పారదర్శకంగా గ్రామాభివృద్ధికి కృషి
నవాబుపేట: సర్పంచ్ అంటే పదవి కాదని, ప్రజలకు సేవ చేసే మార్గమని ఎమ్మెల్యే కాలె యాదయ్య పేర్కొన్నారు. మండలంలోని వివిధ గ్రామాల్లో ఇటీవల గెలుపొందిన సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు మెంబర్లు గురువారం ఎమ్మెల్యే నివాసంలో ఆయన్ని కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారందరినీ శాలువా, పూలమాలలతో సన్మానించారు. అనంతరం మాట్లాడుతూ.. గ్రామస్తులు మీపై ఉంచిన విశ్వాసం ఎంతో గొప్పదన్నారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టి, పారదర్శకంగా గ్రామాభివృద్ధి పనులను ముందుకు తీసుకెళ్లాలన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ గీతాసింగ్ నాయక్, పీఏసీఎస్ చైర్మన్ రాంరెడ్డి, నాయకులు మల్లారెడ్డి, నాగిరెడ్డి, ప్రభాకర్, రంగారెడ్డి, ఖదీర్ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే కాలె యాదయ్య


