యువతకు ఉపాధే లక్ష్యం
ఇప్పటికే లక్ష ఉద్యోగాలు భర్తీ చేశాం బీఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది గనులు, కార్మిక, ఉపాధి కల్పన శాఖల మంత్రి గడ్డం వివేక్‌వెంకటస్వామి. పరిగిలో అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్‌కుశంకుస్థాపన
పరిగి: యువతకు ఉపాధి కల్పనే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని గనులు, కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి గడ్డం వివేక్‌వెంకటస్వామి అన్నారు. టాటా కంపెనీ సౌజన్యంతో రూ.45 కోట్లు వెచ్చించి పరిగిలోని నస్కల్‌లో నిర్మించనున్న అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్‌కు శనివారం ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా 115 ఏటీసీలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇందుకోసం రూ.4 వేల కోట్ల నిధులు వినియోగిస్తున్నామని తెలిపారు. వీటిలో ట్రైనింగ్ పూర్తి చేసుకున్న యువతకు పరిశ్రమల్లో ఉద్యోగావకాశాలు కల్పిస్తామని స్పష్టంచేశారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఏటీసీలను పట్టించుకోలేదని, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటికే లక్ష ఉద్యోగాలను భర్తీ చేశారని వెల్లడించారు. యువతకు సరైన ఉద్యోగాలు లభిస్తేనే రాష్ట్రం పురోగమిస్తుందని తెలిపారు. రాష్ట్ర ఆదాయంలో 22శాతం వరకు కార్మిక, మైనింగ్ విభాగాల నుంచే వస్తోందన్నారు. ఇప్పటికే మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కొనసాగుతోందని, తమ ఐదేళ్ల పాలనలో 17 లక్షల ఇళ్లు మంజూరు చేస్తామని ప్రకటించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం పేదలకు ఒక్క ఇల్లు కూడా ఇచ్చిన పాపాన పోలేదన్నారు. స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతోనే ఏటీసీ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రీజనల్ డిప్యూటీ డైరెక్టర రాజు, మార్కెట్ కమిటీ చైర్మన్ పరశురాంరెడ్డి, వైస్ చైర్మన్ అయూబ్, కుల్కచర్ల ఏఎంసీ చైర్మన్ ఆంజనేయులు,డీసీసీ ఉపాధ్యక్షుడు లాల్‌కృష్ణ, ఏబ్లాక్ అధ్యక్షుడు పార్థసారథి, పట్టణ అధ్యక్షుడు ఎర్రగడ్డపల్లి కృష్ణ, నాయకులు తదితరులు పాల్గొన్నారు.


