మలి సమరం
మధ్యాహ్నం 2గంటల నుంచి కౌంటింగ్ 175 పంచాయతీల్లో 20 ఏకగ్రీవం 155 స్థానాలకు బరిలో 510 అభ్యర్థులు
వికారాబాద్: రెండవ విడత పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఇప్పటికే అధికార యంత్రాంగం ఏర్పాట్లను పూర్తి చేసింది.మండల కేంద్రాల నుంచి పోలింగ్ అధికారులు, సిబ్బంది ఎన్నికల సామ గ్రి తో తమకు కేటాయించిన గ్రామాలకు శనివారం బ యలుదేరారు.బ్యాలెట్ బాక్సులు,బ్యాలెట్ పత్రాల ను పోలీసు బందోబస్తు మధ్య కేంద్రాలకు తీసుకెళ్లా రు.మొత్తం 175 గ్రామపంచాయతీలు ఉండగా,ఇ ప్పటికే 20 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మి గతా 155 పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నా యి.ఈ స్థానాల్లో 510 సర్పంచ్ అభ్యర్థులు బరిలో ఉన్నారు.రెండవ విడతలో 1,510 వార్డులకుగాను 294 వార్డులు ఏకగ్రీవమయ్యాయి.మిగిలిన 1,2 26 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి.ఈ వార్డుల ప రిధిలో 3,164 మంది అభ్యర్థులు తలపడుతున్నారు. ఆదివారం ఉదయం 7గంటల నుంచి మధ్యా హ్నం ఒంటిగంట వరకు పోలింగ్ జరుగనుంది.భోజన వి రామం తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ నిర్వహించి ఫలితాలను ప్రకటిస్తారు. తదనంతరం ఉపసర్పంచ్ ఎన్నిక నిర్వహించనున్నారు.
2,22,457 ఓటర్లకు స్లిప్పుల పంపిణీ
వికారాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని వికారాబాద్, బంట్వారం, ధారూరు, కోట్‌పల్లి, మోమిన్‌పేట, నవాబుపేట, మర్పల్లి మండలాల్లో నేడు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇప్పటికే ఓటరు స్లిప్పుల పంపిణీ పూర్తయింది. రిటర్నింగ్ అధికారులు, పోలింగ్ సిబ్బందికి రెండు దఫాలుగా శిక్షణ పూర్తయింది. ప్రతీ పోలింగ్ కేంద్రంలో రిటర్నింగ్ అధికారితో పాటుగా పీఓలు, ఓపీఓలు విధులు నిర్వహిస్తారు. పోలింగ్ నిర్వహించే ఏడు మండలాలలో 1,912 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటుచేశారు. 1,226 మంది పీఓలు, 1,250 మంది ఓపీఓలు, మొత్తం 2,500 పైచిలుకు ఉద్యోగులు ఎన్నికల విధుల్లో పాల్గొననున్నారు. 2,22,457 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
188 లొకేషన్లు.. 57 రూట్లు
రెండవ విడతలో భద్రత పరంగా 188 లొకేషన్లు గుర్తించారు. ఈ విడతలో ఎన్నికలు జరిగే పంచాయతీల్లో 42 సమస్యాత్మక గ్రామాలుగా గుర్తించారు. ఎన్నికల నిర్వహణకుగాను 57 రూట్లుగా విభజించారు. 950 మంది పోలీసు సిబ్బందితో భారీ బందోబస్తును ఏర్పాటుచేస్తున్నారు. స్థానిక పోలీసు సిబ్బందితో పాటు సుమారుగా 150 మంది స్పెషల్ పోలీసులు సైతం ఎన్నికల విధుల్లో పాల్గొంటారు. శాంతిభద్రతల సమస్యలను తెలుసుకోవడానికి ఎస్పీ కార్యాలయంలో పోలీస్ కంట్రోల్‌రూంను ఏర్పాటుచేశారు.
పోలింగ్ బూత్‌కు తీసుకురావడమే లక్ష్యం
కలెక్టర్ ప్రతీక్‌జైన్, అడిషనల్ కలెక్టర్లు లింగ్యానాయక్, సుధీర్, డీపీఓ జయసుధల పర్యవేక్షణలో జిల్లా యంత్రాంగం ఓటింగ్ కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. దివ్యాంగులు, ఇతర ప్రత్యేక ప్రతిభావంతులకు ఓటు వేసే సమయంలో ఇబ్బందులు తలెత్తకుండా వీల్ చైర్‌లు తదితర ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. చివరి రోజు ప్రలోభాల పర్వంలో మునిగిపోయారనే చర్చలు వినిపిస్తున్నాయి. ప్రతీ ఓటరును పోలింగ్ బూత్‌కు తీసుకువచ్చేలా అభ్యర్థులు శాయశక్తులు ఒడ్డుతున్నారు.
అబ్జర్వర్ ఆగ్రహం
వికారాబాద్ ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌ను శనివారం ఎన్నికల అబ్జర్వర్ యాస్మిన్‌బాష సందర్శించారు. ఇప్పటివరకు ఎంత మంది ఎన్నికల సిబ్బంది వచ్చారు? ఇంక ఎంతమంది రావాలనే విషయాన్ని అక్కడున్న అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఉదయం 11.30 గంటలు దాటినా మెజార్టీ సిబ్బంది రాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ధారూరులోనూ ఇదే పరిస్థితి తలెత్తగా ఎంపీడీఓ ఉద్యోగులను మైకులో పదే పదే మందలించారు. కలెక్టర్‌కు రిపోర్ట్ చేస్తానని బెదించారు. దీంతో ఓ ఉద్యోగి కుప్పకూలాడు. ఆ సంఘటనను అదునుగా తీసుకున్న ఉద్యోగులు ఎంపీడీఓ డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేశారు.
రెండో దశ పోలింగ్ వివరాలు
మండలం మొత్తం పంచాయతీలు ఏకగ్రీవం పోలింగ్ నిర్వహించనున్న జీపీలు ఓటర్లు
వికారాబాద్ 21 – 21 24,237
ధారూరు 34 05 29 36,261
మోమిన్‌పేట్ 29 04 25 39,576
నవాబుపేట్ 32 02 30 37,786
బంట్వారం 12 01 11 17,589
మర్పల్లి 29 03 26 45,581
కోట్‌పల్లి 18 05 13 21,427


