సస్టైనబిలిటీ ఒక ట్రెండ్ కాదు., భవిష్యత్ జీవనశైలి
● లైఫ్ స్టైల్, ఫుడ్ టెక్ రంగాల్లో సిటీ స్టార్టప్ ఎల్మెంటోజ్
● సిటీలో దేశంలోనే అతిపెద్ద స్మార్ట్ ప్రోటీన్ తయారీ కేంద్రం
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ నుంచి గ్లోబల్ సస్టైనబుల్ ఫుడ్ భవిష్యత్తుకు దారి చూపుతున్న స్టార్టప్ ఎల్మెంటోజ్ రీసెర్చ్... ఇప్పుడు లైఫ్ స్టైల్, ఫుడ్ టెక్ రంగాల్లో రాణిస్తోందని సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ జయశంకర్ దాస్ అన్నారు. జంతు పోషణను కేవలం వ్యవసాయ అంశంగా కాకుండా, ఆరోగ్యం– పర్యావరణం– సస్టైనబిలిటీతో ముడిపడ్డ ఆధునిక జీవన విధానంగా మార్చే దిశగా తమ సంస్థ అడుగులు వేస్తోందన్నారు. ఇండియా, నార్వే ఏంజెల్ ఇన్వెస్టర్ల మద్దతుతో లభించిన సీడ్ ఫండింగ్‌తో, బ్లాక్ సోల్జర్ ఫ్లై ఆధారిత దేశంలోనే అతిపెద్ద స్మార్ట్ ప్రోటీన్ తయారీ కేంద్రాన్ని ఎల్మెంటోజ్ హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనుంది. జనవరి 2026 నుంచి ప్రారంభమయ్యే ఈ కేంద్రం నెలకు వేల టన్నుల పారిశ్రామిక వ్యర్థాలను విలువైన సస్టైనబుల్ ప్రోటీన్లుగా మారుస్తుంది. ఇది పర్యావరణంపై ఒత్తిడి తగ్గించడమే కాదు, భవిష్యత్ ఫుడ్ సిస్టమ్‌లకు కొత్త దారి చూపనుందన్నారు. యాంటీబయోటిక్‌లకు ప్రత్యామ్నాయంగా ఇమ్యూన్–స్మార్ట్ న్యూట్రిషన్, ప్రెసిషన్ ఫీడ్ ఫార్ములేషన్లతో ఫౌల్ట్రీ, ఆక్వాకల్చర్, పెట్ ఫుడ్ రంగాల్లో ఆరోగ్యకరమైన మార్పు తీసుకొస్తోంది. ‘‘సస్టైనబిలిటీ ఒక ట్రెండ్ కాదు, భవిష్యత్ జీవనశైలి’’ అనే సందేశాన్ని ఎల్మెంటోజ్ స్పష్టంగా ముందుకు తెస్తోందని సహ–వ్యవస్థాపకులు డాక్టర్ పద్మజ మోహంతి పేర్కొన్నారు.


