భవనం నుంచి జారిపడి మేసీ్త్ర మృతి
శంకర్‌పల్లి: నిర్మాణంలో ఉన్న భవనం పైనుంచి ప్రమాదవశాత్తు ఓ మేసీ్త్ర కాలు జారి పడి మృతి చెందిన సంఘటన శంకర్‌పల్లి పట్టణంలో చోటుచేసుకుంది. సీఐ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన జాహంగీర్ అలం, అనరులోహక్ సోదరులు. ఇద్దరూ కలిసి ఏడు నెలల క్రితం బతుకుదెరువు నిమిత్తం శంకర్‌పల్లి పట్టణానికి వచ్చి మేసీ్త్ర పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అనరులోహక్(31) గురువారం పట్టణంలోని శాంటమ్ హోమ్స్‌లో సీలింగ్ పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు కాలు జారి కింద పడి పోయాడు. దీంతో తోటి మేసీ్త్రలు, కూలీలు శంకర్‌పల్లిలోని ఓ ఆసుపత్రికి, తర్వాత పటాన్ చెరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మేసీ్త్ర మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. భవన నిర్మాణ యాజమాన్యం కార్మికులకు ఎలాంటి భద్రతని ఇవ్వకుండా పనులు చేయించుకుంటున్నారని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మృతుని సోదరుడు ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.


