16 నుంచి ధనుర్మాసోత్సవాలు
మణికొండ: నార్సింగి సర్కిల్ పరిధిలోని మంచిరేవుల వేణుగోపాలాస్వామి ఆలయంలో ఈనెల 16 నుంచి జనవరి 15వ వరకు ధనుర్మాసోత్సవాలు, గోదాదేవి రంగనాయకుల స్వామి కల్యాణం నిర్వహించనున్నట్లు అర్చకుడు వరదాచారి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 30న వైకుంఠ ఉత్తర ద్వారా దర్శనం, జనవరి 11న గంగాళాల ప్రసాద వితరణ, 15న గోదాదేవి రంగనాథస్వామి కల్యాణం ఉంటుందని పేర్కొన్నారు. ప్రతిరోజు గోదాదేవి సేవా కార్యక్రమం, దంపతులతో పూజ, ప్రతి శుక్రవారం సామూహిక కుంకుమార్చనలు ఉంటాయని, నెల రోజుల పాటు గోత్రనామార్చన చేసుకునే భక్తులు తమ పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు 9347587786 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.


