ఇందిరమ్మ రాజ్యంతోనే అభివృద్ధి
● పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి
● పలు గ్రామాల్లోపంచాయతీ ఎన్నికల ప్రచారం
దోమ: ఇందిరమ్మ రాజ్యంతోనే అభివృద్ధి సాఽ ద్యమని పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి అన్నారు. సోమవారం తన స్వగ్రామం శివారెడ్డిపల్లిలో కాంగ్రెస్ మద్దతుదారు లక్ష్మమ్మతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అనంతరం బొంపల్లి, బాస్పల్లిలో అభ్యర్థులు బోయిని సంతోష, తలారి అనంతయ్య తరఫున ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో అత్యధిక సర్పంచ్ స్థానాలు కాంగ్రెస్ పార్టీకే వచ్చాయని, ప్రజలంతా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నారని తెలిపారు. ప్రతీ గ్రామంలో సీసీ రోడ్లు, అండర్ డ్రైనేజీలు, వీధి దీపాలు, మంచినీటి వసతి కల్పిస్తున్నారని స్పష్టంచేశారు. అధికార పార్టీకి సంబంధించిన వారిని గెలిపించుకుంటేనే పల్లెల్లో అభివృద్ధి సాధ్యమవుతుందని స్పష్టంచేశారు.


