ఆయుర్వేదంలో హన్మంత్‌కు డాక్టరేట్
బొంరాస్‌పేట: పదిహేనేళ్లుగా ఆయుర్వేద వైద్యసేవలందిస్తున్న గుంజ హన్మంత్ డాక్టరేట్ పట్టా పొందారు. లింగన్‌పల్లికి చెందిన ఆయన ప్రకృతిలో ఉన్న వనమూళికలను ఆయుర్వేదంగా మార్చి ప్రజలకు వైద్యం అందిస్తున్నందుకు గాను చైన్నెలోని గ్లోబల్ హ్యూమన్ పీస్ వర్సిటీ నుంచి డాక్టర్ ఆఫ్ ట్రెడిషనల్ మెడిసిన్ (ఆయుర్వేదం) ఈ పట్టా అందుకున్నారు. ఈ సందర్భంగా హన్మంత్ మాట్లాడుతూ తన ఆయుర్వేద విద్యకు పునాదులు వేసిన డాక్టర్ చెన్మూర్ నారాయణరెడ్డి, డాక్టర్ రామకృష్ణారెడ్డి, హీరాలాల్‌కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా
పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి
పరిగి: రాష్ట్రంలో పరిగి నియోజకవర్గాన్ని మోడ ల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ఎమ్మె ల్యే టి.రామ్మోహన్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మున్సిపల్ పరిధిలోని తిరుమల వెంచర్‌లో రూ.20 లక్షల వ్యయంతో ఓపెన్ జిమ్, తుంకుల్‌గడ్డలో రూ.15లక్షలతో సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పరిగి ప్రాంత అభివృద్ధే తన లక్ష్యమన్నారు. ఓపెన్ జిమ్‌ను యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు. తుంకుల్‌గడ్డలో విద్యాసంస్థల ఏర్పాటుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటయ్య, డీసీసీ ప్రధాన కార్యదర్శి హన్మంత్ ముదిరాజ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అయూబ్, పట్టణ అధ్యక్షుడు కృష్ణ, గోపాల్, చిన్న నర్సింలు తదితరులు పాల్గొన్నారు.
నిబంధనలు పాటించని ఆస్పత్రులపై చర్యలు
జిల్లా వైద్యాధికారి స్వర్ణలత
పరిగి: నిబంధనలు పాటించని ఆస్పత్రులపై చర్యలు తప్పవని జిల్లా వైద్యాధికారి స్వర్ణలత అన్నారు. మంగళవారం ఆమె పట్టణకేంద్రంలోని విజేత ఆస్పత్రికి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలో రికార్డులు లేక పోవడంతో నోటీసులు జారీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ నిబంధనలను తప్పకుండా పాటించాలని సూచించారు. నోటీలసుకు వెంటనే వివరణ ఇవ్వాలని లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆస్పత్రిలో అనుమతులు ఉన్న చికిత్సలే నిర్వహించాలన్నారు.
పౌష్టికాహారంతోనే
సంపూర్ణ ఆరోగ్యం
షాద్‌నగర్‌రూరల్: పోషక విలువలు కలిగిన పౌష్టికాహారాన్ని తీసుకుంటే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని గిరిజన గురుకులాల రీజినల్ కో ఆర్డినేటర్ శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. పట్టణ సమీపంలోని నూర్ ఇంజనీరింగ్ కళాశాల భవనంలో కొనసాగుతున్న గిరిజన గురుకుల మహిళా డిగ్రీ, పీజీ కళాశాలలో మంగళవారం ఫుడ్ ఫెస్ట్ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన శ్రీనివాస్‌రెడ్డి విద్యార్థినులు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను తిలకించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యార్థినులు పౌష్టికాహారంపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నీతాపోలె, మైక్రోబయోలజీ హెడ్ కళాజ్యోతి, బోటనీ హెడ్ స్పందన పాల్గొన్నారు.
ఆయుర్వేదంలో హన్మంత్‌కు డాక్టరేట్
ఆయుర్వేదంలో హన్మంత్‌కు డాక్టరేట్
ఆయుర్వేదంలో హన్మంత్‌కు డాక్టరేట్


