‘చలో విశాఖపట్నం’ విజవయంతం చేయండి
సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్
తాండూరు టౌన్: సీఐటీయూ అఖిల భారత మహాసభలను విజయవంతం చేయలని సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాస్ పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక అంబేడ్కర్ చౌక్‌లో సీఐటీయూ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులకు ఇచ్చిన హామీలు, వాటి అమలుకు చేయాల్సిన పోరాటాలపై సభలో దిశానిర్దేశం చేస్తారస్తాన్నారు. ఈ మహాసభలు ఈ నెల 31 నుంచి జనవరి 4వరకు విశాఖపట్నంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులతో పాటు రెగ్యులర్ కార్మికులు పెద్దఎత్తున పాల్గొనాలని కోరారు.
జాతర ఏర్పాట్ల పరిశీలన
యాలాల: ముద్దాయిపేట ఎల్లమ్మ జాతర ఉత్సవాల ఏర్పాట్లను సోమవారం తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య పరిశీలించారు. ఈ నెల 19 నుంచి ప్రారంభం కానున్న జాతర ఉత్సవాల్లో సిడె ఊరేగింపు, రథోత్సవం, చుక్క బోనాల కార్యక్రమ వివరాలను గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. భక్తులు, వాహనాల పార్కింగ్ తదితర సౌకర్యాల గురించి జాతర గురించి జాతర నిర్వహణ కమిటీ సభ్యులు పోలీసులకు వివరించారు. ఉత్సవాలు ప్రశాంతంగా ఎలాంటి అవాంఛనీయ ఘటలను చోటు చేసుకోకుండా జాగ్రత్తల తీసుకోవాలని సూచించారు. ఏర్పాట్ల పరిశీలనకు వచ్చిన డీఎస్పీ, సీఐ, ఎస్‌ఐలను గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రూరల్ సీఐ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, ఎస్‌ఐ విఠల్‌రెడ్డి, సర్పంచ్ రుద్రమణి, మాజీ సర్పంచ్ కృష్ణయ్యగౌడ్, ఉప సర్పంచ్ శివ, జాతర నిర్వాహణ కమిటీ అధ్యక్షుడు భానుప్రసాద్ గౌడ్, గ్రామస్తులు రాజప్ప, వినోద్‌కుమార్ తదితరులు ఉన్నారు.
ఎన్నికల ఏర్పాట్లపై
డీఆర్‌డీఓ పీడీ ఆగ్రహం
పరిగి: మూడో దశ పోలింగ్ ఏర్పాట్లపై డీఆర్‌డీఓ పీడీ శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఆయన పట్టణ కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో ఎన్నికల సిబ్బందికి సామగ్రి పంపిణీ కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించారు. మండల పరిషత్ అధికారులు సక్రమంగా నిర్వహించడం లేదని అసహనం వ్యక్తం చేశారు. ఎలాంటి అవకతవకలు లేకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. విధులపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
జాతీయ జూనియర్ క్రికెట్ పోటీలకు ఇద్దరు విద్యార్థులు
కుల్కచర్ల: జాతీయ స్థాయి క్రికెట్ పోటీలకు ముజాహిద్‌పూర్ మాడల్ స్కూల్ నుంచి ఇద్దరు విద్యార్థులు ఎంపికయ్యారు.ఈ మేరకు పాఠశా ల ప్రిన్సిపాల్ జ్యోతిఎప్సిబా సోమవారం వారి ని ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా ఆ మె మాట్లాడుతూ..క్రీడలతో మానసికోల్లాసం కలుగుతుందన్నారు. పాఠశాలలో అరుణ్, పాండు 9వ తరగతి చదువుతున్నారు. వారు రాష్ట్ర స్థాయి టెన్నిస్ బాల్ క్రికెట్ పోటీల్లో సత్తా చాటి జాతీయ స్థాయికి ఎంపికయ్యారని చెప్పారు. ఈ నెల 18 నుంచి 21 వరకు ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రలో నిర్వహించే జాతీయ స్థాయి పాల్గొంటారని వివరించారు.
‘చలో విశాఖపట్నం’ విజవయంతం చేయండి
‘చలో విశాఖపట్నం’ విజవయంతం చేయండి
‘చలో విశాఖపట్నం’ విజవయంతం చేయండి


