బీఆర్‌ఎస్‌తోనే ప్రజాసంక్షేమం
● మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి
● పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం
పరిగి: బీఆర్‌ఎస్ హయంలోనే ప్రజలకు సంక్షేమ పథకాలు అందాయని మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి అన్నారు. మండల పరిధిలోని పాలేపల్లిలో సోమవారం సర్పంచ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామానికి చెందిన జెడ్పీటీసీ మాజీ సభ్యుడు జగన్‌మోహన్‌రెడ్డి కుమారుడు అజయ్‌కుమార్‌రెడ్డి తన అనుచరులతో కలిసి బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఉప్పరి యశోదతిరుపతి, నాయకులు పురుషోత్తం, గంపురి, ఆంజనేయులు, మణికంఠ, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.
హామీల అమలులో విఫలం..
కుల్కచర్ల: బండవెల్కిచర్లలో బీఆర్‌ఎస్ బలపర్చిన అభ్యర్థి జ్యోతిలక్ష్మిని భారీ మెజార్టీతో గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే కోప్పుల మహేశ్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆయన గ్రామంలో ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ నేతలు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా అమలు చేయకుండా ప్రజలను ఇబ్బందులకు గురి చేశారన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో ప్రజలను మభ్యపెట్టి ఓట్లు రాబట్టుకునేలా ప్రయత్నిస్తున్నారని, వీరి కుయుక్తులను నమ్మకుండా బీఆర్‌ఎస్ పార్టీ బలర్చిన అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించేలా కృషి చేయాలన్నారు.
బీఆర్‌ఎస్‌తోనే ప్రజాసంక్షేమం


