చేస్తారో!
వాట్సాప్‌లో ఆర్డర్లు అధికారుల సమన్వయలోపంతో ఉద్యోగులు సతమతం తొలివిడత ముగిసే వరకు 20 మందిపై సస్పెన్షన్ వేటు మలివిడత డ్యూటీలపై భయంభయం
సరి
సస్పెండ్
వికారాబాద్: మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో అధికారుల సమన్వయలోపం కొట్టొచ్చినట్టు కనిపించింది. ఈ పరిణామాల నేపథ్యంలో పోలింగ్‌కు వారం ముందు ముగ్గురు ఉద్యోగులు సస్పెన్షన్ వేటుకు గురికాగా.. పోలింగ్‌కు ముందు రోజు ఏకంగా 17 మందిని సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేయడం చర్చనీయాంశం అయింది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారి విషయంలో ఇది స్వాగతించాల్సిన విషయమైనా పలువురు తప్పు చేయకుండానే బలయ్యారు. ఎన్నికల విధుల కేటాయింపులో తీవ్ర గందరగోళ పరిస్థితి తలెత్తింది. తాము ముందుగానే అవకతవకలు, ఇబ్బందులను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి.
పాఠాలు నేరుస్తారా..?
అధికారులు, ఉద్యోగులకు స్థానిక సంస్థల ఎన్నికల విధులు కేటయింపులో గందరగోళ పరిస్థితులు నెల కొన్నాయి. జిల్లాలో మొత్తం 594 పంచాయతీలు, 5,058 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో మొదటి విడతలో తాండూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఎనిమిది మండలాల్లో ఎన్నికలు పూర్తవగా.. వికారాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఏడు మండలాల్లో ఆదివారం(14న) ఎన్నికలు జరగనున్నాయి. ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఎన్నికల విధులకు సంబంధించి విడతల వారీగా శిక్షణ ఇస్తున్నారు. అయితే శిక్షణకు హాజరయ్యే విషయంలో మరియు పోలింగ్ డ్యూటీలు వేసే విషయంలోనూ ఉన్నతాధికారులు అవగాహన రాహి త్యంతో వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. కొన్ని మండలాల్లో మొదటి విడతలో 60 మంది వరకు విధులు కేటాయించిన ఉద్యోగులు విధులకు గైర్హాజరయ్యారు. ఈ విషయంలో ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్ చర్యలకు ఉపక్రమించిన విషయం తెలిసిందే. అయితే ఆయా మండలాల ఎంపీడీఓల నిర్లక్ష్యం వల్లే ఈ గందరగోళం తలెత్తిందని ఉద్యో గులు, ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు. చాలా మంది ఉద్యోగులకు నిబంధనల ప్రకారం ఎన్నికల విధులకు సంబంధించిన ఆర్డర్లు సర్వ్ చేయకుండా వాట్సాప్‌లో షేర్‌చేసి చేతులు దులుపుకొన్నారని.. వారు ఆ ఆర్డర్లు చూసుకున్నారా..? లేదా కూడా గమనించలేదని పేర్కొంటున్నారు. దీంట్లో ఉన్నతాధికారుల తప్పిదం ఉన్నప్పటికీ కేవలం కిందిస్థాయి ఉద్యోగులపైనే చర్యలు తీసుకోవటం బాధాకరమని వాపోతున్నారు. మొదటి విడతలో చోటు చేసుకున్న అవకతవకలు రెండో విడతలోనైనా జరగకుండా చూస్తారా..? ఈ సారి అయినా పాఠాలు నేరుస్తారా..? లేదా అని ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది చర్చించుకుంటున్నారు.
పర్యవేక్షణ అధికారుల్లో కనిపించని మార్పు
ఎన్నికల ఏర్పాట్లలో గందరగోళ పరిస్థితి తలెత్తింది. జిల్లా అధికారుల తీరుతో ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులు ఇబ్బందులకు గురవుతున్నారు. తొలివిడతలో మృతి చెందిన ఉద్యోగికి ఓ చోట, ఉద్యోగ విరమణ చేసిన వారికి మరోచోట, బదిలీపై వెళ్లిన వారికి సైతం విధులు కేటాయించిన విషయం విదితమే. దీంతో విధి నిర్వహణలో నిర్లక్ష్యం తగదని కలెక్టర్ ఇప్పటి వరకు 20 మంది ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు వేశారు. ఇందులో ముగ్గురు కిందిస్థాయి ఉద్యోగులుండగా మిగిలిన వారు ఉపాధ్యాయులు. సస్పెన్షన్ వేటుతో క్షేత్రస్థాయి ఉద్యోగుల్లో మార్పు కనిపిస్తుండగా.. పర్యవేక్షణాధికారులుగా ఉన్న ఆయా శాఖల హెచ్‌ఓడీలు, ఇతర ఉన్నతాధికారుల్లో మాత్రం నిర్లక్ష్యపు నీడలు వీడడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
గందరగోళంగా ఎన్నికల విధుల కేటాయింపు


