కాంగ్రెస్‌తోనే గ్రామాభివృద్ధి
● పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి
● పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం
దోమ: కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యమని పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంతో పాటు గుండాల, కొత్తపల్లి, దాదాపూర్ గ్రామాల్లో శనివారం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మాలి శివకుమార్‌రెడ్డి, పార్వతమ్మకు మద్దతుగా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులనే సర్పంచ్‌లుగా గెలిపించాలని కోరారు. వీరిని భారీ మెజార్టీతో గెలిపిస్తే గ్రామాల బాధ్యతను తానే తీసుకుంటానని స్పష్టంచేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ ప్రభాకర్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాంచంద్రారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


