ఎన్నికలు పకడ్బందీగా నిర్వహిద్దాం
పరిగి: పంచాయతీ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలని వికారాబాద్ ఆర్‌డీఓ వాసుచంద్ర సూచించారు. మంగళవారం రంగాపూర్ రైతుల వేదికలో ప్రిసైడింగ్ అధికారులకు ఽశిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల విధుల పట్ల నిర్లక్ష్యం వహించరాదన్నారు. పోలింగ్ సమయంలో ఎలాంటి సందేహాలు వచ్చినా వెంటనే ఉన్నతాధికారులను సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ వెంకటేశ్వరి, ఎంపీడీఓ హరిప్రియ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వికారాబాద్ ఆర్‌డీఓ వాసుచంద్ర


