గ్రామాల అభివృద్ధికి పాటుపడాలి
● మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి
● నూతన సర్పంచ్‌లకు సన్మానం
తాండూరు రూరల్: గ్రామాల అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. పెద్దేముల్ మండలం మంబాపూర్ సర్పంచ్ భార్గవిశ్రీనివాస్, ఉప సర్పంచ్ మోహిజ్‌ను అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పార్టీలకు అతీతంగా గ్రామాల అభివృద్ధికి పాటుపడాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ధన్‌రాజ్, జ్యోతి, శ్రీదేవి, స్వరూప, అశోక్, అనంతయ్య, నవీన్, సత్తార్‌మియా, లాజర్, ఎల్లప్ప, పుల్లప్ప పాల్గొన్నారు.
గౌతాపూర్‌లో ఎమ్మెల్సీ సందడి..
తాండూరు మండలం గౌతాపూర్ గ్రామంలో మండలి చీఫ్ మహేందర్‌రెడ్డి సందడి చేశారు. గ్రామానికి చెందిన మాజీ వైస్ ఎంపీపీ రాజప్పగౌడ్ ఇంట్లో నిర్వహించిన అయ్యప్ప పడిపూజకు హాజరై తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ఇదే గ్రామానికి చెందిన రాంచెంద్రారెడ్డి ఇంటికి వెళ్లి నూతన సర్పంచు జెన్నె సుజనను సన్మానించి, కాంగ్రెస్ కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పార్టీ మండల అధ్యక్షుడు జెన్నె నాగప్ప, సీనియర్ నాయకులు కరణం పురుషోత్తంరావు తదితరులు ఉన్నారు.


