విజయవంతం చేయాలి
వేడుకలను విజయవంతం చేయాలని మహేశ్వర మహాపిరమిడ్ ట్రస్ట్ చైర్మన్ విజయభాస్కర్‌రెడ్డి పిలుపునిచ్చారు. పిరమిడ్ ఆవరణలో గురువారం ట్రస్ట్ సభ్యులతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వేడుకల్లో భాగంగా వివిధ దేశాలు, రాష్ట్రా లకు చెందిన గురువులు, ఆధ్యాత్మికవేత్తలు, మేధావులు, సీనియర్ పిరమిడ్ మాస్టర్లు ధ్యాన సందేశం ఇవ్వనున్నారని తెలిపారు. ప్రతిరోజు 25 వేల మంది ధ్యానులు, సందర్శకులు హాజరుకానున్నారని, ఈమేరకు 10 లక్షల మందికి ఉచి త అన్నదానం కోసం ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పా రు. 21న ప్రపంచ ధ్యాన దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉదయం 9 నుంచి మధ్యా హ్నం 2 గంటల వరకు ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయన్నారు. సమావేశంలో ట్రస్ట్ సభ్యులు దామోదర్‌రెడ్డి, మాధవి, జేజీ నారాయణ, చంద్రశేఖర్, మహేశ్వరి, మీడియా ఇన్‌చార్జి భాస్కరానంద, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు దశరథ్‌నాయక్, సర్పంచ్‌లు సేవ్యా, శ్రీను పాల్గొన్నారు.


