● సాధారణ ఎన్నికల జిల్లా అధికారి షేక్ యాస్మిన్ బాష
పరిగి: మూడో విడత పంచాయితీ ఎన్నికలు సజావుగా నిర్వహించాలని సాధారణ ఎన్నికల జిల్లా అధికారి షేక్ యాస్మిన్ బాష సూచించారు. మంగళవారం ఆమె పట్టణ కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా యాస్మిన్‌బాష మాట్లాడుతూ.. ఎన్నికల సామగ్రి, బ్యాలెట్ పేపర్లను, పోలింగ్ బాక్సులను సరిచూకోవాలన్నారు. పోలింగ్‌లో లోపాలు ఉంటే వెంటనే సమాచారం అందించాలన్నారు. ఆమె వెంట డీఆర్‌డీఓ పీడీ శ్రీనివాస్, తహసీల్దార్ వెంకటేశ్వరి, ఎంపీడీఓ తదితరులు పాల్గొన్నారు.


