కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్ప వని ఎస్పీ స్నేహమెహ్ర హెచ్చరించారు. మంగళవారం ఎన్నికల బందోబస్తుపై మాట్లాడా రు. సమస్యాత్మక, అతిసమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తే ఉపేక్షించమన్నారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. అర్హులు విధిగా ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. స్వేచ్ఛగా ఓటు వేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. సోషల్ మీడియాలో ప్రచారమయ్యే తప్పుడు వార్తలపై అప్రతమత్తంగా ఉండాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బంది అప్ర మత్తంగా ఉండాలని ఆదేశించారు. పోలింగ్ అనంతరం ర్యాలీలు, సబంరాలు, సభలు, సమావేశాలు నిషేధమన్నారు.


