రూ.42 కోట్ల పత్తి కొనుగోళ్లు
దుద్యాల్: చెరువుల కింద యాసంగి వరి సాగుకు రైతులు సన్నద్ధం అవుతున్నారు. అందులో భాగంగానే దుద్యాల్ గ్రామంలోని గోపన్ చెరువు కిందనున్న 120 ఎకరాల పొలాలకు సాగు నీరు అందించేందుకు జేసీబీతో కాలువల మరమ్మతులు గురువారం చేపట్టారు. వర్షాలు సమృద్ధిగా కురవడంతో చెరువులు, కుంటలు నిండాయి. నీరు సాఫీగా చివరి పొలం వరకు సులువుగా అందేందుకు కాలువలు పూడిక చేపట్టినట్లు కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మేరుగు వెంకటయ్య తెలిపారు. పనులు పూర్తవ్వగానే నీటి విడుదలకు తీర్మానం చేసి పంటలను సాగుకు ముందుకెళ్తామని పేర్కొన్నారు.
బంట్వారం: యూరియా బుకింగ్ యాప్‌పై గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా బంట్వారం, కోట్‌పల్లి మండలాల్లోని రైతు వేదికల్లో వ్యవసాయ శాఖ అధికారులు, డీలర్లు వీసీని తిలకించారు. యూరియా బుకింగ్‌కు సంబంధించిన పలు అంశాలపై అధికారులు వీసీలో సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఓలు కరుణాకర్‌రెడ్డి, శ్రావ్య, ఏఈఓలు సందీప్, మశ్చేందర్ డీలర్లు, రైతుల తదితరులు పాల్గొన్నారు.


