమావేశంలో కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎన్నికల జనరల్ అబ్జర్వర్ షేక్ యాస్మిన్ బాషా సమక్షంలో ర్యాండమైజేషన్ ద్వారా సిబ్బందికి ఎన్నికల విధులు కేటాయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రెండో విడతలో 7 మండలాలు 175 గ్రామ పంచాయతీలు ఉండగా 16 జీపీలు ఏకగ్రీవమైనట్లు తెలిపారు. మిగిలిన 159 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు వివరించారు. ఈ మండలాల్లో 1,520 వార్డులు ఉండగా 122 యునానిమస్ అయినట్లు తెలిపారు. 1,398 వార్డు స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నట్లు చెప్పారు. ఆయా మండలాల్లో ఎన్నికల విధులకు 1,701 మంది ప్రిసైడింగ్ అధికారులు, 2,127 మందితో కూడిన ఇద్దరు సభ్యుల టీంలను, 298 మందితో కూడిన ముగ్గురు సభ్యులు గల 28 టీంలును, 1,398 మందితో కూడిన నలుగురు సభ్యుల టీంలకు ర్యాండమైజేషన్ ద్వారా ఎన్నికల విధులు కేటాయించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సుధీర్, డీపీఓ జయసుధ, నోడల్ ఆఫీసర్లు పాల్గొన్నారు.


