ప్రజాసేవకులకే మద్దతు
దుద్యాల్: మండల పరిధిలోని హకీంపేట్‌లో కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి రవీంద్ర నర్సింహారెడ్డికి ప్రజా మద్దతు కూడగట్టుకోవడంలో ముందున్నారు. సోమవారం గ్రామంలో నిర్వహించిన ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడు తూ.. ప్రజాసేవకులకే జనం మద్దతు లభిస్తుందని తెలిపారు. ఊరికి మంచి చేసే నాయకులకే ప్రజలు పట్టం కడుతారని స్పష్టంచేశారు. గ్రామంలో తన సొంత ఖర్చుతో ఆంజనేయ ఆలయం నిర్మించానని, గ్రామాభివృద్ధి కోసం ఇప్పటికే రూ.6 కోట్ల నిధులు తీసుకువచ్చానని చెప్పారు. హకీంపేట్ ప్రజల్లో తమకు సంపూర్ణ మద్దతు లభిస్తోందని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి సహ కారంతో గ్రామాన్ని రాష్ట్రానికే రోల్ మోడల్‌గా తీర్చిదిద్దుతానని స్పష్టంచేశారు. అన్ని వర్గాల వారు సీఎంకు అండగా నిలవాలన్నారు.
కాంగ్రెస్ నేత నర్సింహారెడ్డి


