చలి పంజా
తాండూరు: జిల్లాలో చలి పంజా విసురుతోంది. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ప్రస్తుత సీజన్‌లో 14 మండలాల్లో 10 డిగ్రీల కనిష్ట టెంపరేచర్ నమోదవుతోంది. దీంతో వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మరో 6 మండలాలను ఎల్లో అలర్ట్ జాబితాలో చేర్చింది. వారం రోజులుగా అనేక మండలాల్లో 8నుంచి 14 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నాలుగు మండలాల్లో 6.8 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు ధ్రువీకరించారు. ఉదయం 9 గంటలైనా చలి తీవ్రత తగ్గడం లేదు. జనాలు ఇంటి నుంచి బయటికి రావాలంటేనే జంకుతున్నారు. చిన్నారులు, వృద్ధుల పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. పగటి ఉష్ణోగ్రతలు 25 నుంచి 30 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. ఉదయం ఎండ.. సాయంత్రం చలి జనాలను ఇబ్బంది పెడుతోంది. ఈ ఏడాది జిల్లాలో భారీగా వర్షాలు పడటం వల్లే ఈ పరిస్థితి నెలకొన్నట్లు వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. మరో వారం రోజులు చలిగాలుల తీవ్రత అధికంగా ఉంటుందన్నారు. తెలిపారు. జిల్లాలో కనిష్ణ ఉష్ణోగ్రతలు నమోదవడం పంటలపై తీవ్ర ప్రభావం పడుతోంది. రాత్రి సమయంలో వరి నారు మడుల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.
మండలాల వారీగా నమోదైన ఉష్ణోగ్రతలు
భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు


