రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు శ్రీలక్ష్మి | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు శ్రీలక్ష్మి

Dec 10 2025 9:21 AM | Updated on Dec 10 2025 9:21 AM

రాష్ట

రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు శ్రీలక్ష్మి

రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు శ్రీలక్ష్మి అభివృద్ధికి ఆకర్షితులై కాంగ్రెస్‌లో చేరికలు కేసీఆర్‌ హయాంలోనే రాష్ట్రం పురోగతి అభివృద్ధికి పట్టం కట్టండి

తాండూరు టౌన్‌: పట్టణంలోని అక్షర హై స్కూల్‌లో తొమ్మిదో తరగతి చదువుతున్న శ్రీలక్ష్మి రాష్ట్రస్థాయి ఖో ఖో పోటీలకు ఎంపికయ్యారు. మంగళవారం వికారాబాద్‌లో నిర్వహించిన జిల్లాస్థాయి పోటీ ల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర జట్టుకు ఎంపికయ్యింది. క్రీడాకారిణి శ్రీలక్ష్మి తోపాటు ఆమెకు శిక్షణ ఇచ్చిన పీడీటీలు రవీందర్‌ రెడ్డి, గోపాల్‌ నాయక్‌ను పాఠశాల ప్రిన్సిపాల్‌ మో హనకృష్ణ గౌడ్‌, ఉపాధ్యాయులు తదితరులు అభినందించారు.

స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌

మర్పల్లి: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై ఇతర పార్టీలకు చెందిన పలువురు కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ తెలిపారు. మంగళవారం మర్పల్లికి చెందిన మాజీ ఉప సర్పంచ్‌లు కనెగెరి రాజు, దగ్గని సంగయ్య మరో 20 మంది అనుచరులు వికారాబాద్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. వారికి స్పీకర్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్‌ నాయకులు సుభాష్‌ యాదవ్‌, కోటపల్లి రాచన్న, మర్పల్లి మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ మల్లేశ్‌ యాదవ్‌, మాజీ డైరక్టర్‌ గౌస్‌, నాయకులు సాయి కిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి

బొంరాస్‌పేట: మాజీ సీఎం కేసీఆర్‌ హయాంలోనే రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందిందని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని బొట్లోనితండా, వడిచర్ల గ్రామాల్లో పర్యటించారు. సర్పంచ్‌ ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులను పలకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి కుంటుపడిందన్నారు. అధికార పార్టీ మద్దతుదారులు అరాచకాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. పోలీసులకు ఫోన్‌ చేసి శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నాయకులు మహేందర్‌రెడ్డి, యాదగిరి, నెహ్రూ నాయక్‌, సురేశ్‌రాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి

యాలాల: అధికార పార్టీ మద్దతుతో స్థానిక ఎన్నికల్లో బరిలో ఉన్న వారికి ఆదరించి గెలిపించి అభివృద్ధికి పట్టం కట్టాలని ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని దేవనూరు, యాలాల, అగ్గనూరు, పేర్కంపల్లి తదితర గ్రామాల్లో అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు. పార్టీ బలపరిచిన అభ్యర్థులకు భారీ మెజార్టీ అందించి గెలిపించాలన్నారు. ఇప్పటికే గ్రామాల్లో అవసరమున్న చోటా సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలకు నిధులు మంజూరు చేశామన్నారు. సర్పంచ్‌లుగా ఎన్నికయ్యే వారికి అధికార పార్టీ ఎక్కువ నిధులు కేటాస్తుందన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్‌ బాల్‌రెడ్డి, సొసైటీ చైర్మన్‌ సురేందర్‌రెడ్డి, నాయకులు హన్మంతు, పేరి రాజేందర్‌రెడ్డి, అక్బర్‌బాబా, భీమప్ప, వీరేశం, ఖాసీం, శ్రీనివాస్‌చారి తదితరులు ఉన్నారు.

రాష్ట్రస్థాయి ఖోఖో  పోటీలకు శ్రీలక్ష్మి 
1
1/3

రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు శ్రీలక్ష్మి

రాష్ట్రస్థాయి ఖోఖో  పోటీలకు శ్రీలక్ష్మి 
2
2/3

రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు శ్రీలక్ష్మి

రాష్ట్రస్థాయి ఖోఖో  పోటీలకు శ్రీలక్ష్మి 
3
3/3

రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు శ్రీలక్ష్మి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement