నస్కల్‌లో ‘ఏటీసీ’
పరిగి: నియోజకవర్గ నిరుద్యోగులకు పాధి కల్పనే ధ్యేయంగా పని చేస్తున్నానని పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన తన నివాసంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మున్సిపల్ పరిధిలోని ఏటీసీ(అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్) ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ శిక్షణ కేంద్రం టాటా కంపెనీ అనుబంధంగా రూ.70 కోట్లు వెచ్చించి ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఇక్కడ శిక్షణ పొందిన నిరుద్యోగులకు సంస్థ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందని చెప్పారు. కొండంగల్‌లో ఏర్పాటు చేస్తున్న పారిశ్రామిక వాడ లోనూ ఉద్యోగ అవకాశాలు ఉంటాయని వివరించారు. ఈ పనులకు మంత్రి వివేక్ వెంకటస్వామి శనివారం శంకుస్థాపన చేస్తారన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్‌లో రాష్ట్రానికి రూ.6లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయని మన ప్రాంతంలోనూ పరిశ్రమలు వస్తాయన్నారు. మొదటి విడత సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులకు మంచి ఫలితాలు వచ్చాయని రెండు, మూడో విడతల్లోనూ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో కుల్కచర్ల ఏఎంసీ చైర్మ న్ ఆంజనేయులు, పూడూరు మండల అధ్యక్షు డు సురేందర్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.


