కుష్టు అనుమానితుల గుర్తింపు
కొడంగల్ రూరల్: లెప్రసీ వ్యాధిగ్రస్తులను(కుష్టు) గుర్తించేందుకు వైద్యాధికారులు గురువారం నుంచి సర్వేను ప్రారంభించారు. గ్రామాల్లో ఉదయం ఆశ కార్యకర్తలు ఇంటింటి సర్వేలో అనుమానితులను గుర్తించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. మున్సిపల్ పరిధిలోని గాంధీనగర్, పాతకొడంగల్ గ్రామాల్లో ఇంటింటి సర్వే నిర్వహిస్తుండగా ఏఎన్‌ఎంలు పరిశీలించారు. ఈ నెల 31వ తేదీ వరకు సర్వే నిర్వహించనున్నట్లు ఏఎన్‌ఎంలు తెలిపారు. పరిశీలన సమయంలో అనుమానితులుగా గుర్తిస్తే సంబంధిత వ్యక్తుల ఫోన్ నంబర్, ఆధార్‌కార్డు జిరాక్స్, ఇంటి చిరునామాలను సేకరిస్తూ ఉన్నతాధికారులకు రిపోర్టు చేయనున్నట్లు సూచించారు. పూర్తి స్థాయి పరిశీలన అనంతరం వ్యాధి ఉన్నట్లు గుర్తించివారికి మందులు ఉచితంగా అందించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏఎన్‌ఎం మనెమ్మ, ఆశ కార్యకర్తలు మంజుల, రాధ, ఇందిరమ్మ, సునిత, అనిత తదితరులు పాల్గొన్నారు.
ఇంటింటికి వెళ్లి వివరాల సేకరణ
దుద్యాల్: మండల వ్యాప్తంగా కుష్టు వ్యాధిగ్రస్తులను గుర్తించే సర్వే గురువారం ప్రారంభమైంది. గ్రామాల్లో ఏఎన్‌ఎంలు, ఆశ కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్లి సర్వే చేపడుతున్నారు. దుద్యాల్, లగచర్ల, హకీంపేట్, పోలేపల్లి, ఈర్లపల్లి, గౌరారం, చెట్టుపల్లి తండా, అల్లిఖాన్‌పల్లి, వాల్యా నాయక్ తండా, నాజుఖాన్‌పల్లి, చిలుముల్ మైల్వార్ తదితర గ్రామాల్లో సర్వే చేపట్టారు. ఒక్క ఆశ కార్యకర్త ప్రతి రోజు 20 ఇళ్లను సర్వే చేస్తున్నారు.
ప్రారంభమైన లెప్రసీ సర్వే


