కేంద్ర నిధులతోనే గ్రామాభివృద్ధి
పరిగి: కేంద్ర ప్రభుత్వ నిధులతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెన్న ఈశ్వరప్ప అన్నారు. సోమవారం ఆయన పట్టణ కేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చిల్లిగవ్వ ఇవ్వలేదన్నారు. గ్రామాలు అభివృద్ధి చెందాలంటే బీజేపీ బలపరిచిన అభ్యర్థులకు ఓటేసి గెలిపించాలని కోరారు. మురుగు కాల్వలశుభ్రం, వీధి దీపాలు, సీసీ రోడ్ల నిర్మాణాలు ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ నిధులతోనే జరుగుత్నుఆయని చెప్పారు. ఉచిత రేషన్ బియ్యం కేంద్రమే అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాంచందర్, రాము యాదవ్, పెంటయ్యగుప్తా, బాలకృష్ణారెడ్డి, శ్రీనివాస్, సురేశ్, నర్సింలు, రాంచందర్ పాల్గొన్నారు.
ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఈశ్వరప్ప


