సత్తాచాటారు.. సర్పంచ్‌లయ్యారు
శంకర్‌పల్లి: చిన్నచిన్న సంఘటనలు మినహా ఆదివారం నిర్వహించిన రెండో విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా పూర్తయ్యాయి. ఈఎన్నికల్లో బీఆర్‌ఎస్ బలపర్చిన కొండకల్ అభ్యర్థి ఎరుకల శేఖర్ 730 ఓట్లతో అత్యధిక మెజారిటీతో గెలుపొందగా, ఎల్వర్తి గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్ మద్దతుదారులు మారెపల్లి భాగ్యలక్ష్మి 721 ఓట్లతో భారీ విజయం సాధించారు. గోపులారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తంగెడపల్లి రవీందర్‌రెడ్డి హోరాహోరీ పోరులో 10 ఓట్ల స్వల్ప మెజార్టీతో విజయం సాధించారు.
కుర్వగూడ ‘సర్పంచ్ హ్యాట్రిక్’
షాబాద్: మండల పరిధిలో కుర్వగూడ సర్పంచ్ బుయ్యని సంధ్యరాణి హ్యాట్రిక్ విజయం సాధించారు. వరుసగా మూడోసారి ఆమె గ్రామ ప్రథమ పౌరురాలిగా ఎన్నికయ్యారు. ఇదిలా ఉండగా మండలంలో బీఆర్‌ఎస్ సత్తాచాటింది. మొత్తం 41 పంచాయతీలు ఉండగా, 22 జీపీలను గులాబీ సానుభూతిపరులే సొంతం చేసుకున్నారు. కాంగ్రెస్ 17, బీజేపీ, ఇండిపెండెంట్‌కు చెరో స్థానం దక్కింది.
ఒక్క ఓటు తేడాతో విజయం
కడ్తాల్: రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో నార్లకుంటతండా సర్పంచ్ స్థానానికి హోరాహోరీగా పోటీ సాగింది. ఒకేఒక్క ఓటు తేడాతో అంగోతు రాంచందర్‌నాయక్ విజయం సాధించారు. తండాలో మొత్తం 462 ఓట్లు ఉండగా, 423 ఓట్లు పోలయ్యాయి. బీఆర్‌ఎస్ మద్దతుతో పోటీ చేసిన అంగోత్ రాంచందర్‌నాయక్‌కు 206 ఓట్లు రాగా, కాంగ్రెస్ బలపరిచిన జాటవత్ రమేశ్‌కుమార్‌కు 205 ఓట్లు వచ్చాయి. నోటాకు 3 ఓట్లు పడగా, 9 ఓట్లు చెల్లకుండాపోయాయి. దీంతో ఒక్క ఓటు తేడాతో రాంచందర్‌నాయక్ విజయం సాధించారు.
ఆ రెండు గ్రామాల్లో పోలీస్ పికెటింగ్
చేవెళ్ల: పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఘర్షణలకు దారితీసిన రెండు గ్రామాల్లో సోమవారం పోలీస్ పికెటింగ్ కొనసాగిస్తున్నట్లు పోలీస్ అధికారులు తెలిపారు. సింగప్పగూడ, రేగడిఘనాపూర్‌లో ఆదివారం స్వల్ప ఘర్షణలు చోటు చేసుకోవడం తెలిసిందే. ఈ క్రమంలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆ రెండు గ్రామాల్లో పోలీస్ పికెటింగ్ కొనసాగిస్తున్నారు. 144 సెక్షన్ అమలులో ఉంటుందని, సాధారణ పరిస్థితులు వచ్చే వరకు పికెటింగ్ కొనసాగుతుందని పోలీసులు చెప్పారు. ఎవరైనా గొడవలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
డివిజన్ల ఏర్పాటుపై అభ్యంతరాలు
తుర్కయంజాల్: జీహెచ్‌ఎంసీ ఇటీవల ప్రకటించిన వార్డులపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ తుర్కయంజాల్ బీజేపీ నాయకులు సోమవారం కమిషనర్ కర్ణన్‌ను కలిసి లేఖ అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కొత్త కాలనీలు, ఇళ్లలో నివసిస్తున్న జనాభా ఆధారంగా విభజన చేపట్టాలని కోరారు. తుర్కయంజాల్, తొర్రూర్ డివిజన్లను మొత్తం నాలుగు డివిజన్లుగా చేయాలని, కోహెడ పేరుతో ఓ డివిజన్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
సత్తాచాటారు.. సర్పంచ్‌లయ్యారు
సత్తాచాటారు.. సర్పంచ్‌లయ్యారు
సత్తాచాటారు.. సర్పంచ్‌లయ్యారు
సత్తాచాటారు.. సర్పంచ్‌లయ్యారు


