కాంగ్రెస్ మాయమాటలు నమ్మొద్దు
తాండూరు రూరల్: కాంగ్రెస్ నేతల మాటలను ప్రజలు నమ్మరాదని మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి అన్నారు. మంగళవారం తాండూరు, పెద్దేముల్ మండలాల్లో బీఆర్‌ఎస్ బలపర్చిన అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత ఎన్నికల్లో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని బూటకపు హామీలు ఇస్తున్నారని, ప్రజలు నమ్మరాదని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై గ్రామాల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. మళ్లీ బీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తోందని ఆయన పేర్కొన్నారు.
మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి


