విజయోత్సవ ర్యాలీలు నిషేధం
ఎస్పీ స్నేహ మెహ్ర
అనంతగిరి: వికారాబాద్ సబ్ డివిజన్ పరిధిలో ఆదివారం జరగనున్న రెండో విడత పంచాయతీ ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించేందుకు జిల్లా పోలీస్‌శాఖ కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టిందని ఎస్పీ స్నేహమెహ్ర శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. వికారాబాద్, బంట్వారం, మోమిన్‌పేట్,మర్పల్లి, ధారూర్, కోట్‌పల్లి, నవాబుపేట్ మండలాల్లో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. పోలింగ్ కేంద్రాల నుంచి వంద మీటర్ల పరిధిలో గుంపులుగా చేరడం నిషేధమన్నారు. అక్రమంగా మద్యం రవాణా, నిల్వ, విక్రయాలకు పాల్పడిన వారిపై, ప్రలోభాలకు గురిచేసే వారిపై చర్యలుంటాయని హెచ్చరించారు. విజయోత్సవ ర్యాలీలు, సంబురాలు నిషేధించినట్లు చెప్పారు. శాంతి భద్రతల పరిరక్షణకు, నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణకు ప్రజలు, అభ్యర్థులు పోలీసు శాఖకు సంపూర్ణ సహకారం అందించాలని కోరారు.
విశ్రాంత ఉద్యోగుల సంఘం యూనిట్ అధ్యక్షుడిగా శ్రీహరి
అనంతగిరి: ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం వికారాబాద్ యూనిట్ అధ్యక్షుడిగా శ్రీహరిని ఎన్నుకున్నారు. శుక్రవారం వికారాబాద్‌లోని ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యూనిట్ అధ్యక్షుడిగా శ్రీహరి, సహాధ్యక్షుడిగా కిష్టయ్య, ఉపాధ్యక్షుడిగా గాలయ్య, జిల్లా కౌన్సిలర్‌గా గాలయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు జిల్లా అధ్యక్షుడు మాణిక్‌ప్రభు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా ప్రతినిధులు పాల్గొన్నారు.
డీజే ఆపరేటర్లకు కౌన్సెలింగ్
అనంతగిరి: G°²-MýSÌS MøyŠæ AÐ]l$-Ë$ÌZ E¯]l²…§ýl$¯]l Ñf-Äñæ*™èlÞ-Ð]l-Æ>Å-ÎË$ °õÙ-«§ýl-Ð]l$-°.. ÐésìæMìS yîlgôæ Ýû…yŠæ íÜçÜt… ò³yìl™ól ïÜgŒæ ^ólĶæ$-yýl…™ø ´ër$ Ķæ$f-Ð]l*-¯]l$Ë$, Bç³-Æó‡-r-Æý‡ÏOò³ MóSçÜ$Ë$ ¯]lÐðl*§ýl$ ^ólÝë¢Ð]l$° ïÜI Á…MýS$-Ð]l*ÆŠ‡ òßæ^èlaÇ…-^éÆý‡$. Gïܵ õܲçßæÐðl${çßæ B§ólÔ>ÌS Ðól$Æý‡MýS$ Ô¶æ${MýS-ÐéÆý‡… BĶæ$¯]l yîli Ķæ$f-Ð]l*-¯]l$Ë$, Bç³-Æó‡-r-Æý‡ÏMýS$ Mú¯ðlÞ-Í…VŠæ C^éaÆý‡$. A¯]l$Ð]l$† ÌôæMýS$…yé ¿êÈ Ôèæº-®…™ø çÜ…X™èl ç³ÇMýS-Æ>Ë$ ѰÄñæ*-WõÜ¢ ^èlÆý‡ÅË$ ™èlç³µÐ]l° òßæ^èla-Ç…-^éÆý‡$. ˘
16 నుంచి
ధనుర్మాస పూజలు
కొడంగల్: పట్టణంలోని పద్మావతీ సమేత శ్రీ మహాలక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం నుంచి ధనుర్మాసం పూజలు ప్రారంభించనున్నట్లు ఆలయ ధర్మకర్త నందారం శ్రీనివాస్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 16 నుంచి జనవరి 14వ తేదీ వరకు ప్రతి రోజు ఉదయం ధనుర్మాసం పూజలు, తిరుప్పావై కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ప్రతి రోజు ఉదయం 4 గంటలకు సన్నాయి, 5 గంటలకు సుప్రభాతం, తోమాల సేవ, అర్చన, 6 గంటలకు తిరుప్పావై ప్రవచనం ప్రసాద వితరణ ఉంటుందన్నారు. ఈ నెల 30న వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉదయం 6 గంటలకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తున్నామని చెప్పారు. జనవరి 14న మధ్యాహ్నం 2 గంటలకు గోదాదేవి కల్యాణోత్సవం, సాయంత్రం 4 గంటలకు తిరుచ్చి ఉత్సవ ఊరేగింపు, 15న మకర సంక్రాంతి, 16న కనుమ, నీరాటోత్సవం, అలంకార తిరుమంజనం ఉంటుందన్నారు. అభిషేకం, అమ్మవారికి నోము తదితర పూజలను వైఖానస ఆగమ శాస్త్రోంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. గోదాదేవి కల్యాణోత్సవంలో పాల్గొనే దంపతులు రూ.1,551 చెల్లించి గోత్రనామాలతో పేరు నమోదు చేయించుకోవాలన్నారు. పొంగలి తళిహకు ప్రసాదం చేయించే భక్తులు ఆలయంలో రూ.450 చెల్లించాలన్నారు శ్రీమాన్ ధరూర్ శ్రీనివాసాచార్యులు తిరుప్పావై ప్రవచనం వినిపిస్తారని వివరించారు.
విజయోత్సవ ర్యాలీలు నిషేధం
విజయోత్సవ ర్యాలీలు నిషేధం
విజయోత్సవ ర్యాలీలు నిషేధం


