హస్తం బలపరిచిన అభ్యర్థులకు ఆదరణ | - | Sakshi
Sakshi News home page

హస్తం బలపరిచిన అభ్యర్థులకు ఆదరణ

Dec 10 2025 9:38 AM | Updated on Dec 10 2025 9:38 AM

హస్తం బలపరిచిన అభ్యర్థులకు ఆదరణ

హస్తం బలపరిచిన అభ్యర్థులకు ఆదరణ

కుల్కచర్ల: సర్పంచ్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు మంచి ఆదరణ లభిస్తోందని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి అన్నారు. మంగళవారం గాధిర్యాలో మండల పరిధిలోని ముజాహిద్‌పూర్‌కు చెందిన పలువురు బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా రామ్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రజలు కాంగ్రెస్‌ బలపరిచిన అభ్యర్థులు గెలిపించుకుని గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఆంజనేయులు, ముజాహిద్‌పూర్‌ సర్పంచ్‌ అభ్యర్థి చంద్రభూపాల్‌ దేశ్‌ముఖ్‌, కృష్ణయ్య, చంద్రయ్య, భా స్కర్‌, శ్రీనివాస్‌, వెంకట్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement