కాంగ్రెస్ జోరుకు.. కారు బ్రేక్!
● బషీరాబాద్ మండలంలో
ఇరు పార్టీలకు సమాన జీపీలు
● బోణీ కొట్టిన బీజేపీ
బషీరాబాద్: బషీరాబాద్ మండలంలో కాంగ్రెస్ జోరుకు బీఆర్‌ఎస్ బ్రేకులు వేసింది. మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి సొంత మండలం కావడంతో ఇక్కడ గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థుల గెలుపుకోసం ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి పంచాయతీల్లో ఎన్నికల ప్రచారం చేశారు. ఇరు పార్టీల మద్దతుదారుల నడుమ తీవ్ర పోటీ సాగింది. బషీరాబాద్ మండలంలో 39 జీపీలకు గానూ, ఐదు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన వాటికి పోలింగ్ నిర్వహించగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్ సమానంగా పంచుకున్నాయి. బీజేపీ మద్దతుతో పోటీ చేసిన ఓ అభ్యర్థి సర్పంచ్‌గా విజయం సాధించారు.
విజేతలు వీరే..
బషీరాబాద్ సర్పంచ్‌గా వెంకటేశ్ మహరాజ్(కాంగ్రెస్), అల్లాపూర్, జంగం వెంకటయ్య (బీఆర్‌ఎస్), బాబునాయక్‌తండా జే.అనిత (కాంగ్రెస్), బహదూర్‌పూర్ నవనీత(కాంగ్రెస్) బహదూర్‌పూర్‌తండా ప్రకాశ్(కాంగ్రెస్), ఎక్మాయి శశికళ(కాంగ్రెస్), గంగ్వార్ సునీతారెడ్డి( బీఆర్‌ఎస్), గొట్టిగకుర్దు సావిత్రమ్మ( కాంగ్రెస్), గొటిగకలాన్ సాబేర్(బీఆర్‌ఎస్), హంక్యానాయక్‌తండా రాథోడ్‌అనిత (కాంగ్రెస్), ఇందర్‌చెడ్ కృష్ణకుమార్(బీఆర్‌ఎస్), ఇస్మాయిల్‌పూర్ నామ్యానాయక్(కాంగ్రెస్), జలాల్‌పూర్‌జైవీర్‌లాల్ (కాంగ్రెస్), కాంసన్‌పల్లి ఎం నరేందర్‌రెడ్డి(బీఆర్‌ఎస్), కాశీంపూర్ హరిత( కాంగ్రెస్), కంసన్‌పల్లి(బీ) సంగీత(బీజేపీ), కొర్విచెడ్ నవీన్‌రెడ్డి(బీఆర్‌ఎస్), కొర్విచెడ్ గని అంబమ్మ(బీఆర్‌ఎస్), కొత్లాపూర్ రాగిణిబాయి(బీఆర్‌ఎస్), కుప్పన్‌కోట్ రాంశెట్టి(బీఆర్‌ఎస్) క్యాద్గిరా జైపాల్‌రెడ్డి(బీఆర్‌ఎస్), మల్కన్‌గిరి నాగేశం(బీఆర్‌ఎస్), మంతన్‌గౌడ్ (ఏకగ్రీవం), మంతన్‌గౌడ్‌తండా అనుషబాయి(కాంగ్రెస్), మంతట్టి గిరిజ(బీఆర్‌ఎస్), మర్పల్లి వాల్మికి నరేష్(కాంగ్రెస్), మాసన్‌పల్లి సునీతాబాయి( కాంగ్రెస్), నంద్యానాయక్‌తండా సుమ్మిబాయి(కాంగ్రెస్), నవల్గ వెంకటమ్మ( బీఆర్‌ఎస్), నవాంద్గి శ్రీకాంత్(కాంగ్రెస్), నీళ్లపల్లి వేణుగోపాల్‌రెడ్డి(కాంగ్రెస్), పర్వత్‌పల్లి పాండురంగారెడ్డి(బీఆర్‌ఎస్), పరా్‌శ్య్ నాయక్‌తండా లక్ష్మిబాయి(కాంగ్రెస్), రెడ్డి గణాపూర్ బసంత్(కాంగ్రెస్), వాల్యానాయక్‌తండా లక్ష్మీబాయి( బీఆర్‌ఎస్), దామర్‌చెడ్ మాణేమ్మ(బీఆర్‌ఎస్) సర్పంచ్‌లుగా విజయం సాఽఽధించారు.


