వైద్య సేవలపై అవగాహన అవసరం
అనంతగిరి: ప్రభుత్వం అందిస్తున్న వైద్య సేవలపై అవగాహన పెంచుకోవాలని జిల్లా వైద్యాధికారి స్వర్ణకుమారి అన్నారు. శుక్రవారం వికారాబాద్ ప్రభుత్వాస్పత్రిలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే సందర్భంగా ఆరోగ్య అవగాహన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం అందిస్తున్న వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రభుత్వం మాతా, శిశు ఆరోగ్య సేవలు, వాక్సినైజేషన్, ఇతర ఆరోగ్య కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ వెంకటేశ్, డాక్టర్ సంగీత తదితరులు పాల్గొన్నారు.
మెరుగైన వైద్యం అందించాలి
మోమిన్‌పేట: ఆస్పత్రికి వచ్చే వారికి మెరుగైన సేవలు అందించాలని జిల్లా వైద్యాధికారి సర్ణకుమారి అన్నారు. శుక్రవారం ఆమె మండల కేంద్రంలోని ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించారు. ప్రభుత్వాస్పత్రికి ఎక్కువగా పేదలే వస్తారని వారికి నాణ్యమైన వైద్యం అందించాలన్నారు. ఉద్యోగులు విధిగా సమయ పాలన పాటించాలని సూచించారు. ఆస్పత్రుల్లో కావాల్సిన మందులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఆస్పత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు.


