బషీరాబాద్‌లో ఎన్నికల కవాతు
బషీరాబాద్: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సోమవారం ఎస్పీ స్నేహమెహ్ర ఆధ్వర్యంలో బషీరాబాద్‌లో భారీ పోలీసు కవాతు నిర్వహించారు. జిల్లాలోని ఏఆర్ కానిస్టేబుళ్లు, సివిల్ పోలీసులు పాల్గొన్నారు. పంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘనటలు జరుగకుండా, శాంతిభద్రత పరిరక్షణ కోసం కవాతు నిర్వహించినట్లు ఎస్సీ తెలిపారు. కార్యక్రమంలో ఏఎస్పీ రామునాయక్, తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య, సీఐ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, ఎస్‌ఐలు నుమాన్‌అలీ, శంకర్, విఠల్‌రెడ్డి, వినోద్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.
పాల్గొన్న ఎస్పీ స్నేహమెహ్ర


