ప్రజలకు సుపరిపాలన అందించాలి
బంట్వారం: ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుందని డీసీసీ అధ్యక్షుడు ధారాసింగ్ అన్నారు. కోట్‌పల్లి సర్పంచ్‌గా ఘన విజయం సాధించిన జంగం బసమ్మను సోమవారం ఆయన మండల కేంద్రంలో శాలువా పూలమాలతో సత్కరించి, శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు సుపరిపాలన అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సంగయ్య స్వామి, జ్ఞానేశ్వర్, సమ్మయ్య, ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు.
ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన కారు
కేశంపేట: ఆర్టీసీ బస్సును కారు వెనుక నుంచి ఢీకొన్న సంఘటన మండల పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహేశ్వరం డిపోకు చెందిన బస్సు ఆదివారం రాత్రి శంషాబాద్ నుంచి మిడ్జిల్‌కు వెళ్తుండగా మండల పరిధిలోని కొత్తపేట శివారులో కారు వెనుక నుంచి ఢీకొట్టింది. కారును డ్రైవర్ అజాగ్రత్తగా నడిపి బస్సును ఢీ కొట్టాడని, బస్సు వెనుక భాగం ధ్వంసం అయిందని బస్సు డ్రైవర్ అబ్ధుల్లా సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్టు సీఐ నరహరి తెలిపారు.
కారు ఢీకొని యువకుడికి గాయాలు
కేశంపేట: బైక్‌ను కారు ఢీకొట్టడంతో ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన మండల కేంద్రంలో చోటుచేసుకుంది. బాధుతుడి కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తలకొండపల్లి మండలం చుక్కాపూర్ గ్రామానికి చెందిన కొప్పు నందు ఆదివారం రాత్రి షాద్‌నగర్ నుంచి స్వగ్రామానికి బైక్‌పై వెళ్తుండగా కేశంపేట శివారులో కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నందుకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ మేరకు సోమవారం బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ నరహరి తెలిపారు.
విద్యార్థులు నైపుణ్యం పెంపొందించుకోవాలి
రంగారెడ్డి డీఈఓ సుశీందర్‌రావు
మహేశ్వరం: విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యం, సృజనాత్మకతను వెలికితీసేందుకు సైన్స్ ఫెయిర్‌లు దోహదపడతాయని జిల్లా విద్యాధికారి సుశీందర్‌రావు అన్నారు. మండల పరిధిలోని తుమ్మలూరు సమీపంలో ఉన్న భాష్యం బ్లూమ్స్ స్కూల్‌లో సోమవారం జిల్లాస్థాయి సైన్స్ ఫెయిర్ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు తమ నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. జిల్లా సైన్స్ అధికారి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. సైన్స్ అంటే కేవలం పుస్తకాల్లో ఉన్న విషయాలు మాత్రమే కాదన్నారు. మన చుట్టూ జరిగే విషయాలను గమనించడం కూడా సైన్సేనని పేర్కొన్నారు. అంతకు ముందు జిల్లాలోని పలు పాఠశాలల నుంచి వచ్చిన విద్యార్థులు వివిధ ప్రయోగాలు చేసి ప్రదర్శించారు. పోటీల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి కస్నా నాయక్, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
రాష్ట్ర స్థాయికి ఎంపికై న ప్రయోగం
కొందుర్గు: మహేశ్వంలో సోమవారం నిర్వహించిన జిల్లాస్థాయి సైన్స్ ఫెయిర్‌లో కొందుర్గు ఉన్నత పాఠశాల విద్యార్థి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై ంది. పాఠశాలలో చదివే మణితేజ తయారు చేసిన ప్రయోగం రాష్ట్రస్థాయికి ఎంపికై నట్టు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గోపీనాథ్ తెలిపారు. ప్రాజెక్టు తయారీలో సైన్స్ టీచర్ రామకృష్ణ సహకరం అందించినట్టు చెప్పారు. ఈ సందర్భంగా మణితేజను ఉపాధ్యాయులు, గ్రామస్తులు అభినందించారు.
ప్రజలకు సుపరిపాలన అందించాలి


