కందిలో గంజాయి సాగు
● తండ్రీకొడుకులపై కేసు నమోదు
● రూ.11 లక్షల విలువైన మొక్కలు, ఎండు గంజాయి స్వాధీనం
తాండూరు టౌన్: కంది పంటలో గంజాయి సాగు చేసిన తండ్రీకొడుకులపై కేసు నమోదు చేసినట్లు వికారాబాద్ జిల్లా ఎకై ్సజ్ అధికారి విజయభాస్కర్ తెలిపారు. తాండూరులోని ఎకై ్సజ్ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కోట్‌పల్లి మండలం బార్వాద్ గ్రామానికి చెందని ఎర్రోళ్ల పెంటయ్య, ఇతని కొడుకు ప్రభాకర్ వీరి పొలంలో కంది పంట వేశారు. ఇందులో గంజాయి సాగు చేస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు, అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా టాస్క్‌ఫోర్స్ బృందం, తాండూరు ఎకై ్సజ్ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. సుమారు రూ.11 లక్షల విలువైన 108 గంజాయి మొక్కలతో పాటు, కిలోన్నర ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కొడుకు ప్రభాకర్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించగా, తండ్రి పెంటయ్య పరారీలో ఉన్నట్లు తెలిపారు. ఈ దాడుల్లో ఏఈఎస్ శ్రీనివాస్‌రెడ్డి, డీటీఎఫ్ సీఐ శ్రీనివాస్, తాండూరు ఇన్‌చార్జి సీఐ రాణి, డీటీఎఫ్ ఎస్‌ఐ ప్రేమ్‌కుమార్‌రెడ్డి, తాండూరు ఎస్‌ఐలు నిజాముద్దీన్, రవికుమార్, సిబ్బంది శివ, ప్రసాద్, హన్మంతు, రవికిరణ్, భీమయ్య, ఆసిఫా బేగం, మహేష్, రాధిక తదితరులు పాల్గొన్నారు.


