అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు
దోమ: జ్వరంతో బాధపడుతూ మృతి చెందిన ఆర్మీ జవాన్ అంత్యక్రియలు గురువారం మండలంలోని దాదాపూర్ గ్రామంలో అధికారిక లాంఛనాలతో నిర్వహించారు. ఈ గ్రామానికి చెందిన తోకని అంజయ్య, తల్లి కనకమ్మ కుమారుడు శ్రీనివాస్(22) రెండేళ్ల క్రితం ఆర్మీలో చేరారు. పంజాబ్ రాష్ట్రంలో అతను విధులు నిర్వహిస్తుండగా, ఈ నెల 16న తీవ్ర జ్వరం వచ్చింది. దీంతో అధికారులు అక్కడే వైద్య పరిక్షలు అందించారు. పరిస్థితి విషమించి మృతి చెందారు. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు ఆర్మీ అధికారులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే టి.రామ్మెహన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి హాజరై మృతదేహానికి నివాళులర్పించారు.


