అభివృద్ధిలో కలిసి సాగండి
అనంతగిరి: ప్రజల ఆదరణతో సర్పంచ్‌లుగా గెలిచిన వారు గ్రామాల అభివృద్ధికి కృషిచేయాలని శాసన సభ స్పీకర్ ప్రసాద్ కుమార్ అన్నారు. విజయం సాధించిన పలువురు సర్పంచ్‌లు వికారాబాద్‌లోని క్యాంప్ కార్యాలయంలో సోమవారం మర్యాదపూర్వకంగా ఆయనను కలిశారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలకు ఆకర్షితులవుతున్న ప్రజలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ మద్దతుదారులను గెలిపిస్తున్నాని తెలిపారు. ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయాలు చేయాలని, మిగిలిన సమయంలో అందరూ కలిసి, గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని పిలుపునిచ్చారు.
స్పీకర్ ప్రసాద్‌కుమార్


