Mahabubabad
-
భూమి రిజిస్ట్రేషన్ చేయడం లేదని దంపతుల ఆత్మహత్యాయత్నం
తరిగొప్పుల: తాము కొనుగోలు చేసిన భూమిని అమ్మకందారుడు రిజిస్ట్రేషన్ చేయకుండా కాలయాపన చేస్తూ తీవ్ర ఇబ్బందులు గురిచేస్తున్నారని దంపతులు శరీరంపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన బుధవారం మండల కేంద్రం శివారు ఎన్యానాయక్తండాలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. జనగామ జిల్లా చిల్పూరు మండలం శ్రీపతిపల్లికి చెందిన జంగ రవి తరిగొప్పుల మండలం ఎన్యానాయక్తండాకు చెందిన ముడావత్ సంపత్‌నాయక్ వద్ద 2 సంవత్సరాల క్రితం 2 గుంటల భూమిని గుంటకు రూ.3.30 లక్షల చొప్పున కొనుగోలు చేశాడు. అయితే ఆ భూమిని రిజిస్ట్రేషన్ చేయకుండా సంపత్‌నాయక్ కాలయాపన చేస్తూ వస్తున్నాడు. దీంతో రవి పెద్దమనుషులను ఆశ్రయించగా 2 గుంటలకు బదులు మరోచోట 8 గుంటల భూమి ఇవ్వాలని రెండు రోజుల క్రితం తీర్మానం చేశారు. సంపత్‌నాయక్ మరోచోట 8 గుంటల భూమికి హద్దులు చూపించగా ఆ భూమిని రవి మంగళవారం ట్రాక్టర్‌తో దున్నాడు. ఈ క్రమంలో ఏమైందో తెలియదు కానీ బుధవారం ఉదయం రవి తన భార్య, బిడ్డతో సంపత్‌నాయక్ ఇంటికి వచ్చి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వెంటనే గ్రామస్తులు, కుటుంబ సభ్యులు ఆ దంపతులను వరంగల్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. -
పుష్కర స్నానం.. పులకించిన భక్తజనం
భూపాలపల్లి/కాళేశ్వరం: కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతీనది పుష్కరాలకు భక్తులు రోజురోజుకూ భారీగా తరలివస్తున్నారు. బుధవారం ఏడోరోజు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ నుంచి కాళేశ్వరానికి తరలివచ్చారు. గోదావరి, ప్రాణహిత, అంతర్వాహిని సరస్వతీనదిలో పుష్కర పుణ్యస్నానాలు ఆచరించి, నదీమాతకు పూజలు చేశారు. పిండప్రదాన పూజలు చేశారు. నదీమాతకు చీర, సారె సమర్పించారు. ముత్తయిదువలు వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు. నదిలో దీపాలు వదిలి మొక్కులు చెల్లించారు. ఇసుకలో సైకత లింగాలు చేసి పూజించారు. కాళేశ్వరాలయంలో కాళేశ్వరముక్తీశ్వరుడిని దర్శించుకున్నారు. ఏడోరోజు లక్షకుపైగా... హైదరాబాద్, వరంగల్, భూపాలపల్లి రహదారి మీదుగా, పెద్దపల్లి, మంథని, కాటారం మీదుగా వాహనాలు తరలివచ్చాయి. సిరొంచ అంతర్రాష్ట్ర వంతెన గుండా మంచిర్యాల, గోదావరిఖని, చెన్నూర్, ఆసిఫాబాద్, నిర్మల్ నుంచి భక్తులు తరలివచ్చారు. ట్రాఫిక్ జామ్ కాకుండా పోలీసులు డివైడర్లు ఏర్పాటు చేసి నియంత్రించారు. ఆరో రోజు తగ్గిన భక్తులు.. ఏడో రోజు రెట్టింపు సంఖ్యలో తరలివచ్చారు. ఆర్టీసీ, ప్రైవేట్ వాహనాల్లో త్రివేణి సంగమం సరస్వతీనదికి వచ్చి పుష్కర స్నానాలు ఆచరించారు. శ్రీకాళేశ్వరముక్తీశ్వరస్వామి ఆలయంలో దర్శనానికి క్యూలైన్లో బారులుదీరారు. ప్రముఖుల పూజలు.. సరస్వతీనది పుష్కరాల్లో ప్రముఖులు స్నానం ఆచరించారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, జడ్జర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి, రామగుండం సీపీ అంబర్‌కిశోర్‌ఝా, ఆసిఫాబాద్ ఎస్పీ శ్రీనివాసరావు పుష్కర స్నానం చేసి కాళేశ్వరముక్తీశ్వరుడిని దర్శించుకున్నారు. అలాగే, భూపాలపల్లి కలెక్టర్ రాహుల్‌శర్మ దంపతులు కుటుంబ సమేతంగా సరస్వతి ఘాట్ పుష్కరిణిలో పుణ్యస్నానాలు చేశారు. అనంతరం శ్రీకాళేశ్వరముక్తీశ్వరుడిని దర్శించుకున్నారు. వర్షంతో ఇబ్బందులు.. రెండు రోజులుగా ఉక్కపోత, ఎండ తీవ్రతతో తల్ల డిల్లిన భక్తులకు బుధవారం సాయంత్రం గంట పాటు కురిసిన వర్షం ఉపశమనం కలిగించింది. వర్షంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడడంతో ఆనందం వ్యక్తం చేశారు. మరో వైపు పుష్కరఘాట్‌లో పార్కింగ్ స్థలాలు బురదమయంగా మారాయి. గాలి దుమారానికి బస్టాండ్ సమీపంలో హైదరాబాద్ అల్వాల్‌కు చెందిన ఉజ్వల్‌పై రేకు లేచి పడడంతో తీవ్రగాయమైంది. రక్తస్రావం కాగా వెంటనే అంబులెన్స్ ద్వారా మహదేవపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి వైద్యసేవలందించారు. సరస్వతీనది పుష్కర స్నానాలకు భక్తుల రద్దీ వివిధ రాష్ట్రాల నుంచి భారీగా రాక ఎమ్మెల్యేలు వినోద్, అనిరుధ్‌రెడ్డి, సీపీ అంబర్‌కిశోర్‌ఝా, ఎస్పీ శ్రీనివాసరావు పుణ్యస్నానాలు ఏడో రోజు లక్షకుపైగా తరలొచ్చిన జనం వర్షంతో చల్లబడిన వాతావరణం -
విత్తన చట్ట నియమాలు పాటించాలి
మహబూబాబాద్ అర్బన్: వ్యాపారులు విత్తన చట్ట నియమ, నిబంధనలు పాటించాలని కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లో డీఏఓ విజయనిర్మల ఆధ్వర్యంలో విత్తన వ్యాపారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. కలెక్టర్ హాజరై మాట్లాడుతూ.. పోలీస్, వ్యవసాయ, రెవెన్యూ శాఖలతో కూడిన విత్తన టాస్క్‌ఫోర్స్ బృందాల ఏర్పాటుకు ప్రతిపాదించామన్నారు. చట్టాన్ని ఉల్లంఘించడం ఏ మాత్రం సమర్థనీయం కాదని, అందుకే సీజన్ ప్రారంభానికి ముందు ఈ అవగాహన సదస్సు ఏర్పాటు చేశామన్నారు. విత్తన వ్యాపారులు అన్ని నియమాలు కచ్చితంగా పాటించాలని, నిల్వ, విక్రయ కేంద్రాల్లో రెగ్యులర్ తనిఖీలు నిర్వహిస్తామన్నారు. ప్రభుత్వం నకిలీ విత్తనాల విషయంలో కఠినంగా వ్యవహరించాలని ఆదేశాలు జారీ చేసిందన్నారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించాలని సూచించారు. సమావేశంలో ఏఓ టెక్నికల్ జి.విజ్ఞాన్, డీఎస్పీ తిరుపతిరావు, జిల్లా హార్టికల్చర్ అధికారి మరియన్న, డీసీఓ వెంకటేశ్వర్లు, డీఎం మార్క్‌ఫెడ్ శ్యామ్, ఏడీఏలు విజయ్ చంద్ర, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ -
పుష్కరిణీ.. ప్రణామం!
ఆకాశం అక్షింతలేసినట్లుగా చిరు చినుకులు.. నిశ్శబ్దంగా నది పరుగులు.. కాళేశ్వరం వైపు భక్తుల అడుగులు. వెరసి త్రివేణి సంగమం భక్త జన సందోహమైంది. ఏడో రోజు బుధవారం సైతం భక్తుల ప్రవాహం కొనసాగింది. పుణ్య స్నానాలు ఆచరించిన అనంతరం భక్తులు అంతర్వాహిని సరస్వతి నదికి మొక్కులు చెల్లించుకున్నారు. కాళేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. సుమారు లక్షమందికిపైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించినట్లు అధికారులు అంచనా వేశారు.– మరిన్ని వివరాలు, ఫొటోలు 8లోuఏడో రోజు కాళేశ్వరానికి తరలివచ్చిన భక్తజనం సరస్వతి ఘాట్‌లో స్నానాలు, ముక్తీశ్వరుడి దర్శనం -
మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలి
హన్మకొండ: కేంద్ర ప్రభుత్వం తాత్సారం వీడి వెంటనే మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని శాంతి చర్చల కమిటీ చైర్మన్ జస్టిస్ చంద్ర కుమార్ డిమాండ్ చేశారు. బుధవారం హనుమకొండ నక్కలగుట్టలోని హోటల్ హరిత కాకతీయలో శాంతి చర్చల కమిటీ ఉమ్మడి జిల్లా ఆధ్వర్యంలో జైసింగ్ రాథోడ్ అధ్యక్షతన ప్రజా సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జస్టిస్ చంద్ర కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ మధ్య భారతదేశంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య జరుగుతున్న అంతర్ యుద్ధంలో సామాన్య ప్రజలు, అమాయక ఆదివాసీలు చనిపోతున్నారన్నారు. రాజ్యం తరఫున పోలీసులు సైతం మరణించి మధ్య భారతమంతా నెత్తురోడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మారణహోమాన్ని గమనించిన శాంతి చర్చల కమిటీ చేసిన అభ్యర్థన మేరకు మావోయిస్టు పార్టీ కాల్పులు విరమణ చేసి శాంతి చర్చలకు సిద్ధమని ప్రకటించిందన్నారు. కేంద్రం స్పందించకుండా దాడులను మరింత పెంచి సామాన్యులను సైతం చంపేస్తోందని, కాల్పుల విరమణ స్థితిలో ఉన్నవాళ్లను చుట్టుముట్టి చంపడం దుర్మార్గమని విమర్శించారు. ఇప్పటికై నా మావోయిస్టులతో శాంతి చర్చలు జరపడానికి ప్రధాని మోదీ, హోం మంత్రి వెంటనే నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం శాంతి చర్చల కమిటీ రాష్ట్ర సభ్యుడు సోమ రామ్మూర్తి, ఆల్ ఇండియా ఓబీసీ జాక్ చైర్మన్ సాయిని నరేందర్, ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ, సిద్ధబోయిన లక్ష్మీనారాయణ, చుంచు రాజేందర్, అనిక్ సిద్ధికి, చిల్ల రాజేంద్రప్రసాద్, బొట్ల భిక్షపతి, ప్రొఫెసర్ అన్వర్ ఖాన్ మాట్లాడారు. కార్యక్రమంలో న్యాయవాదులు అబ్దుల్ నబీ, పండుగ శ్రీనివాస్, ఆదినారాయణ, దొమ్మటి ప్రవీణ్ కుమార్, కొండ్ర నర్సింగరావు, తదితరులు పాల్గొన్నారు. శాంతి చర్చల కమిటీ చైర్మన్ జస్టిస్ చంద్ర కుమార్ -
ఇస్రో నోడల్ సెంటర్ ఆర్ట్స్అండ్ సైన్స్ కళాశాల కోఆర్డినేటర్లుగా జితేందర్, సరిత
కేయూ క్యాంపస్: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అనుబంధ సంస్థ ఇండియన్ ఇన్స్టిట్యూ ట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ (ఇస్రో –ఐఆర్ఎస్) డెహ్రడూన్ వరంగల్ పాంతీయ కోఆర్డినేటర్లుగా హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఫిజిక్స్ విభాగం కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ జితేందర్, డాక్టర్ అలేటి సరిత నియమితులయ్యా రు. ఈ మేరకు ఇస్రో నుంచి సమాచారం అందిందని ఆ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్. జ్యోతి బుధవారం తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీ తర్వాత హ నుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ ఇస్రో ఈ కోర్సెస్‌కు సంబంధించి నోడల్ సెంటర్‌గా ఉందన్నారు. విద్యార్థులు ఈ కోర్సెస్ అవకాశాన్ని విని యోగించుకోవాలన్నారు. కాగా, డాక్టర్ జితేందర్, డాక్టర్ సరితను ప్రిన్సిపాల్ జ్యోతి అభినందించారు. పీజీ సెమిస్టర్ల ఫలితాలు విడుదలవిద్యారణ్యపురి: హనుమకొండలోని పింగిళి ప్రభుత్వ మహిళా కళాశాల (అటానమస్)లో ఈఏడాది ఏప్రిల్‌లో నిర్వహించిన పీజీ కోర్సుల మొదటి, మూడో సెమిస్టర్ పరీక్షల ఫలితాలను బుధవారం ఆ కళాశాల ప్రిన్సిపాల్ చంద్రమౌళి విడుదల చేశారు. పీజీ కోర్సుల్లో మొదటి సెమిస్టర్ల పరీక్షల్లో మొత్తం 85 శాతం, మూడో సెమిస్టర్ పరీక్షల్లో 93శాతం మంది విద్యార్థినులు ఉత్తీర్ణులయ్యారని చంద్రమౌళి తెలిపారు. విద్యార్థినులు తమ ఫలితాలను సంబంధిత కాలేజీ వెబ్సైట్లోగాని లేదా కళాశాలలోని పరీక్షల విభాగంలో తెలుసుకోవచ్చని తెలిపారు. ఈ ఫలితాల విడుదల కార్యక్రమంలో పరీక్షల నియంత్రణాధికారి సుహాసిని, అదనపు పరీక్షల నియంత్రణాధికారులు కె. శ్రీనివాస్, పి. రాజిరెడ్డి, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ సురేశ్ బాబు, వివిధ విభాగాల అఽధిపతులు పాల్గొన్నారు. -
‘ఎల్సీ’ నిర్లక్ష్యంపై సీఎండీ అసహనం
హన్మకొండ : ఎల్సీ యాప్ వినియోగంలో నిర్లక్ష్యంపై విద్యుత్ ఇంజనీర్లు, ఆపరేటర్లపై టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. బుధవారం హనుమకొండలోని టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం నుంచి 16 సర్కిళ్ల ఎస్ఈలు, డీఈలు, ఏడీఈ, ఏఈలతో వీడియో కాన్ఫరెన్స్(వీసీ) నిర్వహించారు. ఎల్సీ యాప్ నిర్వహణ, డ్యాష్‌బోర్డులో పారామీటర్ల నమో దు, విద్యుత్ అంతరాయాలపై సమీక్షించారు. విద్యుత్ ప్రమాదాలు తగ్గించేందుకు, భద్రతకు అత్యంత ప్రాధాన్యత కల్పించేందుకు ప్రవేశ పెట్టిన ఎల్సీ యాప్‌పై నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. అదే విధంగా డ్యాష్ బోర్డులో ఎవరు ఏ పని చేస్తున్నారో నమోదు చేయకపోవడంపై సీరియస్ అయ్యారు. ఇక నుంచి అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఇన్చార్జ్ డైరెక్టర్ టి.మధుసూదన్, చీఫ్ ఇంజనీర్లు రాజు చౌహాన్, అశోక్, జీఎం శ్రీనివాస్, ఎస్ఈ లు, డీఈ, ఏడీఈ, ఏఈలు పాల్గొన్నారు. డ్యాష్ బోర్డులో వివరాల నమోదులో అలసత్వంౖపై సీరియస్ -
విద్యుత్ షాక్‌తో వృద్ధురాలి మృతి
● ఇల్లు శుభ్రం చేస్తుండగా ఘటన ● 13 రోజుల్లో మనుమరాలి పెళ్లి.. అంతలోనే విషాదం హసన్‌పర్తి: మనుమరాలి పెళ్లికి ఇల్లు శుభ్రం చేస్తున్న క్రమంలో విద్యుత్‌షాక్‌కు గురై ఓ వృద్ధురాలు మృతి చెందింది. ఈ ఘటన హసన్‌పర్తి మండలం జయగిరిలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. జయగిరికి చెందిన లింగాల నర్సమ్మ(60)కు ఇద్దరు కుమారులు మధు, చంద్రశేఖర్ సంతానం. మధు ఆర్టీసీ డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తూ.. ఎనిమిదేళ్ల క్రితం మృతిచెందాడు. మధుకు భార్య, ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ప్రవీణ్ ఉన్నారు. మధు మృతి తర్వాత అతడి కుటుంబం బతుకుదెరువు నిమిత్తం రాంపూర్ వెళ్లింది. వచ్చే నెల 4న మధు చిన్న కూతురు పెళ్లి జరుగనుంది. జయగిరిలోనే పెళ్లి చేయాలని నిర్ణయించారు. ఈమేరకు ఇంటిని ముస్తాబు చేయడానికి ప్రవీణ్ జయగిరి వచ్చాడు. బుధవారం నానమ్మ నర్సమ్మతో కలిసి ప్రవీణ్ ఇల్లు శుభ్రం చేస్తున్నారు. ఈ క్రమంలో దండెంపై దుస్తులు ఆరేస్తున్న క్రమంలో నర్సమ్మ విద్యుత్ షాక్‌కు గురైంది. గమనించిన ప్రవీణ్ ఆమెను రక్షించడానికి యత్నించి ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటనలో నర్సమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ ఇన్స్పెక్టర్ చేరాలు తెలిపారు. పిడుగుపాటుకు ఇద్దరి మృతి● మహబూబాబాద్ జిల్లాలో ఘటన కొత్తగూడ/గూడూరు: పిడుగుపాటుకు మహబూబాబాద్ జిల్లాలో ఇద్దరు మృతి చెందారు. ఇందులో ఓ గొర్రెలకాపరి, ఓ యువకుడు ఉన్నారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. కొత్తగూడ మండలం ఓటాయికి చెందిన ఏశబోయిన చేరాలు(50) గొర్రెల కాపరిగా పని చేస్తున్నాడు. రోజువారీగా గొర్రెలను మేపేందుకు బుధవారం కూడా గ్రామ సమీపంలోని పొలాల్లోకి వెళ్లాడు. మధ్యాహ్నం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుండగా గొర్రెలను తోలుకుని ఇంటికి వెళ్తున్న క్రమంలో పిడుగుపడింది. దీంతో చేరాలు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఘటనలో గూడూరు మండలం గుండెంగ గ్రామానికి చెందిన మైదం సారయ్య కుమారుడు ప్రవీణ్‌కుమార్ (30) కూలీ పనులు చేసుకుంటూ కుటుంబానికి ఆసరా అవుతున్నాడు. ఈ క్రమంలో బుధవారం మధ్యాహ్నం బహిర్భూమికి వెళ్లిన ప్రవీణ్.. వర్షం వస్తుండడంతో రోడ్డు పక్కన చెట్టు కింద నిలబడ్డాడు. అదే సమయంలో చెట్టుపై పిడుగుపడడంతో ప్రవీణ్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి తండ్రి సారయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై గిరిధర్‌రెడ్డి తెలిపారు. -
ఇందిర సౌర గిరి జలవికాస పథకం అమలుకు కసరత్తు
● మొదటి విడతలో 1,235 మంది రైతుల ఎంపిక ● బోర్లు, పంపుసెట్, సౌర విద్యుత్ కల్పన ● భూ అనుకూలతను బట్టి పంటల సాగు ● కసరత్తు ప్రారంభించిన జిల్లా అధికారులు సాక్షి, మహబూబాబాద్: గిరిజనులు పోడు భూము ల హక్కులను సద్వినియోగం చేసుకునే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. గిరిజన రైతులు భూములు సాగుచేసి లాభాల పంటలు పండించాలంటే నీటి వనరు కల్పన ప్రధానం. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ఇందిర సౌర గిరి జలవికాస పథకం అమలు చేసేందుకు కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ శ్రీకారం చుట్టారు. మొదటి విడత 1235మంది రైతులకు.. ప్రభుత్వం ఇందిర గిరి జలవికాస పథకాన్ని ఐదు విడతలుగా అమలు చేయనుంది. ఇందులో భాగంగా జిల్లాలో మొదటి విడత 1235 మంది ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ఉన్న రైతులను ఎంపిక చేయనున్నారు. గతంలో 214 కుటుంబాలకు గిరి వికాసం పథకం పేరుతో సాగునీటి వసతి కల్పించారు. ఆ తర్వాత కొత్తగా గంగారం, కొత్తగూడ, గూడూరు, గార్ల, బయ్యారం, కేసముద్రం, నెల్లికుదురు, మహబూబాబాద్, కురవి మండలాల పరిధిలో 164 గ్రామ పంచాయతీలు, 340 అవాస ప్రాంతాలకు చెందిన 24,181 కుటుంబాలకు 67,730 ఎకరాల పోడు భూములకు పట్టాలు ఇచ్చారు. ఇందులో ప్రస్తుతం నీటి వనరులు ఉన్న భూములు, గిరి వికాసం లబ్ధిదారులు పోను మిగిలిన వారిని ఐదు భాగాలుగా విభజిస్తారు. ఈ వానాకాలం సీజన్ వరకు మొదటి విడతగా లబ్ధిదారులను ఎంపిక చేసి వారి భూములకు సాగునీరు అందించనున్నారు. కమిటీల ద్వారా ఎంపిక.. లబ్ధిదారుల ఎంపిక కోసం మండల కమిటీలు ఏర్పాటు చేస్తారు. ఇందులో మండల అభివృద్ధి అధికారి, భూగర్భజల అధికారి, ఆర్డబ్ల్యూఎస్ అధికారి, గిరిజనాభివృద్ధిశాఖ అధికారి ఉంటారు. ప్రత్యేకంగా రూపొందించిన ఫార్మెట్ ప్రకారం గిరిజనుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈ దరఖాస్తులను పరిశీలించి భూమిలో బోరు పడే ప్రాంతాలను గుర్తిస్తారు. విద్యుత్ సరఫరా కోసం యూనిట్‌కు రూ. 6లక్షల చొప్పున వంద శాతం సబ్సిడీతో సోలార్ ఉత్పత్తి పరికరాలను అమర్చుతారు. బోరుబావిలో మోటారు బిగిస్తారు. ఈ ప్రక్రియ జరిగిన తర్వాత భూముల స్వభాన్ని భట్టి జామ, బాంబో, ఆయిల్‌పామ్ తదితర తోటల పెంపకానికి ప్రోత్సాహకాలు అందిస్తారు. వందశాతం సబ్సిడీతో డ్రిప్, ఇతర పరికరాలు అందజేస్తారు. కసరత్తు ప్రారంభించాం ఇందిర సౌర గిరి జల వికాస పథకం అమలుకోసం కసరత్తు ప్రారంభించాం. జిల్లా కలెక్టర్ నేతృత్వంలో గిరిజన ప్రాంతాల్లోని మండల అధికారులతో సమీక్షలు నిర్వహించాం. మండల కమిటీల ద్వారా లబ్ధిదారుల నుంచి దరఖాస్తుల స్వీకరణ చేపట్టనున్నాం. ప్రక్రియ వేగవంతంగా చేపట్టి గిరిజన భూములను సస్యశ్యామలం చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. – దేశిరాం నాయక్, జిల్లా గిరిజన అభివృద్ధిశాఖ అధికారి సౌర విద్యుత్‌తో అదనపు ఆదాయం ఇందిర సౌర గిరి జల వికాస పథకం ద్వారా గిరిజనుల భూముల్లో ఏర్పాటు చేసే సౌర విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ ద్వారా కరెంట్ సరఫరా జరుగుతుంది. ఈ విద్యుత్‌తో పంపుసెట్లు నడిపించుకోగా మిగులు విద్యుత్‌ను.. ఉత్పత్తి సంస్థకు అమ్మే అవకాశం ఉంటుంది. ఇలా మిగులు విద్యుత్ ద్వారా గిరిజన రైతులకు నెలకు రూ. 5వేల మేరకు అదనపు ఆదాయం వస్తుందని అధికారులు చెబుతున్నారు. -
కంటి పరీక్షలు నిర్వహించాలి
● డీఎంహెచ్ఓ రవిరాథోడ్ నెహ్రూసెంటర్: అంగన్వాడీ కేంద్రాల్లోని పిల్ల లందరికీ ఆర్బీఎస్కే కార్యక్రమం ద్వారా కంటి పరీక్షలు నిర్వహించాలని డీఎంహెచ్ఓ రవిరాథోడ్ సూచించారు. జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో ఆర్బీఎస్కే కార్యక్రమంపై బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ.. ఎనిమి యా ఉన్న పిల్లలను గుర్తించి వారికి ఐరన్, పోలిక్ ఆసిడ్ మాత్రలు ఇవ్వాలని సూచించారు. ఆర్బీఎస్కే బృందాలు గిరిజన వెల్ఫేర్, కస్తూర్బా, ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల వివరాలను నమోదు చేసుకోవాలని తెలిపారు.కార్యక్రమంలో ప్రొగ్రాం ఆఫీసర్ డాక్టర్ విజయ్, డిప్యూటీ మాస్ మీడియా అధికారి ప్రసాద్, హెచ్ఈఓ రామకృష్ణ, డాక్టర్ కుమార్, డాక్టర్ శివరాం తదితరులు పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానంమహబూబాబాద్ అర్బన్: జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓసీ, ఈబీసీ విద్యార్థుల నుంచి పోస్టుమెట్రిక్ స్కాలర్‌షిప్‌ల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల అధికారి ఎం.నర్సింహస్వామి బుధవారం తెలిపారు. ఈ నెల 30 వరకు ఆన్లైన్లో సంబంధిత వెబ్సైట్లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి కార్యాలయంలో సంప్రదించాలన్నారు. గుట్టుచప్పుడు కాకుండా అబార్షన్‌కు యత్నం● డీఎంహెచ్ఓకు సమాచారం.. అప్పటికే చేజారిన పరిస్థితి ● జీజీహెచ్‌కు తరలించి అబార్షన్ నెహ్రూసెంటర్: జిల్లాలోని ఓ మండలానికి చెందిన గర్భిణి పక్క జిల్లాలో స్కానింగ్ చేసుకోగా.. ఆడపిల్ల అని తేలినట్లు సమాచారం. కాగా గుట్టుచప్పుడు కాకుండా అబార్షన్ చేయించుకోవాలని నిర్ణయించుకుంది. ఈమేరకు ఆమె జిల్లాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. విషయం తెలుసుకున్న వైద్యారోగ్యశాఖ అధికారులు ఆమెనె జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్)కి తరలించారు. అప్పటికే ఆమె పరిస్థితి చేజారి పోవడంతో బుధవారం అబార్షన్ జరిగింది. ఈ ఘటనపై డీఎంహెచ్ఓ రవిరాథోడ్ను వివరణ కోరగా.. తమకు సమాచారం అందిన వెంటనే వెళ్లి సదరు మహిళను ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించామని.. అక్కడ అబార్షన్ జరిగిందని తెలిపారు. అబార్షన్ విషయమై భార్యభర్తలను విచారించి కౌన్సెలింగ్ నిర్వహించామన్నారు. చికిత్స అందించిన ప్రైవేట్ ఆస్పత్రికి నోటీసులు జారీ చేశామని, ఈ విషయంపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకోనున్నట్లు డీఎంహెచ్ఓ వెల్లడించారు. శాంతి భద్రతల పరిరక్షణకు కృషి● ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ తొర్రూరు: శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులు అంకితభావంతో కృషి చేస్తున్నారని ఎస్పీ సుఽధీర్ రాంనాథ్ కేకన్ తెలిపారు. డివిజన్ కేంద్రంలో ఆధునికీకరించిన స్థానిక పోలీస్ స్టేషన్, సర్కిల్ కార్యాలయాన్ని బుధవారం ఎస్పీ ప్రారంభించారు. ఉత్తమ సేవలు అందిస్తున్న పోలీసులకు ప్రశంసపత్రాలు అందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా నేరాల నియంత్రణకు పకడ్బందీ చర్యలు తీసుకుంటూ అసాంఘిక శక్తులపై దృష్టి కేంద్రీకరిస్తున్నామని తెలిపారు. పోలీస్ స్టేషన్లను ప్రజల అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు. పోలీస్స్టేషన్లలో వెయిటింగ్ హాల్, ప్రత్యేక కౌంటర్లు, సీసీ కెమెరాలు, తాగునీరు వంటి సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. ప్రజలతో సంబంధాలు మెరుగుపర్చేందుకు పోలీసు శాఖ కృషి చేస్తోందన్నారు. కార్యక్రమంలో తొర్రూరు డీఎస్పీ కృష్ణ కిశోర్, డీఎస్పీలు తిరుపతి, శ్రీనివాస్, మోహన్, సీఐలు టి.గణేష్, రాజు, చంద్రమోహన్, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు. -
కాళ్లకు పెట్టిన పారాణితోనే వరుడు పాడె ఎక్కాడు..
బయ్యారం(వరంగల్): మూడుముళ్లు.. ఏడు అడుగుల బంధంతో ఒక్కటైన ఆ జంటపై దేవుడు చిన్న చూపు చూశాడు. అప్పటి వరకు పెళ్లి బా జాలు మోగిన ఆ ఇంట.. చావు డప్పు మో గాల్సి వచ్చింది. కోటి ఆశలతో కొత్త జీవితం ప్రారంభమై 48 గంటలు గడవకముందే న వవరుడు కన్నుమూశాడు. రిసెప్షన్ ఏర్పాట్లు చేస్తుండగా విద్యుదాఘాతం సంభవించి మృతి చెందాడు. భర్త తన కళ్లెదుటే కానరానిలోకాలకు వెళ్లడంతో ఆ నవవధువు స్పృహ తప్పడంతో బంధువులు చికిత్స ని మిత్తం ఆస్పత్రికి తరలించారు. కాళ్లకు పెట్టి న పారాణితోనే ఆ వరుడు పాడె ఎక్కిన విషాదకరఘటన పలువురిని కన్నీటిపర్యంతం చేసింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం గౌరారం పంచాయతీ శివారు కోడిపుంజులతండాకు చెందిన ఇస్లావత్ బా ల, లక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు. 14 సంవత్సరాల క్రితం బాల అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో బతుకుదెరువు నిమిత్తం ఇద్దరు కుమారులు గణేశ్, నరేశ్(26)తో కలిసి తల్లి లక్ష్మి హైదరాబాద్‌లో ఉంటుండగా నరేశ్ కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో నరేశ్‌కు ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా కంచికచర్ల గ్రామానికి చెందిన బానోత్ జాహ్నవితో వివాహం నిశ్చియం కాగా స్వగ్రామంలో రిసెప్షన్ నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా రిసెప్షన్ కోసం ఇటీవల రేకుల ఇల్లు నిర్మించుకున్నారు. ఆదివారం కంచికచర్లలో జాహ్నవితో వివాహం జరిపించారు.మోటారు రూపంలో బలితీసుకున్న కరెంట్..రిసెప్షన్ సందర్భంగా మంగళవారం తెల్లవారుజాము నుంచే నరేశ్ ఇంటి వద్ద ఏర్పాట్లు మొదలు పెట్టారు. వంట చేసే వా రు భోజనాల తయారీలో నిమగ్నమయ్యా రు. వంట కోసం నీళ్లు అవసరం ఏర్పడడంతో నరేశ్‌ను మోటార్ ఆన్చేయని కోరారు. దీంతో నరేశ్ మోటర్ ఆన్ చేసే ప్రయత్నంలో విద్యుత్తీగలను సాకెట్లో పెడుతుండగా షాక్‌గురయ్యాడు. దీంతో కుటుంబీకు లు, స్థానికులు ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. దీంతో నరేశ్ మృతదేహం మీదపడి కుటుంబీకులు, బంధువులు గుండెలవిసేలా రోదించారు. మృత్యువు కరెంట్రూపంలో బలి తీసుకుందని కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతుడి సోదరుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తిరుపతి తెలిపారు. చనిపోయే ముందు ఉప్మా అందించాడు..రిసెప్షన్ సందర్భంగా నరేశ్ ఉదయం తండాలోని పలువురు బంధువుల వద్దకు వెళ్లి ఉప్మా (అల్పాహారం) ఇచ్చి వచ్చాడు. ఆప్యాయంగా ఉప్మా అందించిన నరేశ్ ఇలా తమకు కన్నీటిని మిగిల్చి వెళ్తాడనుకోలేదని బంధువులు గుండెలవిసేలా రోదించారు. -
విద్యుదాఘాతంతో ఆరుగురు మృతి
బయ్యారం/మిరుదొడ్డి (దుబ్బాక)/జగదేవ్‌పూర్ (గజ్వేల్)/పిట్లం (జుక్కల్)/ తొగుట (దుబ్బాక): విద్యుత్ తీగలు ప్రాణాలు తీశాయి. వేర్వేరుచోట్ల కరెంట్ షాక్‌కు గురై ఆరుగురు మృతిచెందారు. పెళ్లయిన 48 గంటలకే.. పెళ్లి బాజాలు...డీజే మోతలు మోగిన ఆ ఇంట చావు డప్పు మోగింది. ఈ విషాద ఘటన మహబూబాబాద్ జిల్లా య్యారం మండలం కోడిపుం జుల తండాలో చోటుచేసుకుంది. తండాకు చెందిన ఇస్లావత్ నరేశ్ (26)కు ఏపీలోని కృష్ణాజిల్లా కంచికచర్లకు చెందిన జాహ్నవితో ఆదివారం వివాహం జరిగింది. సోమవారం తండాకు దంపతులిద్దరూ వచ్చారు. మంగళవారం నరేశ్ ఇంటి వద్ద మోటార్‌ను ఆన్‌చేసే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో విద్యుదాఘాతానికి గుర య్యా డు. ఆస్పత్రికి తరలిస్తుండగానే మృతి చెందాడు. విద్యుత్ సర్వీస్ వైరుపైపడి.. కౌలు రైతు మృతి చెందిన ఘటన మండల పరిధిలోని పీర్లపల్లిలో మంగళవారం చోటు చేసుకుంది. జగదేవ్‌పూర్‌కు చెందిన మహ్మద్ షాదుల్ (25) మామిడితోటను కౌలుకు తీసుకున్నాడు. గ్రామంలో కోతుల బెడద ఎక్కువగా ఉండటంతో మామిడి చెట్టుకు ఇనుప స్టాండ్ వేసుకొని ఎక్కి వలను చుడుతున్నాడు. ఈ క్రమంలో స్టాండ్‌పై నుంచి జారి కిందున్న విద్యుత్ సర్వీస్ వైర్‌పై పడటంతో కరెంట్ షాక్ కొట్టి అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదవశాత్తూ కరెంట్ తీగలు తగిలి.. విద్యుదాఘాతంతో రైతు మృతి చెందిన ఘటన సిద్దిపేట జిల్లా అక్బర్పేట–భూంపల్లి మండల పరిధిలోని మోతెలో చోటు చేసుకుంది. భూంపల్లి ఎస్ఐ హరీశ్ కథనం మేరకు.. మోతె గ్రామానికి చెందిన మంగోరి కృష్ణ హరి (60) తనకున్న ఐదెకరాల్లో వ్యవసాయం చేస్తున్నాడు. మంగళవారం పొలం వద్దకు వెళ్లాడు. అయితే సోమవారం రాత్రి వీచిన గాలి వానకు పొలంలో కరెంటు స్తంభం పడిపోయి ఉంది. ఇది గమనించని కృష్ణ హరి వ్యవసాయ పనులు చేస్తుండగా తీగలు తగిలి విద్యుదాఘాతంతో మృతి చెందాడు. మోటారు తీస్తుండగా విద్యుత్ తీగలు తగిలి.. కామారెడ్డి జిల్లా పిట్లం మండలంలోని కంబాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామ శివారులోని పొలంలో బోరు మోటారు పని చేయకపోవడంతో మంగళవారం గ్రామానికి చెందిన రాములు (42), హన్మయ్య (59) బోరు మోటారును తీయడానికి వెళ్లారు. మోటారును పైకి తీస్తున్న క్రమంలో మోటార్‌కు ఉన్న ఇనుప పైప్ పైన ఉన్న విద్యుత్ తీగలకు తగిలింది. దీంతో విద్యుత్‌షాక్‌తో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మత్తులో ట్రాన్స్ఫార్మర్ను ముట్టుకుని.. సిద్దిపేట జిల్లా తొగుటకు చెందిన రామారపు రాజు (36) కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. రోజూ మాదిరిగా మంగళవారం కూలి పనికి వెళ్లి.. సాయంత్రం మద్యం సేవించి ఇంటికొచ్చాడు. మత్తులో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను ముట్టుకోగా కరెంట్ షాక్‌తో అక్కడికక్కడే మృతి చెందాడు. -
లండన్‌లో చదువుకున్నా.. మన సంస్కృతిని మరిచిపోలేదు
హన్మకొండ/హన్మకొండ కల్చరల్/ఖిలావరంగల్: లండన్‌లో చదువుకున్నా మన సంస్కృతి, సంప్రదాయాలను మరిచిపోలేదని కాకతీయ 22వ వారసుడు కమల్ చంద్ర భంజ్‌దేవ్ అన్నారు. మంగళవారం ఆయన మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్, నన్నపునేని నరేందర్‌తో కలిసి నగరంలోని వేయిస్తంభాల గుడి, భద్రకాళి ఆలయం, ఖిలావరంగల్ కోటలోని స్వయంభు శంభు లింగేశ్వర ఆలయంలో, వడ్డేపల్లిలోని పోచమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పోచమ్మ మైదాన్‌లోని రాణి రుద్రమదేవి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం హనుమకొండలోని హోటల్ హరిత కాకతీయలో ప్రజలతో నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. పలువురు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. కాకతీయుల రాజధాని అయిన ఓరుగల్లు సాంస్కృతికపరంగా ఎంతో అభివృద్ధి చెందిందని, పారిశ్రామిక పరంగా అభివృదద్ధి జరిగేందుకు సలహాలు ఇవ్వాలని కోరారు. కాకతీయుల కాలంలో సాంస్కృతిక జీవనం విలసిల్లిందని, ఇప్పుడు ఆ సంస్కృతి, కలలు కాపాడడానికి మీరు ఏమైనా చేయగలుగుతారా అని ప్రజలు అడిగారు. కమల్ చంద్ర భంజ్‌దేవ్ స్పందిస్తూ తనకు కళలు, కళాకారులన్నా చాలా ఇష్టమని, సాధ్యమైనంతవరకు సంస్కృతిని కాపాడుతానన్నారు. తాను లండన్‌లో విద్యనభ్యసించే సమయంలో తమ వద్ద జరిగే దసరా వేడుకలకు కాలేజీ మానేసి వచ్చేవాడినన్నారు. సంప్రదాయ దుస్తులు ధరించడం తనకు ఇష్టమన్నారు. ఆయా కార్యక్రమాల్లో జిల్లా పర్యాటకశాఖాధికారి ఎం.శివాజి, టార్చ్ కార్యదర్శి అరవింద్ ఆర్య, సేవా టూరిజం అండ్‌కల్చరల్ సొసైటీ వ్యవస్థాపకుడు కుసుమ సూర్యకిరణ్, పర్యాటక శాఖ ఉద్యోగులు జై నరేష్, రాజు, తెలంగాణ జాగృతి రాష్ట్ర నాయకుడు దాస్యం విజయ్‌భాస్కర్, బీఆర్ఎస్ వరంగల్ పశ్చిమ నియోజక వర్గ కో ఆర్డినేటర్ పులి రజినీకాంత్, తదితరులు పాల్గొన్నారు. కాలేజీ వదిలేసి దసరాకు వచ్చేవాడిని కాకతీయ 22వ వారసుడు కమల్ చంద్ర భంజ్‌దేవ్ కోట, వేయిస్తంభాల గుడి, భద్రకాళి ఆలయంలో పూజలు -
రైల్వే మూడో లైన్ నిర్మాణ పనుల్లో జాప్యం
● మానుకోట రైల్వేస్టేషన్లో కొనసాగుతున్న ఆధునికీకరణ పనులు ● ప్రయాణికులకు తప్పని ఇక్కట్లు ● పనులు త్వరగా పూర్తిచేయాలని డిమాండ్ ఎల్సీ గేటు సమీపంలో జరుగుతున్న బ్రిడ్జి నిర్మాణ పనులు మహబూబాబాద్ రూరల్: రైల్వే మూడో లైన్ నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఈ పనులతో పాటు మానుకోట రైల్వే స్టేషన్ పరిధిలో చేపడుతున్న ఆధునికీకరణ పనుల్లో జాప్యం వల్ల ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. కాగా రైల్వే అధికారులు పర్యవేక్షిస్తున్నప్పటికీ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల పనులు నెమ్మదిగా జరుగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రైల్వేస్టేషన్లో ప్రయాణికుల అవస్థలు.. మహబూబాబాద్ రైల్వే స్టేషన్ రెండో నంబర్ ప్లాట్ ఫారం వైపున కొత్త ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తికాకుండానే రైల్వే మూడోలైన్ పనులు మొ దలుపెట్టారు. రెండు నెలల క్రితం ఇక్కడ ఉన్న బుకింగ్ కౌంటర్‌ను కూల్చివేసి రైల్వే లైన్ నిర్మాణం కోసం తవ్వకాలు జరిపారు. అనంతరం చేపట్టిన పనులు నత్తనడకన జరుగుతున్నాయి. కాగా ప్ర యాణికులు వచ్చి, వెళ్లేందుకు ఎలాంటి ప్రత్యామ్నా య ఏర్పాట్లు చేయలేదు. దీంతో రైళ్లు వచ్చి వెళ్లేటప్పుడు ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. రైల్వే లైన్ సైడ్ వాల్ ఒక ప్రాంతంలో కొంత మేరకు తొలగించి వదిలివేయడంతో ప్రయాణికులు అక్కడి నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. అయితే ఒకేసారి రెండు రైళ్లు వచ్చినప్పుడు ప్రయాణికుల రద్దీ వల్ల ఆ దారిగుండా వెళ్లలేకపోతున్నారు. ఇప్పటికై నా సంబంధిత శాఖ ఉన్నతాధికారులు స్పందించి ప్రయాణికుల అవసరాలను గుర్తించి అభివృద్ధి పనులు చేపట్టాలని, జరుగుతున్న పనుల్లో పురోగతి పెంచాలని ప్రజలు కోరుతున్నారు. అధికారి పరిశీలన.. రైల్వే అధికారుల మధ్య సమన్వయలోపం వల్ల కూడా పనుల్లో పురోగతి కనిపించడం లేదని తెలుస్తోంది. ఇటీవల రైల్వేశాఖ నిర్మాణ పనుల విభాగం డిప్యూటీ సీఈ రామారావు.. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాసరావుతో కలిసి రైల్వే మూడో లైన్ నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతంలో పరిశీలించారు. త్వరితగతిన పనులు పూర్తి చేసి ప్రయాణికులకు మౌలిక వసతులు అందుబాటులోకి వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఈపీసీ కాంట్రాక్టర్లను ఆదేశించారు. ఈ నెల 23నుంచి 30వ తేదీ వరకు నాన్ ఇంటర్ లాకింగ్ పనులు ఉన్నందువల్ల మహబూబాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలో మూడో లైన్ నిర్మాణ పనుల పురోగతి పెంచాలన్నారు.గేటు మూసివేతతో ఇబ్బందులు.. రైల్వే ఎల్సీ–80 నంబర్ గేటు వద్ద మూడో లైన్ నిర్మాణ పనుల కోసం పలుమార్లు ఆ గేటును మూపివేశారు. దీంతో వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు పడుతూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా మూడో లైన్ నిర్మాణ పనుల్లో భాగంగా కల్వర్టుల వద్ద బ్రిడ్జిల నిర్మాణాల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. రైల్వే ఎల్సీ 80 నంబర్ గేటు వద్ద కేబుల్ వైర్లు తెగిపోవడం వల్ల పనుల్లో జాప్యం జరుగుతోంది. -
‘భరోసా’ సేవలు అభినందనీయం
మహబూబాబాద్ రూరల్: భరోసా సెంటర్ సేవలు అభినందనీయమని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ అన్నారు. జిల్లా కేంద్రంలో భరోసా సెంటర్ ఏర్పా టు చేసి మూడేళ్లు పూర్తయింది. ఈమేరకు సెంటర్లో మంగళవారం ఎస్పీ కేక్ కట్ చేసి మాట్లాడారు. భరోసా సెంటర్లో బాధితులకు అన్ని రకాల సహాయ సహకారాలు, అత్యవసర పరిస్థితుల్లో ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందన్నారు. వార్షికోత్సవం సందర్భంగా భరోసా సెంటర్ తరఫున నలుగురు బాధితులకు తక్షణ సహాయం కింద రూ.30వేలు అందజేశారు. డీఎస్పీ తిరుపతిరావు, ఎస్బీ సీఐ చంద్రమౌళి, టౌన్, రూరల్ సీఐలు దేవేందర్, సర్వయ్య, రూరల్ ఎస్సై దీపిక, భరోసా సెంటర్ ఎస్సై ఝాన్సీ, షీ టీం ఎస్సై సునంద, డీడబ్ల్యూఓ ధనమ్మ, సీడబ్ల్యూసీ చైర్పర్సన్ నాగవాణి, భరోసాసెంటర్, సఖి, షీ టీమ్ సిబ్బంది ఉన్నారు. ఎస్పీ సుధీర్‌రాంనాథ్ కేకన్ -
మా భూమిలో ఆస్పత్రి నిర్మించొద్దు
మహబూబాబాద్: తాము కొనుగోలు చేసి భూమిలో అర్బన్ పీహెచ్సీ భవన నిర్మాణం చేపట్టడం సబబు కాదని బాధితులు చుక్కల పద్మ, కోడెల లక్ష్మి అన్నారు. జిల్లా కేంద్రం శివారు డబుల్ బెడ్రూం ఇళ్ల సమీపంలో అర్బన్ పీహెచ్సీ భవన నిర్మాణ పనులు జరుగుతుండగా.. మంగళవారం వారిద్దరూ ఆ స్థలం వద్ద పెట్రోలు బాటిల్‌తో ఆందోళన చేశారు. ఈసందర్భంగా పద్మ, లక్ష్మి మాట్లాడుతూ.. తాము లక్షలు పెట్టి కొనుగోలు చేసిన 800గజాల భూమిలో పీహెచ్సీ భవన నిర్మాణ పనులు చేయడం ఎంత వరకు సమంజసమన్నారు. పనులు నిలిపి వేయకపోతే ఆత్మహత్య చేసుకుంటామన్నారు. విషయం తెలుసుకున్న టౌన్ ఎస్సై విజయ్ అక్కడికి చేరుకుని.. వివరాలు తెలుసుకుని పనులు నిలిపివేయించడంతో బాధితులు ఆందోళన విరమించారు. సంబంధిత డాక్యుమెంట్లు తీసుకుని వస్తే అఽధికారులతో మాట్లాడుతామని చెప్పడంతో వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. పెట్రోలు బాటిల్‌తో బాధితుల ఆందోళన -
ధాన్యం కొనుగోళ్లకు కంట్రోల్ రూం ఏర్పాటు
మహబూబాబాద్: ధాన్యం రైతుల సౌకర్యార్థం కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు చేశామని డీసీఎస్ఓ ప్రేమ్‌కుమార్, సివిల్ సప్లయీస్ డీఎం కృష్ణవేణి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ధాన్యం కొనుగోళ్లు, రవాణా, కేంద్రాల నిర్వహణ తదితర అంశాలపై రైతులు టోల్ ఫ్రీ 7995050789 నంబర్‌కు కాల్ చేయవచ్చన్నారు. సమస్యలను తమ అధికారుల దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించుకోవాలన్నారు. లేబర్కోడ్లు రద్దు చేసే వరకు పోరాటాలు● కార్మిక సంఘాల నేతల పిలుపు నెహ్రూసెంటర్: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్కోడ్లు రద్దు చేసే వరకు పోరాటాలు నిర్వహిస్తామని కార్మిక సంఘాల నేతలు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ వద్ద కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి కుంట ఉపేందర్, ఏఐటీయూసీ జిల్లా సహాయ కార్యదర్శి వరిపెల్లి వె వెంకన్న, ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షుడు పర్వత కోటేష్, టీయూసీఐ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి రవి, ఎస్కె.మదార్ మాట్లాడారు. కార్మిక హక్కుల రక్షణ, చట్టాల అమలు, కనీస వేతన చట్టం అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, సంఘటిత, అసంఘటిత రంగంలో పని చేస్తున్న కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆకుల రాజు, అల్వాల వీరయ్య, సమ్మెట రాజమౌళి, దార స్నేహబిందు, హలావత్ లింగన్న, లక్ష్మయ్య, సురేష్, బిల్లకంటి సూర్యం, భాస్కర్‌రెడ్డి, కార్మికులు పాల్గొన్నారు. పెండింగ్ వేతనాలు విడుదల చేయాలిమహబూబాబాద్: మున్సిపల్ కార్మికుల పెండింగ్ వేతనాలు వెంటనే విడుదల చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆకుల రాజు డిమాండ్ చేశారు. సీఐటీయూ అనుబంధ తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో మంగళవారం మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళన చేసి మేనేజర్ శ్రీధర్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆకుల రాజు మాట్లాడుతూ.. కార్మికులంతా దళిత, బడుగు, బలహీన వర్గాలకు చెందిన వారే ఉన్నారని, ఐదు నెలలుగా వేతనాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికా రుల నిర్లక్ష్యంతోనే వేతనాలు విడుదల కావడం లేదన్నారు. కనీస వేతనం రూ.26,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈనెల 26లోపు వేతనాలు చెల్లించాలని, లేని యెడల 27నుంచి కార్మికులు పనులు నిలిపివేస్తారని హెచ్చరించారు. కార్యక్రమంలో కుమ్మరికుంట్ల నాగన్న, సమ్మెట రాజమౌళి, తోట శ్రీనివాస్, కాంపెల్లి శ్రీనివాస్, శ్రీను, విజయ్, పుష్పరాజ్, చిరంజీవి, వీరన్న, సుజాత, లక్ష్మి పాల్గొన్నారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో వినతి మున్సిపల్ కార్మికుల వేతనాలు చెల్లించాలని ఏఐటీయూసీ అనుబంధ యూనియన్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి రేషపల్లి నవీన్ రమణ, విజయ్, మధుసూదన్, నాగేశ్వర్రావు, శ్రీను పాల్గొన్నారు. -
‘గిరి జలవికాసం’ అమలుకు చర్యలు
మహబూబాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిర సౌర గిరి జలవికాసం పథకం అమలుకు జిల్లాలో పకడ్బందీ చర్యలు తీసుకుంటామని కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్ అన్నారు. కలెక్టర్ కార్యాలయం ఎన్ఐసీ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఐటీడీఏ ఏటూరునాగారం ప్రాజెక్ట్ డైరెక్టర్ చిత్రామిశ్రా, డీఎఫ్ఓ విశాల్ సంబంధిత అధికారులతో కలిసి కలెక్టర్ గిరిజల వికాసం పథకంపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అర్హత కలిగిన ఆర్ఓఎఫ్ఆర్ పట్టాదారులను మండలస్థాయి కమిటీ ద్వారా గుర్తించి భూగర్భజల సర్వేను నిర్వహించాలన్నారు. బోరు బావులు నిర్మించి సోలార్ సిస్టం ద్వా రా మోటార్లను వినియోగంలోకి తీసుకొచ్చి డ్రిప్ ఇరిగేషన్ ద్వారా సాగు చేపట్టాలన్నారు. ప్రభుత్వ సూచనల ప్రకారం క్షేత్రస్థాయిలో ట్రైబల్ వెల్ఫేర్, అటవీశాఖ, గ్రౌండ్ వాటర్, హార్టికల్చర్, సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నా రు. ప్రత్యేక గ్రామ సభలు నిర్వహించి ఆసక్తి గల ట్రైబల్ రైతులకు పథకం ఆవశ్యకతను వివరించాలన్నారు. ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా మాట్లాడుతూ.. ప్రభుత్వ జీఓ ప్రకారం గిరిజన రైతులను గుర్తించి వారి అభ్యున్నతికి కృషి చేయాలన్నారు. సద్వినియోగం చేసుకోవాలిడిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ పథకాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్ అన్నారు. కలెక్టరేట్లోని కలెక్టర్ చాంబర్లో మంగళవారం జిల్లా పెట్టుబడుల ప్రోగ్రాం కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 58మంది ఎస్టీ, ఎస్సీ లబ్ధిదారులకు సబ్సిడీ రాయితీ మంజూరు చేసినట్లు చెప్పారు. యువతకు ప్రైవేట్ ఇండస్ట్రీయల్‌లో ఉపాధి కల్పించడానికి డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు చెప్పారు. జిల్లా పరిశ్రమల శాఖ జీఎంశ్రీమన్నారాయణరెడ్డి, అధికారులు పాల్గొన్నారు. వైద్యులు అందుబాటులో ఉండాలి నెహ్రూసెంటర్: ఆస్పత్రికి వస్తున్న రోగులు, ప్రజ లకు వైద్యులు అందుబాటులో ఉంటూ వైద్య సేవలు అందించాలని కలెక్టర్ అధ్వైత్‌కుమార్‌సింగ్ సూ చించారు, జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిని మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..రోగులకు నిరంతర వైద్య సేవలు అందించాలని తెలిపారు. వైద్యులు, సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించారు. సదరం క్యాంపుల నిర్వహణకు ఆస్పత్రిలో అనువైన ప్రదేశంలో సేవలు అందించేలా బ్లాక్ నిర్మాణ ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించారు. మానసిక, కంటి, చెవి, ముక్కు, దంత, వినికిడి విభాగాలకు సంబంధించిన పరీక్షల కోసం ప్రత్యేక ఏర్పాటు చేయాలన్నారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీనివాసరావు, ఆర్ఎంఓ జగదీశ్వర్, వైద్యులు, సిబ్బంది, డీఆర్డీఓ మధుసూదన్‌రాజు, డీఈ, ఏఈ, శంకర్ ఉన్నారు. కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్ -
ఉపాధ్యాయుల చేతుల్లోనే విద్యార్థుల భవిష్యత్
మహబూబాబాద్ అర్బన్: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల భవిష్యత్ ఉపాధ్యాయుల చేతుల్లో ఉందని డీఈఓ రవీందర్ రెడ్డి అన్నారు. జిల్లాలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల ఉపాధ్యాయులకు రెండో విడత శిక్షణ తరగతులు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా డీఈఓ శిక్షణ తరగతులను సందర్శించి మాట్లాడారు. ప్రతీరరోజు క్రమం తప్పకుండా సయమానికి ఉపాధ్యాయులు శిక్షణకు హాజరు కావాలన్నారు. అనంతరం రాష్ట్ర విద్యాశాఖ సెక్రటరీ యోగితా రానా వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఉపాధ్యాయులు శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకొని విద్యార్థుల బంగారు భవిష్యత్‌కు బాటలు వేయాలని కోరారు. కార్యక్రమంలో ఏసీజీఈ శ్రీరాములు, సైన్స్ అధికారి అప్పారావు, క్వాలిటీ కోఆర్డినేటర్ ఆజాద్, రిసోర్స్ పర్సన్లు తదితరులు పాల్గొన్నారు. -
వడదెబ్బతో పారిశుద్ధ్య కార్మికుడి మృతి
కాటారం: సరస్వతీనది పుష్కరాల్లో భాగంగా విధులు నిర్వర్తిస్తూ ఓ పారిశుద్ధ్య కార్మికుడు వడదెబ్బతో మృతి చెందాడు. కుటుంబీకుల కథనం ప్రకారం.. కాటారం మండలం గంగారం గ్రామానికి చెందిన జీపీ పారిశుద్ధ్య కార్మికుడు మంతెన శ్రీనివాస్(35) ఈ నెల 15 నుంచి నాలుగు రోజుల పాటు కాళేశ్వరంలో పుష్కరాల విధులు నిర్వర్తించాడు. పనులు చేస్తూ ఆదివారం ఎండతీవ్రతకు అస్వస్థతకు గురయ్యాడు. దీంతో అధికారులు కాళేశ్వరంలోని వైద్య శిబిరంలో ప్రథమ చికిత్స చేయించి ఇంటికి పంపించారు. అయితే పరిస్థితి విషమించి సోమవారం అర్ధరాత్రి మృతి చెందాడు. -
గోదావరి తీరం.. భక్తప్రవాహం
సరస్వతీనది పుష్కర స్నానాలకు భక్తుల రద్దీ● తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకూ కొనసాగింపు.. ● ఆరో రోజు స్వల్పంగా తగ్గిన భక్తులు ● ముక్తీశ్వరస్వామి ఆలయ క్యూలైన్లో బారులుదీరిన భక్తజనం● హైకోర్టు జడ్జి, ఎస్ఐబీ డైరెక్టర్, ఇంటెలిజెన్స్ డీజీ పుష్కర స్నానం, దర్శనం ● 50వేల మంది వరకు భక్తులు పుష్కర స్నానాలుభూపాలపల్లి/కాళేశ్వరం: జయశంకర్భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతీనది పుష్కరాలకు భక్తులు తరలివచ్చారు. మంగళవారం ఆరో రోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, కర్నాటక రాష్ట్రాల నుంచి తరలొచ్చి గోదావరి, ప్రాణహిత, అంతర్వాహిని సరస్వతీనదిలో పుష్కర పుణ్యస్నానాలు ఆచరించారు. నదీమాతకు పూజలు చేశారు. పిండ ప్రదాన పూజలు చేశారు. పితృదేవతలకు తర్పణాలు నిర్వహించారు. నదీమాతకు చీర, సారె సమర్పించారు. ముత్తయిదువలు వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు. గోదావరితీరం వద్ద భక్తప్రవాహం కనిపించింది. నదిలో దీపాలు వదిలి మొక్కులు చెల్లించారు. ఇసుకలో సైకత లింగాలు చేసి పూజించారు. కలెక్టర్, ఎస్పీ పరిశీలన పుష్కరాల్లో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ టీమ్‌లు, సింగరేణి, గజ ఈతగాళ్లును ఏర్పాటు చేశారు. కలెక్టర్ రాహుల్‌శర్మ, ఎస్పీ కిరణ్‌ఖరే వాకీటాకీలతో మాట్లాడుతూ పరిశీలించారు. టెంట్‌సిటీ, ఆలయ పరిసరాలు, ప్రధాన రహదారుల్లో బ్లీచింగ్ చల్లించి పరిస్థితిని చూశారు. పుష్కర ఘాట్ గోదావరిలో బోటు ద్వారా భద్రతను పరిశీలించారు. బస్టాండ్ ప్రాంతంలో అదనంగా చలువ పందిళ్లు వేయాలని ఆదేశించారు. ఎస్పీ ట్రాఫిక్ నియంత్రణను పకడ్బందీగా చేట్టాలని ఆదేశించారు. అష్టమితో తగ్గిన రద్దీ.. మంగళవారం అష్టమి సందర్భంగా భక్తుల రద్దీ తగ్గుముఖం పట్టింది. ఉదయం 10గంటల వరకు భక్తుల రద్దీ లేదు. ఆ తర్వాత క్రమక్రమంగా పెరిగింది. హైదరాబాద్, వరంగల్, భూపాలపల్లి, మంథని, కాటారం మీదుగా వాహనాలు తరలొచ్చాయి. ట్రాఫిక్ జామ్ కాకుండా పోలీసులు డివైడర్లతో నియంత్రించారు. పార్కింగ్ స్థలాల్లో వాహనాల రద్దీ కొనసాగింది. రోడ్లు శుభ్రం.. ఆదిముక్తీశ్వరస్వామి నుంచి వీఐపీ ఘాట్ వెళ్లే మార్గంలో వర్షం పడితే రోడ్లపై దిగబడకుండా గ్రావెల్ చిప్స్ వేశారు. రోడ్లపై దుమ్ము లేవకుండా ట్యాంకర్లతో నీటిని చల్లుతున్నారు. గోదావరితీరం, ఆలయ పరిసరాలు, పార్కింగ్ ప్రాంతాలు, ఆర్టీసీ బస్టాండ్లు, ప్రధాన రహదారుల్లో పారిశుద్ధ్య కార్మికులు పనులు చురుగ్గా చేపట్టారు. 50వేల మంది స్నానాలు.. వివిధ రాష్ట్రాల నుంచి ఆర్టీసీ, ప్రైవేట్ వాహనాల్లో భక్తులు త్రివేణి సంగమం సరస్వతీనదికి వచ్చి పుష్కర స్నానాలు ఆచరించారు. కాళేశ్వరముక్తీశ్వరస్వామి ఆలయంలో దర్శనానికి క్యూలైన్లో బారులుదీరారు. మంగళవారం 50వేల మంది వరకు పుష్కర స్నానాలు చేసి దర్శనాలు చేసుకున్నట్లు అధికారుల అంచనా. పలువురు భక్తులు అక్కడక్కడ వడదెబ్బకు గురయ్యారు. వారిని కాళేశ్వరం పీహెచ్‌సీకి తరలించి వైద్యసేవలందించారు. కొంత మందిని ఇతర పట్టణాలకు తరలించి వైద్యసేవలందించినట్లు వైద్యులు పేర్కొన్నారు. మజ్జిగ ప్యాకెట్లు అందజేత.. భక్తులకు దేవాదాయశాఖ ఆధ్వర్యంలో తాగునీరు, మజ్జిక ప్యాకెట్లు అందించారు. ప్రధాన తూర్పు, దక్షిణ ద్వారాల ద్వారా క్యూలైన్లలో భక్తులను ఎప్పటికప్పుడు క్లియర్ చేశారు. ప్రత్యేకాధికారిగా మనోహర్‌ను నియమించారు. ఆయన క్రౌడ్ మేనేజ్మెంట్ చేపట్టారు. సరస్వతీనది పుష్కరాలకు ప్రముఖులు హాజరయ్యారు. హైకోర్టు జడ్జి సృజన, ఎస్ఐబీ డైరెక్టర్ తరుణ్‌జోషి, ఇంటెలిజెన్స్ డీజీ శివధర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి పుష్కర స్నానాలు ఆచరించి శ్రీకాళేశ్వరముక్తీశ్వరున్ని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.నదీహారతి ప్రత్యక్ష ప్రసారం.. సరస్వతి ఘాట్‌లో కాశీపండితులతో ఏర్పాటు చేసిన నవరత్నమాల హారతికి భక్తుల నుంచి విశేష స్పందన రావడంతో సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యక్ష ప్రసారం చేయాలని ఆదేశించారు. రాత్రి 7.30 గంటలకు 45 నిమిషాల పాటు జరిగే ఈకార్యక్రమాన్ని పుష్కరాలు పూర్తయ్యే వరకు ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ రాహుల్‌శర్మ తెలిపారు. కాశీ పండితులు ఏడుగురితో తొమ్మిది హారతులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విద్యుత్ వెలుగుల్లో హారతి ఇస్తున్నారు. రోజురోజుకూ పరిసర ప్రాంతాల భక్తులు వీక్షించడానికి తరలి వస్తున్నారు. రాత్రి 9 వరకు కూడా వరకు భక్తులు ఆయా పరిసరాల్లో కాలక్షేపం చేస్తున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు అలరిస్తున్నాయి. ప్రముఖుల పూజలు.. -
ఇన్చార్జ్ సీఎండీలతో ఇబ్బందులు
● టీఎస్‌ఈఈయూ –327 రాష్ట్ర సెక్రటరీ జనరల్ ఇనుగాల శ్రీధర్ హన్మకొండ: టీజీ జెన్కో, టీజీ ట్రాన్స్‌కోలో ఇన్చార్జ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్లతో అనేక ఇబ్బందులు పడుతున్నామని తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ (టీఎస్‌ఈఈయూ)–327 రాష్ట్ర సెక్రటరీ జనరల్ ఇనుగాల శ్రీధర్ అన్నారు. మంగళవారం హనుమకొండ వడ్డేపల్లి రోడ్‌లోని టీఎస్‌ఈఈయూ–327 కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వం శ్రమశక్తి అవార్డు గ్రహీతల సన్మానం జరిగింది. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ విద్యుత్ సంస్థల్లో డైరెక్టర్ల నియామకంలో జాప్యంతో పాలనాపరమైన ఇబ్బందులు కలుగుతున్నాయని, వెంటనే నియామకాలు చేపట్టాలన్నారు. ఆర్థిక పరిస్థితి, ఉద్యోగుల సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఉద్యోగుల్లో అసంతృప్తి ఉందన్నారు. ఉద్యోగుల సమస్యలపై చర్చించడానికి విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్కతో అపాయింట్మెంట్ ఇప్పించాలని సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డిని కోరారు. ఎమ్మెల్యే నాయిని మాట్లాడుతూ తాను ఈ కార్యక్రమం నుంచి విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్కతో మాట్లాడానని, నాలుగైదు రోజుల్లో సమయం ఇస్తానని చెప్పారన్నారు. అనంతరం శ్రమశక్తి అవార్డు గ్రహీతలు పి.మహేందర్ రెడ్డి, నీలం ఐలేశ్, సురేశ్ కుమార్‌ను ఎమ్మె ల్యే నాయిని, ఇనుగాల శ్రీధర్, నాయకులు సన్మానించారు. పీసీసీ నాయకుడు ఈ.వి.శ్రీనివాస్ రావు, టీఎస్‌ఈఈయూ–327 టీజీ ఎన్పీడీసీఎల్ సెక్రటరీ కొండూరి శ్రీనివాస్, భూపాల్‌రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, నరేందర్ రెడ్డి, మాధవ రావు, చిట్ల ఓదేలు, బుచ్చయ్య గౌడ్, జశ్వంత్ కుమార్, సదయ్య, శ్రీనివాస్, రవికుమార్ పాల్గొన్నారు. కొత్త సబ్స్టేషన్లకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలి ● టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి హన్మకొండ: కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి ఆదేశించారు. మంగళవారం హనుమకొండలోని టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో చీఫ్ ఇంజనీర్లు, నోడల్ అధికారుల సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీఎండీ వరుణ్‌రెడ్డి మాట్లాడుతూ 16 సర్కిళ్ల పరిధిలో పురోగతిలో ఉన్న ఇంటర్ లింకింగ్ లైన్ల పనులు యుద్ధ ప్రతిపాదికన పూర్తి చేయాలని ఆదేశించారు. బ్రేక్ డౌన్స్, ట్రిప్పింగ్స్ లేకుండా ప్రతీ నెల ఫీడర్ల నిర్వహణ చేపట్టాలన్నారు. ప్రీ మాన్సూన్ తనిఖీలు అన్ని ఫీడర్లలో చేపట్టాలని, తద్వారా అంతరాయాలు తగ్గుతాయన్నారు. సబ్ స్టేషన్ల నిర్వహణ చేసే సమయంలో అంతరాయం లేకుండా వేరే సబ్ స్టేషన్ నుంచి ప్రత్యామ్నాయ విద్యుత్ సరఫరా చేయాలన్నారు. కార్యక్రమంలో ఇన్చార్జ్ డైరెక్టర్లు బి.అశోక్ కుమార్, టి.సదర్ లాల్, వి.తిరుపతి రెడ్డి, టి.మధుసూదన్, సీఈలు కె.తిరుమల్ రావు, రాజుచౌహాన్, అశోక్, వెంకట రమణ, జీఎంలు వేణు బాబు, దేవేందర్, కృష్ణమోహన్, వెంకటకృష్ణ, శ్రీనివాస్, సత్యనారాయణ, సురేందర్, ఉత్తమ్, తదితరులు పాల్గొన్నారు. పీజీ పరీక్షలు షురూకేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆ దిలాబాద్ జిల్లాలో పీజీ కోర్సుల (నాన్ ప్రొఫెషనల్) రెగ్యులర్, ఎక్స్, ఇంప్రూవ్మెంట్ నాలుగో సెమిస్టర్ పరీక్షలు మంగళవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రారంభమయ్యాయి. పీజీ నాలుగో సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ కొందరు విద్యార్థులు మంగళవారం ఉదయం కేయూలోని పరిపాలనా భవనం వద్ద ధర్నా నిర్వహించారు. పోలీసుల చొరవతో వీసీ ప్రతాప్‌రెడ్డి, రిజిస్ట్రార్ రామచంద్రం, యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ మనోహర్ విద్యార్థులతో చర్చించారు. త్వరగా పరీక్షలు జరిగితే ఎంతో మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుందని నచ్చజెప్పడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. టైంటేబుల్ ప్రకారం మధ్యాహ్నం 2గంటల నుంచి యథావిధిగా పరీక్షలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు కేయూ పరిధిలో 95 శాతం మంది విద్యార్థులు పరీక్షలు రాసినట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి రాజేందర్ తెలిపారు. వీరి వెంట పరీక్షల నియంత్రణాధికారి రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ బీఎస్ఎల్ సౌజన్య, వర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ మనోహర్, ఆర్ట్స్ కాలేజీ పరీక్ష కేంద్రంలో ప్రిన్సిపాల్ జ్యోతి ఉన్నారు. రేపటి నుంచి జిల్లా స్థాయి బాక్సింగ్ ఎంపికలువరంగల్ స్పోర్ట్స్: ఈనెల 22వ తేదీన జూనియర్స్ బాలబాలికల ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి బాక్సింగ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు బాక్సింగ్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి పి.రాజేందర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు జనవరి 1, 2009 నుంచి డిసెంబర్ 31, 2010 మధ్య జన్మించిన వారు అర్హులుగా పేర్కొన్నారు. ఆధార్, స్కూల్ బోనోఫైడ్, జనన ధ్రువీకరణ పత్రం జిరాక్స్‌లతో పాటు రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలతో పాటు రూ.300 ఎంట్రీ ఫీజుతో ఉదయం 7గంటలకు హనుమకొండలోని డీఎస్ఏ బాక్సింగ్హాల్ నందు హాజరు కావాలని తెలిపారు. ఎంపికై న క్రీడాకారులు ఈనెల 24వ తేదీన మంచిర్యాలలో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. ● ఉదయం కేయూలో విద్యార్థుల ధర్నా ● మధ్యాహ్నం నుంచి యథావిధిగా ఎగ్జామ్స్ -
కన్యాదానం చేసిన 48 గంటల్లోనే నవవధువు తండ్రి మృతి
బయ్యారం: బిడ్డకు వేదమంత్రాల నడుమ కన్యాదానం చేసిన తండ్రి 48 గంటల వ్యవధిలో కాలంచేసి ఆ కుటుంబంలో విషాదం నింపాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం గంధంపల్లిలో మంగళవారం జరిగింది. గ్రామానికి చెందిన జంగిలి సతీష్(46)– శోభ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్దకుమార్తె వివాహం కొన్నేళ్ల క్రితం జరగగా, చిన్నకుమార్తె అక్షయ వివాహం ఆదివారం నిర్వహించారు. పెళ్లి పూర్తయిన తర్వాత రెండురోజులుగా సతీష్ స్థానికంగా ఉపాధి హామీ పనులకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో వడదెబ్బ తగలడంతో వాంతులు, విరోచనాలవుతున్నాయి. స్థానికంగా వైద్యం చేయించినప్పటికీ పరిస్థితి విషమించి మంగళవారం మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. -
త్రివేణి సంగమం.. భక్తజన సంద్రం
కాళేశ్వరంలో భక్తుల సందడి ● పుణ్యస్నానాలు ఆచరించిన వేలాది భక్తులు ● ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ప్రముఖులు త్రివేణి సంగమం.. భక్త జన సంద్రమైంది. పుష్కరిణి స్నానం.. పులకించేలా చేసింది. వడివడిగా పరుగులు పెడుతున్న చల్లని తల్లికి వాయినాలిచ్చే ఆడపడుచులు.. పితృదేవతలను స్మరిస్తూ తర్పణాలు వదిలే పురుషులు. కేరింతలు కొడుతూ అల్లరి చేస్తున్న యువతులు, చిన్నారులతో నదీ ప్రాంతం సందడిగా మారింది. ఐదో రోజు సోమవారం వేలాదిగా భక్తులు కాళేశ్వరానికి తరలివచ్చారు. ముక్తీశ్వరుడిని దర్శించుకునేందుకు గంటల కొద్దీ క్యూలో వేచి చూశారు.– వివరాలు, మరిన్ని ఫొటోలు 8లోu -
త్వరలో జిల్లాకు క్రికెట్ స్టేడియం
● ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య ● అంతర్ జిల్లాల క్రికెట్ పోటీలు షురూ వరంగల్ స్పోర్ట్స్: జిల్లాలో క్రికెట్ స్టేడియం నిర్మాణ అంశాన్ని ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు తీసుకెళ్లారని, త్వరలోనే స్టేడియం ఏర్పాటు ప్రకటన వెలువడనుందని ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య అన్నారు. వరంగల్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హనుమకొండ రెడ్డిపురంలో సోమవారం అంతర్‌జిల్లాల క్రికెట్ లీగ్ పోటీలు ప్రారంభమయ్యాయి. హనుమకొండ, భూపాలపల్లి జిల్లాల మధ్య జరిగిన మ్యాచ్‌ను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. ఉమ్మడి రా ష్ట్రంలో అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో బీజంపడిన క్రికెట్ స్టేడియం నిర్మాణం.. ఇప్పుడు ఆచరణలోకి రానుందని, అందుకు ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలతో పాటు తానుకూడా ముందుండి నిర్మాణం జరిగేలా చొరవచూపుతానని భరోసా కల్పించారు. క్రికెట్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి చాగంటి శ్రీనివాస్ మాట్లాడుతూ రెడ్డిపురంతో పాటు మొగిలిచర్ల గ్రౌండ్లో జనగామ, ములుగు, వంగాలపల్లి మైదానంలో వరంగల్, మహబూబాబాద్ జట్ల మధ్య లీగ్ మ్యాచ్‌లు కొనసాగాయని తెలిపారు. సంఘం జిల్లా అధ్యక్షుడు పెద్ది ప్రవీణ్‌గౌడ్, ఉపాధ్యక్షుడు సదాశివ్, తోట రాము, సంయుక్త కార్యదర్శి ఉపేందర్ పాల్గొన్నారు. -
వందశాతం అడ్మిషన్లు పూర్తి చేయాలి
మహబూబాబాద్ అర్బన్: మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో వందశాతం అడ్మిషన్లు పూర్తి చేయాలని ఉమ్మడి వరంగల్ జిల్లా ఆర్సీఓ రమేశ్ లాల్ హట్కర్ అన్నారు. జి ల్లా కేంద్రంలోని మైనార్టీ గురుకుల పాఠశా ల ఉపాధ్యాయులు చేపట్టిన అడ్మిషన్ల ప్రక్రియను సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మైనార్టీ గురుకులాల్లో 5 నుంచి 8వ తరగతి వరకు ముస్లిం విద్యార్థుల అడ్మిషన్లు పూర్తి చేయాలన్నారు. ఉపాధ్యాయులు ఇంటింటా ప్రచారం చేయాలని, విద్యార్థుల తల్లిదండ్రులను కలిసి మైనార్టీ గురుకులాల్లో నాణ్యమైన విద్యతో పాటు అన్ని వసతులు ఉచితంగా అందిస్తారని అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు మహేశ్, రాజశేఖర్, ఇమాముద్దీన్ పాల్గొన్నారు. -
పకడ్బందీ చర్యలు చేపట్టాలి
మహబూబాబాద్ రూరల్: రైతులకు ఎలాంటి ఇ బ్బందులు లేకుండా కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అ ద్వైత్ కుమార్ సింగ్ అన్నారు. మహబూబాబాద్ మండలంలోని కంబాలపల్లి గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రిజిస్టర్లను పరిశీలించారు. కొనుగోలు చేసిన ధా న్యం, రైస్ మిల్లులకు తరలింపు, మద్దతు ధర చెల్లించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేంద్రానికి వచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేసి వెంటనే మిల్లులకు తరలించాలని ఆదేశించారు. లారీలు, గోనె సంచుల సమాచారంపై రైతులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరంలేదని, అధికారులు ధాన్యాన్ని మిల్లులకు సకాలంలో తరలించి రైతులకు ఎటువంటి సమస్యలు లేకుండా క్షేత్రస్థాయిలో పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. వాతావరణ మార్పుల దృష్ట్యా అకాల వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడవకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని సూచించారు. ధాన్యాన్ని సకాలంలో మిల్లులకు తరలించాలి చిన్నగూడూరు: ధాన్యాన్ని సకాలంలో మిల్లులకు తరలించాలని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఆదేశించారు. సోమవారం మండలంలోని చిన్నగూడూరు, విస్సంపల్లి, ఉగ్గంపల్లి కొనుగోలు కేంద్రాలను సందర్శించి ధాన్యం కొనుగోలు రిజిస్టర్లను పరిశీలించారు. ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయిల్లో తనిఖీలు చేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ మహబూబ్ అలీ, కొనుగోలు కేంద్రం నిర్వాహకులు, రైతులు ఉన్నారు. కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్ ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిశీలన -
కమిషనరేట్‌లో ఏసీపీల బదిలీ
వరంగల్ క్రైం: రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఏసీపీ బదిలీల్లో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పలువురు ఏసీపీలు బదిలీ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 77 మంది ఏసీపీలను బదిలీ చేస్తూ డీజీపీ డాక్టర్ జితేందర్ ఉత్తర్వులు జారీ చేశారు. నర్సంపేట ఏసీపీగా పనిచేసిన వి.కిరణ్‌కుమార్.. డీజీపీ ఆఫీస్‌కు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో ఖమ్మం సీసీఆర్బీ ఏసీపీగా పనిచేస్తున్న పున్నం రవీందర్‌రెడ్డి బదిలీపై వచ్చారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ విభాగం డీఎస్పీగా పనిచేసిన పి.ప్రశాంత్‌రెడ్డిని కాజీపేట ఏసీపీగా, మామునూరు ఏసీపీగా పనిచేస్తున్న బి.తిరుపతి డీజీపీ కార్యాలయానికి బదిలీ కాగా, ఆయన స్థానంలో ఖమ్మం ఎస్బీ ఏసీపీగా పనిచేస్తున్న ఎన్.వెంకటేష్ బదిలీపై వచ్చారు. రాచకొండ ‘షీ’ టీమ్ ఏసీపీగా పనిచేస్తున్న పి.నర్సింహారావు హనుమకొండ ఏసీపీగా, హనుమకొండ ఏసీపీగా పనిచేస్తున్న కొత్త దేవేందర్‌రెడ్డి డీజీపీ కార్యాలయానికి బదిలీ అయ్యారు. సీఐడీ డీఎస్పీగా పనిచేస్తున్న పి.సదయ్య వరంగల్ సీసీఎస్ ఏసీపీగా బదిలీ అయ్యారు. ఇప్పటికే బదిలీ అయిన స్థానాల్లో పలువురు ఏసీపీలు రిపోర్టు చేశారు. నర్సంపేట ఏసీపీగా పనిచేసిన కిరణ్‌కుమార్ సీసీఎస్ ఏసీపీగా బాధ్యతలు స్వీకరించారు. పి.ప్రశాంత్‌రెడ్డి కాజీపేట ఏసీపీగా, నర్సంపేట ఏసీపీగా పున్నం రవీందర్‌రెడ్డి బాధ్యతలు చేపట్టారు. కొత్తగా వెలువడిన ఉత్తర్వుల్లో సీసీఎస్ ఏసీపీగా పి.సదయ్య బదిలీ అయినట్లు ఉండడం గందరగోళానికి తావిస్తోంది. ఒకటి, రెండు రోజుల్లో బదిలీ ఉత్తర్వులపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు ఓ పోలీస్ ఉన్నతాధికారి తెలిపారు. ఏఐవైఎఫ్ జాతీయ కార్యదర్శిగా వలీఉల్లాఖాద్రీ కేయూ క్యాంపస్: అఖిల భారత యువజన సమైక్య(ఏఐవైఎఫ్) జాతీయ కార్యదర్శిగా వరంగల్‌కు చెందిన డాక్టర్ వలీ ఉల్లాఖాద్రీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏపీలోని తిరుపతిలో నాలుగురోజులుగా నిర్వహించిన ఏఐవైఎఫ్ జాతీయ మహాసభల్లో వలీఉల్లాఖాద్రీని జాతీయ కార్యదర్శిగా ఎన్నుకున్నారు. వలీఉల్లాఖాద్రీ తెలంగాణ మలిదశ ఉద్యమంలో కీలక పాత్రపోషించారు. కేయూ వేదికగా అనేక ఉద్యమాల్లో భాగస్వాములయ్యారు. ఏఐఎస్ఎఫ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేశారు. ఆ తర్వాత ఏఐఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షుడిగా కూడా దేశం వ్యాప్త విద్యార్థి ఉద్యమాల్లో భాగస్వాములయ్యారు. వలీఉల్లాఖాద్రీ కేయూలో కామర్స్ అండ్ బిజినెస్మేనేజ్మెంట్ విభాగం నుంచి డాక్టరేట్ పొందారు. -
రైతులకు అండగా ప్రభుత్వం
మరిపెడ: ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి ప్రేమ్‌కుమార్ అన్నారు. మరిపెడ తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం సివిల్ సప్లయీస్ డీఎం కృష్ణవేణితో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతుల ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. మరిపెడలో గత యాసంగి సీజన్ కంటే ప్రస్తుతం అధికంగా ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందన్నారు. ఇప్పటివరకు 75శాతం ధాన్యం సేకరణ పూర్తయినట్లు తెలిపారు. కలెక్టర్ నిత్యం అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారన్నారు. ప్రత్యేకాధికారులు కొనుగోలు కేంద్రాలను పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. సమావేశంలో మండల ప్రత్యేక అధికారి కిరణ్‌కుమార్, డీపీఆర్ఓ రాజేంద్రప్రసాద్, తహసీల్దార్ కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. -
నిబంధనలు ఉల్లంఘిస్తే అనుమతులు రద్దు
నెహ్రూసెంటర్: ప్రైవేటు ఆస్పత్రులు నిబంధనలు ఉల్లంఘిస్తే నోటీసులు జారీతో పాటు అనుమతులను రద్దు చేస్తామని డీఎంహెచ్ఓ రవిరాథోడ్ హెచ్చరించారు. వైద్యారోగ్యశాఖ అధికారులు సోమవారం జిల్లా కేంద్రంలోని పలు ఆస్పత్రుల్లో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ.. వైద్యారోగ్యశాఖ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఆస్పత్రి భవనాల్లో ఫైర్‌సేఫ్టీ అనుమతులు తీసుకోవాలని, బయో మెడికల్, పొల్యూషన్ కంట్రోల్ బోర్టు నుంచి సర్టిఫికెట్లు విధిగా తీసుకోవాలని సూచించారు. స్కానింగ్ సెంటర్లో అనుమతి పొందిన రేడియోలాజిస్టులు, గైనకాలజిస్టులు మాత్రమే గర్భిణులకు స్కానింగ్‌లు చేయాలని, లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. ఆస్పత్రుల యాజమాన్యాలు అందించే వైద్య సేవలకు సంబంధించిన రుసుము వివరాలను ఆస్పత్రి ఆవరణలో ఏర్పాటు చేయాలని చెప్పారు. తనిఖీల్లో ప్రోగ్రాం అధికారి సారంగం, డిప్యూటీ మాస్ మీడియా అధికారి కొప్పు ప్రసాద్, హెచ్ఈఓ లోక్య, ఎల్డీ కంప్యూటర్ అరుణ్, మనోహర్, సీసీ అనిల్ తదితరులు పాల్గొన్నారు. డీఎంహెచ్ఓ రవిరాథోడ్ -
పార్టీలో కోవర్టులకు స్థానంలేదు
తొర్రూరు రూరల్: కాంగ్రెస్ పార్టీలో కోవర్టులకు స్థానం లేదని, నిజమైన కార్యకర్తలకే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రాధాన్యం ఉంటుందని ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని నాంచారీమడూరు గ్రామ శివారులోని రెడ్డి గార్డెన్లో తొర్రూరు మండల, పట్టణ స్థాయి కార్యకర్తల సమావేశాన్ని పార్టీ జిల్లా పరిశీలకురాలు రవళిరెడ్డి, పాలకుర్తి నియోజకవర్గ ఇన్చార్జ్ ఝూన్సీరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పార్టీ అభివృద్ధి కోసం కష్టపడిన కార్యకర్తలకే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రాధ్యాన్యత ఇస్తామన్నారు. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో పాత, కొత్త తేడా లేకుండా అందరూ కలిసికట్టుగా పనిచేసి అన్ని స్థానాలు గెలవడానికి కృషి చేయాలన్నారు. అనంతరం పరిశీలకురాలు రవళిరెడ్డి మాట్లాడుతూ.. గ్రామస్థాయి నుంచి జాతీయస్థాయి వరకు జరిగే పార్టీ సంస్థాగత ఎన్నికల్లో అందరూ పోటీ చేయాలని, పార్టీ కోసం నిజాయితీగా పని చేసే నాయకులు, కార్యకర్తలకు మాత్రమే కులాల వారీ గా అవకాశాలు కల్పిస్తుందన్నారు. పార్టీ పదవుల నిచామకాల్లో ఎలాంటి పైరవీలు, ఒత్తిడి ఉండదని, పార్టీ కోసం నిరంతరం పని చేసే వారికే అవకాశం దక్కుతుందన్నారు. పార్టీ బ్లాక్, మండల, పట్టణ అధ్యక్షులు హమ్యానాయక్, సుంచు సంతోష్, సోమరాజశేఖర్, మండల, గ్రామాల ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకే స్థానిక ఎన్నికల్లో ప్రాధాన్యం పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి -
పుష్కర ఏర్పాట్లు భేష్..
● ప్రభుత్వ విప్ జాటోత్ రాంచంద్రునాయక్ కాటారం: కాళేశ్వరంలో కొనసాగుతున్న సరస్వతీనది పుష్కరాల ఏర్పాట్లు భేష్‌గా ఉన్నాయని ప్రభుత్వ విప్ జాటోత్ రాంచంద్రునాయక్ అన్నారు. వైరా ఎమ్మెల్యే రాందాస్‌నాయక్‌తో కలిసి విప్ కుటుంబ సమేతంగా సోమవారం పుష్కర స్నానం ఆచరించారు. అనంతరం కాళేశ్వర ముక్తీశ్వరాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. పుష్కర ఏర్పాట్లు పరిశీలించి కలెక్టర్, అధికారులను అభినందించారు. విప్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని కాళేశ్వర ముక్తీశ్వరుడిని కోరుకున్నట్లు తెలిపారు. -
పుష్కర విధుల్లో అతివలు..
కాటారం/మల్హర్ : ఒకప్పుడు వంటింటికే పరిమితమైన మహిళలు.. ప్రస్తుతం అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. పురుషులతో సమానంగా పోటీపడుతూ ఉద్యోగాలు సాధించి ఉన్నత స్థానంలో నిలుస్తున్నారు. ఉద్యోగాలు పొందిన అనంతరం విధి నిర్వహణలో పురుషులతో సరిసమానంగా ముందుకెళ్తున్నారు. ఎంతకష్టమైనా ఉన్నతాధికారులు కేటాయించిన విధులు సమర్థవంతంగా పూర్తి చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రముఖ పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో కొనసాగుతున్న సరస్వతీనది పుష్కరాల్లో మహిళా ఉద్యోగులు అధిక సంఖ్యలో విధులు నిర్వర్తిస్తున్నారు. పోలీస్, వైద్యారోగ్య, మహిళా, శిశు సంక్షేమ శాఖల్లో పలు కేడర్లకు చెందిన మహిళా ఉద్యోగులు, సిబ్బంది పుష్కరాల్లో భక్తులకు సేవలందిస్తున్నారు. సుమారు 300 మంది మహిళా ఉద్యోగులు.. సరస్వతీనది పుష్కరాల్లో భాగంగా పోలీస్, వైద్యారోగ్య, మహిళా, శిశు సంక్షేమశాఖల పరిధిలో సుమారు 300 మంది మహిళా ఉద్యోగులు విధుల్లో ఉన్నారు. ఇందులో పోలీస్‌శాఖలో సుమారు 80 మంది మహిళా ఎస్సైలు, కానిస్టేబుళ్లు, వైద్యారోగ్య శాఖలో 30 మంది మహిళా వైద్యులు, 120 మంది ఏఎన్ఎం, ఆశాకార్యకర్తలు, మహిళా, శిశ ుసంక్షేమ శాఖకు సంబంధించి సుమారు 70 మంది మహిళా ఉద్యోగులు, సిబ్బంది భక్తులకు తమ శాఖల ద్వారా సేవలు అందిస్తున్నారు. ప్రధాన ఆలయం, త్రివేణి సంఘమం, సరస్వతి పుష్కరఘాట్ వద్ద విధులు నిర్వర్తిస్తూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా విధుల్లో ఉన్న పలువురు మహిళా ఉద్యోగులు ‘సాక్షి’ పలకరించగా తమ అనుభూతులను పంచుకున్నారు. పురుషులకు దీటుగా మహిళా ఉద్యోగుల సేవలు అధికంగా పోలీస్, వైద్యారోగ్య, శిశు సంక్షేమ శాఖలు భక్తిభావంతో పన్నెండు రోజుల పాటు విధుల నిర్వహణ -
అనుమానిస్తున్నాడని.. కడతేర్చారు
● వ్యక్తి హత్య కేసులో అత్తామామ, భార్య అరెస్ట్ ● వివరాలు వెల్లడించిన డీఎస్పీ తిరుపతిరావు మహబూబాబాద్ రూరల్ : వివాహేతర సంబంధం పెట్టుకున్న భార్యను అనుమానిస్తున్నాడని భర్తను అత్తామామ, భార్య కలిసి కడతేర్చారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ధర్మారం తండాలో చోటుచేసుకుంది. ఈ హత్య కేసు వివరాలను మహబూబాబాద్ డీఎస్పీ ఎన్.తిరుపతిరావు సోమవారం రూరల్ పీఎస్‌లో వెల్లడించారు. తండాకు చెందిన బానోత్ వీరన్న కూతురు మౌనికను తొమ్మిది సంవత్సరాల క్రితం బల్హార్ష ప్రాంతానికి చెందిన లకావత్ బాలకు ఇచ్చి వివాహం జరిపించారు. వారికి ఇద్దరు కుమారులు ఉండగా, 5 సంవత్సరాల నుంచి దంపతులు హైదరాబాద్‌లో పనిచేసుకుంటూ జీవిస్తున్నారు. ఈ క్రమంలో మౌనిక వివాహేతర సంబంధ విషయంలో దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో మౌనిక తన తల్లిదండ్రుల ఇంటికి వచ్చింది. ఇదే విషయమై ఈ నెల 17వ తేదీన బాల, అతడి అన్న లకావత్ బావుసింగ్ ధర్మారం తండాకు వెళ్లి మౌనికతో గొడవ పెట్టుకున్నారు. అంతలోనే భార్య మౌనిక, మామ వీరన్న, అత్త కై ల కలిసి బాల, బావుసింగ్ కళ్లలో కారం చల్లారు. దీంతో వారు అక్కడి నుంచి పరారయ్యారు. కొద్ది సమయం తర్వాత బాల తన అత్తగారింటికి వెళ్లి తమను చంపాలని చూస్తారా అని గొడవ పెట్టుకున్నాడు. ఆ వెంటనే అతడి భార్య మౌనిక, అత్త కై ల కొట్టగా మామ వీరన్న కత్తితో చాతీలో పొడిచాడు. తీవ్రంగా గాయపడిన బాలను 108లో మహబూబాబాద్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా అదే రాత్రి 10 గంటలకు మృతిచెందాడు. ఈ ఘటనలో అత్తామామ వీరన్న, కై ల, భార్య మౌనికను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. -
త్రివేణి సంగమం.. భక్తజన సంద్రం
● సరస్వతీ నది పుష్కరాలకు పోటెత్తిన భక్తజనం ● ఐదో రోజు 80వేల మంది పుణ్యస్నానాలుభూపాలపల్లి/కాళేశ్వరం: సరస్వతీ నది పుష్కరాలకు సోమవారం ఐదోరోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చారు. త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించి నదీమాతకు పూజలు చేశారు. చీరె, సారె సమర్పించారు. ముత్తయిదువలు వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు. పిండ ప్రదానాలు, పితృదేవతలకు తర్పణాలు నిర్వహించారు. భక్తులతో పుష్కరిణి నిండిపోయింది. పుష్కర స్నానాలు ఆచరించిన అనంతరం భక్తులు కాళేశ్వర ముక్తీశ్వరస్వామిని దర్శించుకున్నారు. తగ్గిన రద్దీ పుష్కరాలకు భక్తుల రద్దీ తగ్గింది. హైదరాబాద్, వరంగల్, భూపాలపల్లి.. మంథని, కాటారం మీదుగా.. అలాగే మంచిర్యాల, గోదావరిఖని, చెన్నూర్, ఆసిఫాబాద్, నిర్మల్ నుంచి భక్తులు వాహనాల్లో తరలివచ్చారు. ట్రాఫిక్ జామ్ కాకుండా పోలీసులు డివైడర్లు ఏర్పాటు చేసి నియంత్రించారు. పార్కింగ్ స్థలాల్లో వాహనాల రద్దీ కొనసాగింది. శని, ఆదివా రాల్లో రెండేసి లక్షల చొప్పున భక్తులు రాగా.. సోమవారం 80వేల మంది పుణ్యస్నానాలు ఆచరించిన ట్లు అధికారులు అంచనా వేశారు. నదీహారతికి రద్దీ సరస్వతీ ఘాట్‌లో కాశీపండితులచే ఏర్పాటు చేసిన నవరత్నమాలిక హారతికి భక్తుల తాకిడి పెరుగుతోంది. ఏడు గద్దెలపై తొమ్మిది హారతులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విద్యుత్ వెలుగుల్లో హారతి ఇస్తున్నా రు. తిలకించేందుకు భక్తులు పోటీ పడ్డారు. సరస్వతీ అమ్మవారి విగ్రహం వద్ద భక్తులు దర్శించుకున్నాక జ్ఞానతీర్థం వద్ద ఫొటోలు, సెల్ఫీలు దిగారు. నాసిక్ పీఠాధిపతి పూజలు నాసిక్ త్రయంబకేశ్వర్ మహామండలేశ్వర్ ఆచార్య సంవిధానందా సరస్వతీ మహారాజ్ ముందుగా త్రివేణి సంగమంలోని అంతర్వాహిని సరస్వతీనది లో పుష్కర స్నానం.. విశేష పూజలు నిర్వహించా రు. అనంతరం రాజగోపురం వద్ద అర్చకులు, అధి కారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. శ్రీకాళేశ్వరముక్తీశ్వరున్ని దర్శించుకుని పూజలు చేశారు. -
సప్లిమెంటరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
మహబూబాబాద్ అర్బన్: ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని డీఐఈఓ మదార్ గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సీఎస్, డీఓలతో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈనెల 22నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభమవుతాయని, సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. ఫస్టియర్ పరీక్షలు ఉదయం 9నుంచి 12గంటల వరకు, సెకండియర్ పరీక్షలు మధ్యాహ్నం 2:30నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు జరుగుతాయని తెలిపారు. ప్రతీ పరీక్ష కేంద్రంలో విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా తాగునీటి వసతి, మరుగుదొడ్లు, కరెంట్ తదితర ఏర్పాట్లు చేయాలన్నారు. చీఫ్ సూపరింటెండెంట్లు, అసిస్టెంట్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులు సమన్వయంతో పని చేసి పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసేందుకు కృషి చేయాలన్నారు. పోలీస్ స్టేషన్ నుంచి ప్రశ్నపత్రాలను పోలీసు బందోబస్తు మధ్య కేంద్రాలకు తీసుకెళ్లాలన్నారు. పరీక్ష కేంద్రాల్లో సెల్ ఫోన్, ఇతర సాంకేతిక గాడ్జెట్స్‌ను ఎవరు తీసుకురాకుండా చూసే బాధ్యత సీఎస్, డీఓలదే అన్నారు. విద్యార్థులు హాల్‌టికెట్లను ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. జిల్లా పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు రాజకుమారి, కుమార్, చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులు పాల్గొన్నారు. -
తూకాల్లో మిల్లర్ల మోసం.. రైతుల ఆందోళన
నర్సింహులపేట: మిల్లర్లు ధాన్యం తూకాల్లో మోసం చేయడంతో రైతులు ఆందోళన చేసిన ఘటన మండలంలో సోమవారం సాయంత్రం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చే ధాన్యాన్ని గోపతండా సమీపంలోని వెంకటేశ్వర బాయిల్డ్ రైస్ మిల్లు నిర్వాహకులు పెద్దనాగా రం శ్రీశ్రీబాయిల్డ్ రైస్ మిల్లు వద్ద ఉన్న వేబ్రిడ్జిపై తూకం వేసి కొనుగోలు చేస్తున్నారు. కాగా, ఐకేపీ కొనుగోలు కేంద్రంలో వేసిన తూకానికి సుమారు క్వింటాకు 3కిలోల చొప్పున పెద్దనాగారం శ్రీశ్రీ పారాబాయిల్డ్ రైస్ మిల్లులోని వేబ్రిడ్జిలో తక్కువ రావడం గమనించిన రైతులు దంతాలపల్లిలోని వేబ్రిడ్జిలో తూకం వేశారు. అక్కడ ఐకేపీలో వేసిన తూకానికి సమానంగా వచ్చింది. దీంతో శ్రీశ్రీ పారాబాయిల్డ్ రైస్ మిల్లు వద్ద దంతాలపల్లి, నర్సింహులపేట, చిన్నగూడూరు, మరిపెడకు చెందిన రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. రెండు మిల్లుల యజమానులు ఒకటై తమను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఈక్రమంలో వందలాది ట్రాక్టర్లు, లారీలు మిల్లు వద్ద నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న తూనికలు, కొలతల జిల్లా అధికారి విజయ్‌కుమార్ సంఘటన స్థలానికి వచ్చి మిల్లుల యజమానులు, రైతులతో మాట్లాడారు. న్యాయం జరిగేలా చూస్తామని చెప్పడంతో రైతులు శాంతించారు. -
ప్రముఖుల పుష్కర స్నానం..
కాటారం/కాళేశ్వరం: సరస్వతీనది పుష్కరాల్లో భాగంగా సోమవారం పలువురు ప్రముఖులు పుష్కర స్నానం ఆచరించారు. డోర్నకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ జాటోత్ రాంచంద్రునాయక్, వైరా ఎమ్మెల్యే రాందాస్‌నాయక్, హైకోర్టు జడ్జి నందికొండ నర్సింగరావు దంపతులు, త్రయంబకేశ్వర్ నాసిక్‌కు చెందిన మహామండలేశ్వర్ ఆచార్య సంవిధానందాసరస్వతి మహారాజ్ స్వామి సరస్వతి ఘాట్ వద్ద త్రివేణి సంఘమంలో పుష్కర స్నానం ఆచరించారు. అనంతరం సరస్వతి మాతను దర్శించుకుని కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. జడ్జి దంపతులను కలెక్టర్ రాహుల్‌శర్మ, భూపాలపల్లి న్యాయమూర్తి అఖిల మర్యాదపూర్వకంగా కలిసి సరస్వతీమాత చిత్రపటం అందజేశారు. ఆలయ అధికారులు సంవిధానందాసరస్వతి మహారాజ్ స్వామికి సరస్వతీమాత విగ్రహం బహూకరించారు. శివుడి ప్రతిమ సెట్టింగ్‌కు మంటలు కాటారం: పుష్కరాల్లో భాగంగా సరస్వతి(వీఐపీ)ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన శివుడి ప్రతిమ సెట్టింగ్‌కు సోమవారం మంటలు అంటుకున్నాయి. థర్మకోల్‌తో తయారు చేసిన శివుడి ప్రతిమ సెట్టింగ్ వద్ద భక్తులు పుష్కర స్నానం అనంతరం దీపాలు వెలిగిస్తున్నారు. ఈ క్రమంలో దీపాలు ప్రతిమ కింద గల థర్మకోల్ స్టాండ్‌కు అంటుకుని మంటలు చెలరేగాయి. అక్కడే డ్యూటీలో ఉన్న పోలీసులు నీళ్లతో మంటలు ఆర్పారు. భక్తులు దీపాలు వెలిగించకుండా చర్యలు చేపట్టారు. -
హామీల అమలులో కేంద్రం విఫలం
● సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి ఎల్కతుర్తి: హామీల అమలులో కేంద్ర ప్రభుత్వం విఫలం చెందిందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి విమర్శించారు. ఆదివారం ఎల్కతుర్తి మండల కేంద్రంలో నిర్వహించిన పార్టీ మండల పదో మహాసభలకు ఆయన ముఖ్యతిథిగా హాజరై మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన వందరోజుల్లో నిత్యావసరాల ధరలు తగ్గిస్తామని, సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు అందిస్తామని, రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పిన ప్రధాని నరేంద్రమోదీ.. ఆ హామీల అమలులో పూర్తిగా విఫలం చెందారన్నారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్య వ్యవస్థను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ మనుధర్మ శాస్త్ర అమలుకు కుట్ర పన్నుతున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నిక హామీలను నెరవేర్చాలన్నారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి కర్రె భిక్షపతి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు ఆదరి శ్రీనివాస్, మండల కార్యదర్శి ఉట్కూరి రాములు, మర్రి శ్రీనివాస్, కర్రె లక్ష్మణ్, సంతోశ్, రాజ్‌కుమార్, బొంత మల్లయ్య, నిమ్మల మనోహర్, ఉట్కూరి ప్రణీత్, విజయ్, రాజనర్సు, మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వడదెబ్బతో అనాథ వృద్ధుడి మృతి ● అంత్యక్రియల కోసం వాట్సాప్ గ్రూప్‌లో పోస్టు ● గంటలో రూ. 51 వేలు జమ చేసిన గ్రామస్తులు రఘునాథపల్లి: మండలంలోని ఖిలాషాపూర్ గ్రామానికి చెందిన అనాథ వృద్ధుడు ఒడ్డూరి మల్ల య్య (75) వడదెబ్బతో మృతి చెందాడు. మల్లయ్య గతంలో గ్రామంలోని జెంగిడి బర్రెలకు (పాడి గేదెలు) కాపరిగా పని చేసేవాడు. కాలక్రమేణా పాడిగేదెలు తగ్గిపోవడంతో జీవనోపాధి కరువైంది. దీంతో పశువుల ఆస్పత్రి సమీపంలో డేరా వేసుకుని ఒంటరి జీవితం గడుపుతూ గ్రామస్తులు అన్నం పెడితే కడుపునింపుకునేవాడు. ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం వడదెబ్బతో చనిపోయినట్లు గ్రామస్తులు గుర్తించారు. మృతుడి అంత్యక్రియలకు ఆర్థిక సాయం చేయాలని తాజా మాజీ సర్పంచ్ ముప్పిడి శ్రీధర్ ఆ గ్రామ వాట్సాప్ గ్రూప్‌లో పోస్టు చేయగా గ్రామస్తులు వెనువెంటనే స్పందించారు. దాదాపు గంటలో రూ. 51 వేలు జమ చేశారు. ఆ డబ్బుతో మల్లయ్య దహన సంస్కారాలు పూర్తి చేసి దాతృత్వం చాటారు. -
24న రైతు చర్చా వేదిక
భూపాలపల్లి రూరల్ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఇల్లందు క్లబ్ హౌస్‌లో నేషనల్ హ్యుమన్‌రైట్స్ (ఎన్హెచ్ఆర్సీ) ఎన్జీఓ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈనెల 24వ తేదీన రైతు చర్చా వేదిక నిర్వహించనున్నట్లు ఎన్హెచ్ఆర్సీ ఎన్జీఓ జాతీయ అధ్యక్షుడు ఐలవేణి శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం జిల్లా కేంద్రంలోని కొమురయ్య భవన్లో ఎన్హెచ్ఆర్సీ జిల్లా అధ్యక్షుడు సురేశ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఐలవేణి శ్రీనివాస్‌తోపాటు రాష్ట్ర అధ్యక్షుడు నక్క గంగారాం ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. చర్చా వేదికకు విశిష్ట అతిథిగా సీబీఐ జాయింట్ మాజీ డైరెక్టర్ లక్ష్మీనారాయణ రానున్నారని తెలిపారు. అదేవిధంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని, వ్యవసాయ అనుబంధ రంగాల సంబంధించిన అధికారులు, మేధావులు కూడా పాల్గొంటారని చెప్పారు. ముగిసిన నెట్‌బాల్ పోటీలు ● విజేతలకు బహుమతుల ప్రదానం జనగామ: జిల్లా కేంద్రంలోని బతుకమ్మకుంటలో మూడు రోజులుగా జరుగుతున్న రాష్ట్ర స్థాయి 8వ సబ్ జూనియర్ బాల బాలికల నెట్‌బాల్ చాంపియన్‌షిప్ పోటీలు ఆదివారం ముగిశాయి. రాష్ట్రంలోని 25 జిల్లాల నుంచి 620 మంది బాలురు, బాలికా క్రీడాకారులు హాజరయ్యారు. ట్రెడిషినల్, ఫాస్ట్–5, మిక్స్డ్ డబుల్స్ కేటగిరీల్లో పోటీలు నిర్వహించారు. ట్రెడిషినల్, ఫాస్ట్–5 పోటీలు ఈనెల 17న ముగియగా.. చివరగా మిక్స్డ్ డబుల్స్ పోటీలతో ముగింపు పలికారు. మిక్స్డ్ డబుల్స్‌లో మహబూబ్‌నగర్(విన్నర్), కామారెడ్డి(రన్నర్), థర్డ్ ప్లేస్‌లో వరంగల్/నాగర్ కర్నూల్ సంయుక్త విజేతలుగా నిలువగా, మూడు కేటగిరీల్లో విజయం సాధించిన టీంలకు బహుమతులు, ప్రశంసా పత్రాలు ప్రదానం చేశారు. -
ఉద్యమ జీవి నల్లెల రాజయ్య
విద్యారణ్యపురి: ఉద్యమ జీవి నల్లెల రాజయ్య చిరస్మరణీయుడని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత అంపశయ్యనవీన్ అన్నారు. ఆదివారం హ నుమకొండ ప్రాక్టీసింగ్ ప్రైమరీ స్కూల్లో నిర్వహించిన ‘ప్రజల మనిషి నల్లెల రాజయ్య’ పుస్తకాన్ని ఆ యన ముఖ్యఅతిథిగా పాల్గొని ఆవిష్కరించి మాట్లాడారు. సి. చంద్ర ప్రధాన సంపాదకుడిగా, అనిశెట్టి రజిత, డాక్టర్ కెబి. చంద్రభాను, బిల్ల మహేందర్, పిట్ట సాంబయ్య, రౌతు అజయ్‌కుమార్ సంపాదకవర్గం సభ్యుల ఆధ్వర్యంలో వ్యాసాల సంపుటి(పుస్తకం)ని రూపొందించారు. కేయూ రిటైర్డ్ ఆచార్యుడు బన్నఅయిలయ్య,ప్రముఖ కవి వీఆర్ విద్యార్థి, టీపీఎఫ్ కన్వీనర్ రమాదేవి మాట్లాడారు. కవి కోడం కుమారస్వామి పుస్తకాన్ని సమీక్షించారు. వ రంగల్ రచయితల సంఘం కార్యదర్శి దండ్రె రాజ మౌళి, వివిధ ప్రజాసంఘాల బాధ్యులు భిక్షపతి, తిరుపతయ్య, సాంబయ్య, ఉదయ్‌సింగ్, మెట్టురవీ ందర్, జిడి. సారయ్య, మార్కశంకర్‌నారాయణ, కె. శంకర్రావు, వి. దిలీప్, బండారు సుజాత, బోనగిరి రాములు, ఎ. విద్యాదేవి, రాజేంద్రప్రసాద్, కుటుంబీకులు సుగుణ, వెన్నెల, సూర్య పాల్గొన్నారు.● కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత అంపశయ్యనవీన్ -
పెరిగిన లిక్కర్ ధరలు
మహబూబాబాద్ రూరల్ : రాష్ట్ర ప్రభుత్వం లిక్కర్ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో మద్యం ప్రియులపై ఆర్థిక భారం పడనుంది. ప్రభుత్వం క్వార్టర్ సీసాపై రూ.10, హాఫ్ బాటిల్ పై రూ.20, ఫుల్ బాటిల్ పై రూ.40 పెంచింది. రెండు నెలల క్రితమే బీర్ల ధరలు పెంచిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా లిక్కర్ ధరలు కూడా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కాగా, పెరిగిన ధరలు ఆదివారం అర్ధరాత్రి నుంచి అమలులోకి రానున్నాయి. నెలకు రూ.2.50 కోట్ల మేర భారం.. ప్రభుత్వం తీసుకున్న లిక్కర్ ధరల పెంపు నిర్ణయం వల్ల జిల్లాలోని మద్యం ప్రియులపై నెలకు రూ.2.50 కోట్ల మేరకు భారం పడనునట్లు అంచనా. జిల్లా పరిధిలో 59 వైన్ షాపులు, 9 బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి. వాటిలో నెలకు అన్ని రకాల మద్యం బాటిళ్లు 56,700 మేరకు విక్రయం జరుగుతున్నాయి. తద్వారా నెలకు రూ.55 కోట్ల మేరకు ఆదాయం సమకూరుతోంది. కాగా ప్రస్తుతం ప్రభుత్వం పెంచిన ధరలతో నెలకు రూ.2.50 కోట్ల మేరకు మద్యం ప్రియులపై భారం పడుతుందని అంచనా. నెలకు రూ.2.50 కోట్ల మేర భారం -
నేడు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ రాక
ప్రముఖుల పుష్కర స్నానం.. కాటారం/కాళేశ్వరం: పవిత్ర పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో కొనసాగుతున్న సరస్వతీనది పుష్కరాల్లో భాగంగా ఆదివారం పలువురు ప్రముఖులు పుష్కర స్నానం ఆచరించారు. హైకోర్టు జడ్జి సుధా దంపతులు, ప్రముఖ సినీనటుడు రాజేంద్రప్రసాద్, జెన్కో డైరెక్టర్ ఆఫ్ ఫైనాన్స్ అనురాధ, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న.. సరస్వతి(వీఐపీ)ఘాట్‌లో పుష్కర స్నానం చేశారు. అనంతరం కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయం చేరుకుని స్వామి వారికి, సరస్వతీమాతా, శుభానందాదేవికి ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు హైకోర్టు జడ్జి సుధాకు కలెక్టర్ రాహుల్‌శర్మ, ఎస్పీ కిరణ్‌ఖరే స్వాగతం పలికి మొక్కను బహూకరించారు.నిఘా నీడలో కాళేశ్వరం భూపాలపల్లి/కాళేశ్వరం: సరస్వతీనది పుష్కరాల సందర్భంగా పోలీసులు ముందస్తు నిఘా నేత్రాలు ఏర్పాటు చేశారు. మావోయిస్టు ప్రాబల్య ప్రాంతం, మహారాష్ట్ర– తెలంగాణ సరిహద్దులో కాళేశ్వరం ఉండడంతో అంతర్రాష్ట్ర వంతెన నుంచి మొదలు.. శ్రీకాళేశ్వర ముక్తీశ్వర దేవాలయం, పరిసర ప్రాంతాలు, పార్కింగ్ స్థలాలు, పుష్కర ఘాట్, ప్రధాన రహదారుల్లో సుమారు 200 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వీటన్నింటినీ కాళేశ్వరంలో ఏర్పాటు చేసిన పోలీస్ కంట్రోల్ రూంకు అనుసంధానం చేసి నిత్యం పరిశీలిస్తున్నారు. ఫలితంగా ఇప్పటి వరకై తే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదు. ఎండవేడితో భక్తుల అస్వస్థత భూపాలపల్లి అర్బన్: కాళేశ్వరంలో ఎండ వేడితో భక్తులు అస్వస్థతకు గురవుతున్నారు. పుష్కరాలో భాగంగా నాలుగో రోజు ఆదివారం 8 మంది భక్తులు ఎండవేడికి అస్వస్థతకు గురికాగా 108లో కాళేశ్వరం పీహెచ్‌సీకి తరలించారు. పీహెచ్సీలో ఆదివారం 156 మందికి ఓపీ పరీక్షలు నిర్వహించగా 30 మంది భక్తులను అడ్మిట్ చేసుకున్నారు. కాళేశ్వరంలో ఏర్పాటు చేసిన క్యాంపుల ద్వారా సుమారు 4వేల మంది భక్తులకు వైద్య సేవలు అందించామని డీఎంహెచ్ఓ మధుసూదన్ తెలిపారు.కలెక్టర్ జాయ్ రైడ్.. భూపాలపల్లి/కాళేశ్వరం: జయశంకర్ భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ జాయ్ రైడ్ చేసి సరస్వతీనది పుష్కర సదుపాయాలను పరిశీలించారు. ఆదివారం ఉదయం కరీంనగర్ సీపీ గౌస్ అలం, కరీంనగర్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్‌తో కలిసి హెలికాప్టర్లో పుష్కర పరిసరాలు పరిశీలించారు. పుష్కర ఘాట్లు, రహదారి సదుపాయాలు, శానిటేషన్, పారిశుద్ధ్య చర్యలు, టెంట్ సిటీ, స్టాళ్లు, భద్రతా ఏర్పాట్లును పరిశీలించారు. అనంతరం అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ భక్తులకు హెలికాప్టర్ ద్వారా త్రివేణి సంగమం, కాళేశ్వర దేవస్థానం, కాళేశ్వరం చుట్టు పక్కల అడవులు, తదితర అందాలను వీక్షించడానికి జాయ్ రైడ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.భూపాలపల్లి: సరస్వతీనది పుష్కరాలకు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ సోమవారం రోడ్డు మార్గాన కాళేశ్వరం రానున్నారు. ఉదయం 10.30 గంటలకు కాళేశ్వరం చేరుకుని పుష్కర స్నానం ఆచరించిన అనంతరం శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి వారిని దర్శించుకుంటారు. 12 గంటలకు తిరిగి కరీంనగర్‌కు వెళ్లనున్నారు. అలాగే, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ కూడా సోమవారం కాళేశ్వరం రానున్నట్లు సమాచారం. -
సైన్యానికి మద్దతుగా తిరంగా ర్యాలీ
మహబూబాబాద్ అర్బన్: పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ సైన్యం నిర్వహించిన ఆపరేషన్ సిందూర్‌ను పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ సెంటర్ నుంచి తహసీల్దార్ కార్యాలయం, నెహ్రూసెంటర్, రైల్వేస్టేషన్ మదర్‌థెరిస్సా సెంటర్, చేపల మార్కెట్ మీదుగా స్వామి వివేకానంద సెంటర్ వరకు భారత్ సైన్యానికి మద్దతుగా తిరంగా ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణ చైర్మన్ మార్తినేని ధర్మారావు హాజరై మాట్లాడారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్‌లోని ఉగ్రస్థావరాలను, ఆర్మీ బేస్‌లను ధ్వంసం చేసిందని కొనియాడారు. ప్రధాని మోదీ వ్యూహంతో వ్యవహరించి పాకిస్తాన్‌లోని టెరర్రిస్టులను భారత్ సైన్యంతో హతం చేశారన్నారు. తిరంగా యాత్రలో పాల్గొన్న జిల్లా మాజీ సైనికులకు, ఆర్మీ, నేవీ సైనికులకు, యువకులు, మహిళలు, వ్యాపారవేత్తలకు, న్యాయవాదులు, వైద్య బృదాలకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఆర్మీ, నేవి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ మాట్లాడు తూ.. సైన్యం పిలిస్తే భారత్ తరఫున తాము యు ద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నామని, తమ ప్రాణా లను సైతం లెక్కచేయమని చెప్పారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, జిల్లా మాజీ అధ్యక్షుడు వద్దిరాజు రామచందర్‌రావు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యు డు శ్యామ్‌సుందర్‌శర్మ, జిల్లా కౌన్సిల్ సభ్యుడు గడ్డం అశోక్, రాష్ట్ర ఎస్టీ మోర్చా కార్యదర్శి రాంబాబునాయక్, జిల్లా అధికార ప్రతినిధి ఇందుభారతి, పట్టణ అధ్యక్షుడు అజయ్, నాయకులు సంపత్, ఓర్సు పద్మ, సరోజ, రాధపటేల్, మహేష్‌గౌడ్, సందీప్, నరేశ్, మదన్‌లాల్, అశోక్, మాజీ సైనికులు నర్సింహరావు, కేశవరావు, విజయ్‌గణేష్, రాజేశ్వర్, రాఘవరెడ్డి, ఐలయ్య తదితరులు ఉన్నారు. -
రక్తహీనతతో అనేక సమస్యలు
మా వద్దకు వచ్చే టీనేజ్ బాలికల్లో మానసిక ఒత్తిడితో పాటు, రక్తహీనత సమస్యతో బాధపడుతున్న వారే అధికంగా ఉంటున్నారు. ఆడవారికి హిమోగ్లోబిన్ 12 నుండి 13 గ్రాముల వరకు ఉండాలి. కానీ కొందరిలో 6 గ్రాములు, 7 గ్రాములు కూడా ఉండని పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ఋతుస్రావం సమస్య తలెత్తుతుంది. జ్వరం, కాళ్లు, చేతులు గుంజడం, నీరసం, ఇతర అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడతారు. ఇందుకు ప్రధాన కారణం సమతుల ఆహారం తీసుకోకపోవడమే. మాంసం, చేపలు, గుడ్లు, పాలు, బెల్లం, కర్జురా, అంజీర, పల్లీలు, నువ్వులు, పండ్లు, తాజా కూగాయలు తీసుకోవాలి. లేకపోతే రక్తహీనత వస్తుంది. టీనేజీలో మొదలైన సమస్యలు పెద్దయ్యాక మరింత జఠిలమవుతాయి. అందుకే మంచి ఆహారం తీసుకోవాలి. – పాల్వాయి సౌజన్య, గైనకాలజిస్టు -
అన్నదానం.. మహాప్రసాదం
భోజన సౌకర్యం బాగుంది..సరస్వతీనది పుష్కరాలకు రెండు రోజుల క్రితం కుటుంబ సమేతంగా వచ్చాం. అన్నదాన సత్రాల్లో ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం చేస్తున్నాం. చాలా రుచిగా, శుభ్రంగా ఉంది. – అనురాధ, భక్తురాలు, మంచిర్యాలకాటారం /మల్హర్: అన్నం పరబ్రహ్మ సర్వూపం. ఆకలితో ఉన్న వారికి ఒక పూట భోజనం పెట్టినా చాలు ఎంతో పుణ్యం లభిస్తుంది. అందుకే సేవాభావంతో పలువురు ప్రముఖ దైవక్షేత్రాల్లో నిత్యాన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. అదే మాదిరి ప్రముఖ పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో కొనసాగుతున్న సరస్వతీనది పుష్కరాల నేపథ్యంలో ముక్తీశ్వరాలయ సమీపంలో దాదాపు 8 చోట్ల అన్నదాన సత్రాలు ఏర్పాటు చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తోపాటు ఇతర రాష్ట్రాల నుంచి అన్నదాతలు ఉచిత భోజన సదుపాయం ఏర్పాటు చేసి భక్తుల కడుపునింపుతున్నారు. ఒక్క పూటకు నాలుగు నుంచి ఆరు వేల మంది భక్తులకు ఉచిత అన్నదానాలు చేస్తున్నారు. ప్రతీ రోజు టిఫిన్, అన్నదానం.. సరస్వతీనది పుష్కరాల సందర్భంగా ఆర్యవైశ్య, బ్రహ్మణ, ఈశ్వరకుమారి, వాసవీ క్లబ్, ఇతరాత్ర ట్రస్ట్‌ల ద్వారా ఏర్పాటు చేసిన అన్నప్రసాద సత్రాల ద్వారా భక్తులకు ప్రతీ రోజు టిఫిన్, మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. ఏదో ఉచిత భోజనం అందిస్తున్నామనే కాకుండా నిర్వాహకులు నాణ్యతతో కూడిన రుచికర భోజనం అందిస్తున్నారు. ఉదయం పలు రకాల అల్పాహారంతోపాటు భోజనంలో రెండు రకాల కూరలు, పప్పు, సాంబారు, పెరుగు, స్వీట్లు, పచ్చడి పెడుతున్నారు. రుచికరం, పరిశుభ్రంగా ఉండడంతో భక్తులు సత్రాల్లో భోజనం చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.సేవలు అభినందనీయం.. పుష్కరాలకు పిల్లలతో కలిసి చాలా దూరం నుంచి వచ్చాం. మధ్యాహ్నం భోజనం చేయడానికి ఇబ్బంది అవుతుందని ఆందోళన చెందాం. కానీ తీరా ఇక్కడికి వచ్చి చూస్తే అన్నదాన సత్రాల్లో భోజనం లభించింది. సమయానికి మా ఆకలి తీరింది. అన్నదానం నిర్వాహకుల సేవలు అభినందనీయం. – శ్రీనివాస్, భక్తుడు, కరీంనగర్ పుష్కరాల భక్తులకు పలు ట్రస్ట్‌ల నిత్యాన్నదానం పన్నెండు రోజుల పాటు ఉచితంగా టిఫిన్, భోజనం భక్తుల ఆకలి తీరుస్తున్న సత్రాలు -
ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించిన కలెక్టర్ రాహుల్, ఎస్పీ కిరణ్
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో సరస్వతి నది పుష్కరాల సందర్భంగా మూడో రోజు కాళేశ్వరానికి భక్తుల రద్దీ పెరిగింది. శనివారం వివిధ ప్రాంతాల నుంచి వాహనాల్లో కాళేశ్వరం బయలుదేరగా మహదేవపూర్ – కాళేశ్వరం రహదారిలో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈక్రమంలో వాహనాలను క్రమబద్ధీకరించేందుకు కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ బైక్‌పై తిరుగుతూ వాహనాలను పంపించి రూట్ క్లియర్ చేశారు. కాగా, శని, ఆది వారాల్లో భక్తుల రద్దీ తీవ్రంగా ఉంటుందని అంచనా వేసి యంత్రాంగాన్ని వారు అప్రమత్తం చేశారు. -
ప్రపంచంతో పోటీపడేలా ప్రభుత్వ పాలన
కాటారం/కాళేశ్వరం: సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో రాష్ట్రం ప్రపంచంతో పోటీపడేలా కాంగ్రెస్ ప్రభుత్వం పాలన కొనసాగిస్తోందని, ముక్తీశ్వర స్వామి ఆశీర్వాదం ఉంటే మరింత ముందుకు వెళ్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర వ్యవసాయ, చేనేత, జౌళి, సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. కాళేశ్వరంలో కొనసాగుతున్న సరస్వతి నది పుష్కరాల్లో భాగంగా ఉప ముఖ్యమంత్రి, మంత్రి, ఖమ్మం ఎంపీ రఘురామిరెడ్డి వేర్వేగా శనివారం పుష్కర స్నానం ఆచరించి సరస్వతి అమ్మవారు, కాళేశ్వర ముక్తీశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి భట్టి, మంత్రి తుమ్మల వేర్వేరుగా విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా పుష్కరాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పన్నెండేళ్లకు ఒకసారి వచ్చే పుష్కరాలు ఎంతో పవిత్రమైనవని, భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి పుష్కర స్నానాలు ఆచరించాలని సూచించారు. రాష్ట్రంలో గోదావరి పుష్కరాలు భారీగా నిర్వహించడానికి ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారని గుర్తుచేశారు. కార్యక్రమంలో మంత్రి శ్రీధర్‌బాబు, ఎమ్మెల్యేలు గండ్ర సత్యనారాయణ రావు, మక్కాన్‌సింగ్, కలెక్టర్ రాహుల్‌శర్మ, ఎస్పీ కిరణ్‌ఖరే, అదనపు కలెక్టర్లు అశోక్‌కుమార్, విజయలక్ష్మి, భూపాలపల్లి ఆర్డీఓ రవి, దేవాదాయశాఖ ఆర్జేసి రామకృష్ణారావు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. సరస్వతి పుష్కరాల నిర్వహణ భేష్ ఉప ముఖ్యమంత్రి భట్టి, మంత్రి తుమ్మల -
పితృ దేవతలకు పిండ ప్రదానాలు
కాటారం: కాళేశ్వరంలో కొనసాగుతున్న సరస్వతి పుష్కరాల్లో భక్తులు పుష్కర స్నానం, ప్రత్యేక పూజలతో పాటు పిండ ప్రదానాలు, పితృ తర్పణాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. పన్నెండేళ్లకు ఒకసారి ఒక్కో నదికి వచ్చే పుష్కరంలో పితృదేవతలకు సమర్పణ ఆనవాయితీగా వస్తోంది. ఒక్కో రాశి బృహస్పతి (గురువు)లో ప్రవేశించడంతో ఒక్కో నదికి ఒక్కో ఏడాది పుష్కరం వస్తుంది. ఇలా 12 నదులకు 12 ఏళ్లకు ఒకసారి పుష్కరాలు వస్తుంటాయి. ఈ పుష్కరాల్లో స్నానం ఆచరిస్తే సకల రోగపీడలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు. అంతేకాకుండా, తమ కుటుంబంలో కాలం చేసిన పితృదేవతలకు పిండ ప్రదానాలు, పితృ తర్పణాలు సమర్పిస్తే వారి ఆత్మకు శాంతి కలిగి మోక్షం చేకూరుతుందని భక్తులు నమ్ముతారు. ఈ ఏడాది మిథునరాశి బృహస్పతిలో ప్రవేశించడంతో కాళేశ్వరంలో అంతర్వాహినిగా కొనసాగుతున్న సరస్వతి నదికి పుష్కరాలు వచ్చాయి. పన్నెండు రోజుల పాటు కొనసాగనున్న పుష్కర వేడుకలకు తెలంగాణ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌తో పాటు పలు రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. త్రివేణి సంగమంలో పుష్కర స్నానం ఆచరించడంతో పాటు పురోహితుల సమక్షంలో పితృదేవతలకు పిండ ప్రదానాలు, పితృ తర్పణాలు చేసి నదిలో సంకల్పాలు చేస్తున్నారు. ప్రతీ పుష్కరంలో నది తీరాన ముప్పై మూడు కోట్ల దేవతలతో పాటు పితృదేవతలు మచ్చ రూపంలో కొలువై ఉంటారని పురోహితులు, వేద బ్రహ్మణులు చెబుతున్నారు. ప్రతీ నది పుష్కరంలో పితృదేవతలకు పిండ ప్రదానాలు, పితృ తర్పణాలు చేయడం వల్ల వారికి మోక్షం కలుగుతుందని పేర్కొంటున్నారు. సరస్వతి నది పుష్కరాల్లో సమర్పణ పుష్కరాల్లో పెద్దలకు సమర్పిస్తే మోక్షం వారి ఆత్మలు శాంతిస్తాయని భక్తుల నమ్మకం -
రైల్వే లోకోపైలెట్ల గైర్హాజరుతో పది రైళ్లు రద్దు
కాజీపేట రూరల్: కాజీపేట జంక్షన్ కేంద్రంగా ప్రయాణిస్తున్న పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లతో పాటు, పుష్పుల్ ప్యాసింజర్ రైళ్లను లోకోపైలెట్ల గైర్హాజరుతో రద్దు చేసినట్లు రైల్వే అధికారులు శనివారం తెలిపారు. లోకో పైలెట్లు డిపార్ట్మెంటల్ పరీక్షలు రాస్తున్నందున ప్యాసింజర్ రైళ్లను నడిపించే వారి కొరత ఏర్పడిందని, దాంతో పలు ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్లను సికింద్రాబాద్ అధికారులు రద్దు చేసినట్లు పేర్కొన్నారు. కాగా, పలు రైళ్ల రద్దుతో పాటు వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు తీ వ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా పుష్ పుల్ ప్యాసింజర్ రైళ్లు రద్దు కావడంతో ఎక్స్‌ప్రెస్ రై ళ్లలో వెళ్లలేక సామాన్యులు ఇక్కట్లు పడుతున్నారు. రద్దయిన ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఈనెల 16 నుంచి 19వ తేదీ వరకు కాజీపేట – బల్లార్షా (17035) వెళ్లే ఎక్స్‌ప్రెస్, ఈనెల 17 నుంచి 19వ తేదీ వరకు బల్లార్షా – కాజీపేట (17036) వెళ్లే ఎక్స్‌ప్రెస్, కాజీపేట – సిర్పూర్ కాగజ్‌నగర్ (17003) వెళ్లే ఎక్స్‌ప్రెస్, బల్లార్షా – కాజీపేట (17004) వెళ్లే ఎక్స్‌ప్రెస్‌లు. నిలిచిన పుష్పుల్ ట్రైన్స్ ఈనెల 17 నుంచి 19వ తేదీ వరకు సికింద్రాబాద్ – వరంగల్ (67761) వెళ్లే పుష్పుల్, వరంగల్ – సికింద్రాబాద్ (67762) పుష్పుల్, సికింద్రాబాద్ – కా జీపేట (67763) పుష్పుల్, కాజీపేట – సికింద్రాబాద్ (67764) పుష్పుల్, డోర్నకల్ – కాజీపేట (67766) పుష్పుల్, కాజీపేట డోర్నకల్ (67765) పుష్పుల్ రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు వివరించారు. క్రైం ఏసీపీగా కిరణ్‌కుమార్ బాధ్యతల స్వీకరణ రామన్నపేట: రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు వరంగల్ పోలీస్ కమిషనర్ క్రైం విభాగం నూతన ఏసీపీగా కిరణ్‌కుమార్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కిరణ్‌కుమార్‌ను అధికారులు, సిబ్బంది కలిసి అభినందనలు తెలిపారు. -
నేటి నుంచి జాయ్‌రైడ్స్
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో జాయ్‌రైడ్స్‌కు ఆదివారం నుంచి హెలికాప్టర్ చక్కర్లు కొట్టనుంది. కన్నెపల్లిలోని లక్ష్మీ పంపుహౌస్ వద్ద భక్తులు విహంగ వీక్షణం చేయడానికి ఏవియేషన్ అధికారులు అందుబాటులోకి తీసుకువచ్చారు. యాత్రధామ్.ఓఆర్జీ యాప్‌లో ఆన్లైన్లో బుక్ చేసుకోవాలని, జాయ్‌రైడ్స్, టెంట్‌సిటీ, దేవస్థానం పూజలను ఈ యాప్‌లో పొందుపర్చినట్లు వివరించారు. జాయ్‌రైడ్స్ బుకింగ్ కోసం ఒక్కరికి రూ.4,500తో 6 – 7 నిమిషాల పాటు గాలిలో చక్కర్లు కొట్టనున్నారు. కన్నెపల్లి హెలిపాడ్ వద్ద హెలికాప్టర్ సిద్ధంగా ఉంది. టెంట్‌సిటీకి ఒక రోజుకు రూ.3వేల వరకు తీసుకుంటున్నట్లు ప్రతినిధులు పేర్కొన్నారు. ఎడ్ల బండ్లకు పెరిగిన గిరాకీభూపాలపల్లి అర్బన్: కాళేశ్వరం పుష్కరాల్లో భాగంగా సరస్వతి ఘాట్ వద్ద ఎడ్ల బండ్లకు గిరాకీ పెరిగింది. శుక్రవారం అర్ధరాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా రోడ్లన్నీ బురదమయంగా మారాయి. దాంతో బురద రోడ్లపై వాహనాలు ముందుకు సాగక భక్తులు ఇబ్బందులు పడ్డారు. కార్లు, వాహనాలను దూరంగా పార్కింగ్ చేసి కాలినడకన వెళ్లలేక ఎడ్ల బండ్లను ఆశ్రయించారు. ఎడ్లబండ్ల యజమానులు ఒక్కరికి రూ.50 చొప్పున చార్జీ వసూలు చేస్తున్నారు. -
డిప్యూటీ సీఎం కాలసర్ప పూజలు
హోరాహోరీగా నెట్‌బాల్ పోటీలుకాటారం/కాళేశ్వరం: సరస్వతి పుష్కరాల్లో భాగంగా సరస్వతి ఘాట్ వద్ద రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తన సోదరుడు మల్లు ప్రసాద్‌తో కలిసి శనివారం తమ పితృదేవతలకు పిండప్రదానం చేశారు. అనంతరం పుష్కర స్నానం ఆచరించి కాళేశ్వర ముక్తీశ్వర ఆలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా భట్టికి ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కుటుంబ సమేతంగా స్వామి వారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో కాలసర్ప నివారణ పూజలు, స్వామి వారికి క్షీరాభిషేకం చేశారు. ఆలయ పురోహితులు వేద మంత్రోచ్ఛరణల మధ్య డిప్యూటీ సీఎం దంపతులకు ఆశీర్వచనం చేసి స్వామి వారి ప్రసాదం అందజేశారు. -
అల్లుడిని కత్తితో పొడిచి చంపిన మామ
కేసముద్రం: కుటుంబ కలహాల కారణంగా ఓ అల్లుడిని కత్తితో పొడిచి మామ హత్య చేసిన ఘటన మండలంలోని ధర్మారంతండా జీపీలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రకు చెందిన లూనావత్ బాల(35) హైదరాబాద్‌లోని లింగంపల్లిలో వాటర్ టాంకర్ డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కేసముద్రం మండలం ధర్మారంతండా జీపీకి చెందిన బానోత్ వీరన్న, కై లా దంపతుల కుమార్తె మౌనికతో 9 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. ఈ క్రమంలో హైదరాబాద్‌లో భార్యభర్తల మధ్య గొడవలు కాగా 3 రోజుల క్రితం మౌనిక తల్లిగారింటికి వచ్చింది. తన భార్యను తీసుకెళ్లేందుకు బాల శనివారం ధర్మారంతండాకు వచ్చాడు. మరోసారి భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో మామ వీరన్న క్షణికావేశంలో కత్తితో అల్లుడి ఛాతిపై పొడిచాడు. బాలను స్థానికులు మానుకోట జనరల్ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. సంఘటన స్థలాన్ని రూరల్ సీఐ సర్వయ్య, ఎస్సై మురళీధర్‌రాజ్ పరీశీలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ధాన్యం తరలింపు వేగంగా చేపట్టాలి
డోర్నకల్/కురవి: కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం నిల్వల తరలింపు ప్రక్రియ వేగంగా చేపట్టాలని జిల్లా వ్యవసాయ అధికారి విజయనిర్మల ఆదేశించారు. సీరోలు మండల కేంద్రంతోపాటు ఉప్పరిగూడెం, మన్నెగూడెం గ్రామాల్లోని వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను శనివారం ఆమె పరిశీలించారు. ధాన్యం తరలింపునకు అవసరమైన లారీలు, గోనె సంచుల వివరాలను అందించాలని ఆదేశించారు. ఇప్పటి వరకు కేంద్రాలకు వచ్చిన లారీలు, గోనె సంచుల లెక్కలను తెలుసుకున్నారు. అవసరముంటే గోనె సంచులు, లారీలకు ఇండెంట్ ఇవ్వాలని ఆమె నిర్వాహకులకు సూచించారు. కార్యక్రమంలో సీరోలు వ్యవసాయ అధికారి ఛాయారాజ్, ఏఏఓ ఎర్ర కర్ణ పాల్గొన్నారు. సీరోలు ఇన్చార్జ్ తహసీల్దారు కృష్ణవేణి తదితరులు ఉన్నారు. పామాయిల్ చెట్ల నరికివేత డోర్నకల్: సీరోలు మండలం మన్నెగూడెం గ్రామంలోని ఓ పామాయిల్ తోటలోని 80 చెట్లను గుర్తు తె లియని వ్యక్తులు నరికివేశారు. డోర్నకల్ ఎస్సై వంశీధర్ శనివారం తెలిపిన వివరాల ప్రకారం.. ఖ మ్మంకు శ్రీరామినేని వెంకటేశ్వర్లు మన్నెగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని తన ఐదెకరాల భూమిలో ఆయిల్‌పామ్ సాగు చేశాడు. మన్నెగూడేనికి చెందిన శ్యామల వెంకటేశ్వర్లును పాలేరుగా నియమించాడు. ఈక్రమంలో శుక్రవారం గుర్తు తెలి యని వ్యక్తులు తోటలోని 80చెట్లను నరికేయడంతో పాలేరు.. యజమానికి తెలియజేశాడు. రూ.12 లక్ష ల నష్టం వాటిల్లిందని, వెంకటేశ్వర్లు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. కొనుగోలు కేంద్రంలో గోల్మాల్మరిపెడ రూరల్: మండలం రాంపురంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జీవనజ్యోతి ధాన్యం కొనుగోలు కేంద్రంలో గోల్మాల్ చోటుచేసుకుంది. నిబంధనలకు విరుద్ధంగా కొందరు ట్రక్ షీట్లు పొందారని సెంటర్ నిర్వాహకులు సుధగాని నీలమ్మ, కంసాని జ్యోతి, పట్ల బాలమ్మ శుక్రవారం కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో అడిషనల్ డీఆర్డీఓ జయశ్రీ శనివారం రైతుల సమక్షంలో ధాన్యం కొనుగోలు కేంద్రంలో విచారణ చేపట్టారు. ఈక్రమంలో రాంపెల్లి రవి 284 బస్తాలు, రాంపెల్లి బుచ్చిరాములు 158, రాంపెల్లి కపిల్ 40, బొమ్మగాని రవి 295, దోమల సత్తెయ్య 233, దోమల సోమయ్య 292, రాంపెల్లి కార్తీక్ కపిల్ 108 మొత్తం 1410 బస్తాల ధాన్యం కొనుగోలు కేంద్రానికి రాకుండానే ట్రక్ షీట్లు ఇచ్చినట్లు తేల్చారు. కొనుగోలు కేంద్రంలోని ఎంట్రీ బుక్ పరిశీలించగా ఆరోపించబడిన రైతులకు సంబంధించి ధాన్యం ఎంట్రీ కాలేదని నిర్దారించారు. విచారణ నివేదికను ఉన్నతాధికారులకు అందించనున్నట్లు తెలిపారు. ఆరోపణ ఎదుర్కొంటున్నరైతులు మాత్రం తాము కష్టపడి ధాన్యం పండించామని, కేంద్రంలో చోటు లేకపోవడంతో తమ కల్లంలోనే ఆరబెట్టికున్నామని, అనంతరం ప్రైవేట్ వాహనాల ద్వారా అబ్బాయిపాలెం సాయి శ్రీనివాస ఇండస్ట్రీస్ రైస్ మిల్కు తరలించినట్లు వివరణ ఇచ్చారు. ఇదిలా ఉండగా.. ఆరోపణ ఎందుర్కొంటున్న రైతుల అకౌంట్లో డబ్బులు జమకాకుండా అధికారులు అప్రమత్తమైనట్లు తెలిసింది. హాయి హాయిగా.. ఎండ తీవ్రత, ఉక్కపోతతో మనుషులు కూలర్లు, ఏసీలతో ఉపశమనం పొందుతున్నారు. కానీ, జంతువులు ఎండ తీవ్రతను తట్టుకోలేక అల్లాడుతున్నాయి. ఈక్రమంలో ఎండవేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు ఓ శునకం మానుకోట మున్సిపల్ పరిధిలోని జంతువుల దాహార్తిని తీర్చేందుకు ఏర్పాటు చేసిన నీటికుండిలో మునిగి ఇలా హాయిని పొందుతుంది. – నెహ్రూసెంటర్ -
సప్లిమెంటరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
మహబూబాబాద్: ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ అౖద్వైత్‌కుమార్ సింగ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. పరీక్షల నిర్వహణపై సంబంధి త అధికారులతో కలెక్టరేట్లో శనివారం నిర్వహించి న సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ఈనెల 22 నుంచి 28వ తేదీవరకు పరీక్షలు నిర్వహించనున్న ట్లు తెలిపారు. ఫస్ట్ ఇయర్ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ద్వితీయ సంవత్స రం పరీక్షలు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటాయన్నారు. జిల్లాలోని 14 పరీక్షా కేంద్రాల్లో మొదటి సంవత్స రం విద్యార్థులు 2,539 మంది, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 1,594 మంది పరీక్షలు రాయనున్నారని తెలిపారు. డీఐఈఓ మదార్, విద్యుత్‌శాఖ ఎస్ఈ నరేష్, డీఎంహెచ్ఓ రవి రాథోడ్, తదితరులు పాల్గొన్నారు. యువ వికాసం దరఖాస్తుల పరిశీలన వేగంగా పూర్తి చేయాలి రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల పరిశీలన త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో శనివారం సంబంధిత అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. దరఖాస్తుల పరిశీలన తర్వాత బ్యాంకర్లకు పంపాలని, అన్ని దరఖాస్తులు బ్యాంకర్లు, ఎంపీడీఓలతో పరిశీలన చేపట్టాలన్నారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్లపై అధికారులతో సమావేశం నిర్వహించారు. పెండింగ్ దరఖాస్తులపై ప్రత్యేక దృష్టిసారించి హర్డ్ కాపీలను అందచేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వీరబ్రహ్మచారి, అధికారులు పాల్గొన్నారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలి నెల్లికుదురు: కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు పెట్టిన ధాన్యం బస్తాలను తరలించే విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉంటూ రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అన్నారు. మండలంలోని మధనతుర్తి, ఎర్రబెల్లిగూడెం, నెల్లికుదురు గ్రామాల్లో సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కొనుగోలు కేంద్రాలను శనివారం కలెక్టర్ సందర్శించి రికార్డులను పరిశీలించారు. వరిధాన్యాన్ని త్వరగా కాంటాలు వేసి మిల్లులకు తరలించాలని అధికారులను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో గన్నీ బ్యాగులు, టార్పాలీన్లు అందుబాటులో ఉంచుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. అకాల వర్షాలకు ధాన్యం తడవకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. ఎర్రబెల్లిగూడెం సబ్‌సెంటర్‌ను సందర్శించి వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎండతీవ్రత, వడగాల్పులపై వైద్య సిబ్బందికి అవగాహన కల్పిచారు. మండల ప్రత్యేక అధికారి జినుగు మరియన్న, తహసీల్దార్ రాజు ఉన్నారు. కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్ -
రక్తపోటుపై అవగాహన కల్పించాలి
నెహ్రూసెంటర్: పీహెచ్‌సీలు, ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాల ద్వారా గ్రామాల్లో రక్తపోటు(బీపీ)పై ప్రజ లకు అవగాహన కల్పిస్తున్నట్లు డీఎంహెచ్ఓ రవి రాథోడ్ తెలిపారు. ప్రపంచ రక్తపోటు(బీపీ) నివారణ దినోత్సవం సందర్భంగా వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎప్పటికప్పుడు రక్తపోటును పరీక్షించుకుంటూ మందులు వాడడం ద్వారా ని యంత్రణలో ఉంచుకోవచ్చని తెలిపారు. రక్తపోటు తనిఖీలు, ప్రాముఖ్యత, చికిత్స నివారణపై క్షేత్రస్థాయిలో ఆరోగ్య సిబ్బంది ప్రజలకు వివరించాలన్నా రు. జీవన శైలిలో మార్పులు చేసుకోవడం, వాకింగ్, సైక్లింగ్, రన్నింగ్, యోగా వంటివాటితో రక్తపోటను అదుపులో ఉంచుకోవచ్చని తెలిపారు. కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారులు నాగేశ్వర్రావు, సుధీర్‌రెడ్డి, లక్ష్మీనారాయణ, సారంగం, విజయ్‌కుమార్, మాస్ మీడియా అధికారి కొప్పు ప్రసాద్, ఆశా నోడల్ ఆఫీసర్ సక్కుభాయి, హెచ్ఈఓ వెంకటేశ్వర్రాజు, శారద, గీత, పురుషోత్తం, రామకృష్ణ, కేఎల్ఎన్ స్వామి, లోక్య, డీపీఓ నీలోహన, నీలిమాశ్వేత, అశోక్, అరుణ్, మనోహర్, సౌమిత, వసంత, త్రివేణి, సీహెచ్ఓ రవీంద్రకుమార్ పాల్గొన్నారు. వడదెబ్బపై జాగ్రత్తలు పాటించాలి పెద్దవంగర: వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు పా టిస్తే మిమ్మల్ని మీరు రక్షించు కోవచ్చని డీఎంహెచ్ఓ రవి రాథోడ్ సూచించారు. శనివారం మండల కేంద్రంతోపాటు ఉప్పరగూడెంలో వైద్యసిబ్బంది చేపట్టిన వాక్సినేషన్ పరిశీలించారు. అంతకు ముందు మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి, రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బీసీజీ, ఓపీవీ, పంటా వంటి వాక్సిన్లు క్రమం తప్పకుండా అందించాలని అదేశించారు. ఎంఎల్‌హెచ్‌పీలు మహిపాల్, మహేష్, ఏఎన్ఎంలు హరిత, నాగజ్యోతి, ఆశాలు, స్థానికులు, తదితరులు పాల్గొన్నారు. డీఎంహెచ్ఓ రవిరాథోడ్ -
రూ.2.8 లక్షల సైబర్ లూటీ
డోర్నకల్: సైబర్ వలలో పడి ఓ యువతి రూ.2.8 లక్షలు పోగొట్టుకున్న ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. డోర్నకల్ సీఐ బి.రాజేష్ శనివారం తెలిపిన వివరాల ప్రకారం.. బొడ్రాయితండాకు చెందిన గుగులోత్ మౌనిక ఏప్రిల్ 8న ఇన్‌స్ర్ట్రాగామ్‌లో లోన్ యాప్ డౌన్లోడ్ చేసుకుంది. లోన్‌యాప్ ప్రతినిధి రూ.10 లక్షల లోన్ మంజూరు చేస్తామని మొదట రూ.11 వేల పంపాలని కోరగా మౌనిక పంపింది. తర్వత మరో రూ.20వేలు పంపమని కోరడంతో మళ్లీ పంపించింది. లోన్ యాప్ ప్రతినిధి వారం రోజులపాటు మౌనికకు మాయమాటలు చెబుతూ రూ.2.8 లక్షలు లూటీ చేశాడు. అనంతరం యాప్ ప్రతినిధి స్పందించకపోవడంతో మౌనిక డోర్నకల్ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు మౌనిక ఖాతా నుంచి బదిలీ అయిన డబ్బులో రూ.7 వేలను హోల్డ్‌లో పెట్టారు. మౌనిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టినట్లు సీఐ తెలిపారు. రుణం ఇప్పిస్తామని మోసం.. మహబూబాబాద్ రూరల్ : రుణం ఇప్పిస్తామని చెప్పిన ప్రకటనను నమ్మిన ఓ యువకుడు డబ్బులు బదిలీ చేయగా సైబర్ మోసగాళ్ల చేతిలో మోసపోయిన ఘటన శనివారం ఆలస్యంగా వెలుగు చూసింది. రూరల్ ఎస్సై దీపిక తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ మున్సిపల్ పరిధిలోని ఈదులపూసపల్లికి చెందిన ఆకుల యుగంధర్ ఫేస్ బుక్ ఖాతాకు జనవరిలో ధని యాప్ పేరిట రుణం ఇస్తామని సమాచారం వచ్చింది. దీంతో యుగంధర్ అవతలి వ్యక్తులు పంపించిన లింక్ ఓపెన్ చేశాడు. అనంతరం అవతలి వ్యక్తులు కోరినవిధంగా రూ.3వేలు, రూ.11,300, రూ.8,800, రూ.13,500 విడతల వారీగా పంపించాడు. డబ్బులు తిరిగి రాకపోవడంతో మాసానికి గురైనట్లు గ్రహించి 1930లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని ఎస్సై తెలిపారు. -
పిట్టల్లా రాలుతున్నారు..
– వివరాలు 8లోuసాక్షి, మహబూబాబాద్: భానుడి ప్రతాపం రోజు రోజుకూ పెరిగిపోతోంది. నిప్పులు కురిపించే ఎండలో తప్పని పరిస్థితిలో పనిచేస్తూ వడదెబ్బకు గురై జిల్లా వ్యాప్తంగా రైతులు, కూలీలు పిట్టల్లా రాలుతున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటికే జిల్లాలో పదిమందికి పైగా వడదెబ్బతో మృతి చెందారంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. అయితే వేసవి తీవ్రత ఎక్కువగా ఉన్నా.. వైద్యారోగ్యశాఖ, మున్సిపాలిటీ, ఇతర శాఖల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు, సహాయక చర్యలు అందించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఉపాధి పని ప్రదేశాల్లో వసతులు కల్పించకపోవడంతోనే మృతుల సంఖ్య పెరుగుతుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పదిమందికి పైగా మృతి జిల్లా వ్యాప్తంగా వడదెబ్బతో అస్వస్థతకు గురై రెండునెలల్లోనే పదిమందికి పైగా మృతి చెందారు. ఏప్రిల్ 15వ తేదీనన కొత్తగూడ మండలం వేలుబెల్లికి చెందిన బాసాని మల్లమ్మ, గార్ల మండలం జీవంజిపల్లి గ్రామానికి చెందిన బాదంపూడి సులోచన వడదెబ్బతో మృతి చెందారు. 21వ తేదీన తొర్రూరు మండలం చర్లపాలెం గ్రామానికి చెందిన హనుమాండ్ల ప్రేమలత, 22వ తేదీన నెల్లికుదురు మండలం మదనతుర్తి గ్రామానికి చెందిన బిర్రు వెంకన్న ఎండలో ధాన్యం ఆరబోసే పనిచేస్తుండగా.. ఎండదెబ్బ తగిలి మృతి చెందాడు. 28వ తేదీన మహబూబాబాద్ పట్టణంలో పనికోసం వచ్చిన బీహర్ కూలీ తులసి మిశ్ర వడదెబ్బతో మృతి చెందారు. 29వ తేదీన బయ్యారం మండలం కస్తూరినగర్‌కు చెందిన కేలోత్ రంగ్య ఎండలో పనిచేస్తూ కుప్పకూపోగా.. చికిత్స అందించే లోపే మృతి చెందారు. మే 6వ తేదీన గార్ల మండలం అంబేడ్కర్ నగర్‌కు చెందిన అక్కి పార్వతి వడదెబ్బతో మృతి చెందారు. నర్సింహులపేట మండల కేంద్రం ఫీల్డ్ అసిస్టెంట్ తూడి మానిక్యం ఈనెల 11వ తేదీన ఉపాధి కూలీలతో పనిచేయిస్తూ వడదెబ్బతగిలి అస్వస్థతకు గురికాగా.. మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. 12వ తేదీన పెద్దవంగర మండలం పోచంపల్లి కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకొచ్చిన గంట్ల శివారు సమ్మిద్ కుంట తండాకు చెందిన గుగులోత్ కిషన్ వడదెబ్బతో మరణించారు. 14న గార్ల మండలం కొత్త పోచారం గ్రామానికి చెందిన గజ్జి యాకమ్మ ఉపాధి పనులకు వెళ్లి వడదెబ్బతో మృతి చెందారు. దీంతోపాటు వడదెబ్బకు గురై అనారోగ్యంతో బాధపడుతున్నారు, ఆస్పత్రుల్లో చికిత్స పొందుతు న్నవారు సైతం అనేకమంది ఉన్నారు. కానరాని సహాయక చర్యలు వేసవి ఎండల నేపథ్యంలో పనిచేసే ప్రదేశాల్లో వసతులు లేకపోవడం, వడదెబ్బకు గురికాకుండా తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించకపోవడంతోనే అత్యధిక మరణాలు చోటు చేసుకుంటున్నాయనే విమర్శలు వస్తున్నాయి. ప్రధానంగా ఉపాధి హామీ పని ప్రదేశాల్లో టెంట్లు, తాగునీటి వసతి కల్పించాలి. కానీ, జిల్లాలో అత్యధిక ప్రాంతాల్లో వసతులు లేవు. దీంతోపాటు కొనుగోలు కేంద్రాలకు విక్రయానికి తీసుకొచ్చిన ధాన్యం తేమ శాతం తగ్గడంకోసం ఆరబోస్తున్న రైతులు రోజలు తరబడి ఎండలో నిరీక్షించాల్సిన పరిస్థితి ఉంటుంది. మరికొన్ని కేంద్రాల్లో కొనుగోళ్లు, తరలింపు ఆలస్యం కావడం వంటి కారణాలతో రైతులు రోజల తరబడి ఆయా కేంద్రాల్లో ఎండలోనే ఉంటూ వడదెబ్బకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. ఇంతజరుగుతున్నా.. వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించడం, ప్రధాన కూడళ్ల వద్ద ఓఆర్ఎస్ ప్యాకెట్ల పంపిణీ, చలి వేంద్రాల ఏర్పాటు వంటి సహాయక చర్యలు చేపట్టడంలో అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారనే విమర్శలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. ఉన్నతాధికారులు చొరవ తీసుకొని సహాయక చర్యలు చేపట్టేలా చూడాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. వారం రోజులుగా జిల్లాలో ఉష్ణోగ్రత వివరాలు (డిగ్రీల్లో..)జిల్లాలో పెరుగుతున్న వడదెబ్బ మరణాలు ఇప్పటికే పది మందికి పైగా మృతి నిప్పులు కురిసే ఎండలో తప్పని పని ఉపాధి పని ప్రదేశాల్లో సౌకర్యాల లేమి తేదీన కనిష్టం గరిష్టం 10 25 40 11 27 39 12 25 40 13 25 38 14 25 37 15 26 40 16 23 35 17 28 42 -
పుష్కర స్నానంతో పొరపాట్లు పరిసమాప్తం
కాళేశ్వరం: పుష్కర స్నానంతో సకల సౌకర్యాలు, సౌభాగ్యాలు కలుగుతాయని, ఏవైనా పొరపాట్లు, తప్పులు జరిగి ఉంటే పరిసమాప్తమవుతాయని రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. శుక్రవారం సాయంత్రం కాళేశ్వరంలో కుటుంబ సమేతంగా డిప్యూటీ సీఎం పుష్కర పుణ్యస్నానం ఆచరించారు. సరస్వతిఘాట్ వద్ద ఏర్పాటు చేసిన హారతి కార్యక్రమాన్ని వీక్షించారు. అంతకుముందు ఏకశిల సరస్వ తీమాత విగ్రహాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ భద్రత, పా రిశుద్ధ్యం, స్నానాల ఘాట్ల వద్ద అధికారులు నిబద్ధ త, నిష్టతో ఏర్పాట్లు చేశారని వివరించారు. పుష్కర స్నానాలకు ప్రతీరోజు ఒక పీఠాధిపతి వచ్చి స్నానం ఆచరించి ముక్తేశ్వర దర్శనం చేసుకుని పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు. డిప్యూటీ సీఎం వెంట మంత్రి శ్రీధర్‌బాబు, ఎమ్మెల్యేలు గండ్ర సత్యనా రాయణరావు, రాజ్‌ఠాకూర్, కలెక్టర్ రాహుల్‌శర్మ, దేవాదాయశాఖ కమిషనర్ వెంకట్రావ్ ఉన్నారు. కాగా, రాత్రి హోటల్ హరితలో బస చేశారు. శనివారం ఉదయం కాళేశ్వర ముక్తీశ్వర స్వామివారిని దర్శించుకోనున్నారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కాళేశ్వరంలో పుష్కరస్నానం -
ఖైదీల పనితీరు ప్రోత్సహించేందుకు స్టాల్ ఏర్పాటు
● జెళ్ల శాఖ డీజీ సౌమ్యమిశ్రా కాళేశ్వరం : ఖైదీల పనితీరు ప్రోత్సహించడంలో భాగంగా సరస్వతీనది పుష్కరాల్లో వారితో తయారు చేయించిన వివిధ ఉత్పత్తులతో కాళేశ్వరంలో స్టాల్ ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ సౌమ్యమిశ్రా తెలిపారు. ఈ మేరకు శుక్రవారం కాళేశ్వరంలో ఏర్పాటు చేసిన స్టాల్‌ను ప్రారంభించిన అనంతరం ఆమె మాట్లాడారు. జైళ్ల శాఖ ఖైదీలకు వివిధ ఉత్పత్తి రంగాల్లో శిక్షణ కల్పిస్తూ వారితో నాణ్యమైన వస్తువులు తయారు చేయించి ఉపాధి కల్పిస్తోందన్నారు. పుష్కరాలకు వచ్చే భక్తులు ఈ ఉత్పత్తులు కొనుగోలు చేయాలని కోరారు. కార్యక్రమంలో జైళ్ల శాఖ వరంగల్ రేంజ్ డీఐజీ సంపత్, కలెక్టర్ రాహుల్ శర్మ, వరంగల్ సెంట్రల్ జైల్ పర్యవేక్షణాధికారి టి.కళాసాగర్, ఉప పర్యవేక్షణాధికారులు పి.వెంటేశ్వరస్వామి, జైలర్ పి.పూర్ణచందర్, పరకాల సబ్ జైలు పర్యవేక్షణాధికారి ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు. -
వీఐపీల సేవలో అధికార గణం
● సామాన్య భక్తులను పట్టించుకోని వైనం ● ఇబ్బందులు పడిన దివ్యాంగులు, వృద్ధులు, గర్భిణులు భూపాలపల్లి/కాళేశ్వరం: కాళేశ్వరంలో సరస్వతీ నది పుష్కరాల సందర్భంగా రెండో రోజు శుక్రవారం భక్తులు వేలాదిగా తరలి వచ్చారు. ఈ క్రమంలో సరస్వతి ఘాట్, కాళేశ్వరాలయంలో పోలీసులు, జిల్లా అధికారులు వీఐపీల సేవలకే పరిమితం అవుతున్నారనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. సాధారణ భక్తుల వాహనాలను పుష్కర ఘాట్‌కు కిలోమీటర్ దూరంలో గల పార్కింగ్ ప్రదేశంలో నిలిపివేస్తున్నారు. అక్కడి నుంచి నడుచుకుంటూ ఘాట్ వద్దకు వెళ్లాలి. అయితే ఇదే రహదారిపై ఒక్కో వీఐపీని రెండు, మూడు ఎస్కార్ట్ వాహనాలతో తీసుకెళ్తుండడంతో సాధారణ భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వృద్ధులు, దివ్యాంగులు, గర్భిణులను తీసుకెళ్లేందుకు ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చే యకపోవడంతో వారు తీవ్ర ఇ బ్బందులు పడుతున్నారు. ఇది లా ఉండగా పుష్కర ఘాట్ తీరంలో తాగునీటి సౌకర్యం కల్పించకపోవడంతో భక్తుల గొంతెండింది. విషయం తెలు సుకున్న కలెక్టర్ రాహుల్ శర్మ మ ధ్యాహ్నం ట్రాలీల ద్వారా మినరల్ వాటర్ సరఫరా చేయించారు. ఆలయంలో గంటల తరబడి సామాన్య భక్తులు క్యూ లెన్లలో ని రీక్షించాల్సి వచ్చినా అధికారులు చూడలేదు. స్థానిక పోలీసు, దేవాదాయశాఖ అధికారులు లేకపోవడం, ఇతర ప్రాంతాల నుంచి వచ్చి విధులు నిర్వర్తిస్తున్న వారు... పోలీసులు, ప్రభు త్వ అధికారుల కుటుంబీకులను ప్రత్యేకంగా ఆలయం లోపలికి పంపించడంపై సాధారణ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశా రు. ఉత్సవ కమిటీ ఉన్నా ఏ అధికారం లేకపోవడంతో వారు ఉత్సవ విగ్రహాలుగా మారారని పలువురు పేర్కొన్నారు. -
పుష్కర స్నానం.. మహాభాగ్యం
కాటారం: పన్నెండేళ్లకు ఒక్కసారి వచ్చే పుష్కరాలను భక్తులు మహాభాగ్యంగా భావిస్తున్నారు. కాళేశ్వరంలో కొనసాగుతున్న సరస్వతీనది పుష్కరాలకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, తదితర రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తున్నారు. పిల్లలు మొదలు.. పెద్దలు, వృద్ధుల వరకు త్రివేణి సంఘమంలో పరమ పవిత్ర పుష్కర స్నానం ఆచరిస్తున్నారు. అనంతరం కాళేశ్వర ముక్తీశ్వరుడిని దర్శించుకుంటున్నారు. గతంలో ఇదే చోట జరిగిన గోదావరి, ప్రాణహిత పుష్కరాలకు సైతం వచ్చి పుష్కర స్నానం ఆచరించిన భక్తులు కొందరు ఉండగా.. మొదటి సారి పుష్కర స్నానం ఆచరించిన వారు సైతం ఉన్నారు. అత్యంత పవిత్రంగా భావించే పుష్కర స్నానం చేయడం అదృష్టంగా భావిస్తున్నారు. ఎన్నో జన్మల పుణ్యఫలం ఈ పుష్కర స్నానమని పలువురు పురోహితులు, పెద్దలు పేర్కొంటున్నారు. కాళేశ్వరంలో అంతర్వాహిణిగా ఉన్న సరస్వతీ నది పుష్కరాలు ఈ నెల 15న ప్రారంభం కాగా 26వ తేదీ వరకు కొనసాగనున్నాయి. పలు రాష్ట్రాల నుంచి తరలివస్తున్న భక్తులు సరస్వతి ఘాట్‌లో పుష్కర స్నానం ఆలయంలో ప్రత్యేక పూజలు -
వైద్య సేవలు విస్తృతం..
భూపాలపల్లి అర్బన్: సరస్వతీనది పుష్కరాల నేపథ్యంలో కాళేశ్వరంలో ఏర్పాటు చేసిన పది వైద్య శిబిరాల్లో భక్తులకు విస్తృత వైద్య సేవలు అందిస్తున్నారు. స్థానిక పీహెచ్సీలో పది పడకలతో తాత్కాలిక ఆస్పత్రి ఏర్పాటు చేశారు. శుక్రవారం 200 మందికి ఓపీ పరీక్షలు నిర్వహించగా 12 మందిని అడ్మిట్ చేసుకున్నారు. భూపాలపల్లికి చెందిన నందకిశోర్ కాళేశ్వరంలో తేలు కాటుకు గురికాగా 108లో పీహెచ్‌సీకి చేరుకోగా చికిత్స అందించారు. ఇద్దరికి ఫిట్స్ రావడంలో ప్రాథమిక చికిత్స అందించి భూపాలపల్లి ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. పలువురు భక్తులు, పారిశుద్ధ్య కార్మికులు వడదెబ్బకు గురైనట్లు డీఎంహెచ్ఓ మధుసూదన్ తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో ఏఆర్ కానిస్టేబుల్ మృతి
స్టేషన్‌ఘన్‌పూర్: రోడ్డు ప్రమాదంలో ఏఆర్ కానిస్టేబుల్ మృతి చెందాడు. ఈ ఘటన గురువారం రాత్రి మండలంలోని ఛాగల్లు శివారు శివారెడ్డిపల్లి వద్ద జాతీయ రహదారిపై జరిగింది. పోలీసు కథనం ప్రకారం.. హనుమకొండ జిల్లా దామెర మండలం ల్యాదెళ్లకు చెందిన రాయరాకుల సతీశ్(42) ఏఆర్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ప్రస్తుతం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు గన్‌మన్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. వ్యక్తిగత పనుల నిమిత్తం బైక్‌పై హనుమకొండ నుంచి జనగామ వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఛాగల్లు శివారులో శివారెడ్డిపల్లి వద్ద జాతీయరహదారిపై గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన స్థానికులు పోలీసులు సమాచారం అందించగా వారు క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించే క్రమంలోనే మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతుడి భార్య రాధిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ జి.వేణు తెలిపారు.● శివారెడ్డిపల్లి వద్ద ఘటన ● మృతుడు మాజీ మంత్రి దయాకర్‌రావు గన్‌మన్ -
రాష్ట్రస్థాయి నెట్‌బాల్ పోటీలు షురూ..
● రాత్రి 10 గంటల వరకు కొనసాగిన లీగ్ మ్యాచ్‌లు ● 25 జిల్లాల నుంచి 620 మంది క్రీడాకారుల రాకజనగామ: జిల్లా కేంద్రం బతుకమ్మకుంటలో 8వ సబ్ జూనియర్స్ స్టేట్ లెవల్ నెట్‌బాల్ చాంపియన్ షిప్–2025 పోటీలను ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. జిల్లా నెట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు రామస్వామి, వర్కింగ్ ప్రెసిడెంట్ రొడ్రిక్స్ రాజ్‌కుమార్, ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు, సహాయ కార్యదర్శి రవికుమార్ ఆధ్వర్యాన అండర్–16 పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ పోటీలకు 25 జిల్లాల నుంచి 620 మంది బాలురు, బాలికల క్రీడాకారులు వచ్చారు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12, సాయంత్రం 4.30 నుంచి రాత్రి 10.30 గంటల వరకు రెండు షిఫ్టుల వారీగా ఫ్లడ్‌లైట్ల వెలుతురులో పోటీలు నిర్వహిస్తున్నారు. తొలిరోజు 45 మ్యాచ్‌లు ఉదయం, సాయంత్రం రెండు షిఫ్టుల్లో సుమారు 45 మ్యాచ్‌లు ఆడారు. పాయింట్ల పట్టికలో ముందు వరుసలో ఉన్న టీంలు క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంటాయి. అక్కడ ప్రతిభ కనబరిచిన జిల్లాలు సెమీఫైనల్, ఫైనల్లో తలపడనున్నాయి. నేడు(శనివారం) రాత్రి 10 గంటల వరకు సెమీఫైనల్ పోటీలను ముగించాలి.. సాధ్యం కాని పరిస్థితుల్లో 18న మిగిలిన మ్యాచ్‌లు పూర్తి చేసి సాయంత్రం ఫైనల్ పోటీలకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ క్రీడలు ఆరోగ్యంగా ఉండేందుకు దోహద పడుతాయన్నారు. డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు చదువుకుంటూనే.. ఆసక్తి ఉన్న ఆటల్లో తర్ఫీదు తీసుకుని ఉన్నత శిఖరాలకు ఎదగాలన్నారు. -
డెంగీ నివారణకు కృషి చేద్దాం●
● డీఎంహెచ్ఓ రవిరాథోడ్ నెహ్రూసెంటర్: ప్రజారోగ్యానికి పెనుముప్పుగా మారిన డెంగీ వ్యాఽధి నివారణకు ప్రజలు, ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు కలిసికట్టుగా పనిచేయాలని డీఎంహెచ్ఓ రవిరాథోడ్, జీజీహెచ్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు అన్నారు. జాతీయ డెంగీ నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దోమల వృద్ధికి అనుకూలమైన పరిస్థితులను మనుషులే సృష్టిస్తున్నారని, వాటి నివారణను ప్రతీ ఒక్కరు బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, దొమల నివారణ పద్ధతులు పాటించాలని తెలిపారు. ఏటా డెంగీ కేసులు పెరుగుతూ రోగులు చనిపోతున్నారని, వ్యాధికి కచ్చితమైన ఔషధం లేనందున నివారణ ఒక్కటే మార్గమన్నారు. కార్యక్రంమలో ప్రోగ్రాం అధికారులు సుధీర్‌రెడ్డి, శ్రవణ్, జీజీహెచ్ ఆర్‌ఎంఓలు జగదీశ్వర్, హర్షవర్ధన్, జిల్లా డిప్యూటీ మీడియా అధికారి కొప్పు ప్రసాద్, డీపీహెచ్ఎన్ఓ సక్కుభాయి, హెచ్‌ఈలు కేవీ రాజు, పురుషోత్తం, సబ్ యూనిట్ ఆఫీసర్ గోపిచంద్, శ్రీరామ్, రామకృష్ణ, కేఎల్ఎన్ స్వామి, సత్యనారాయణ, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. నిర్లక్ష్యం వహించొద్దు గూడూరు: చెక్‌పోస్టుల వద్ద విధులు నిర్వహించే సిబ్బంది నిర్లక్ష్యం వహించొద్దని డీఎస్పీ తిరుపతిరావు అన్నారు. మండలంలోని భూపతిపేట చెక్‌పోస్టును శుక్రవారం రాత్రి ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పశువుల అక్రమ రవాణాతో పాటు ఇతర అక్రమ వ్యాపారాలపై కూడా నిఘా పెట్టాలని సూచించారు. కార్యక్రమంలో గూడూరు సీఐ సూర్యప్రకాశ్, ఎస్సై గిరిధర్‌రెడ్డి, కొత్తగూడ, గంగారం ఎస్సైలు కుషకుమార్, రవికుమార్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
పుష్కర స్నానం.. సకల పాప హరణం
భూపాలపల్లి/కాళేశ్వరం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో సరస్వతినది పుష్కరాలకు రెండో రోజు శుక్రవారం భక్తులు పోటెత్తారు. గోదావరి, ప్రాణహిత, అంతర్వాహిని సరస్వతినదిలో పుష్కర స్నానాలు ఆచరించారు. నదీమాతకు పండ్లు, పూలతో పాటు, పసుపు, కుంకుమ, చీర, సారెను సమర్పించారు. దీపాలు వదిలారు. సైకత లింగాలు చేసి ఆరాధన చేశారు. పితృతర్పనాలు, పిండప్రదానాలు చేశారు. బ్రాహ్మణ ముత్తయిదువులు వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు. భక్తుల కష్టాలు, ఇబ్బందులు తొలగిపోవాలని కోరుతూ కాళేశ్వరాలయంలో సంకష్టహర గణపతి హోమం నిర్వహించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగశాలలో వేదపండితులు రెండోరోజు హోమాలు, విశేష పూజలు చేశారు. రాత్రి కాశీపండితుల ఆధ్వర్యంలో నదికి నవరత్నమాల హారతి ఇచ్చారు. నిండిన పార్కింగ్ స్థలాలు, చలువ పందిళ్లు.. ఆర్టీసీ బస్సులు, ట్రావెల్స్, ప్రైవేటు వాహనాల్లో భక్తులు తరలిరావడంతో పార్కింగ్ స్థలాలు కిటకిటలాడాయి. వరంగల్, భూపాలపల్లి మీదుగా తరలి వస్తున్న భక్తులు, వాహనాలను వీఐపీఘాట్, ఇప్పలబోరు వైపు పార్కింగ్‌లకు పోలీసులు తరలించారు. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, మంచిర్యాల వైపునుంచి వచ్చే వాహనాలను బస్టాండ్ సమీపంలోని పార్కింగ్ స్థలం వద్ద నిలిపివేస్తున్నారు. అక్కడినుంచి ఘాట్ వరకు భక్తుల సౌకర్యార్థం ఉచిత ఆర్టీసీ షెటిల్ బస్సులు ఏర్పాటు చేశారు. స్థానిక ఆటోలకు కూడా అనుమతివ్వడంతో భక్తులను పార్కింగ్స్థలాలనుంచి సరస్వతి ఘాట్, అక్కడినుంచి ఆలయానికి తరలిస్తున్నారు. ఎండ వేడిమి అధికంగా ఉండడంతో భక్తులు చలువ పందిళ్లకింద సేదదీరడం కనిపించింది. వీఐపీల రాక.. రెండో రోజు శుక్రవారం సరస్వతినదిలో పలువురు ప్రముఖులు పుష్కర స్నానం ఆచరించారు. డిప్యూ టీ సీఎం మల్లు భట్టివిక్రమార్క జైళ్లశాఖ డీజీ సౌమ్యమిశ్రా, ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి, భూపాలపల్లి ఇన్చార్జ్ జడ్జి పట్టాభిరాం వేర్వేరుగా పుష్కర స్నానాలు చేసి, ముక్తీశ్వరుడిని దర్శించుకున్నారు. గోదావరి, ఆలయ పరిసరాల్లో కిటకిట..వీకెండ్స్‌లో పెరగనున్న భక్తుల తాకిడి..శని, ఆదివారాల్లో భక్తుల తాకిడి రెట్టింపుస్థాయిలో ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం గోదావరి తీరం వద్ద ఏర్పాటు చేసిన చలువ పందిళ్లు శుక్రవారం వచ్చిన భక్తులతోనే నిండాయి. శని, ఆదివారాల్లో లక్షమందికిపైగా భక్తులు రానున్నట్లు అంచనా. ఈ మేరకు అధికారులు మరిన్ని ఏర్పాట్లు చేస్తే ఇబ్బందులు ఉండవని, లేనిపక్షంలో ఎండకు మాడిపోవాల్సిందేనని భక్తులు అంటున్నారు. రెండో రోజు సరస్వతి పుష్కరాలకు తరలివచ్చిన భక్తులు సుమారు 80వేల మంది వరకు పుణ్యస్నానాలు ఆచరణ కిటకిటలాడిన సరస్వతి ఘాట్, దేవస్థానం పుష్కర స్నానం చేసిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, వీఐపీలుపుష్కరాల మరిన్ని వార్తలు, ఫొటోలు – IIలోu -
ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి
మహబూబాబాద్: ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని రాష్ట్ర నీటి పారుదల, పౌరసరఫరా శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని సచివాలయం నుంచి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇతర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, సీఎస్ రామకృష్ణారావుతో కలిసి ధాన్యం కొనుగోళ్లు, ఇతర అంశాలపై జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడవకుండా చర్యలు చేపట్టాలన్నారు. టార్పాలిన్లు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. 48గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలన్నారు. కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్ మాట్లాడుతూ.. గత సీజన్‌తో పోలిస్తే ఈసారి ధాన్యం కొనుగోలు పెరిగిందన్నారు. జిల్లాలో 1.16లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, దానిలో 1,03,000 మెట్రిక్‌టన్నులు మిల్లులకు తరలించినట్లు చెప్పారు. వీసీలోజిల్లా నుంచి కలెక్టర్‌తో పాటు అదనపు కలెక్టర్ వీరబ్రహ్మచారి ఉన్నారు. వీసీలో మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి -
నేడు ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’
కేసముద్రం: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని శనివారం మండల కేంద్రంలోని రైతువేదిక భవనంలో నిర్వహించనున్నట్లు ఏఓ వెంకన్న శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 9.30గంటలకు నిర్వహించే కార్యక్రమంలో కేవీకే మల్యాల శాస్త్రవేత్తలు, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం, వరంగల్ శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో రైతులకు శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. దరఖాస్తుల పరిశీలన వేగవంతం చేయాలి మహబూబాబాద్: రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల పరిశీలన వేగవంతంగా పూర్తి చేయాలని బీసీ సంక్షేమశాఖ జిల్లా అధికారి సర్సింహస్వామి అన్నారు. స్థానిక మున్సిపాలిటీ కార్యాలయంలో శుక్రవారం రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల పరిశీలనపై వార్డు ఆఫీసర్లు, మున్సిపల్ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సింహస్వామి మాట్లాడుతూ.. ఆన్లైన్ దరఖాస్తు చేసుకున్న వారి నుంచి హార్డ్‌కాపీలు రాకపోతే వెంటనే తెప్పించుకోవాలన్నారు. బ్యాంకుల నుంచి వెరిఫికేషన్ నివేదికలు త్వరగా తీసుకుని టార్గెట్లు పూర్తి చేయాలన్నారు. సమావేశంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్రీనివాస రావు, ఎల్డీఎం సత్యనారాయణ మూర్తి పాల్గొన్నారు. పార్టీ అభివృద్ధికి కష్టపడిన వారికే పదవులు బయ్యారం: కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కష్టపడిన వారికే పదవులు వస్తాయని టీపీసీసీ జిల్లా పరిశీలకులు కూచన రవళిరెడ్డి, పొట్ల నాగేశ్వరరావు అన్నారు. సంస్థాగత కమిటీల ఏర్పాటులో భాగంగా శుక్రవారం స్థానిక సీతారామచంద్రస్వామి ఫంక్షన్హాల్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పార్టీ పెద్దల సూచనల మేరకు నిజమైన పార్టీ శ్రేణులకే పదవులు వస్తాయని, పార్టీ కోసం ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో పనిచేయాలన్నా రు. కార్యక్రమంలో ఎంపీ బలరాంనాయక్, ఇ ల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, డీసీసీ అధ్యక్షుడు భరత్‌చందర్‌రెడ్డి, సొసైటీ చైర్మన్ మధుకర్‌రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు ముసలయ్య, ఎస్టీ విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు రామునాయ క్ తదితరులు పాల్గొన్నారు. 108 ప్రోగ్రాం మేనేజర్‌గా శివకుమార్ నెహ్రూసెంటర్: ఈఎంఆర్ఐ గ్రీన్ హెల్త్ సర్వీసెస్ సంస్థ జిల్లా ప్రోగ్రాం మేనేజర్‌గా శివకుమార్ నియమితులయ్యారు. జిల్లాలోని 108 (అత్యవసర సేవలు), 102 (అమ్మ ఒడి), 1962 (పశు సంచార) సేవలను పర్యవేక్షణ చేయనున్నారు. మహబూబాబాద్ ప్రోగ్రాం మేనేజర్‌గా పని చేసిన భూమ నాగేందర్ హైదరాబాద్ క్లస్టర్‌కు బదిలీపై వెళ్లగా ఆయన స్థానంలో వరంగల్‌లో మేనేజర్‌గా పని చేస్తున్న శివకుమార్ విధుల్లో చేరారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు గార్ల: ఆస్పత్రి అధికారులు, సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని ఎమ్మెల్యే కో రం కనకయ్య అన్నారు. శుక్రవారం గార్ల సీహెచ్‌సీని తనిఖీ చేశారు. తొలుత వైద్యుల హాజరు పట్టికను పరిశీలించారు. నలుగురు డాక్టర్లలో ఒక్కరే విధులకు హాజరుకావడంపై ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వం డాక్టర్లకు లక్షల్లో వేతనాలు చెల్లిస్తుంటే.. కొంతమంది వారంలో ఒకరోజు కూడా హాజరుకాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రి నుంచే కొంతమంది డాక్టర్లకు ఎమ్మెల్యే ఫోన్ చేయగా వారు పొంతన లేని సమాధానం చెప్పారు. అనంతరం ఆస్పత్రికి వచ్చే రోగులతో ఎమ్మెల్యే మాట్లాడారు. ఆస్పత్రిలో ఉన్న డాక్టర్‌ను పిలిచి రోగులకు నాణ్యమైన వైద్యం అందించాలని ఆదేశించారు. వైద్యుల గైర్హాజరు విషయాన్ని వైద్యశాఖ మంత్రి, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ రవిరాథోడ్, పీఏసీఎస్ చైర్మన్ దుర్గాప్రసాద్, మాజీ ఎంపీపీ వెంకట్‌లాల్, ఏఎంసీ మాజీ చైర్మన్ నాగేశ్వరరావు, డాక్టర్లు హనుమంతరావు, రాజ్‌కుమార్ జాదవ్ పాల్గొన్నారు. -
రైతులు ఉక్కిరి బిక్కిరి!
శనివారం శ్రీ 17 శ్రీ మే శ్రీ 2025– IIలోuసాక్షి, మహబూబాబాద్/మహబూబాబాద్ రూరల్: యాసంగి ధాన్యం అంచనాకు మించి దిగుబడి వ చ్చింది. ఇదే రీతిలో కొనుగోలు కేంద్రాలకు వస్తోంది. అంచనాకు మించి ధాన్యం కేంద్రాలకు రావడంతో ఒక వైపు కాంటాలు ఆలస్యం.. మరోవైపు గన్నీ సంచులు, లారీల కొరతతో పాటు జిల్లాలోని మిల్లులన్నీ ధాన్యంతో నిండిపోయాయి. ఈక్రమంలో వారాల తరబడి కేంద్రాల్లోనే రైతులు నిరీక్షించాల్సి వస్తోంది. దీనికి తోడు సాయంత్రం అయితే ఉరుములు, మెరుపులతో అకాల వర్షాలు కురుస్తుండడంతో రైతులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అంచనాలు తారుమారు.. గత యాసంగిలో సివిల్ సప్లయీస్ అధికారులు వేసిన అంచనాల్లో మూడోవంతు ధాన్యం కూడా రాలేదు. ఇదే పరిస్థితి ఉంటుందని ఈ సారి అధికారులు వేసిన అంచనాలు తారుమారయ్యాయి. యాసంగిలో 1,36,236 ఎకరాల్లో వరి సాగుచేశారు. 2,63,577 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేశారు. ఇందులో ప్రైవేట్ అమ్మకాలు, ఇతర అవసరాలకు రైతులు నిల్వ ఉంచడం పోనూ.. కొనుగోలు కేంద్రాలకు 1.79లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేశారు. అయితే సన్న ధాన్యానికి క్వింటాకు బోనస్‌తో కలుపకొని రూ. 2,820 చెల్లించడంతో అందరు కొనుగోలు కేంద్రాలకే రావడం మొదలు పెట్టారు. దీనికి తోడు దిగుబడి అంచనా కూడా పెరడగంతో ఇప్పటికే 1.20లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా మరో 30వేల మెట్రిక్ టన్నులకు మించి ధాన్యం కేంద్రాల్లో ఉంది. ఇంకా రైతుల వద్దనుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తూనే ఉంది. తీరని లారీల కొరత కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన వెంటనే పలుచోట్ల ధాన్యం కొనకుండా ఉండడంతో ఒకేసారి రైతుల నుంచి ఒత్తిడి పెరిగింది. పెద్ద మొత్తంలో ధాన్యం రావడం, కాంటాలు పెట్టిన ధాన్యం మిల్లులకు చేరవేసేందుకు సరిపడా లారీలను అధికారులు సమకూర్చలేకపోతున్నారు. దీంతో కాంటాలు పెట్టిన ధాన్యం కేంద్రాల్లోనే వారాల తరబడి ఉంచాల్సి వస్తుందని రైతులు చెబుతున్నారు. ఆరు ఐదు రూట్లలో లారీలు సరఫరా చేసేందుకు కాంట్రాక్టర్లతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు లారీలు పెట్టడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. గతంలో ఎగుమతి చేసిన ధాన్యం ఆధారంగా 80శాతం డబ్బులు అడ్వాన్స్‌గా ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ఇవ్వడం లేదని పలువురు లారీ కాంట్రాక్టర్లు లారీలు పెట్టేందుకు వెనకడుగు వేస్తున్నట్లు తెలిసింది. దీంతో సరిపడా లారీలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. నిండిన మిల్లులు జిల్లాలో 193 కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు చేసిన ధాన్యం దిగుమతి చేసుకునేకునే మిల్లులు నిండిపోయినట్లు తెలిసింది. జిల్లా వ్యాప్తంగా 63 రైస్ మిల్లులు ఉండగా ఇందులో సీఎంఆర్ పెట్టడం లేదని 16 మిల్లులను బ్లాక్ లిస్టులో పెట్టారు. ప్రభుత్వం పెట్టిన 10 శాతం బ్యాంకు గ్యారంటీ ఇవ్వాలనే నిబంధనలతో మరికొన్ని మిల్లులు వెనకడుగు వేశాయి. కాగా, వీటన్నిటికి అంగీకరించిన 40 మిల్లులకు మాత్రమే ధాన్యం సరఫరా చేయగా.. ఇప్పటికే వానాకాలం ధాన్యం నిల్వ ఉండడం, యాసంగి ధాన్యం రావడంతో మిల్లులు నిండిపోయాయి. జిల్లా సివిల్ సప్లయీస్ ఉన్నతాధికారులకు ఈవిషయం తెలుపగా వరంగల్ జిల్లాలోని మిల్లులకు పంపించాలని చెప్పారు. అయితే అక్కడ కూడా ఎక్కువ మొత్తంలో ధాన్యం రావడంతో మాకొద్దు మీ ధాన్యం అని వరంగల్ జిల్లా రైస్ మిల్లర్లు అంటున్నట్లు తెలిసింది. దీంతో ధాన్యం ఎగుమతి చేయడం కూడా అధికారులకు సవాల్‌గానే మారింది. 250 బస్తాల ధాన్యం తడిసింది మా 250 బస్తాల ధాన్యం కొనుగోలు చేసి కాంటాలు పెట్టి మూడు రోజులైంది. లారీలు రాకపోవడం వల్ల నాలాంటి ఎంతో మంది రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లా రీలు రాకపోవడంతో అకాల వర్షం వల్ల ధా న్యం బస్తాలు తడిసిపోయాయి. ఇంకా ఎన్ని రోజులు కొనుగోలు కేంద్రంలో ఉండాలి, ఇప్పుడు ఈ నష్టాన్ని ఎవరు భరించాలి. – బానోత్ మీట్యా, ఇస్లావత్‌తండా జీపీ ధాన్యం కొన్నారు... తరలించలేదు.. సింగారం ధాన్యం కొనుగోలు కేంద్రంలో మా వద్ద నిర్వాహకులు ధాన్యం కొనుగోలు చేశారు. కానీ బస్తాలు నింపి ఉంచి కాంటాలుపెట్టి మిల్లులకు తరలించకపోవడం వల్ల వర్షానికి ధాన్యం తడిసింది. ఇప్పుడు మిల్లర్లు ఈ బస్తాలు తీసుకోమని చెబితే మా పరిస్థితి ఏమిటో అర్థం కాడంలేదు. – బానోత్ జేతా, కేశ్యతండా, వీఎస్.లక్ష్మిపురం జీపీ అకాల వర్షం.. తడిసిన ధాన్యం కురవి/మరిపెడ రూరల్/ నర్సింహులపేట/ పెద్దవంగర/దంతాలపల్లి: జిల్లాలోని పలు మండలాల్లో గురువారం రాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. గాలివానకు చెట్లు కూలిపోయాయి, ఇంటిపైకప్పు రేకులు ఎగిరిపోయాయి. పలుచోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. కురవి మండల కేంద్రంతోపాటు నేరడ గ్రామంలోని కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసింది. కాంటా అయిన ధాన్యం సైతం వర్షానికి తడిసిపోయింది. నేరడ గ్రామానికి వెళ్లే మార్గంలో పెద్ద వృక్షం కూలిపోవడంతో రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. యువకులు రోడ్డుపై పడిన చెట్టును తొలగించారు. సీరోలు మండలం కొత్తూరు(సీ) గ్రామంలో ధాన్యం తడిసిపోయింది. నర్సింహులపేట మండలంలో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. అలాగే మరిపెడ మండలంలోని తండధర్మారం గ్రామానికి చెందిన రైతు ధరంసోత్ మంగీలాల్‌కు చెందిన 90 ధాన్యం బస్తాలు తడిసిపోగా ఆరబెట్టుకున్నాడు. పెద్దవంగర మండలంలోని పలు కొనుగోలు కేంద్రాల్లో కాంటా పెట్టిన బస్తాలు తడిసిపోయాయి. శుక్రవారం బస్తాలను ఉల్టావేసి ఆరబెట్టుకున్నారు. అధికారులు తహసీల్దార్ మహేందర్, ఏఓ స్వామి నాయక్, ఏఈఓలు కేంద్రాలను సందర్శించారు. కాంటా పెట్టి నిల్వ ఉన్న బస్తాలను లారీల ద్వారా పంపించే పక్రియను వేగవంతంగా చేట్టారు. అలాగే దంతాలపల్లి మండలంలోనూ అకాల వర్షంతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసింది. న్యూస్రీల్కొనుగోలు కేంద్రాల్లో పేరుకుపోయిన ధాన్యం నిల్వలు సరిపడా గన్నీ సంచులు, లారీలు లేక ఇబ్బందులు ఇప్పటికే నిండిపోయిన రైస్ మిల్లులు మాకొద్దు ధాన్యం అంటున్న వరంగల్ అధికారులు రైతులను వెంటాడుతున్న అకాల వర్షాలు -
కంబాలపల్లి C/O ప్రభుత్వోద్యోగులు
మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ మండలంలోని కంబాలపల్లి గ్రామం.. ప్రభుత్వ ఉద్యోగుల గ్రామంగా విలసిల్లుతోంది. గ్రామం నుంచి ఆర్మీ, సీఐఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, ఆర్టిలరీ, బీఎస్ఎఫ్, ఎస్పీఎఫ్, మద్రాస్ రెజిమెంట్, టీఎస్ఎస్పీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్, ఏఆర్, పోలీసు విభాగాలతో పాటు ఉపాధ్యాయులు 79 మంది వరకు సేవలు అందిస్తున్నారు. కాగా ఇక్కడి నుంచి ఎక్కువగా సైనికులు దేశానికి సేవలందిస్తున్నారు. గ్రామానికి చెందిన మల్లికంటి కృష్ణయ్య మొట్టమొదటిసారిగా సీఆర్పీఎఫ్ జవాన్‌గా చేరారు. ఆయనను ఆదర్శంగా తీసుకుని గ్రామ యువత వివిధ ప్రాంతాల్లో పనిచేస్తూ.. కంబాలపల్లి గ్రామం (Kambalapally Village) ఆదర్శంగా నిలిచేలా కృషి చేస్తున్నారు. సేవలందిస్తున్న 79 మందిలో...కంబాలపల్లి గ్రామం నుంచి 79 మంది ప్రభుత్వ ఉద్యోగాలు (Govt Jobs) చేస్తున్నారు. ఇందులో 38 మంది ఆర్మీలో, 10 మంది కానిస్టేబుళ్లు, 15 మంది ఉపాధ్యాయులు, ఆరుగురు టీఎస్ఎస్పీ, ఇద్దరు నేవీ, ముగ్గురు ఎయిర్ ఫోర్సు, ఐదుగురు గన్మన్లు, ఇద్దరు ఎస్పీఎఫ్ (SPF) విభాగాల్లో పనిచేస్తున్నారు.తొలిసారిగా ఎయిర్‌ఫోర్స్‌లో..కంబాలపల్లి గ్రామం నుంచి ఎంపికైన మొట్టమొదటి ఎయిర్‌ఫోర్స్ (Air Force) ఉద్యోగిగా నూకల నరేందర్ రెడ్డి పేరుపొందారు. ఎయిర్‌ఫోర్స్ విమాన కమాండర్ (ఆర్మీలో బ్రిగేడియర్ హోదా)గా 36 ఏళ్లపాటు పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు. ప్రస్తుతం నరేందర్ రెడ్డి హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయంలో హెలికాప్టర్ పైలట్ విధులు నిర్వర్తిస్తున్నారు. తమ గ్రామం నుంచి దేశ రక్షణ, ఇతర విభాగాల్లో యువకులు పనిచేస్తూ ఆదర్శంగా నిలవడం హర్షణీయమని ఆయన పేర్కొన్నారు. – నూకల నరేందర్‌రెడ్డి, మొట్టమొదటి ఎయిర్‌ఫోర్స్ ఉద్యోగిగ్రేడ్ హవల్దార్‌గా విధులు..గ్రామానికి చెందిన కొలిశెట్టి సుధాకర్ ఆర్మీలో పనిచేస్తున్నారు. ప్రస్తుతం గ్రేడ్ హవల్దార్ హోదాలో కొనసాగుతున్నారు. దేశ సేవ చేయాలనే లక్ష్యంతో 2001లో మొదటి ప్రయత్నంలోనే ఆర్మీలో సిపాయిగా ఉద్యోగంలో చేరారు. తర్వాత లాంచ్ నాయక్, నాయక్, హవల్దార్ హోదాల అనంతరం ప్రస్తుతం గ్రేడ్ హవల్దార్‌గా పనిచేస్తున్నారు. – కొలిశెట్టి సుధాకర్, ఆర్మీ గ్రేడ్ హవల్దార్ 22 ఏళ్లుగా ఆర్మీలో .. గ్రామానికి చెందిన సంద భాస్కర్ 22 ఏళ్ల క్రితం ఆర్మీలో చేరి విధులు నిర్వర్తిస్తున్నారు. గ్రామానికి చెందిన మల్లికంటి కృష్ణయ్య ఆర్మీలో చేరిన మొ దటి వ్యక్తి కాగా.. భాస్కర్ రెండోవారు. ఆర్మీలో జూనియర్ కమాండెంట్ ఆఫీసర్‌గా కొనసాగుతున్నారు. – సంద భాస్కర్, జూనియర్ కమాండెంట్ ఆఫీసర్తండ్రిని ఆదర్శంగా తీసుకొని.. గ్రామానికి చెందిన మల్లికంటి కృష్ణయ్య, సైదమ్మ దంపతుల చిన్న కుమారుడు అవినాశ్ తన తండ్రిని ఆదర్శంగా తీసుకుని ఆర్మీలో చేరాడు. ఆయన ప్రస్తుతం జమ్మూలో ఆర్టిలరీ విభాగంలో ఉద్యోగం చేస్తున్నారు.– మల్లికంటి అవినాశ్, ఆర్మీ ఆర్టిలరీ ఉద్యోగిప్రభుత్వ ఉపాధ్యాయునిగా..గ్రామానికి చెందిన మల్లికంటి రమేశ్ ఆర్మీలో 16 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసి ఉద్యోగ విరమణ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన డీఎస్సీ రాసి ఉపాధ్యాయ ఉద్యోగం సాధించాడు. ప్రస్తుతం గంగారం మండలంలో స్కూల్ అసిస్టెంట్‌గా కొనసాగుతున్నారు. – మల్లికంటి రమేశ్, ప్రభుత్వ ఉపాధ్యాయుడుచదవండి: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం రేవంత్‌రెడ్డి -
ఆలయ నిర్వహణ అధ్వానం!
కాళేశ్వరం: కాళేశ్వరంలో సరస్వతీనది పుష్కరాల సందర్భంగా శ్రీకాళేశ్వరముక్తీశ్వరస్వామి ఆలయంలో నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. గురువారం అట్టహాసంగా ప్రారంభమైన పుష్కరాలకు తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు తెల్లవారుజాము వరకు తరలొచ్చారు. కాగా, నదిలో స్నానాలు చేసిన భక్తులు నేరుగా శ్రీకాళేశ్వరముక్తీశ్వరస్వామి ఆలయంలో దేవస్థానం, పోలీసు అధికారులతో ఇబ్బందులు పడ్డారు. పోలీసులు, దేవస్థానం అధికారుల కుటుంబాలు, బంధువులు, స్నేహితుల కోసం దర్శనాలకు వీఐపీ దర్శనాలు చేయించడానికి తీసుకెళ్తున్నారని గుర్తుతెలియని ఎండోమెంట్‌శాఖ అధికారులు ప్రధాన మండపానికి వెళ్లే గ్రిల్‌కు తాళం వేసి దాచిపెట్టారు. దీంతో పోలీసుల, ఇతర అధికారుల కుటుంబాలు రావడంతో దేవస్థాన ఉద్యోగులు తాళం వేసి దొరకడం లేదని తెలుపడంతో ఇబ్బందులు పడ్డారు. దాదాపు రెండున్నర గంటల అనంతరం తాళం చెవి దొరకడంతో సామాన్య భక్తుల దర్శనానికి ఎక్కువ సమయం తీసుకున్నారు. దీంతో అసహానానికి గురయ్యారు.దేవాదాయశాఖ అధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరించారని భక్తులు ఆరోపించారు. మిగతా 11రోజులు ఇబ్బందులు లేకుండా చూడాలని పలువురు భక్తులు కోరుతున్నారు. -
బస్టాండ్ బహుదూరం..
కాటారం : సరస్వతీనది పుష్కరాల్లో భాగంగా కాళేశ్వరం ఏర్పాటు చేసిన ఆర్టీసీ తాత్కాలిక బస్టాండ్ ప్రధాన ఆలయం, సరస్వతీ(వీఐపీ) ఘాట్, మెయిన్ ఘాట్‌కు చాలా దూరంలో ఉండడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాహనాలు, భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయానికి దగ్గరలోని ఆర్టీసీ బస్టాండ్‌కు అధికారులు బస్సుల రాకపోకలు నిలిపివేశారు. దీంతో తాత్కాలిక బస్టాండ్ నుంచి బస్సులు నడుపుతుండడంతో భక్తులు అక్కడే దిగి అక్కడే ఎక్కాల్సి వస్తోంది. పుష్కర స్నానానికి వెళ్లడానికి ప్రైవేట్ వాహనాల్లో, ఉచిత బస్సుల్లో వెళ్తున్నా తిరుగు ప్రయాణంలో మాత్రం ఆలయం నుంచి తాత్కాలిక బస్టాండ్ వరకు నడుచుకుంటూ రావాల్సి వస్తోంది. -
పుష్కర భక్తులకు రోజూ అన్నదానం
వరంగల్ చౌరస్తా : కాళేశ్వరంలో ఈనెల 15 నుంచి 26వ తేదీ వరకు జరుగనున్న సరస్వతీనది పుష్కరాల సందర్భంగా భక్తులకు రోజూ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు వాసవి ఆర్యవైశ్య నిత్యాన్నసత్రం ఉపాధ్యక్షుడు గట్టు మహేశ్ బాబు తెలిపారు. గురువారం వరంగల్ రామన్నపేట ఆర్యవైశ్య సత్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 12 రోజులపాటు కొనసాగే పుష్కరాలకు లక్షలాది మంది ఆర్యవైశ్యులు హాజరై పుష్కర స్నానం చేసి స్వామివారి సేవలో తరిస్తారన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి కుటుంబ సభ్యులతో హాజరయ్యే ఆర్యవైశ్యుల కోసం ఈ కార్యక్రమం చేపట్టినట్లు పేర్కొన్నారు. సమావేశంలో సత్రం అధ్యక్షుడు సోమ రామయ్య, ఉపాధ్యక్షుడు గోరంటల యాదగిరి, ప్రతినిధులు యిరుకుళ్ల రమేశ్, ఐతా గోపినాథ్, గుముడవెల్లి సురేశ్ తదితరులు పాల్గొన్నారు. -
ముహూర్తం ప్రకారం 5.44 గంటలకు..
జయశంకర్భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో సరస్వతినది పుష్కరాలను వేదపండితులు శాస్త్రోకంగా గణపతిపూజతో ప్రారంభించారు. గురువారం తెల్లవారుజామున 5.44గంటలకు కాళేశ్వరంలోని సరస్వతిఘాటుకు చేరుకొని ముహూర్తం ప్రకారం గోదావరి, ప్రాణహిత, అంతర్వాహిని సరస్వతి నదికి విశేష పూజలు నిర్వహించారు. మెదక్ జిల్లా రంగంపేటకు చెందిన పీఠాధిపతి మాధవానందసరస్వతిస్వామి ముందుగా పుష్కరునికి ఆహ్వాన పూజ చేశారు. పండితులు సరస్వతిమాతకు పూలు, పండ్లు, పాలు, చీరసారెతో నైవేద్యం సమర్పించారు. మాధవా నందసరస్వతిస్వామి పుష్కరినిలో స్నానం ఆచరించి ప్రారంభించారు. అదేవిధంగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఆయన సతీమణి, దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, దేవాదాయ కమిషనర్ వెంకట్రావు, కలెక్టర్ రాహుల్‌శర్మ, ఆర్జేసీ రామకృష్ణారావు, ఈఓ మహేశ పుష్కర ప్రారంభ స్నానాలు ఆచరించారు. అనంతరం వేదపండితులు ఐదు కలశాలలో గోదావరి జలాలను తీసుకుచ్చి శ్రీకాళేశ్వరముక్తీశ్వరస్వామికి అభిషేక పూజలు చేశారు. -
సీఎంను కలిసిన ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి
పాలకుర్తి టౌన్: పాలకుర్తి నియోజకవర్గ అభివృద్ధికి రూ.50 కోట్లు కేటాయించాలని సీఎం రేవంత్‌రెడ్డిని ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జ్ ఝాన్సీరెడ్డి కోరారు. ఈ మేరకు గురువారం హైదరాబాద్‌లోని నివాసంలో సీఎంను కలిసిన వినతిపత్రం అందజేశారు. నిధుల మంజూరుపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి తెలిపారు. తహసీల్దార్ల బదిలీ మహబూబాబాద్: జిల్లాలో పలువురు తహసీల్దార్లను బదిలీ చేస్తూ చీఫ్ కమిషనర్ నవీన్‌మిట్టల్ గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. మహబూబాబాద్ తహసీల్దార్ భగవాన్‌రెడ్డిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు బదిలీ చేశారు. తహసీల్దార్లు సైదులు, శ్వేత, నారాయణమూర్తిని ఖమ్మం జిల్లాకు, తహసీల్దార్ రమాదేవిని ములుగు జిల్లాకు బదిలీ చేశారు. భద్రాద్రికొత్తగూడెం, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లో పనిచేస్తున్న తహసీల్దార్లు సీహెచ్.నరేశ్, వివేక్, ఇమ్మానీయల్, నాగభవాని, పూర్ణచందర్, రమేశ్‌బాబును మహబూబా బాద్‌కు జిల్లాకు బదిలీ చేశారు. కాగా కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్ బదిలీపై వచ్చిన తహసీల్దార్లకు మండలాలు కేటాయించనున్నారు. నేరప్రవృత్తిని విడనాడాలి తొర్రూరు: రౌడీ షీటర్లు నేరప్రవృత్తిని విడనాడాలని తొర్రూరు డీఎస్పీ కృష్ణకిషోర్ అ న్నారు. స్థానిక పోలీస్ స్టేషన్లో గురువారం రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఆ యన మాట్లాడుతూ.. రౌడీషీటర్ల ప్రవర్తనలో మార్పు కనిపిస్తే రౌడీషీట్ తొలగిస్తామన్నారు. స్థానిక ఎన్నికల్లో అల్లర్లు సృష్టిస్తే చర్యలు తప్పవన్నారు. సీఐ గణేశ్, ఎస్సైలు ఉపేందర్, రమేష్‌బాబు, రాజు, సురేశ్ పాల్గొన్నారు. -
దరఖాస్తులు పరిష్కరించాలి
దంతాలపల్లి: భూభారతి రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను తప్పులు లేకుండా పరిష్కరించాలని కలెక్టర్ అద్వైత్ కుమార్‌సింగ్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో రైతుల దరఖాస్తులను పరిశీలించారు. అనంతరం రెవెన్యూ అధికారులతో మాట్లాడుతూ.. భూముల విషయంలో రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, దరఖాస్తుదారుల ఆధారాలను పరిశీలించి న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. రైతుల సమస్యలను పూర్తిస్థాయిలో అవగాహన చేసుకొని, సమస్యలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. క్షేత్రస్థాయిలో భూములను పరిశీలించి హద్దులు ఏర్పాటు చేసి రైతులకు న్యాయం చేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ వీరబ్రహ్మచారి, తహసీల్దార్ సునీల్‌కుమార్, నాగరాజు, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కొనుగోళ్లలో వేగం పెంచాలి నర్సింహులపేట: ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలని కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్ అన్నారు. గురువారం మండలంలోని వంతడపల స్టేజీ వద్ద ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా, వేగంగా చేపట్టాలన్నారు. అకాల వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అదనపు కలెక్టర్ వీరబ్రహ్మచారి, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్ -
కాళేశ్వరం శాశ్వత అభివృద్ధికి తోడ్పాటు : సీఎం రేవంత్‌రెడ్డి
మంత్రి శ్రీధర్‌బాబు కోరినట్లుగా కాళేశ్వరం శాశ్వత అభివృద్ధికి తోడ్పాటును అందిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. మాస్టర్ ప్లాన్ తయారు చేసి నివేదించాలని మంత్రి కొండా సురేఖ, ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్‌ను సీఎం కోరారు. పుష్కర ఏర్పాట్లపై సీఎం సంతృప్తి వ్యక్తం చేసి మంత్రి శ్రీధర్‌బాబును, అధికారులను అభినందించారు. మంత్రులు ఏమన్నారంటే.. ● మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ రాబోయే గోదావరి పుష్కరాల్లోగా కాళేశ్వర అభివృద్ధికి రూ.100 కోట్ల నిధుల మంజూరుతోపాటు పర్యాటక క్షేత్రంగా ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డిని కోరారు. ఇప్పటికే రూ.35కోట్లు మంజూరు చేశారని సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ● దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ రాష్ట్రంలోని దేవాలయాల అభివృద్ధికి సీఎం ఎంతగానో కృషి చేస్తున్నారని చెప్పుకొచ్చారు. రానున్న గోదావరి, కృష్ణ ఫు ష్కరాలతో పాటు సమ్మక్క–సారలమ్మ జాతరను విజయవంతం చేస్తామని అన్నారు. ● రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీని వాస్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఆర్థిక లోటుపాట్లతో ఉన్నప్పటికి పుష్కర ఏర్పాట్లు ఘనంగా చేశామన్నారు. ● రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ పన్నెండేళ్లకు ఓసారి వచ్చే సరస్వతిమాత పుష్కర స్నానాలను భక్తులు ఆచరించాలని సూచించారు. – మరిన్ని పుష్కర వార్తలు, ఫొటోలు 8లోu -
విద్యుత్ సమస్యలు పరిష్కరిస్తాం
కురవి: మండలంలోని బలపాల గ్రామంలో నెలకొన్న విద్యుత్ సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని మహబూబాబాద్ విద్యుత్ శాఖ డీఈ విజయ్ అన్నారు. గురువారం బలపాల గ్రామంలోని ప్రాథమిక పాఠశాల, బంచరాయి, ఎస్సీ కాలనీలను సందర్శించి అక్కడి విద్యుత్ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. బంచరాయిలో విద్యుత్ వైర్లు అపహరణకు గురికాగా పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గ్రామంలో మిడిల్ పోల్స్, కొత్త ట్రాన్స్ఫార్మర్, పాఠశాలలో విద్యుత్ స్తంభం ఏర్పాటు చేస్తామని తెలిపారు. విద్యుత్ వైర్లు చోరీ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంబేడ్కర్ కమ్యూనిటీ హాల్ వరకు స్తంభాలు ఏర్పాటు, రోడ్డు మధ్యలో ఉన్న స్తంభాలను తొలగిస్తామని తెలిపారు. ఏఈఈ శారద, లైన్‌మన్ కపిల్, గణేశ్, ఉప్పయ్య, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు రజనీకాంత్, పాఠశాల హెచ్ఎం సునీత, ప్రసాద్, మదన్, మోహన్, వెంకటేశ్వర్లు, నరేశ్,మంగయ్య, రాంకోటి, ఈదయ్య, రమేశ్, వీరభద్రం, వెంకటేశ్, శ్రీను, ఆనందం పాల్గొన్నారు. -
సాగు ప్రణాళిక ఖరారు
మహబూబాబాద్ రూరల్ : జిల్లాలో వానాకాలం పంటల సాగు ప్రణాళికను జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు సిద్ధం చేశారు. జిల్లా వ్యాప్తంగా 4,22,641 ఎకరాల్లో రైతులు పంటలు సాగు చేస్తారని అంచనా వేశారు. ఈమేరకు అధికారులు ఎరువులు, విత్తనాలను అందుబాటులో ఉంచనున్నారు. ఇదిలా ఉండగా రైతులు వేసవి దుక్కులను దున్నుతున్నారు. అదనపు చర్యలు.. జిల్లా వ్యవసాయ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసేందుకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాలు విత్తనాలు, ఎరువుల సరఫరా, రైతులకు సాంకేతిక సహాయం అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. కాగా జిల్లాకు 11వేల క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలను కేటాయించగా.. పంపిణీ ప్రక్రియ ప్రారంభమైంది. రైతులు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (పీఏసీఎస్), వ్యవసాయ పరిశోధన కేంద్రాల వద్ద 50శాతం సబ్సిడీపై ఈ విత్తనాలను పొందవచ్చు. దుక్కులు పొతం.. జిల్లాలో మెట్టప్రాంతాల్లో పత్తి, మిర్చి, మొక్కజొన్న అధికంగా పండిస్తారు. అలాగే కంది, బొబ్బెర, నువ్వులు, పెసర, మినుములు, వేరుశనగ, పసుపు పంటలు కూడా సాగు చేస్తారు. ఈమేరకు ప్రస్తుతం రైతులు వేసవి దుక్కులు దున్ని పంట వేయడానికి సిద్ధం చేసుకుంటున్నారు. ఎరువుల అవసరం (మెట్రిక్ టన్నుల్లో) యూరియా : 54,198.975డీఏపీ : 10,526.993ఎంఓపీ : 5,119.540ఎస్ఎస్పీ : 1,390.493కాంప్లెక్స్ : 34,762.331నేడు ఐడీఓసీలో సమావేశం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గురువారం వానాకాలం సాగు సన్నద్ధతపై సమావేశం నిర్వహిస్తున్నారు. జిల్లాలోని అన్ని రకాల విత్తన వ్యాపారులు హాజరుకావాలి. ఈ సమావేశంలో విత్తనాల సరఫరా, నాణ్యత, రైతులకు సకాలంలో అధికారుల అందుబాటు తదితర అంశాలపై చర్చిస్తారు. – విజయనిర్మల, డీఏఓ పంటల సాగు వివరాలు(ఎకరాల్లో) వానాకాలంలో 4,22,641 ఎకరాల్లో పంటలు సాగు చేస్తారని అంచనా ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచేలా చర్యలు వేసవి దుక్కులు దున్నుతున్న రైతులు కావాల్సిన విత్తనాలు వరి : 44,256 క్వింటాళ్లు పత్తి : 1,69,708 (ప్రతీ ప్యాకెట్ 475 గ్రాములు) మొక్కజొన్న : 4,669 క్వింటాళ్లు మిరప : 522.49 క్వింటాళ్లు కంది : 30 క్వింటాళ్లు పెసర : 182.2 క్వింటాళ్లు మినుములు : 40 కిలోలు వేరుశనగ : 21 క్వింటాళ్లు పసుపు : 2,315 క్వింటాళ్లు నువ్వులు : 1.04 క్వింటాళ్లు -
సరస్వతీనది పుష్కరాలకు వేళాయె..
సరస్వతి ఘాట్ వద్ద ఏర్పాటుచేసిన విద్యుత్ వెలుగులు, వేదిక – వివరాలు 8లోuజయశంకర్భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలోని గోదావరి, ప్రాణహిత, అంతర్వాహిణి సరస్వతీనది పుష్కరాలు నేటినుంచి (గురువారం) ప్రారంభంకానున్నాయి. 12 రోజుల పాటు నిర్వహించడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. గురువారం ఉదయం 5.44 గంటలకు వేదపండితులు ముహూర్తం ఖరారు చేశారు. నదికి విశేష పూజాకార్యక్రమాలతో వేదపండితులు పుష్కరుడిని ఆహ్వానిస్తారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దంపతులు సరస్వతి ఘాట్‌లో పుణ్య స్నానం ఆచరించనున్నారు. సీఎంతో పాటు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పాల్గొననున్నారు. – కాళేశ్వరం ● నేటినుంచి 26వ తేదీ వరకు నిర్వహణ ● సరస్వతిఘాట్‌లో పుణ్య స్నానం ఆచరించనున్న సీఎం రేవంత్‌రెడ్డి దంపతులు ● లక్షలాదిగా తరలిరానున్న భక్తజనం -
అభ్యసన సామర్థ్యాలు పెంపొందించుకోవాలి
● కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్ మహబూబాబాద్ అర్బన్: ఉపాధ్యాయులు శిక్షణలో అభ్యసన సామర్థ్యాలు పెంపొందించుకోవాలని కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్ అన్నారు. ఉపాధ్యాయుల శిక్షణ శిబిరాన్ని బుధవారం సందర్శించి మాట్లాడారు. శిక్షణ ద్వారా మెళకువలు నేర్చుకుని విద్యార్థులకు ఉత్తమ బోధన చేపట్టాలన్నారు. ఏజెన్సీ ప్రాంతాల విద్యార్థులపై ఉపాధ్యాయులు ఎక్కువ శ్రద్ధ వహించాలన్నారు. విద్యార్థులు పాఠశాలలకు సరి గా హాజరుకాకపోవడంతో గణితం, తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో నైపుణ్యత సాధించలేకపోతున్నారని అన్నారు. అన్ని సబ్జెక్టులపై విద్యార్థులు మక్కువ చూపేలా చర్యలు తీసుకోవాలన్నారు. తరగతి గదుల్లో చదవడం, రాయడం పెంపొందించాలన్నారు. ఆర్జేడీ సత్యనారాయణ, డీఈఓ రవీందర్‌రెడ్డి, ఏసీ జీఈ శ్రీరాములు, జిల్లా సైన్స్ అధికారి అప్పారావు, చంద్రశేఖర్ఆజాద్ తదితరులు పాల్గొన్నారు. -
జిల్లా పాఠ్యపుస్తకాల గోదాం సందర్శన
కేసముద్రం: మున్సిపాలిటీ పరిధిలోని కేసముద్రంవిలేజ్ జెడ్పీ హైస్కూల్లోని జిల్లా పాఠ్యపుస్తకాల గోదాంను ఆర్జేడీ సత్యనారాయణరెడ్డి బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ మేరకు ఇప్పటి వరకు వచ్చిన పుస్తకాలను ఆయన పరిశీలించారు. జిల్లా పాఠ్యపుస్తకాల మేనేజర్ చీకటి వెంకట్రాంనర్సయ్యకు పలు అంశాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆయన వివరించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. ఈనెల 20నుంచి జిల్లాలోని వివిధ మండలాలకు పుస్తకాలు పంపిణీ జరుగుతుందన్నారు. ఇప్పటి వరకు జిల్లాకు 2,21,880 పాఠ్యపుస్తకాలు వచ్చాయన్నారు. కార్యక్రమంలో బుక్స్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ సిబ్బంది పాల్గొన్నారు.పుష్కరాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులునెహ్రూసెంటర్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో ఈ నెల 15 నుంచి 26వరకు జరగనున్న సరస్వతీ పుష్కరాలకు మహబూబాబాద్ నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు డిపో మేనేజర్ ఎం.శివప్రసాద్ బుధవారం తెలిపారు. మహబూబాబాద్ నుంచి కాళేశ్వరానికి పెద్దలకు రూ. 400, పిల్లలకు రూ. 210గా బస్సు చార్జీలు నిర్ణయించినట్లు తెలిపారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణించి పవిత్ర నదిలో పుణ్యస్నానాలు ఆచరించాలని ఆయన కోరారు. ప్రయాణికులు, ప్రజలు ఈ అవకాశాలన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ప్యాసింజర్ రైళ్లను పునరుద్ధరించాలిడోర్నకల్: డోర్నకల్ రైల్వే జంక్షన్ మీదుగా రద్దయిన ప్యాసింజర్ రైళ్లను పునరుద్ధరించాలని డీఆర్‌యూసీసీ సభ్యుడు లక్ష్మణ్‌నాయక్ కోరారు. సికింద్రాబాద్ రైలు నిలయంలో బుధవారం దక్షిణ మధ్యరైల్వే డివిజనల్ మేనేజర్ అరుణ్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా లక్ష్మణ్‌నాయక్ మాట్లాడుతూ.. డోర్నకల్ మీదుగా నడిచే ప్యాసింజర్ రైళ్లను పునరుద్ధరించాలని, ముఖ్యంగా కాజీపేట–విజయవాడ(337–338) ప్యాసింజర్ రైలును వెంటనే పునరుద్ధరించాలని కోరారు.కురవిలో చెక్ పోస్టు ఏర్పాటుకురవి: మండల కేంద్రంలోని జాతీయ రహదారి–365పై పెట్రోల్ బంక్ వద్ద కురవి పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టును బుధవారం రాత్రి మహబూబాబాద్ రూరల్ సీఐ సర్వయ్య ప్రారంభించారు. జూన్ 6న బక్రీద్ పండుగ సందర్భంగా అక్రమంగా పశువుల రవాణా జరగకుండా ఉండేందుకు చెక్ పోస్ట్‌ను ఏర్పాటు చేసినట్లు సీఐ సర్వయ్య తెలిపారు. కార్యక్రమంలో ఎస్సై గండ్రాతి సతీశ్, పీఎస్సై కృష్ణారెడ్డి, ఏఎస్సై వెంకన్న, సిబ్బంది జానిమియా, కాశీరాం, హరిబాబు పాల్గొన్నారు. -
కాకతీయుల గడ్డపై మెరిసిన ప్రపంచ సుందరీమణులు
రవిని తలపించే మోము.. తారల వెలుగులు నిండిన కనులు.. నుదుటిపై బొట్టు.. తలనిండా మల్లె, కనకాంబర పూలు, నెలవంక కట్టగా నెమలంచు చీర.. కన్నెపిల్లలు చుట్టగా కలువ రేకుల చీర.. ఆరు మూరల చీర కట్టిన అరిందలు.. ఓరుగల్లులో విహరించారు. ఫ్యాన్సీ దుస్తులు వదిలేసి పదహారణాల తెలుగమ్మాయిల్లా మారి ప్రతి ఒక్కరినీ మంత్రముగ్ధ్ధులను చేశారు. రెడ్‌కార్పెట్‌పై హొయలొలుకుతూ చిరునవ్వులతో తమ అందాలను ఆరబోశారు. ● తెలుగింటి ఆడపడుచుల్లా ముస్తాబు ● ఫ్యాన్సీ డ్రెస్‌లు వదిలి అంచుల చీరలు, పట్టుపరికిణీలు కట్టిన భామలు ● హైదరాబాద్ నుంచి నేరుగా హరిత కాకతీయకు.. ● వేయిస్తంభాలు, రామప్ప ఆలయంలో సంప్రదాయబద్ధంగా పూజలు ● అందరికీ అభివాదం చేస్తూ ఆకట్టుకున్న ముద్దుగుమ్మలు ● సుందరీమణులకు ప్రత్యేక బహుమతుల అందజేతసాక్షిప్రతినిధి, వరంగల్/సాక్షి, వరంగల్/హన్మకొండ చౌరస్తా/వెంకటాపురం(ఎం) : మిస్ వరల్డ్–2025 పోటీదారులు బుధవారం వరంగల్ నగరంలో సందడి చేశారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సుల ద్వారా హనుమకొండకు చేరుకున్న వారు హరిత కాకతీయలో దిగారు. హోటల్ వద్ద వారికి హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు ప్రావీణ్య, డాక్టర్ సత్య శారద, సీపీ సన్‌ప్రీత్ సింగ్, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, నగర మేయర్ గుండు సుధారాణి, మున్సిపల్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, ఇతర అధికారులు స్వాగతం పలికారు. హోటల్లో సుమారు గంటకుపైగా గడిపిన వారు వేయిస్తంభాల ఆలయానికి వెళ్లే ముందు చీర కట్టుకొని తిలకం దిద్దుకొని అచ్చం తెలుగు అమ్మాయిల్లా తయారయ్యారు. సుందరీమణుల రాకతో చారిత్రక ఆలయ ప్రాంగణం మెరిసిపోయింది. ముందుగా తూర్పు ద్వారం వద్ద గల ఆలయ విశిష్టత, చారిత్రక నేపథ్యాన్ని వివరించే ఏకశిలాశాసనాన్ని టూరిజం గైడ్ సూర్యకిరణ్ క్లుప్తంగా వివరించారు. చారిత్రక ఆలయాన్ని చూసి మురిసిపోయారు.నందీశ్వరుడి ముందు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కుర్చీల్లో పాదాలను శుభ్రం చేసుకున్నారు. నందీశ్వరుడి వద్ద ఫొటోలు దిగిన సుందరీమణులకు కల్యాణమంటపం విశిష్టతను గైడ్ వివరించారు. మంటపం వద్ద మరోసారి ఫొటోషూట్‌తో సందడి చేసి, ఆలయం చుట్టూ ప్ర దక్షిణలు చేశారు. ప్రధాన అర్చకుడు గంగు ఉపేంద్రశర్మ సుందరీమణులకు సన్నాయి మేళాలు, పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. గర్భగుడిలో రుద్రేశ్వరుడికి అభిషేకం చేసిన అనంతరం పట్టువస్త్రాలు, ప్రసాదాలు అందజేసి ఆశీర్వచనాలు ఇచ్చారు. అనంతరం ఖిలావరంగల్‌కు బయలుదేరి వెళ్లారు. కోట చారిత్రక అందాలకు ఫిదా విశ్వసుందరి పోటీదారులు ఖిలావరంగల్ కోటకు రాత్రి 7.20గంటలకు చేరుకొని కాకతీయ కళా వైభవాన్ని తెలుసుకొని మంత్రముగ్ధులయ్యారు. కోటలో ఏర్పాటు చేసిన ఫ్లియా మార్కెట్‌ను సందర్శించి చేనేత కలంకారి దర్రీస్, జీఐ ట్యాగ్ పొందిన చపాట మిర్చి, పసుపు, హ్యాండ్ బ్యాగులు, బంగారు వర్ణంలో మెరిసిన హ్యాండ్ క్రాఫ్ట్ ప్రత్యేకతల గురించి అధికారులు వివరించడంతో ఆసక్తిగా విన్నారు. కాకతీయుల నాలుగు కీర్తితోరణాల నడు మ నళ్ల రాతిలోని శిల్ప కళ సంపదను అందాల భా మలు మరింత ఆసక్తిగా తిలకించారు. కాకతీయుల చరిత్ర, విశిష్టతను పర్యాటక శాఖ అధికారులు వివరించారు. టీజీ టీడీసీ ఆధ్వర్యంలో 45 నిమిషాల నిడివిగల సౌండ్ అండ్ లైటింగ్ షోను ఇంగ్లిష్‌లో ప్రదర్శించగా... ఆసక్తిగా వీక్షించారు. అంతకుముందు కాకతీయుల తోరణం ఎదుట గ్రూపు ఫొటో దిగారు. అనంతరం శిల్పాల ప్రాంగణంలో పేరిణి నృత్య కళాకారుడు గంజల రంజిత్ శిష్య బృందం ప్రదర్శించిన శివతాండవం ఆకట్టుకుంది. చివరగా సుందరీమణులకు చేనేత కలంకారి దర్రీస్, చపాట మిర్చి, పాకాల, కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ద్వారా రూపొందించిన సావనీర్‌తో కూడిన బహుమతులు అందించారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రి కొండా సురేఖ, వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, మేయర్ గుండు సుధారాణి, జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు హుస్సేన్ నాయక్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. రామప్ప అందాలు వీక్షించి.. రామప్ప సరస్సుకట్టపై ఉన్న హరితహోటల్ వద్దకు సాయంత్రం 4:30 గంటలకు చేరుకున్న మిస్‌వరల్డ్ పోటీదారులు సంప్రదాయ దుస్తులు ధరించారు. 5:50గంటలకు రామప్ప ప్రధాన గేట్ వద్దకు చేరుకున్న వారికి కొమ్ముకోయ నృత్యంతో కళాకారులు స్వాగతం పలికారు. కలెక్టర్ దివాకర టీఎస్‌తో పాటు అధికార యంత్రాంగం వారికి పుష్పగుచ్ఛాలు అందించారు. ఆలయానికి చేరుకున్న తరువాత రెండు బృందాలుగా విడిపోయారు. 18 మంది, 15 మంది వేర్వేరుగా రామలింగేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆలయ విశిష్టతను ప్రొఫెసర్ పాండురంగారావుతో పాటు టూరిజం గైడ్లు విజయ్‌కుమార్, వెంకటేష్ వారికి వివరించగా శిల్పకళ సంపదను తమ సెల్ఫోన్లో బంధించుకున్నారు. ముఖ్య అతి థిగా వచ్చిన మంత్రి ధనసరి సీతక్కతో కలిసి ఆల య ఆవరణలో గ్రూప్ ఫొటో దిగారు. అనంతరం గార్డెన్లో పేరిణి నృత్యం, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించగా ఆసక్తిగా తిలకించారు. -
కాంగ్రెస్‌లో కమిటీల సందడి
సాక్షి, మహబూబాబాద్: కాంగ్రెస్ పార్టీలో కమిటీల సందడి మొదలైంది. గత అనుభవాల నేపథ్యంలో కొత్త టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించగా.. ఇందుకోసం జిల్లాకు ని యమించిన పరిశీలకులు పొట్ల నాగేశ్వర్రావు, రవళిరెడ్డి వారం రోజులుగా జిల్లాలో పర్యటించి కమి టీల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు. వారం రోజులుగా.. జిల్లాలోని గ్రామ స్థాయి నుంచి బ్లాక్ స్థాయివరకు కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం నూతన కమిటీల ఏర్పాటు ప్రక్రియ వారం రోజులుగా సాగుతోంది. జిల్లా పరిశీలకులు పొట్ల నాగేశ్వర్రావు, రవళిరెడ్డి జిల్లాలోని అన్ని మండలాల్లో పర్యటించి ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఇలా ఇప్పటి వరకు ములుగు నియోజకవర్గంలోని కొత్తగూడ, గంగారం మండలాలు, ఇల్లెందు నియోజకవర్గంలోని గార్ల, బయ్యారం మండలాలు మినహా 14 మండలాలు, ఐదు మున్సిపాలిటీల పరిధిలో కమిటీల నియామకం కోసం దరఖాస్తులు తీసుకుంటున్నారు. ఇలా ఆయా మండలాల్లో గ్రామ, మండల అధ్యక్షులు, మరిపెడ, డోర్నకల్, మహబూబాబాద్, నెల్లికుదురు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుల కోసం పోటాపోటీగా దరఖాస్తులు చేసుకున్నారు. గాడ్ ఫాదర్స్‌ను నమ్ముకొని.. పదవులకోసం దరఖాస్తు చేసుకున్న నాయకులు ఎవరికి వారుగా తమకే పదవి వస్తుందని చెబుతున్నారు. ప్రధానంగా జిల్లాలోని డోర్నకల్, మహబూబాబాద్, పాలకుర్తి, ములుగు, ఇల్లెందు నియోజకవర్గాల ఎమ్మెల్యేల అనుచరులు, అదే విధంగా ఎంపీ పోరిక బలరాంనాయక్, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి అనుచరులు కూడా పదవులకోసం పోటీ పడుతున్న వారిలో ఉన్నారు. ఇలా దరఖాస్తు చేసుకున్న వారు మేం కేవలం దరఖాస్తు చేసే వరకే.. అంతా మా నాయకులు చూసుకుంటారనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. గత అనుభవాల దృష్ట్యా.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వేసిన ఇందిరమ్మ కమిటీల ఏర్పాటు పలు మండలాల్లో రసాభాసగా మారింది. నెల్లికుదురు మండలంలో ఎమ్మెల్యే వర్గం, ఎంపీ వర్గాలుగా విడిపోయి విమర్శలు చేసుకున్నారు. మరికొన్ని మండలాల్లో పాత కార్యకర్తలను కాకుండా ఎన్నికల తర్వాత పార్టీలోకి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారనే ఫిర్యాదులు పీసీసీ వరకు వెళ్లాయి. ఈ అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈ సారి పకడ్బందీగా నియామక ప్రక్రియ ఉంటుందని జిల్లాకు వచ్చిన పరిశీలకులు చెబుతున్నారు. వచ్చిన దరఖాస్తులు పరిశీలించి గ్రామ స్థాయి నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకుంటామని, పీసీసీ అధ్యక్షుడు, జిల్లా ఇన్చార్జ్ మంత్రి సమక్షంలో నియామకం ఉంటుందని అంటున్నారు. అయితే పరిశీలకులు చెప్పిన విధంగా పార్టీకోసం కష్టపడిన వారికి పట్టం కడుతారా.. పైరవీలతో వచ్చిన నాయకులకు పట్టం కడుతారా అనేది జిల్లా కాంగ్రెస్ వర్గాల్లో చర్చగా మారింది. గ్రామ, మండల, బ్లాక్ అధ్యక్షుల ఎంపికకు కసరత్తు 14 మండలాలు, ఐదు పట్టణాల్లో దరఖాస్తుల స్వీకరణ పోటీ పడి దరఖాస్తు చేసిన ఆశావహులు -
సీఎం పర్యటనకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు
కాళేశ్వరం : సరస్వతీనది పుష్కరాల్లో పాల్గొనేందుకు గురువారం సీఎం రేవంత్‌రెడ్డి కాళేశ్వర పర్యటన నేపథ్యంలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరే, సీఎం భద్రతా అధికారి వాసుదేవరెడ్డి తెలిపారు. బుధవారం కాళేశ్వరంలోని ఈఓ కార్యాలయంలో సీఎం పర్యటన భద్రతా ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ సీఎం రేవంత్‌రెడ్డి హెలికాప్టర్ ద్వారా గురువా రం సాయంత్రం 5 గంటలకు కాళేశ్వరం చేరుకుంటారని తెలిపారు. సీఎం ప్రయాణించే మార్గంలో పోలీస్ బందోబస్తు, బాంబ్ స్క్వాడ్, ట్రాఫిక్ కంట్రోల్, ఆయా విభాగాల అధికారులు సమన్వయంతో పర్యవేక్షించనున్నట్లు తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్, ఆర్డీఓ రవి, ఇతర శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేక ఆకర్షణగా ఎస్‌హెచ్‌జీ హ్యాండ్లూమ్ స్టాళ్లు.. కాళేశ్వరం: సరస్వతీనది పుష్కరాల్లో మహిళా స్వయం సహాయ సంఘాల (ఎస్‌హెచ్‌జీ) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హ్యాండ్లూమ్, టెక్స్టైల్ ఉత్పత్తుల స్టాళ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయి. ఈ స్టాళ్ల పర్యవేక్షణకు డీఆర్డీఓ నరేశ్, పరిశ్రమల శాఖ జీఎం సిద్ధార్థను కలెక్టర్ రాహుల్ శర్మ ప్రత్యేకాధికారులుగా నియమించారు. టెక్స్టైల్, హ్యాండ్లూమ్ స్టాళ్లలో పట్టు చీరలు, నూలు వస్త్రాలు, డిజైన్ దుస్తులు, చేనేత వస్త్రాలతోపాటు ప్రత్యేక కలెక్షన్ వస్త్రాలు ప్రదర్శిస్తారని అధికారులు పేర్కొన్నారు. స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులు తక్కువ ధరల్లో, నేరుగా ఉత్పత్తిదారుల నుంచి వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయని, ఈ స్టాళ్ల ఏర్పాటుతో ఎస్‌హెచ్‌జీలు ఆర్థికంగా బలపడే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు. -
సరస్వతీనది పుష్కరాలకు వేళాయె..
కాళేశ్వరం : జయశంకర్భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని గోదావరి, ప్రాణహిత, అంతర్వాహిణి సరస్వతీనది పుష్కరాలు నేడు ప్రారంభ కానున్నాయి. గురువారం నుంచి 26వ తేదీ వరకు 12 రోజుల పాటు నిర్వహించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. బుధవారం రాత్రి 10.35 గంటలకు బృహస్పతి మిథునరాశిలోకి ప్రవేశిస్తాడు. కాగా, రాత్రి సమయం సందర్భంగా (నేడు) గురువారం ఉదయం 5.44 గంటలకు వేదపండితులు ముహూర్తం ఖరారు చేశారు. నదికి విశేష పూజాకార్యక్రమాలతో వేదపండితులు పుష్కరుడిని ఆహ్వానిస్తారు. ఈ పూజలో మెదక్ రంగంపేటకు చెందిన పీఠాధిపతి మాధవానందాసరస్వతి పాల్గొననున్నారు. పీఠాధిపతితో మంథని ఎమ్మెల్యే, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్, కమిషనర్ వెంకట్రావు, కలెక్టర్ రాహుల్‌శర్మ, ఎస్పీ కిరణ్‌ఖరే, దేవస్థానం అధికారులు, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొననున్నారు. పుష్కరాలకు వివిధ రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తజనం తరలిరానుందని అధికారులు అంచనా. 12 రోజుల పాటు కాళేశ్వరంలో పుష్కర శోభ నెలకొననుంది. ఉత్తరాఖండ్‌లోని మానస నది, ఆలహాబాద్‌లోని గంగా, యమున, అంతర్వాహిణి సరస్వతి, తెలంగాణలోని కాళేశ్వరంలో గోదావరి, ప్రాణహిత, అంతర్వాహిణి సరస్వతి నదులకు పుష్కరాలు జరుగుతాయి. ఏర్పాట్లు ఇలా.. సరస్వతీనది పుష్కరాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.35కోట్లు మంజూరు చేసింది. రాష్ట్ర ఐటీశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ, దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్ ప్రత్యేక దృష్టితో పనులు ముమ్మరం చేశారు. అంతర్గత సీసీ రోడ్లు, ప్రసాదశాల కౌంటర్లు, పుష్కరఘాట్ విస్తరణ, రెండు ఘాట్ల వద్ద తాత్కాలిక మరుగుదొడ్లు, శాశ్వత మరుగుదొడ్లు, కల్యాణ కట్ట, మెయిన్ ఘాట్ నుంచి సరస్వతీఘాట్కు గ్రావెల్‌రోడ్డు, గోదావరిలో మట్టిరోడ్డు, వీఐపీ ఘాట్ నుంచి పలుగుల రోడ్డు మట్టిరోడ్డు, చలువ పందిళ్లు, సరస్వతీమాత విగ్రహం, హారతి స్టేజీపై ఏడు గద్దెలు, జ్ఞానదీపం, తాత్కాలికంగా డెకరేషన్స్, టెంట్‌సిటీ, డార్మెటరీ హౌస్‌లు, ఎగ్జిబిషన్ స్టాళ్లు, జల్లు స్నానాలు, దుస్తులు మార్చుకునే గదులు ఏర్పాటు చేశారు. మిషన్‌భగీరథ ద్వారా తాగునీరు సరఫరా చేస్తున్నారు. కాళేశ్వరం కొత్త బస్టాండ్, వాసవీ సత్రం, అంతర్రాష్ట్ర వంతెన సమీపం, హరితహోటల్ సమీపం, వీఐపీఘాట్, ఇబ్బలబోరు వద్ద పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశారు. పీఠాధిపతుల విడిది కోసం త్రివేణి గెస్ట్‌హౌస్‌లో సాలహారంతో ఏర్పాటు చేశారు. ప్రతీ రోజు కాశీ పండితులతో హారతి కార్యక్రమం నిర్వహిస్తారు. ప్రతీ రోజు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.సరస్వతీమాత విగ్రహం వెనుక ఏర్పాటు చేసిన శివుడి ప్రతిమనేటి నుంచి 26వ తేదీ వరకు నిర్వహణ నేటి ఉదయం 5.44 గంటలకు ముహూర్తం ఖరారు ప్రారంభ పూజలో పాల్గొనున్న పీఠాధిపతి మాధవానందాసరస్వతి, మంత్రి శ్రీధర్‌బాబు పుష్కర స్నానాలకు సరస్వతీఘాట్, మెయిన్ ఘాట్ టెంట్‌సిటీ, హారతి స్టేజ్ ఏర్పాటు లక్షలాదిగా తరలిరానున్న భక్తజనంనేడు కాళేశ్వరానికి సీఎం రాక సాక్షి ప్రతినిధి వరంగల్/కాళేశ్వరం: కాళేశ్వరానికి రాష్ట్రముఖ్యమంత్రి ఏ.రేవంత్‌రెడ్డి దంపతులు గురువారం రానున్నారు. ఆయన హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం నుంచి సాయంత్రం 4గంటలకు బయలుదేరుతారు. 5గంటలకు కాళేశ్వరం చేరుకొని వీఐపీ ఘాటులోని టెంట్ సిటికి వప్తారు. 5.25గంటలకు సరస్వతిమాత విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. 6గంటలకు సరస్వతినదిలో సీఎం దంపతులు సంకల్ప పుష్కరస్నానం చేస్తారు. 6.05గంటలకు శ్రీకాళేశ్వరముక్తీశ్వరస్వామిని దర్శించుకుంటారు. 6.30గంటలకు అర్చకులతో ఆశీర్వచనం చేస్తారు. 6.40గంటల నుంచి రాత్రి 7గంటల వరకు సరస్వతి నవ రత్నమాల హారతి కార్యక్రమంలో పాల్గొంటారు. రాత్రి 8 గంటల తరువాత రోడ్డు మార్గం గుండా భూపాలపల్లికి చేరుకుంటారని సీఎం కార్యాలయంనుంచి షెడ్యూల్ ఖరారు చేశారు. -
పుష్కరాలకు విస్తృత ఏర్పాట్లు
కాళేశ్వరం : కాళేశ్వరంలో ఈనెల 15 నుంచి 26వ తేదీ వరకు జరుగనున్న సరస్వతీనది పుష్కరాలకు విస్తృత ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్ తెలిపారు. బుధవారం కాళేశ్వరంలో సరస్వతీ ఘాట్ వద్ద ఏర్పాట్లు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నేడు (గురువారం) సీఎం రేవంత్ రెడ్డి సరస్వతీమాతా విగ్రహం, ఘాట్ ప్రారంభోత్సవం చేస్తారన్నారు. అనంతరం పుష్కర స్నానమాచరించి కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారిని దర్శించుకున్న తర్వాత త్రివేణి సంగమంలో మొదటిసారి కాశీ పండితులు నిర్వహించనున్న నదీ హారతిలో పాల్గొంటారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారి పెద్ద ఎత్తున సరస్వతీనది పుష్కరాలు నిర్వహిస్తున్నామని, జిల్లా యంత్రాంగం భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో వారికి ఎక్కడా అసౌకర్యం కలగకుండా అధికారులు విధులు నిర్వర్తించాలన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ రాహుల్ శర్మ, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు. దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్ -
అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలి
● కలెక్టర్ రాహుల్ శర్మకాళేశ్వరం : సరస్వతీనది పుష్కరాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని జయశంకర్ భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. బుధవారం కాళేశ్వరం దేవస్థానంలోని కల్యాణ మండపంలో విధులు కేటాయించిన వివిధ శాఖల అధికారులు, సిబ్బందితో సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పుష్కరాలకు రోజూ సుమారు లక్షకు పైగా భక్తులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రతీ అధికారి తమకు కేటాయించిన లోకేషన్లలో మందస్తు పర్యటించి ఏర్పాట్లు పరిశీలించాలని తెలిపారు. 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ పుష్కరాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందన్నారు. ఈ సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఘాట్ల వద్ద 50 మంది గజ ఈతగాళ్లు నాటు పడవలతో పహారా కాస్తున్నట్లు తెలిపారు. తాత్కాలిక బస్టాండ్ నుంచి బస్టాండ్ వరకు భక్తుల సౌకర్యార్థం ఉచితంగా 30 షటిల్ బస్సులు నడుపుతున్నట్లు తెలిపారు. విధులు కేటాయించిన అధికారులు ఎవరైనా గైర్హాజరైతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో దేవాదాయ శాఖ డైరెక్టర్ వెంకటరావు, అదనపు కలెక్టర్లు అశోక్‌కుమార్, విజయలక్ష్మి, కాటారం సబ్‌కలెక్టర్ మయాంక్‌సింగ్, ఆర్డీఓ రవి, తదితరులు పాల్గొన్నారు. -
‘సెంట్రల్’ టెన్త్‌లో సత్తాచాటిన ‘తేజస్వి’
నయీంనగర్: సీబీఎస్ఈ –2025 టెన్త్ ఫలితాల్లో తేజస్వి పాఠశాల విద్యార్థులు సత్తా చాటారు. అత్యుత్తమ మార్కులు సాధించి ఉమ్మడి వరంగల్ జిల్లాలో విజయదుందుభి మోగించారు. సిద్దామూర్తి జ్ఞానతేజారెడ్డి 487 మార్కులు, గంజి ఉదయ్ నిక్షిత్, లడే శ్రీవిద్య 481 , ఎస్.నందిత 479, భవ్యాంశ్ అగర్వాల్ 476, భూక్యా శ్రీ కృష్ణ కౌషిక్ 473, ఎం. సునైన రీతుల్ 472 , కె.మీనాక్షి 471 మార్కులు సాధించారు. హంటర్‌రోడ్, ఎర్రగట్టు గుట్ట బ్రాంచ్‌లలో విద్యార్థులు అధిక మార్కులు సాధించారు. పాఠశాల గత చరిత్రను ఎప్పటిలాగే కొనసాగిస్తూ ఉత్తమ స్థానం నిలబెట్టుకుంది. ఈ విజయపరంపర కొనసాగించి న విద్యార్థులు, బోధన, బోధనేతర సిబ్బంది, తల్లి దండ్రులకు విద్యాసంస్థల చైర్మన్ రేవూరి జెన్నారెడ్డి, డైరెక్టర్లు, ప్రిన్సిపాల్స్ అభినందనలు తెలిపారు. -
సీబీఎస్ఈ టెన్త్ ఫలితాల్లో విజయభేరి..
విద్యారణ్యపురి: సీబీఎస్ఈ టెన్త్ పరీక్షల ఫలితాల్లో ‘ఎస్ఆర్’ స్కూల్స్ విద్యాసంస్థల విద్యార్థులు విజయభేరి మోగించారని ౖ‘ఎస్ఆర్’ విద్యాసంస్థల చెర్మన్ ఎ. వరదారెడ్డి, డైరెక్టర్లు మధుకర్‌రెడ్డి, సంతోశ్‌రెడ్డి మంగళవారం తెలిపారు. జాతీయ స్థాయిలో ఎం. రిషి 500 మార్కులకుగాను 498 మార్కులు సాధించారని వారు పేర్కొన్నారు. వి. వివేకానందారెడ్డి 487 మార్కులు, కె జశ్వంత్ 487 మార్కులు, బి హృశికేశ్మూర్తికి 485 మార్కులు, ఎ. సాయి కశ్యప్ 484 మార్కులు, పి.అభిలాశ్రెడ్డి 481మార్కులు, కెకె.సాహిత్య 480మార్కులు సాఽధించారని తెలిపారు. పటిష్ట విద్యాప్రణాళిక, అంకితభావం కలిగిన ఉపాధ్యాయ బృంద విద్యాబోధనతో విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారని వారు చెప్పారు. ఎస్ఎస్సీ విద్యార్థులకు ఐఐటీ, మెడికల్ ఫౌండేషన్‌పై శ్రద్ధ తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ ఫలితాలు విద్యార్థులందరికీ స్ఫూర్తిదాయకం కావాలని వారు ఆకాంక్షించారు. -
ప్రజాప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుంది
బయ్యారం: తెలంగాణలో కాంగ్రెస్ పాలిత ప్రజాప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. మండలంలోని లక్ష్మీనర్సింహాపురం, రామచంద్రాపురం, కొమ్మవరం గ్రామాల్లో నిర్మించనున్న విద్యుత్ సబ్స్టేషన్ల పనులకు మంగళవారం లక్ష్మీనర్సింహాపురంలో శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య అధ్యక్షతన నిర్వహించిన బహిరంగసభలో డిప్యూటీ సీఎం మాట్లాడారు. రాష్ట్రంలో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ప్రజలపై రూపాయి భారం వేయకుండా వేల కోట్లతో పలు సంక్షేమ పథకాలు చేపడుతున్నామన్నారు. ఇల్లందు నియోజకవర్గంలో లోఓల్టేజీ సమస్య ఉందని స్థానిక ఎమ్మెల్యే తన దృష్టికి తీసుకొచ్చిన వెంటనే బయ్యారం మండలంలో మూడు, టేకులపల్లి మండలంలో ఒక విద్యుత్ సబ్‌స్టేషన్ ఏర్పాటుకు ముందుకొచ్చామన్నారు. రానున్న రోజుల్లో ఇల్లందు నియోజకవర్గానికి మరో విద్యుత్ సబ్‌స్టేషన్ మంజూరు చేస్తామన్నారు. రాష్ట్రంలో ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి 3,500 చొప్పున రూ.22, 500 వేల కోట్లతో ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తున్నామని, గిరిజన ప్రాంతంలో అదనంగా మరికొన్ని ఇళ్లు మంజూరు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తుందన్నారు బయ్యారం పెద్ద చెరువు, తులారాం ప్రాజెక్టులపై దృష్టి.. మండలంలో ప్రధాన నీటివనరులైన బయ్యారం పెద్దచెరువు, తులారాం ప్రాజెక్టుల అభివృద్ధిపై దృష్టిసారిస్తానని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఆయకట్టులోని భూములకు రెండు పంటలకు సాగు నీరు అందించాలని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య తన దృష్టికి తీసుకొచ్చారని, ఈ విషయంపై అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం గంధంపల్లి–కొత్తపేటలో కాంగ్రెస్ నాయకుడు ప్రవీణ్‌నాయక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మాజీ ప్రధాని ఇందిరాగాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్రునాయక్, ఇల్లందు, మహబూబాబాద్, వైరా ఎమ్మెల్యేలు కోరం కనకయ్య, డాక్టర్ మురళీనాయక్, రాందాస్, కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్, టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్‌రెడ్డి, ఎస్పీ సుధీర్రాంనాఽథ్కేకన్, అదనపు కలెక్టర్ వీరబ్రహ్మచారి, ఆర్డీఓ కృష్ణవేణి, విద్యుత్‌శాఖ సీఈ రాజుచౌహాన్, ఎస్ఈ నరేశ్, డీఈ విజయ్, ఏఈ సుమన్, సొసైటీ చైర్మన్ మూల మధుకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గిరిజన ప్రాంతాల్లో అదనంగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు బయ్యారం, తులారాం ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తాం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మండలంలో మూడు సబ్స్టేషన్ల నిర్మాణానికి శంకుస్థాపన -
ప్లస్ టు ఫలితాల్లో ‘ఎస్ఆర్’ విజయకేతనం
విద్యారణ్యపురి: ప్లస్ టు (సీబీఎస్ఈ ఇంటర్) పరీ క్షల ఫలితాల్లో ‘ఎస్ఆర్’ విద్యాసంస్థల విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారని ‘ఎస్ఆర్’ విద్యాసంస్థల చైర్మన్ ఎ. వరదా రెడ్డి, మఽధుకర్రెడ్డి, సంతోశ్‌రెడ్డి తెలిపారు. జి. సా యిహర్షిణి 500 మార్కులకు 480 మార్కులు సాధించారు. ఆర్. స్వస్తికా 478 మార్కులు, సీహె చ్. అన్సికా 477 మార్కులతో జాతీయ స్థాయిలో ‘ఎస్ఆర్’ కీర్తి ప్రతిష్ట నిలిపారని తెలిపారు. అలాగే, కె. అంజనాసంతోషి 475 మార్కులు, ఎ. అమూల్య 472 మార్కులు, వి.ప్రత్యూన్నారెడ్డి 470 మార్కులు సాధించారని వారు తెలిపారు. భవిష్యత్తులో మరింత అత్యుత్తమ మార్కులు సాధించేలా విద్యార్థులను తీర్చిదిద్దుతామని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. -
9 రోజుల బాబుకు ఊపిరి పోశారు..
కమలాపూర్: వైద్యో నారాయణ హరి.. వైద్యులు దేవుళ్లతో సమానమని అర్థం. తల్లిదండ్రులు జన్మనిస్తే వారు పునర్జన్మనిస్తారు. అలాంటి ఘటనే ఇది. ఊపిరాడక, కదలిక లేని 9 రోజుల బాబుకు వైద్యులు, సిబ్బంది ఊపిరి పోసి కాపాడారు. ఈ ఘటన మంగళవారం హనుమకొండ జిల్లా కమలాపూర్ సా మాజిక ఆరో గ్య కేంద్రంలో చోటు చేసుకుంది. కమలాపూర్‌కు చెందిన రాపెల్లి సంధ్యారాణి కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ప్రభుత్వాస్పత్రిలో 9 రోజుల క్రితం ప్రసవించి బాబుకు జన్మనిచ్చింది. అవగాహనారాహిత్యంతో బాబుకు సబ్బుతో స్నా నం చేయించడంతో ముక్కులోకి సబ్బు నీళ్లు వెళ్లి ఊపిరాడక, కదలిక లేకుండా పోయింది. కంగారుపడిన కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రానికి తీసుకురాగా డాక్టర్ వరుణ్ మా ధవ్ ఆధ్వర్యంలో నర్సింగ్ ఆఫీసర్లు స్వప్న, అనిత, కల్యాణి కలిసి బాబు ముక్కులో పైపు వేసి ఆస్పిరేషన్ ద్వారా సబ్బు నీళ్లు బయటకు తీయడంతో బా బులో కదలిక వచ్చి ఒక్కసారిగా ఏడవటం ప్రారంభించాడు. అనంతరం బాబుకు పిల్లల వైద్యుడితో మెరుగైన వైద్యం ఇప్పించాలని సూచించి వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి పంపించారు. దీంతో సదరు కుటుంబీకులు బాబుకు ఊపిరి పోసిన వైద్యుడు, నర్సింగ్ ఆఫీసర్లకు కృతజ్ఞతలు తెలిపారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ ఆస్పత్రి వైద్యుల ఘనత -
హరిత హోటల్ వద్ద భారీ భద్రత
వరంగల్ క్రైం : ప్రపంచ సుందరీమణుల వరంగల్ పర్యటనలో భాగంగా హనుమకొండలో వారు బస చేసే హరిత హోటల్ చుట్టూ 200 మంది సిబ్బందితో భారీ భద్రత ఏర్పాటు చేసినట్లు సుబేదారి ఇన్స్పెక్టర్ పి.సత్యనారాయణరెడ్డి తెలిపారు. ఎక్కడా, ఎలాంటి సమస్య తలెత్తకుండా హరిత హోటల్‌ను పూర్తి నిఘా నీడలో ఉంచనున్నట్లు తెలిపారు. అండర్–25 క్రికెట్ జిల్లా జట్ల ఎంపికలు వరంగల్ స్పోర్ట్స్: ఈ నెల 15, 16వ తేదీల్లో అండర్–25 జిల్లా జట్ల ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు వరంగల్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి చాగంటి శ్రీనివాస్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కరుణాపురంలోని వంగపల్లి క్రికెట్ మైదానంలో వరంగల్, హనుమకొండ, భూపాలపల్లి, మహబూబాబాద్, జనగామ, ములుగు జిల్లాల స్థాయి ఎంపికలు ఉంటాయన్నారు. ఆరు జిల్లాల క్రికెట్ జట్ల ఎంపిక కోసం నిర్వహించే ఈ పోటీల్లో 17 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు గల క్రీడాకారులు, ఆగస్టు 31, 2000 తర్వాత జన్మించిన వారు అర్హులని పేర్కొన్నారు. ఎంపికలకు హాజరయ్యే క్రీడాకారులు ఆధార్, మీసేవ జారీ చేసిన జనన ధ్రువీకరణ పత్రం, యూనిఫాంతో వంగపల్లి గ్రౌండ్ వద్ద ఉదయం 10గంటల కల్లా హాజరు కావాలన్నారు. ఇందులో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులతో ఆరు జిల్లాల జట్లు ఎంపిక చేసి ఈనెల 19వ తేదీన అంతర్‌జిల్లాల స్థాయి క్రికెట్ పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇంటర్ డిస్ట్రిక్ట్స్‌లో ప్రతిభ చూపిన క్రీడాకారులతో కూడిన ఉమ్మడి వరంగల్ జిల్లా జట్టు జూన్ మొదటి వారం నుంచి హైదరాబాద్ కేంద్రంగా జరిగే లీగ్ పోటీల్లో పాల్గొంటుందని పేర్కొన్నారు. వివరాలకు 98495 70979 నంబర్లో సంప్రదించవచ్చని తెలిపారు. వడదెబ్బతో జీపీ కార్మికుడి మృతి హసన్‌పర్తి: వడదెబ్బతో ఓ గ్రామ పంచాయతీ కార్మికుడు మృతిచెందాడు. ఈఘటన హసన్‌పర్తి మండలం సీతానాగారంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రాజేందర్ గ్రామ పంచాయతీలో పంప్ ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. సోమవారం విధులకు హాజరైన రాజేందర్ వడదెబ్బతో అస్వస్థకు గురై అదే రోజు రాత్రి మృతి చెందాడు. కాగా, రాజేందర్ మృతదేహాన్ని కారోబార్, బిల్కలెక్టర్ల ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సదానందం, కార్యదర్శి వెంకన్న, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రజనీకుమార్ సందర్శించి నివాళులర్పించారు. కోటలో ఏర్పాట్ల పరిశీలన.. ఖిలా వరంగల్: ప్రపంచ సుందరీమణుల రాకకు కోటలోని శిల్పాల ప్రాంగణాన్ని మంగళవారం రాత్రి కలెక్టర్ డాక్టర్ సత్యశారద, బల్దియా కమిషనర్ అశ్వినీ తానాజీ వాకడే, మేయర్ గుండు సుధారాణి, కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రామ్ రెడ్డి, పర్యాటక శాఖ రాష్ట్ర అధికారి నాథన్, కల్చరల్ డైరెక్టర్ మామిడి హరికృష్ణ సందర్శించి ఏర్పాట్లును పరిశీలించారు. రాత్రి వేళల్లో కోట మరింత సౌందర్యవంతంగా కనిపించేలా తీర్చిదిద్దిన లైటింగ్ ఏర్పాట్లను ఆసక్తిగా తిలకించారు. తె లంగాణ సంస్కృతి ఉట్టిపడేలా ప్రత్యేక స్వాగతం పలకనున్నారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి, ఏసీపీ నందిరామ్ నాయక్, తహసీల్దార్ బండి నాగేశ్వర్రావు, ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. -
పుష్కరాల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సేవలు
● రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ కాళేశ్వరం : కాళేశ్వరంలో ఈనెల 15 నుంచి 26వ తేదీ వరకు జరుగనున్న సరస్వతీనది పుష్కరాల్లో భక్తుల భద్రత, అత్యవసర సేవల నిమిత్తం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సేవలు వినియోగించనున్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి కాళేశ్వరంలోని వీఐపీ ఘాట్, సరస్వతీమాతా విగ్రహం, భక్తులు పుష్కర స్నానాలు చేసే త్రివేణి సంగమం, గోదావరి ఘాట్, దేవాలయం, బందోబస్తు ప్రణాళిక తదితర రక్షణ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 14 నుంచి 25వ తేదీ వరకు కాళేశ్వరంలో జాతీయ, రాష్ట్ర విపత్తులు దళ సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్ ఒక టీం (34 మంది), ఎస్డీఆర్ఎఫ్ రెండు టీంల (66 మంది) సిబ్బంది మూడు షిఫ్టుల్లో నిరంతరం విధులు నిర్వర్తిస్తారని పేర్కొన్నారు. పుష్కరాల సమయంలో ఏదైనా అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు వెంటనే స్పందించి తక్షణమే సేవలు అందించేందుకు ఈ బలగాలను వివిధ ఘాట్ల వద్ద సిద్ధంగా ఉంచుతున్నట్లు తెలిపారు. భక్తులు భద్రతా నిబంధనలను పాటిస్తూ, అధికారుల సూచనల ప్రకారం పుష్కర స్నానాలు చేయాలని సూచించారు. భక్తులు ప్రమాద హెచ్చరికల సూచికలు దాటి నదిలోకి వెళ్లకుండా పటిష్ట పర్యవేక్షణ చేయాలని సిబ్బందిని ఆదేశించారు. పుష్కరాల్లో పారిశుద్ధ్య పనులు నిరంతరం జరిగేలా చర్యలు తీసుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మీకి సూచించారు. కార్యక్రమంలో ఇరిగేషన్ ఎస్ఈ సత్యనారాయణ, జిల్లా అగ్నిమాపక అధికారి కెవి. సతీశ్ కుమార్, తెలంగాణ రీజియన్ ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ డిప్యూటీ కమాండెండ్ దామోదర్ సింగ్,కాటారం డీఎస్పీ రామ్మోహన్‌రెడ్డి, దేవస్థానం ఈఓ మహేశ్ తదితరులు పాల్గొన్నారు. -
నేటినుంచి కేయూ డిగ్రీ పరీక్షలు
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలో డిగ్రీ కోర్సుల బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీసీఏ, బీ ఒకేషనల్ తదితర కోర్సుల 2,4,6 సెమిస్టర్ల పరీక్షలు, అలాగే బ్యాక్లాగ్ మొదటి, మూడు, ఐదో సెమిస్టర్ల పరీక్షలు నేటి నుంచి (ఈనెల 14నుంచి) నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు పూర్తిచేసినట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి కె. రాజేందర్ మంగళవారం తెలిపారు. ఆయా సెమిస్టర్ల పరీక్షల నిర్వహణకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో 46, ఖమ్మం జిల్లాలో 25, ఆదిలాబాద్ జిల్లాలో 47.. మొత్తం 118 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. 118 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 125 మంది అబ్జర్వర్లను నియమించామని తెలిపారు. ఆయా సెమిస్టర్ల పరీక్షలకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో 79,224మంది విద్యార్థులు, ఖమ్మం జిల్లాలో44,793 మంది, ఆదిలాబాద్ జిల్లాలో 77,221మంది.. మొత్తం 2,01,238 మంది విద్యార్థులు పరీక్షలు రాయబోతున్నారన్నారు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు 10 మంది ఫ్లయింగ్స్క్వాడ్లను నియమించినట్లు తెలిపారు. టైంటేబుల్ ప్రకారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. విద్యార్థులు హాల్‌టికెట్లను సంబంఽధిత కేయూ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. కాగా, పరీక్షల నిర్వహణకు నిర్దేశించిన సమయానికి ముందే ఆయా కేంద్రాలకు ఆన్లైన్లోనే ప్రశ్నాపత్రాలు పంపిస్తారు. డౌన్లోడ్ చేసుకుని విద్యార్థులకు అందజేయాల్సింటుంది. పరీక్షలు రాయనున్న 2,01,238 మంది విద్యార్థులు 118 కేంద్రాలు ఏర్పాటు 125మంది అబ్జర్వర్లు, 10 మంది ఫ్లయింగ్స్క్వాడ్ల నియామకం -
ఓరుగల్లుకు నేడు ‘ప్రపంచ సుందరీమణులు’
సాక్షిప్రతినిధి, వరంగల్/వెంకటాపురం(ఎం): చారిత్రక నేపథ్యమున్న ఓరుగల్లులో వివిధ దేశాలకు చెందిన సుందరీమణులు బుధవారం సందడి చేయనున్నారు. కళలు, దేవాలయాలు, చారిత్రక కట్టడాలు.. సాంస్కృతిక వేదికలు.. సంస్కృతీసంప్రదాయాలకు పెద్దపీట వేసిన కాకతీయుల కాలంనాటి కట్టడాలను తిలకించనున్నారు. హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన వివిధ దేశాలకు చెందిన సుందరీమణులు రెండు బృందాలుగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు రానున్నారు. ఈ మేరకు వేయిస్తంభాల ఆలయం, వరంగల్ కోట, రామప్పలో సకల ఏర్పాట్లు చేశారు. ఐదు రోజులుగా హనుమకొండ, వరంగల్ కలెక్టర్లు ప్రావీణ్య, డాక్టర్ సత్యశారద, వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్, వివిధ శాఖల అధికారులు ఏర్పాట్లను పరిశీలించారు. రామప్పలో ములుగు కలెక్టర్ టీఎస్ దివాకర, ఎస్పీ శబరీష్ రెవె న్యూ, పర్యాటక తదితర శాఖల అధికారులను సమన్వయం చేసుకుంటూ పనులు చేయించారు. ముస్తాబైన నగరం.. వరంగల్ నగరంలో మూడుచోట్ల ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు ఏర్పాటు చేశారు. వేయిస్తంభాల దేవాలయం, ఫోర్ట్ వరంగల్ వద్ద సౌండ్ అండ్ లైట్, ఫ్లియా మార్కెట్, సాంస్కృతిక ప్రదర్శనల వేదిక, మీడియా పాయింట్లు ఏర్పాటు చేశారు. హరిత కాకతీయ, వేయిస్తంభాల ఆలయం, వరంగల్ కోట, పలు ముఖ్య కూడళ్లు ఫ్లడ్‌లైట్ల వెలుతురులో జిగేల్మంటున్నాయి. సుందరీమణుల పర్యటనను పర్యవేక్షించేందుకు వరంగల్, హనుమకొండ ప్రాంతాల్లో ప్రస్తుతమున్న సీసీ కెమెరాలతోపాటు అదనంగా మరికొన్ని అమర్చారు. మూడంచెల భద్రత కోసం కమిషనరేట్ పరిధిలో సుమారు రెండు వేల మందికిపైగా పోలీసులను వినియోగిస్తున్నారు. హరిత హోటల్ చుట్టూ 200 మంది సిబ్బంది పహారా కాస్తున్నారు. విద్యుత్ వెలుగుల్లో వేయిస్తంభాల గుడి -
బ్రిడ్జి నిర్మాణానికి నిధులు విడుదల చేయిస్తా
గార్ల: పాకాల ఏటిపై హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్కతో మాట్లాడి నిధులు విడుదల చేయిస్తానని కొత్తగూడెం ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. బ్రిడ్జి నిర్మాణానికి సీపీఐ ఆధ్వర్యంలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న దీక్షశిబిరాన్ని మంగళవారం సందర్శించారు. ఈనెల 17న బ్రిడ్జి నిర్మాణం నిధుల విడుదలపై డిప్యూటీ సీఎంను కలుస్తామన్నారు. అప్పటి వరకు దీక్షను విరమింపజేయాలని నాయకులకు నిమ్మరసం ఇచ్చి దీక్షను ముగించారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి విజయసారథి, నాయకులు అజయ్‌సారథి, శ్రీనివాస్, కుమార్, వెంకన్న, లక్ష్మి, జనార్దన్, లోకేశ్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రశాంతంగా పాలీసెట్
– వివరాలు 8లోuమహబూబాబాద్ అర్బన్: జిల్లాలో పాలీసెట్–2025 ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా జరిగిందని పాలీసెట్ జిల్లా కోఆర్డినేటర్ ఎం. రాంప్రసాద్ మంగళవారం తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఐదు కేంద్రాల్లో ప్రవేశ పరీక్ష నిర్వహించినట్లు చెప్పారు. 897మంది బాలురకు 844 మంది హాజరై 53 మంది గైర్హాజరయ్యారని చెప్పారు. 761మంది బాలికలకు 710 మంది హాజరై 51 మంది గైర్హాజరయ్యారన్నారు. మొత్తంగా 1,554మంది విద్యార్థులు హాజరై 104మంది గైర్హాజరైనట్లు చెప్పారు. పరీక్షలకు సహకరించిన పోలీస్, విద్యాశాఖ అధికారులకు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. -
ఆయిల్‌పామ్ సాగు విస్తీర్ణం పెంచాలి
మహబూబాబాద్: జిల్లాలో ఆయిల్‌పామ్ సాగు విస్తీర్ణం పెంచాలని కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్ అన్నారు. కలెక్టరేట్లో మంగళవారం ఆయిల్‌పామ్ సాగు పోస్టర్లు, కరపత్రాలను కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్, అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఆయిల్‌పామ్ సాగుతో ప్రతీ నెల స్థిరమైన ఆదాయం సమకూరుతుందన్నారు. జిల్లాలో 8,000 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు చేసిన ట్లు తెలిపారు. పలు రకాల ఉద్యాన పంటలు సాగు చేస్తే రైతులకు ఆదాయం పెరుగుతుందన్నారు. కార్యక్రమంలో డీఏఓ విజయనిర్మల, ఉ ద్యానశాఖ జిల్లా అఽధికారి మరియన్న ఉన్నారు.పీహెచ్సీ ఆకస్మిక తనిఖీమరిపెడ: మరిపెడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డిప్యూటీ డీఎంహెచ్ఓ సుధీర్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు. గర్భిణులు పీహెచ్‌సీలోనే ప్రసవం అయ్యేలా చూడాలని సూచించారు. ప్రతీ బుధ, శనివారాల్లో పిల్లలకు వ్యాక్సిన్స్ ఇవ్వాలన్నారు. ప్రతీ మంగళ, శుక్రవారాల్లో డ్రైడే పాటించాలని చెప్పారు. కార్యక్రమంలో స్థానిక వైద్యాధికారి గుగులోతు రవికుమార్, డిప్యూటీ పారామెడికల్ ఆఫీసర్ వనాకర్‌రెడ్డి, విద్యాసాగర్, మంగమ్మ, సుదర్శన్, లక్ష్మి, మాధవి, పద్మ, స్వర్ణ, వీరయ్య తదితరులు పాల్గొన్నారు.శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలిమహబూబాబాద్ అర్బన్: ఉపాధ్యాయులు శిక్షణ తరగతులకు తప్పకుండా హాజరై సద్వి నియోగం చేసుకోవాలని డీఈఓ రవీందర్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని అనంతారం మో డల్ స్కూల్, హోలిఏంజిల్స్ ఏకశిల హైస్కూల్, జెడ్పీహెచ్ఎస్ బాలికల పాఠశాలలో మంగళవారం ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు ప్రా రంభమయ్యాయి. డీఈఓ హాజరై మాట్లాడు తూ.. ఉపాధ్యాయులు శిక్షణలో నేర్చుకున్న అంశాల ఆధారంగా విద్యార్థులకు మెరుగైన బోధన చేయాలన్నారు. ప్రభుత్వ బడుల బలోపేతానికి ఉపాధ్యాయులందరూ కృషి చేయాలని, విద్యార్థుల సంఖ్య పెంచాలన్నారు. కార్యక్రమంలో క్వాలిటీ కోఆర్డినేటర్ ఆజాద్ చంద్రశేఖర్, ఏసీజీఈ మందుల శ్రీరాములు, జిల్లా సైన్స్ అధికారి అప్పారావు, ఎంఈఓలు వెంకటేశ్వర్లు, రవి కుమార్, డీసీఈబీ అసిస్టెంట్ సెక్రటరీ సమ్మెట సతీష్‌గౌడ్ పాల్గొన్నారు.గొంతులో మాంసం బొక్క ఇరుక్కుని ఒకరి మృతిమరిపెడ: భోజనం చేస్తుండగా మాంసం బొక్క గొంతులో ఇరుక్కుని ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మరిపెడ పట్టణ శివారు కొత్తతండాలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ శివారు బండతండాకు చెందిన జాటోతు లక్ష్మణ్(68) తన బావమరిది అయిన కొత్తతండాకు చెందిన అజ్మీరా ఠాగూర్ ఇంట్లో దుర్గమ్మ పండుగకు హాజరయ్యాడు. మంగళవారం ఉదయం మాంసం తింటున్న సమయంలో బొక్క గొంతులో అడ్డుపడింది. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. మృతుడికి భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు.సమయపాలన పాటించాలిగూడూరు: ఏజెన్సీ ప్రాంతాల్లోని ఆస్పత్రుల్లో విధులు నిర్వర్తించే వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలని ఐటీడీఏ ఏటూరునాగా రం పీఓ చిత్రామిశ్రా అన్నారు. మండలంలోని తీగలవేణి పీహెచ్‌సీని మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రి భవనం, పరిసర ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ... ఎండాకాలం దృష్ట్యా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుకోవాలని, అవసరమైన మందులు నిల్వ చేసుకోవాలన్నారు. ఓపీ, ఇతర రికార్డులను పరిశీలించారు. డాక్టర్ రాంబాబు, సూపర్వైజర్ శానుబేగం, ఫార్మసిస్టు అమల, సిబ్బంది పాల్గొన్నారు. -
బుధవారం శ్రీ 14 శ్రీ మే శ్రీ 2025
– 8లోuపున్నమి వెలుగుల్లో రామప్పసుందరీమణుల రాక సందర్భంగా రామప్ప ఆలయం జిగేల్‌మంటోంది. విదేశీ వనితలు భారతీయ సంప్రదాయాలను గౌరవిస్తూ రామలింగేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఆలయం చుట్టూ గ్రీన్ మ్యాట్ వేశారు. ప్రత్యేక విద్యుత్‌దీపాలు ఏర్పాటు చేశారు. సాంస్కృతిక కార్యక్రమాల కోసం గార్డెన్లో స్టేజీ నిర్మించారు. సరస్సు కట్టపై ఉన్న హరి త కాటేజీలను ముస్తాబు చేశా రు. వెయ్యి మంది సిబ్బందితో మూడంచెల భద్రత ఏర్పాటు చేసి మంగళవారం రాత్రి నుంచే పోలీసులు విధుల్లో చేరారు. పర్యాటకులకు బుధవారం రామప్ప సందర్శనకు అనుమతి లేదు.● వేయిస్తంభాల ఆలయం, వరంగల్ కోట సందర్శన ● రామప్పలో సందడి చేయనున్న అందాలభామలు ● అడుగడుగునా సీసీ కెమెరాల నిఘా.. 3వేల మందికి పైగా పోలీసులు ● మూడంచెల భద్రత.. సీనియర్ అధికారుల పర్యవేక్షణ● 4గంటలకు రామప్పకు చేరుకుంటారు. 4:40 గంటలకు రామప్ప సరస్సు అందాల వద్ద ఫొటో సెషన్లో పాల్గొంటారు. ● 4:55 గంటలకు రామప్ప ఆలయానికి చేరుకుంటారు. 5 గంటలకు రామప్ప ఎంట్రెన్స్ గేట్ వద్ద కొమ్ముకోయ నృత్యంతో కళాకారులు వారికి స్వాగతం పలుకుతారు. ● 5:10 నుంచి 6 గంటల వరకు సంప్రదాయ దుస్తుల్లో రామప్ప రామలింగేశ్వరస్వామిని దర్శించుకొని శిల్పకళాసంపదను తిలకిస్తారు. ● 6.10 గంటల నుంచి రాత్రి 7.00 గంటల వరకు రామప్ప గార్డెన్లో అలేఖ్య శాసీ్త్రయ నృత్యం, పేరిణి ప్రదర్శన వీక్షించిన అనంతరం ప్రముఖులు అతిథులను సన్మానిస్తారు. ● రాత్రి 7.20 గంటలకు ఇంటర్‌ప్రిటిషన్ సెంటర్‌కు చేరుకుంటారు. 7.30 గంటలకు డిన్నర్ చేసి 8:15 గంటలకు హైదరాబాద్ ప్రయాణమవుతారు. ● హైదరాబాద్ నుంచి రెండు బృందాలుగా ప్రత్యేక బస్సుల్లో బయలుదేరుతారు. ● ఒక బృందం హనుమకొండలోని హరిత కాకతీయకు సాయంత్రం 4.35 గంటలకు చేరుకుంటుంది. ● సుమారు గంటపాటు హోటల్లోనే గడిపి సాయంత్రం 5.45 గంటలకు వేయిస్తంభాల గుడికి చేరుకుంటారు. ఏయే దేశాల సుందరీమణులంటే.. ప్రపంచంలోని 19 దేశాలకు చెందిన సుందరీమణులు గ్రేటర్ వరంగల్ నగరానికి, 32 దేశాల వారు రామప్ప ఆలయానికి రానున్నట్లు సమాచారం. వారిలో అర్జెంటీనా, బొలివియా, బ్రెజిల్, కెనడా, చీలి, కొలంబో, ఈక్వెడార్, ఈ సాల్వడార్, గౌతమాల, మెక్సికో, పనామా, పరాగ్వే, పెరు, యునైటెడ్ స్టేట్స్, వెనిజులా, హైతీ, హోందురాస్, నికరగ్వా, సురినామే తదితర దేశాల సుందరీమణులు ఉన్నారు. ● 40 నిమిషాలు పాటు అక్కడ వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ● సాయంత్రం 6.25 వరంగల్ కోటకు చేరుకుంటారు. 7.30 గంటలకు వరకు అక్కడే పేరిణి శివతాండవం, ఇతర సంప్రదాయ నృత్యాలను తిలకించి తిరిగి హరిత హోటల్‌కు చేరుకుంటారు. ● 8 గంటల నుంచి 9 గంటల వరకు పర్యాటక శాఖ విందులో పాల్గొని 9.15 గంటలకు హైదరాబాద్‌కు బయలుదేరుతారు. డిన్నర్లో ఇవే.. సుందరీమణులకు హనుమకొండ నక్కలగుట్టలోని టూరిజం హోటల్ హరిత కాకతీయ ముస్తాబైంది. హోటల్‌కు చేరుకున్న బృందానికి స్వాగత పలకరింపుగా నారింజ జ్యూస్ అందిస్తారు. స్టాటర్‌గా ప్రెలూడే ప్లేట్–స్టార్టర్ ట్రియో, గోల్డెన్ కోస్ట్ ఫిష్ బైట్స్ లేదా చీజ్ అండ్ హెర్బ్ మిలాంజ్ క్రాక్వెట్స్, సీసర్స్ గార్డెన్, మెయిన్ ఆఫెయిర్– సిగ్నేచర్ ప్లేట్స్గా నాన్ వెజిటేరియన్‌గా హర్బ్ గ్రిల్డ్ చికెన్ సుప్రీం, వెజిటేరియన్‌గా గ్రిల్డ్ కాటేజ్ చీస్ స్టీక్, మెడిటెర్రానీన్ వెజిటబుల్ గ్రాటిన్, టస్కాన్ పెన్న అర్రాబిటా, గోల్డెన్ చిప్స్, స్వీట్ ఇప్రెషన్గా చాక్లెట్ మౌసెస్, సాఫ్రాన్ ఫిర్ని, సీసన్స్ బౌంటి అందిస్తారు. న్యూస్రీల్అందాల భామలకు ఆహ్వానంరామప్ప ఆలయంలో ఇలా..4.35 గంటలకు వరంగల్‌కు.. -
పుష్కరాలకు ఆర్టీసీ సన్నద్ధం..
హన్మకొండ/కాళేశ్వరం: ప్రతీ పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చే సరస్వతీనది పుష్కరా లకు టీజీఎస్ ఆర్టీసీ సన్నద్ధమైంది. ఈ మేరకు ఆర్టీసీ వరంగల్ రీజియన్ యాజమాన్యం, అధికా రులు ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా క్షేమంగా, సురక్షితంగా గమ్యస్థానా లకు చేరవేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఈక్రమంలో ఈ నెల 15 నుంచి 26వ తేదీ వరకు ప్రత్యేక బస్సులు నడుపనున్నారు. ప్రతీ రోజు 140 బస్సులకు తగ్గకుండా నడిపేందుకు ప్రణాళిక సి ద్ధం చేశారు. భక్తుల సంఖ్య పెరిగితే మరిన్ని అదనపు బస్సులు నడిపేందు కు సిద్ధంగా ఉన్నారు. హనుమకొండ జిల్లా బస్ స్టేషన్ నుంచి 40 బస్సులు, వరంగల్ బస్ స్టేషన్ నుంచి 25, జనగామ, పరకాల, నర్సంపేట బస్ స్టేషన్ నుంచి 10 చొప్పున, భూపాలపల్లి నుంచి 20, తొర్రూరు, మహబూబాబాద్ బస్ స్టేషన్ నుంచి 5 చొప్పున, హైదరాబాద్ నుంచి 15 ప్రత్యే క బస్సులు నడిపేలా కార్యాచరణ రూపొందించారు. అదే విధంగా హైదరాబాద్ నుంచి ఏసీ బస్సులు నడుపనున్నారు. ఏసీ బస్సులకు హైదరా బాద్ నుంచి రిజర్వేషన్ సౌకర్యం కల్పించారు. ఈ నెల 13 నుంచి రిజర్వేషన్ చేసుకోవచ్చు. సరస్వతీనది పుష్కరాలు జరిగే కాళేశ్వరంలో నాలుగు ఎకరాల్లో తాత్కాలిక బస్ స్టేషన్ ఏర్పాటు చేశారు. మొత్తం 9 పాయింట్లు ఉంటాయి. 9 పాయింట్ల నుంచి వివిధ ప్రాంతాలకు బస్సులు బయలుదేరుతాయి. కాళేశ్వరంలో ఇద్దరు అధికారులు, 10 మంది సూపర్ వైజర్లు, 20 మంది వలంటీర్లు నిరంతరాయంగా సేవలు అందిస్తారు. ఉదయం 4 నుంచి రాత్రి 11 గంటల వరకు బస్సులు నడుస్తాయని అధికారులు తెలిపారు. కాగా, సరస్వతీనది పుష్కరాలకు చార్జీలు ఖరారు చేశారు. సాధారణ చార్జీలతో చూసుకుంటే ఒకటిన్నర రెట్లు చార్జీలు పెంచారు.రూట్ల వారీగా ప్రత్యేక బస్సుల చార్జీల వివరాలు ఇలా.. రూట్ బస్సు సర్వీస్ పెద్దలకు పిల్లలకు (రూ.) (రూ.) హనుమకొండ – కాళేశ్వరం ఎక్స్‌ప్రెస్ 250 140 ఎలక్ట్రిక్ ఎక్స్‌ప్రెస్ 260 150 డీలక్స్ 290 160 ఎలక్ట్రిక్ డీలక్స్ 310 180 సూపర్ లగ్జరీ 330 190 ఎలక్ట్రిక్ సూపర్ లగ్జరీ 350 210 రాజధాని 420 330 గరుడ (+) 500 380 నర్సంపేట – కాళేశ్వరం ఎక్స్‌ప్రెస్ 330 180 మహబూబాబాద్ – కాళేశ్వరం ఎక్స్‌ప్రెస్ 400 220 తొర్రూరు – కాళేశ్వరం ఎక్స్‌ప్రెస్ 360 190 జనగామ – కాళేశ్వరం ఎక్స్‌ప్రెస్ 390 220 భూపాలపల్లి –కాళేశ్వరం ఎక్స్‌ప్రెస్ 120 70 సూపర్ లగ్జరీ 160 100 పరకాల – కాళేశ్వరం ఎక్స్‌ప్రెస్ 190 110 హైదరాబాద్ – కాళేశ్వరం ఎక్స్‌ప్రెస్ 570 320 డీలక్స్ 670 370 సూపర్ లగ్జరీ 760 420 రాజధాని 960 740 గరుడ (+) 1130 870ఆర్టీసీ సేవలు సద్వినియోగం చేసుకోవాలి సరస్వతీనది పుష్కరాలకు వచ్చే భక్తులు ఆర్టీసీ సేవలు సద్వి నియోగం చేసుకోవాలి. భక్తులను చేరవేసేందుకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నాం. భద్రతతో కూడిన సౌకర్యవంత ప్రయాణం అందిస్తాం. అవసరమైతే బస్సుల సంఖ్య పెంచుతాం. అధికారుల నిరంతర పర్యవేక్షణలో సురక్షితంగా, క్షేమంగా భక్తులను చేరవేస్తాం. డి.విజయభాను, రీజినల్ మేనేజర్, వరంగల్ ●ఈ నెల 15 నుంచి 26వ తేదీ వరకు ప్రత్యేక బస్సులు రోజుకు 140 ట్రిప్పులు.. భక్తుల సంఖ్య పెరిగితే మరిన్ని అదనపు సర్వీసులు ఏసీ బస్సులకు హైదరాబాద్ నుంచి రిజర్వేషన్ సౌకర్యం చార్జీలు ఖరారు చేసిన అధికారులు -
పుష్కరాలకు పటిష్ట భద్రత
● ఎస్పీ కిరణ్ ఖరే కాళేశ్వరం : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో ఈ నెల 15 నుంచి 26తేదీ వరకు జరుగనున్న సరస్వతీనది పుష్కరాలకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ కిరణ్ ఖరే తెలిపారు. ఈ మేరకు సోమవారం కాళేశ్వరంలోని పుష్కర ఘాట్లతోపాటు పోలీసు భద్రతా ఏర్పాట్లు, పార్కింగ్ స్థలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సరస్వతీనది పుష్కరాలకు వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు రానున్నట్లు పేర్కొన్నారు. సరిహద్దు రాష్ట్రాలు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ పోలీసులతో సమన్వయంతో పనిచేస్తున్నామన్నారు. మూడు షిఫ్టుల్లో 3,500 పోలీసుల విధులు.. పుష్కరాల సందర్భంగా మల్టీజోన్ –1 నుంచి సుమారు 3,500 మంది పోలీసు అధికారులు, సిబ్బంది మూడు షిఫ్టుల్లో విధులు నిర్వర్తిస్తారని ఎస్పీ తెలిపారు. 200 సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలను కమాండ్ కంట్రోల్‌కు అనుసంధానం చేసి భక్తులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పర్యవేక్షించనున్నట్లు తెలిపారు. 14 పార్కింగ్ స్థలాలు,7 హోల్డింగ్ పాయింట్స్ పార్కింగ్ స్థలాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. పుష్కరాల్లో మహిళలు, పిల్లల రక్షణకు ప్రత్యేక మహిళా పోలీసు విభాగంతో పాటు, ‘షీ’ టీమ్స్ పనిచేస్తాయని తెలిపారు. వాహనాల మళ్లింపు ఇలా.. పుష్కరాల వచ్చే భక్తుల వాహనాలను నిర్దేశించిన స్థలాల్లో పార్క్ చేసేలా పలు మళ్లింపులు చేపట్టినట్లు తెలిపారు. హైదరాబాద్, వరంగల్ నుంచి వచ్చే వాహనాలు కాటారం నుంచి పలుగుల క్రాస్ మీదుగా కాళేశ్వరం చేరుకోవాలని, కరీంనగర్ నుంచి వచ్చే వాహనాలు మంథని, గంగారం క్రాస్, పలుగుల క్రాస్ మీదుగా కాళేశ్వరం రావాలని, అలాగే, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, నిర్మల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల నుంచి వచ్చే వాహనాలు సిరొంచ అంతర్రాష్ట్ర వంతెన నుంచి కాళేశ్వరం చేరుకోవాలని సూచించారు. భక్తుల సౌకర్యార్థం ఉచిత షటిల్ బస్‌లు నడపనున్నారని తెలిపారు. ఘాట్ల వద్ద భక్తులకు ప్రమాదాలు జరగకుండా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి, రెస్క్యూ టీంలు, పోలీసులు విధులు నిర్వర్తిస్తారని తెలిపారు. కార్యక్రమంలో ఏఎస్పీ బోనాల కిషన్, కాటారం, భూపాలపల్లి డీఎస్పీలు రామ్మోహన్ రెడ్డి, సంపత్ రావు, నారాయణ నాయక్, మహదేవపూర్ సీఐలు రామచందర్ రావు, నాగార్జున రావు, నరేశ్, కాళేశ్వరం ఎస్సై తమాషా రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
యథావిధిగా డిగ్రీ పరీక్షలు
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో డిగ్రీ కోర్సుల బీఏ, బీకాం, బీబీఏ, బీఎస్సీ, బీసీఏ తదితర కోర్సులు 2, 4, 6 సెమిస్టర్ల పరీక్షలు ఈనెల 14నుంచి(బుధవారం) నిర్వహించనున్నారు. అలాగే, బ్యాక్లాగ్ డిగ్రీ కోర్సుల మొదటి, మూడు, ఐదో సెమిస్టర్ల పరీక్షలు కూడా నిర్వహించబోతున్నారు. ఇప్పటికే వెల్లడించిన టైం టేబుల్ ప్రకారం పరీక్షలు ఉంటాయని పరీక్షల విభాగం అధికారులు స్పష్టం చేశారు అయితే సోమవారం రాత్రి వరకు విద్యార్థులకు సంబంధించిన హాల్‌టికెట్లు జారీ చేయలేదు. నేడు (మంగళవారం) హాల్ టికెట్లు జారీ చేస్తామని అధికారులు స్పష్టం చేశారు. పరీక్షల నిర్వహణకు యాజమాన్యాలు ఓకే.. ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయడంలో ప్రభుత్వం జాప్యం చేస్తోందని తాము ఇబ్బందులు పడుతున్నామని పేర్కొంటూ పరీక్షలకు సహకరించబోమని ఎక్కువ శాతం ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు ఫీజులు చెల్లించకుండా మొండికేశాయి. దీంతో రెండుసార్లు డిగ్రీ పరీక్షలు వాయిదా వేశారు. ఫీజులు చెల్లించేందుకు 138 ప్రైవేట్ కాలేజీలు ముందుకు రాకపోవడంతో వాటి పేర్లను డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ (దోస్త్) వెబ్సైట్ నుంచి అధికారులు తొలగించారు. అయితే కొన్ని కాలేజీలు పరీక్షల ఫీజులు చెల్లించాయి. సోమవారం ప్రైవేట్ డిగ్రీ కాలేజీల యాజమాన్యాల అసోసియేషన్ బాధ్యులు హైదరాబాద్‌లో రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌ను కలిసి ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయించాలని కోరారని సమాచారం. అయితే తప్పనిసరిగా ఈనెల 14నుంచి డిగ్రీ పరీక్షలు జరుగుతాయని ఫీజులు చెల్లించి పరీక్షలు నిర్వహణకు సహకరించాలని కూడా ఆదేశించారని సమాచారం. దీంతో ఆయా యాజమాన్యాలు ఇక పరీక్షల నిర్వహణకు ఓకే చెప్పాయి. మొదటి రెండు పరీక్షలు చివరికి నిర్వహించండి! పరీక్షల నిర్వహణకు ఒక్కరోజే మిగిలి ఉండడంతో హాల్‌టికెట్ల జారీ, సిట్టింగ్ అరెంజ్మెంట్ ఇబ్బందిగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ముందు జరిగే రెండు పరీక్షలు చివరికి నిర్వహించాలని మిగతా పరీక్షలు టైంటేబుల్ ప్రకారం నిర్వహించాలని ప్రైవేట్ యాజమాన్యాల అసోసియేషన్ బాధ్యులు సోమవారం రిజిస్ట్రార్ ఆచార్య వి.రామచంద్రం దృష్టికి తీసుకెళ్లారు.నేడు హాల్ టికెట్ల జారీ ఫీజులు చెల్లించని మరికొన్ని కాలేజీలు ఫీజు చెల్లించిన కాలేజీల విద్యార్థులకే ఎగ్జామ్స్ ఒక్కరోజులో ఫీజుల చెల్లింపు దోస్త్ నుంచి పేర్లు తొలగించిన డిగ్రీ కాలేజీల యాజమాన్యాలు కొందరు ఇటీవల పరీక్షల ఫీజులు చెల్లించగా ఎక్కువ సంఖ్యలో కాలేజీలు సోమవారం ఆన్లైన్లో ఫీజు చెల్లించి పరీక్షల విభాగానికి వాట్సాప్‌లో వివరాలు పంపారు. మరిన్ని కాలేజీలు ఇంకా పరీక్షల ఫీజులు చెల్లించలేదు. మంగళవారం వారు కూడా ఫీజులు చెల్లిస్తారని భావిస్తున్నారు. చెల్లించకపోతే ఆయా కాలేజీల విద్యార్థులకు పరీక్షలు నిర్వహించబోమని పరీక్షల విభాగం అధికారులు స్పష్టం చేస్తున్నారు. -
వైద్యుల నిర్లక్ష్యంతో రోగి మృతి..?
హన్మకొండ చౌరస్తా : వైద్యుల నిర్లక్ష్యంతోనే రోగి మృతి చెందాడంటూ ఆస్పత్రి ఎదుట రోగి బంధువులు సోమవారం ఆందోళన చేపట్టారు. మృతుడి బంధువులు తెలిపిన కథనం ప్రకారం.. వరంగల్ రంగశాయిపేటకు చెందిన మహేందర్‌రావు కడుపునొప్పితో బాధపడుతూ ఆదివారం హనుమకొండలోని బంధన్ ఆస్పత్రికి వెళ్లారు. పరీక్షించిన వైద్యులు అడ్మిట్ చేసుకుని చికిత్స ప్రారంభించారు. రాత్రి వరకు బాగానే ఉన్నాడని చెప్పిన వైద్యులు, ఆస్పత్రి యాజమాన్యం, సోమవారం ఉదయం మహేందర్‌రావు చనిపోయినట్లు వెల్లడించారని ఆవేదన వ్యక్తం చేశారు. నిపుణులైన వైద్యులు చికిత్స చేయకుండా ఫార్మాడీ, బీఎంఎంస్ వైద్యులు చికిత్స చేయడంతోనే మృతి చెందాడని బంధువులు చెబుతున్నారు. ఆస్పత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని వారు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. కొందరి మధ్యవర్తిత్వంతో మృతుడు కుటుంబ సభ్యులకు నష్ట పరిహారం చెల్లిస్తామన్న హామీతో గొడవ సద్దుమణిగాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో బంధన్ ఆస్పత్రి వద్ద జరుగుతున్న ఆందోళనను గుర్తించిన డీఎంహెచ్ఓ అప్పయ్య ఆస్పత్రిని తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి చికిత్స వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కేస్షీట్స్ను హనుమకొండ పోలీసులు తీసుకెళ్లడంతో పూర్తి చికిత్స వివరాలు తెలియాల్సి ఉందన్నారు. గతంలో కూడా ఇలాంటి ఘటన జరిగిందని, వైద్యసేవల పట్ల అశ్రద్ధ వహిస్తే చర్యలు తప్పవని ఆస్పత్రి యాజమాన్యాన్ని హెచ్చరించారు. ఆస్పత్రి ఎదుట బంధువుల ఆందోళన విచారణ చేపట్టిన డీఎంహెచ్ఓ -
ఆర్టీసీ బస్సులో బంగారం చోరీ..
రఘునాథపల్లి: ఆర్టీసీ బస్సులో ఓ మహిళా ప్రయాణికురాలి హ్యాండ్ బ్యాగు నుంచి పదమూడున్నర తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యా యి. ఈ ఘటన సోమవారం చోటు చేసుకుంది. పో లీసుల కథనం ప్రకారం.. నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెం గ్రామానికి చెందిన చిత్తలూరి మమత ప్రస్తుతం మెదక్ జిల్లా తూప్రాన్‌లో ప్రైవేట్ టీచర్‌గా పని చేస్తోంది. హనుమకొండలో సోదరుడి వద్ద ఉన్న కుమారుడు, కూతురును తీసుకొచ్చేందుకు తూప్రాన్ నుంచి బస్సులో గజ్వేల్‌కు.. అక్కడి నుంచి భువనగిరి చేరుకుని, మరో బస్సులో జనగామకు చేరుకుంది. మధ్యాహ్నం 12.20 గంటలకు హనుమకొండ వెళ్లేందుకు జనగామ బస్టాండ్‌లో హనుమకొండ డిపోనకు చెందిన ఆర్టీసీ పల్లెవెలుగు బస్సు ఎక్కింది. రఘునాథపల్లి వచ్చాక హ్యాండ్ బ్యాగు జిప్ తెరిచి ఉండడంతో లోపల చూసింది. ఇందులో ఉన్న పదమూడున్నర తులాల బంగారు ఆభరణాలు కనిపించకపోవడంతో చోరీ అయినట్లు గుర్తించింది. ఈ విషయం కండక్టర్ విష్ణువర్ధన్‌రెడ్డి, డ్రైవర్ రాము దృష్టికి తీసుకెళ్లడంతో వారు నేరుగా బస్సును రఘునాథపల్లి పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. బస్సులోని ప్రయాణికులను తనిఖీ చేయగా ఆభరణాలు లభించలేదు. జనగామ బస్టాండ్‌లో, ఆయా గ్రామాల్లోని సీసీ ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై దూదిమెట్ల నరేశ్ తెలిపారు. హ్యాండ్ బ్యాగు నుంచి పదమూడున్నర తులాలు మాయం లబోదిబోమంటున్న బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు -
పౌర రక్షణ వలంటీర్లుగా నమోదుకు అవకాశం
న్యూశాయంపేట : భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ‘మై భారత్ పౌర రక్షణ వలంటీర్లుగా పనిచేయడానికి యువత నుంచి పేర్ల నమోదుకు ఆహ్వానిస్తున్నట్లు మై భారత్ వరంగల్ డిప్యూటీ డైరెక్టర్, ఉమ్మడి జిల్లా యువజన సంక్షేమాధికారి సీహెచ్.అన్వేశ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. యువతలో పౌర బాధ్యత, క్రమశిక్షణ భావం పెంపొందించడమే కాకుండా క్లిష్ట పరిస్థితుల్లో శిక్షణ ఇచ్చి పనిచేయడానికి సన్నద్ధం చేస్తామని తెలిపారు. ఆసక్తి గల యువత మై భారత్ పోర్టల్ mybharat.gov.inలో నమోదు చేసుకోవాలన్నారు. వివరాలకు 9491383832 నంబర్లో సంప్రదించాలన్నారు. వడదెబ్బతో వృద్ధురాలి మృతి లింగాలఘణపురం : మండలంలోని వడిచర్లకు చెందిన గండి పోషఎల్లమ్మ (68)వడదెబ్బతో సోమవారం మృతి చెందింది. ఆదివారం కుటుంబ సభ్యులు బంధువుల వివాహానికి వెళ్లగా ఇంటి వద్ద ఉన్న పోషఎల్లమ్మ గ్రామంలో ఎండలో తిరిగింది. వివాహానికి వెళ్లిన కుటుంబ సభ్యులు ఆలస్యంగా ఇంటికి రావడంతో నిద్రపోతుందని భావించి వారు కూడా నిద్రపోయారు. ఉదయం లేచి చూడగా తీవ్ర జ్వరంతో కనిపించగా గమనించి ఆస్పత్రికి తరలించే ప్రయత్నంలోనే మృతి చెందింది. రాయపర్తిలో వృద్ధుడు.. రాయపర్తి: వడదెబ్బతో మండల కేంద్రంలోని అంబేడ్కర్‌నగర్ కాలనీకి చెందిన కంతుల ఉప్పలయ్య(75) మృతి చెందాడు. సోమవారం ఎండవేడిమికి అస్వస్థతకు గురికావడంతో ఆర్ఎంపీ వద్దకు తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందినట్లు స్థానికులు తెలిపారు. చేపల వేటకు వెళ్లి వ్యక్తి .. చిన్నగూడూరు: చేపల వేటకు వెళ్లి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన సోమవారం మండలంలోని జయ్యారం పెద్ద చెరువులో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కొండ సైదులు(55) చేపలు పట్టే క్రమంలో చెరువులో ఉన్న నాచు, వల కాళ్లకు చుట్టుకుంది. గమనించి సహ జాలర్లు సైదులును కాపాడే యత్నం చేస్తుండగానే నీట మునిగి మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రవీణ్‌కుమార్ తెలిపారు. 60 కిలోల ఎండు గంజాయి స్వాధీనం మహబూబాబాద్ రూరల్ : మహబూబాబాద్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో సుమారు రూ. 15 లక్షల విలువైన 60 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నామని ఎకై ్సజ్ సీఐ జి.చిరంజీవి తెలిపారు. ఈ మేరకు మహబూబాబాద్ ఎకై ్సజ్ స్టేషన్ వద్ద సోమవారం వివరాలు వెల్లడించారు. పలు రైళ్లలో ఎండు గంజాయి సరఫరా చేస్తున్నారనే సమాచారం మేరకు సోదాలు నిర్వహించగా కురవి గేట్ రైల్వే ట్రాక్ సమీపంలోని చెట్ల పొదలమాటున రెండు ప్లాస్టిక్ సంచుల్లో ఎండు గంజాయి లభ్యమైందన్నారు. ఘటనాస్థలిలో ఎవరూలేరని, గంజాయి సీజ్ చేసి కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ సోదాల్లో ఎకై ్సజ్ సీఐలు నాగేశ్వరరావు, నీరజ, ఎస్సైలు చంద్రశేఖర్, అశోక్, కిరీటి, హెడ్ కానిస్టేబుళ్లు శ్రీనివాస్, మధు, కానిస్టేబుళ్లు రాజు, శ్రీను, శేఖర్, ఇబ్రహీం, భవా ని, నర్సింహరావు, రవి, సుమన్ పాల్గొన్నారు. -
కాశీపండితులతో నవహారతులకు సిద్ధం
పీఠాధిపతులకు ప్రత్యేక విడిది.. కాళేశ్వరం : సరస్వతీనది పుష్కరాలకు వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చే పీఠాధిపతుల కోసం దేవాదాయశాఖ ప్రత్యేకంగా విడిది ఏర్పాట్లు చేసింది. కాళేశ్వరంలోని త్రివేణి గెస్ట్‌హౌస్‌ను కాకినాడకు చెందిన శిల్పులు సాలహారం సిమెంట్‌తో అందంగా ముస్తాబు చేశారు. 15 నుంచి 26 వరకు పదుల సంఖ్యలో రోజుకు ఒకరు తరలొచ్చి స్నానం ఆచరించనున్నారు.ప్రమాద హెచ్చరిక జెండాలు ఏర్పాటు కాళేశ్వరం: సరస్వతీనది పుష్కరాల్లో లక్షలాదిగా పుణ్యస్నానాలు ఆచరించడానికి తరలొచ్చే భక్తులు ప్రమాదాలకు గురికాకుండా ఇరిగేషన్‌శాఖ ఆధ్వర్యంలో కొంత లోతు వరకు ఎరుపు జెండాలు, బెలూన్స్ ఏర్పాటు చేశారు. మోకాలు లోతు నీటిలో స్నానాలు ఆచరించనున్నారు.‘బాహుబలి’ సెట్టింగ్స్! కాళేశ్వరం: పుణ్యస్నానాలకు వచ్చే భక్తులు పులకించేలా బాహుబలి మాదిరి సెట్టింగ్స్ ఏర్పాటు చేశారు. నాలుగు స్తంభాలకు నమస్కరిస్తున్న సింహాల బొమ్మలు ఏర్పాటు చేశారు. ఘాట్‌లో తోరణాలు ఏర్పాటు చేస్తున్నారు.దుస్తులు మార్చుకునే గదుల నిర్మాణం కాళేశ్వరం: పుణ్యస్నానాలు చేసిన అనంతరం మహిళలు దుస్తులు మార్చుకోవడానికి సరస్వతీఘాట్ వద్ద గదులు నిర్మిస్తున్నారు. 24 వరకు గదులు నిర్మించారు. మెయిన్ఘాట్లో 12 గదులు నిర్మించారు. కాళేశ్వరం: కాళేశ్వరంలో మే15 నుంచి 26వ తేదీ వరకు జరుగనున్న సరస్వతీనది పుష్కరాల్లో తొలిసారి కాశీపండితులతో నవహారతులు ఇవ్వడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏడు గద్దెలు సరస్వతీమాత విగ్రహం ఎదుట నిర్మాణం చేశారు. ఏడుగురు పండితులు తొమ్మిది హారతులు 12 రోజుల పాటు ఇవ్వనున్నారు. కాశీ నుంచి పండితులు అశుతోశ్ పాండే, అభిషేక్ పాండే, నితీశ్‌కుమార్ పాండే, సమంత్ తివారీ, కౌశల్ తివారీ, దీపక్పాండే, అంకిత్‌పాండే, శివమ్ మిశ్రా ప్రత్యేక విమానంలో రానున్నారు. -
కష్టపడేవారికి తగిన గుర్తింపు
మహబూబాబాద్ రూరల్: కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం కష్టపడేవారికి తగిన గుర్తింపు ఉంటుందని టీపీసీసీ పరిశీలకులు కూచన రవళిరెడ్డి, పొట్ల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ అన్నా రు. జిల్లా కేంద్రంలోని పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత, నిర్మాణ సన్నాహక సమావేశం సోమవారం నిర్వహించారు. ముందుగా కాంగ్రెస్ బ్లాక్, మండల, అర్బన్, గ్రామ, వార్డు కమిటీ అధ్యక్ష పదవుల కోసం అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. కార్యకర్తలే పార్టీకి బలమైన పునాది అని, అలాగే పార్టీ బలంగా ఉంటేనే కార్యకర్తలు బలంగా ఉంటారన్నారు. మహిళలకు కూడా పార్టీ పదవుల్లో సమాన అవకాశాలు కల్పిస్తామన్నారు. ఒక నియమావళిని రూపొందించి దానికి అనుగుణంగా కమిటీలను ఏర్పాటు చేయాలని అభిప్రాయపడ్డారు. సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు జెన్నారెడ్డి భరత్ చందర్ రెడ్డి, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అజ్మీరా సురేశ్, ఎండీ.ఖలీల్, బోడ రవి, మిట్టకంటి రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బయ్యారం పెద్దచెరువుపై చిన్నచూపు
బయ్యారం: కాకతీయుల కాలంలో నిర్మించిన బయ్యారం పెద్ద చెరువుపై పాలకులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. బయ్యారం, గార్ల మండలాలకు కల్పతరువుగా ఉన్న చెరువుకు సీతారామ ప్రాజెక్టు ద్వారా నీటిని తరలించాలని ముందు ప్రతిపాదనలు చేసిన ప్రజాప్రతినిధులు.. తర్వాత డిజైన్మార్చి ఇక్కడి రైతులకు అన్యాయం చేస్తున్నారు. డిజైన్ మార్చి అన్యాయం.. బీఆర్ఎస్ పాలనలో అప్పటి సీఎం కేసీఆర్ సీతారామప్రాజెక్టు శంకుస్థాపన సందర్భంగా భద్రాద్రి జిల్లా టేకులపల్లి మండలం రోళ్లపాడులో నిర్వహించిన బహిరంగసభలో కాల్వల డిజైన్‌ను ప్రజల సాక్షిగా ప్రకటించారు. ఆ డిజైన్ ప్రకారం రోళ్లపాడు చెరువులోకి వచ్చే గోదావరి జలాలను అక్కడి నుంచి గ్రావిటీ ద్వారా బయ్యారం పెద్దచెరువులోకి తీసుకొస్తామని ప్రకటించారు. ఆ తర్వాత బయ్యారం పెద్దచెరువును రిజర్వాయర్‌గా మార్చి ఇక్కడి నుంచి జిల్లాలోని కురవి, డోర్నకల్ మండలాల మీదుగా ఖమ్మం జిల్లాలోని పాలేరు రిజర్వాయర్‌కు నీటిని తరలిస్తామని ప్రకటించారు. అయితే ఆ సమయంలో పాలేరు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి తన పలుకుబడిని ఉపయోగించి బయ్యారం చెరువుకు నీరు రాకుండా డిజైన్‌ను మార్చి అన్యాయం చేశారని రైతులు ఆరోపిస్తున్నారు. ఎన్నికల ముందు హామీలు ఇచ్చినా.. గత సాధారణ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యనాయకులు బయ్యారం పెద్దచెరువుకు గోదావరి నీటిని తీసుకొస్తామని ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోలేదు. ఇటీవల స్థానిక ఎమ్మెల్యే కోరం కనకయ్య బయ్యారం పెద్దచెరువుకు సీతారామ ప్రాజెక్ట్‌కు బదులు దేవాదుల నీటిని తీసుకొచ్చేందుకు ఇరిగేషన్ అధికారులతో క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు. అయితే ఈ అంశంపై ప్రభుత్వం నుంచి స్పష్టత రాలేదని రైతులు పేర్కొంటున్నారు. స్పష్టత కోసం ఎదురుచూపులు.. కొత్త జిల్లాల ఏర్పాటుకు ముందు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అంతర్భాగంగా ఉన్న బయ్యారం, గార్ల మండలాల నుంచి ప్రస్తుత డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క శాసనమండలి సభ్యుడిగా కొనసాగారు. ఇలా ఈ ప్రాంతంతో అనుబంధం ఉన్న ఆయన రాష్ట్ర ప్రభుత్వంలో కీలకమైన డిప్యూటీ సీఎం హోదాలో ఉండడంతో బయ్యారం పెద్దచెరువు అభివృద్ధి విషయంపై తన పర్యటన ద్వారా స్పష్టత వస్తుందా అని బయ్యారం, గార్ల మండలాల రైతులు ఎదురుచూస్తున్నారు. నేడు పర్యటన.. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మండలంలోని పలు గ్రామాల్లో మంగళవారం పర్యటించనున్నారు. రోడ్డు మార్గం ద్వారా వచ్చి లక్ష్మినర్సింహపురంలో విద్యుత్ ఉపకేంద్రం, బ్రిడ్జి నిర్మాణపనులు, గంధంపల్లి–కొత్తపేటలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ విగ్రహ ఆవిష్కరణ, రామచంద్రాపురం, కొమ్మవరంలో విద్యుత్ ఉపకేంద్రాల ఏర్పాటు పనులకు డిప్యూటీ సీఎం శంకుస్థాపన చేయనున్నారు. ఆ తర్వాత భద్రాద్రి జిల్లాలో డిప్యూటీ సీఎం పర్యటన కొనసాగనుంది. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సీతారామ ప్రాజెక్టు జలాలు రాకుండా అడ్డగింత డిజైన్ మార్చడంతో బయ్యారం, గార్ల మండలాల రైతుల్లో ఆందోళన నేడు మండలంలో పర్యటించనున్న డిప్యూటీ సీఎం మల్లుభట్టి విక్రమార్క చెరువు నీటివనరుపై స్పష్టత ఇచ్చేనా.. -
దరఖాస్తులు సత్వరమే పరిష్కరించాలి
మహబూబాబాద్: ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్ ఆదేశించారు. కలెక్టరేట్లోని ప్రధాన సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించగా కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్, అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పెండింగ్ వినతులు కూడా వెంటనే పరిష్కరించాలన్నారు. పరిష్కారం నోచుకోకపోతే కారణాలతో కూడిన నివేదిక అందజేయాలన్నారు. వినతుల విషయంలో నిరక్ష్యం చేస్తే ఉపేక్షించేది లేదన్నారు. మొత్తం 85 వినతులు అందజేశారు. ఎక్కువగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని వినతులు ఇచ్చారు. కార్యక్రమంలో డీసీఓ వెంకట్వేర్లు, సీపీఓ సుబ్బారావు, డీపీఓ హరిప్రసాద్, జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు. కొన్ని వినతులు పరిశీలిస్తే.. ● జిల్లాలో మూతబడిన పాఠశాలలను తెరవాలని జాయింట్యాక్షన్ కమిటీ స్టేట్ కో కన్వీనర్ మైస శ్రీనివాసులు, జిల్లా కన్వీనర్ మామిడాల సత్యనారాయణ వినతిపత్రం అందజేశారు. 144 పాఠశాలలను మూసివేశారని, ఇందులో 123 గిరిజన తండాల్లో ఉన్నాయని, అధికారులు ఆలోచించి ఆ పాఠశాలలను పునఃప్రారంభించాలని కోరారు. ● కురవి మండలం నల్లెల గ్రామానికి చెందిన ఖాజాపాషా అనే దివ్యాంగుడు అర్హులకు కాకుండా అనర్హులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నారని వినతిపత్రం అందజేశాడు. ● బయ్యారం మండలం ఇర్సులాపురం గ్రామానికి చెందిన దివ్యాంగుడు శ్రీను తన తల్లి పేరిట ఇందిరమ్మ ఇల్లు మంజూరైందని, అయితే వయసు 57 సంవత్సరాలు దాటిందని తన తల్లి పేరు తొలగించారని, తమను అర్థం చేసుకుని ఇల్లు మంజూరు చేయాలని వినతి ఇచ్చాడు. కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్ ప్రజావాణిలో 85వినతుల స్వీకరణ -
ప్రయాణికుల అవసరాలను గుర్తిస్తాం
మహబూబాబాద్ రూరల్: ప్రయాణికుల అవసరాల మేరకు మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటామని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు హుస్సేన్‌నాయక్ అన్నారు. మహబూబాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులను సోమవారం ఆయన పరిశీలించారు. పనుల వివరాలను రైల్వే స్టేషన్ సూపరింటెండెంట్ కనకరాజును అడిగి తెలుసుకున్నారు. రైల్వే నాల్గో ప్లాట్ ఫారం నిర్మాణం చేపట్టాలని స్థానికులు కోరగా.. కేంద్ర రైల్వే శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. ప్రయాణికుల అవసరాల మేరకు పలు రైళ్లు నిలుపుదల చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ క్లాత్ మర్చంట్స్ అసోసియేషన్ బాధ్యులు హుస్సేన్‌నాయక్‌కు వినతిపత్రం అందజేశారు. వందేభారత్, జీటీ, ఏపీ, తమిళనాడు, గరీబ్‌రథ్, ఎల్టీటీ, సంఘమిత్ర రైళ్లకు హాల్టింగ్ సౌకర్యం కల్పించాలన్నారు. రామచంద్రరావు, శ్యాంసుందర్ శర్మ, అశోక్, గంగాధర్నాథ్, అజయ్, సందీప్, రాంబాబు, నరేష్, ప్రేమ్ రాయుడు, రామకృష్ణ, రాంబాబు, పద్మ, వెంకన్న పాల్గొన్నారు. పోడు భూములకు పట్టాలు మంజూరు చేయండి.. గూడూరు: ఏజెన్సీ ప్రాంతంలోని పోడు రైతులకు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ఇప్పించాలని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు హుస్సేన్‌నాయక్ ఫారెస్టు అధికారులను కోరారు. మండలంలోని గుండెంగలో పోడు రైతుల ఫిర్యాదు మేరకు సోమవారం ఆయన వారి భూములను సందర్శించారు. గిరిజన రైతులు తమ సమస్యలను హుస్సేన్‌నాయక్‌కు చెప్పుకున్నారు. గుండెంగ జీపీ పరిధిలోని భూములు వరంగల్, మహబూబాబాద్ జిల్లాల అటవీ సరిహద్దులో ఉన్నాయని, వారికి గతంలో ఆర్ఓఎఫ్ ఆర్ పట్టాలు రాలేదని, ఆ రైతుల అప్లికేషన్లు తీసుకొని మంజూరు చేయాలన్నారు. తహసీల్దార్ చంద్రశేఖర్‌రావు, ఫారెస్టు అధికారులు పాల్గొన్నారు. రోగులకు నాణ్యమైన వైద్యం అందించాలి నెహ్రూసెంటర్: రోగులకు నాణ్యమైన వైద్యాన్ని అందించాలని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్ అన్నారు. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిని సోమవారం ఆయన సందర్శించి పరిశీలించారు. వార్డులను పరిశీలించి రోగులకు అందుతున్న సౌకర్యాలు, వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైద్యులతో సమావేశం నిర్వహించారు. జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోతు హుస్సేన్‌నాయక్ -
జీజీహెచ్‌లో శిశువు మృతి
నెహ్రూసెంటర్ : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఆదివారం నవజాత శిశువు మృతి చెందింది. కుటుంబీకుల కథనం ప్రకారం.. కురవి మండలం మొగిలిచర్ల శివారు జగ్యాతండాకు చెందిన నూనావత్ భువనేశ్వరికి పురిటినొప్పులు రాగా ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఇక్కడ వైద్యులు.. భువనేశ్వరికి స్కానింగ్ చేసి శిశువు కడుపులోనే మృతి చెందినట్లు చెప్పారు. నార్మల్ డెలివరీ చేసి శిశువును బయటకు తీసిన అనంతరం మృతదేహాన్ని అప్పగించారు. కాగా, మూడు రోజుల క్రితం ఆస్పత్రికి వస్తే బాగానే ఉన్నారని వైద్యులు చెప్పారని, ఇప్పుడు శిశువు ఎందుకు మృతి చెందాడని వైద్యులను నిలదీశారు. ఈ ఘటనపై ఆస్పత్రి ఆర్ఎంఓ జగదీశ్వర్‌ను వివరణ కోరగా జన్యుపరమైన కారణాలతో శిశువు కడుపులోనే మృతి చెందాడని, వైద్యుల నిర్లక్ష్యమేమి లేదని తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. -
పాకాల ఏటిపై బ్రిడ్జి నిర్మించాలి
గార్ల: పాకాల ఏటిపై హైలెవల్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఆదివారం ఏటివద్ద సీపీఐ ఆధ్వర్యంలో చేపట్టిన నిరాహార దీక్షలను సీపీఐ జిల్లా కార్యదర్శి బి.విజయసారథి ప్రారంభించారు. ఈ దీక్షలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. 40ఏళ్లుగా పాకాల ఏటిపై హైలెవల్ బ్రిడ్జి నిర్మా ణం చేపట్టాలని రాంపురం, మద్దివంచ పంచాయతీల ప్రజలు ఎన్నో పోరాటాలు, ఆందోళనలు చేపట్టినా పాలకులు, అధికారుల్లో చలనం రావడం లేదన్నారు. పాకాల ఏటిపై బ్రిడ్జి లేకపోవడంతో ప్రతీఏటా వర్షాకాలంలో సుమారు 20 గ్రామాల ప్రజలు వరద ఉధృతితో మండల కేంద్రానికి రాలేక నానా ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. సీపీఐ రాష్ట్ర నాయకుడు కట్టెబోయిన శ్రీనివాసరావు మాట్లాడుతూ.. బ్రిడ్జి నిర్మాణానికి ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చేంత వరకు అవసరమైతే ఆమరణ దీక్ష చేస్తానని స్పష్టం చేశారు. దీక్ష శిబిరాన్ని బీఆర్ఎస్, కాంగ్రెస్, సీపీఎం, టీజేఎస్, టీవీవీ పార్టీల నాయకులు సందర్శించి తమ సంఘీభావం ప్రకటించారు. దీక్షలో నాయకులు జంపాల వెంకన్న, రాగం రమేశ్, జనార్దన్, మాగం లోకేష్, రమేశ్, నాగేష్, వీరన్న, వెంకటేష్ పాల్గొన్నారు. -
వర్షాలు వచ్చేనాటికి మరమ్మతులు చేయాలి
మా గ్రామంలోని పెద్ద చెరువు, పక్కన ఉన్న రావిరాల పెద్ద చెరువు కట్టలు పూర్తిగా తెగిపోయి. ఇప్పటికి రెండు పంటలు లాస్ అయ్యాం. చెరువు కట్ట కింద వందల మంది రైతులు వేల ఎకరాల్లో సాగు ఆగమైపోయింది. ప్రభుత్వం ఇప్పటివరకు పట్టించుకోవడం లేదు. తెగిపోయిన చెరువులను తక్షణమే మరమ్మతులు చేపట్టాలి. చెరువుల్లో నీరు లేకపోవడం వల్ల వ్యవసాయ బావులు, బోర్లలో నీరు ఇంకిపోయి చెరువు కిందే కాకుండా చుట్టుపక్కల కూడా పంటలు పండే పరిస్థితి లేదు. – రాపాక వీరభద్రయ్య, రైతు, సీతారాంపురం -
వైభవంగా లక్ష్మీనృసింహుడి కల్యాణం
మహబూబాబాద్ రూరల్: లక్ష్మీనృసింహుడి జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని మహోదయ నగర్ కాలనీలోని శ్రీలక్ష్మీనరసింహ స్వామివారి దేవాలయంలో ఆదివారం స్వామివారు, అమ్మవార్ల కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు జెన్నారెడ్డి భరత్ చందర్ రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ పోతురాజు రాజు, బూర వెంకన్న, భక్తులు పాల్గొన్నారు.అధికారుల పర్యవేక్షణలో ధాన్యం కొనుగోళ్లుఅదనపు కలెక్టర్ వీరబ్రహ్మచారిమహబూబాబాద్: ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు, రవాణా జరుగుతోందని అదనపు కలెక్టర్ వీర బ్రహ్మచారి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అవసరం ఉన్న చోట లారీలను సిద్ధంగా ఉంచి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా కాంటా వేసి ధాన్యాన్ని తరలిస్తున్నామన్నారు. కొనుగోలు కేంద్రాల్లో సరిపడా గన్నీ బ్యాగులు, టార్పాలిన్లు అందుబాటులో ఉన్నాయన్నారు. అధికారులంతా సమన్వయంతో పని చేస్తున్నారని చెప్పారు. కలెక్టరేట్లో ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు చేసి ధాన్యం రవాణాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆదేశాలు జారీ చేస్తూ, పర్యవేక్షిస్తున్నామన్నారు.పెండింగ్ వేతనాలు చెల్లించాలినెహ్రూసెంటర్: మున్సిపల్ కార్మికులకు పెండింగ్ వేతనాలు వెంటనే విడుదల చేయాలని టీయూసీఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కొత్తపల్లి రవి, బిల్లకంటి సూర్యం ఆదివారం అన్నా రు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... పరిసరాలను పరిశుభ్రం చేస్తున్న కార్మికులకు వేతనాలు ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టడం సరికాదన్నారు. కార్మిక ఉద్యోగులకు నెలనెలా వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.సింగరేణి సీఎండీ పూజలుకాళేశ్వరం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామిని తెలంగాణ సింగరేణి సంస్థ సీఎండీ బలరాంనాయక్, రాష్ట్ర దేవాదాయశాఖ సలహాదారు గోవిందహరి వేర్వేరుగా దర్శించుకున్నారు. ఆదివారం ఆయన ఆలయానికి రాగా అర్చకులు మర్యాద పూర్వక స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి గర్భగుడిలో అభిషేకం, శ్రీశుభానందదేవి అమ్మవారి ఆలయంలో దర్శనం చేశారు. ఆలయ ఈఓ ఎస్.మహేష్ స్వామివారి శేషవస్త్రాలతో వారిని సన్మానించగా అర్చకులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదం అందజేశారు. -
పుష్కర పనుల్లో నాణ్యత పాటించాలి
కాళేశ్వరం: సరస్వతీనది పుష్కరాల పనుల్లో నాణ్యత పాటించాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆదేశించారు. ఆదివారం మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో సరస్వతీ(వీఐపీ)ఘాట్ సరస్వతీమాతా విగ్రహం, జ్ఞానదీపం, నదిలో భక్తుల స్నానమాచరించే ప్రదేశం, టెంట్ సిటీ తదితర ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం టెంట్సిటీలో అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పనులు చాలా నెమ్మదిగా జరుగుతున్నాయని, మీరే జవాబు చెప్పాలన్నారు. గ్రామం మొత్తాన్ని విద్యుద్దీకరణతో ముస్తాబు చేయాలన్నారు. 12 రోజులు పండుగ వాతావరణం ఉట్టిపడేలా ఏర్పాట్లు చేయాలన్నారు. పిండ ప్రదాన భవనం అసంపూర్తిగా ఉందని దేవాదాయ ఇంజినీరింగ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తులు హారతి కార్యక్రమాన్ని వీక్షించేందుకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. భక్తులు నదిలోకి స్నానాలకు వెళ్లడానికి తాత్కాలిక రహదారి ఏర్పాటుతోపాటు క్వియర్ మ్యాట్ ఏర్పాటు చేయాలన్నారు. భక్తులు నదిలోకి వెళ్లకుండా బారికేడ్స్, ప్రమాద హెచ్చరికల బోర్డ్స్ ఏర్పాటు చేయాలన్నారు. నది వద్ద 50 మంది గజఈతగాళ్లను అందుబాటులో ఉంచి, నాటుపడవలను సిద్ధంగా ఉంచాలన్నారు. మొదటిసారి కాళేశ్వరంలో టెంట్ సిటీ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. హారతి కార్యక్రమం పర్యవేక్షణకు దేవాదాశాఖ నుంచి ప్రత్యేక అధికారులను నియమించాలని సూచించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభోత్సవానికి వస్తున్నారని, అలాగే తదుపరి రోజుల్లో గవర్నర్, రాష్ట్ర మంత్రులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. మహదేవపూర్ నుంచి వీధిదీపాలు ఏర్పాటుతో పాటు డివైడర్లు మధ్యలో స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌కు సూచించారు. రహదారులకు మరమ్మతులు నిర్వహించాలని, ఎక్కడా గుంతలు ఉండొద్దని ఆర్అండ్బీ, జాతీయ రహదారుల అధికారులను ఆదేశించారు. తాత్కాలిక బస్టాండ్ వద్ద తాత్కాలిక లైటింగ్, మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలన్నారు. పనుల్లో నాణ్యత పాటించాలని, లేనిపక్షంలో చర్యలు తప్పవని కాంట్రాక్టర్లును హెచ్చరించారు. ప్రత్యేకాధికారులు స్థానికంగా ఉండి పనులను పర్యవేక్షించాలని తెలిపారు. నిమిషం కూడా కరెంట్ కట్ కావొద్దని, కాటారం, బీరసాగర్ నుంచి విద్యుత్ సరఫరా తీసుకోవాలన్నారు. భక్తులకు ప్రతీ రోజు అన్నదానం చేయాలని స్పష్టం చేశారు. పుష్కరాలు దగ్గర పడుతున్న సమయంలో ఎందుకు స్లాబు వేశారని, పని ఎలా అయిపోతుంది చెప్పండంటూ దేవస్థానం ఇంజనీరింగ్ అధికారులను ప్రశ్నించారు. స్లాబ్ చేయకుండా ఉండాల్సిందని భక్తులు నదిలోకి ఎలా వెళ్తారని అసంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్, దేవాదాయ శాఖ కమిషనర్ వెంకటరావు, సింగరేణి సీఎండీ బలరాంనాయక్, కలెక్టర్ రాహుల్‌శర్మ, ఎస్పీ కిరణ్‌ఖరే, దేవాదాయ శాఖ ఆర్జేసీ రామకృష్ణారావు, అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, కాటారం సబ్‌కలెక్టర్ మ యాంక్ సింగ్, ఈఓ మహేశ్, ఇరిగేషన్, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, వైద్య, ఆర్అండ్బీ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. నదిలో బోట్లు తిప్పేందుకు అవకాశం ఇవ్వాలి.. కాళేశ్వరం: కాళేశ్వరంలో మే 15 నుంచి 26వ తేదీ వరకు జరగనున్న సరస్వతీనది పుష్కరాల్లో త్రివేణి సంగమంలో బోట్లు తిప్పేందుకు అవకాశం ఇవ్వాలని మంత్రి శ్రీధర్‌బాబును స్థానిక గంగ పుత్రులు వేడుకున్నారు. మంత్రి ఆదివారం కాళేశ్వరానికి రాగా తమ జీవనోపాధి గురించి వివరించగా ఆయన సానుకూలంగా స్పందించారు. కలెక్టర్ రాహుల్‌శర్మ, ఎస్పీ కిరణ్ఖరేకు గంగ పుత్రులకు అవకాశం ఇవ్వాలని ఆదేశించారు. మంత్రి వెంట సింగరేణి సీఎండీ బలరామ్‌నాయక్, ఇతర అధికారులు ఉన్నారు. గ్రామం మొత్తం విద్యుద్దీపాలు ఏర్పాటు చేయాలి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు పుష్కర ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష -
తరుణ్‌కు 325 ర్యాంకు
మహబూబాబాద్ రూరల్ : మహబూబాబాద్ మండలం అయోధ్య జీపీ పరిధిలోని భజన తండాకు చెందిన గుగులోత్ నెహ్రూ, సత్తి దంపతుల పెద్ద కుమారుడు తరుణ్ టీజీ ఎప్‌సెట్ ఫలితాల్లో 325 ర్యాంకు సాధించాడు. హైదరాబాద్ హయత్‌నగర్ ప్రాంతంలోని ఓ కళాశాలలో 2024 మార్చిలో ఇంటర్ ఎంపీసీ పూర్తిచేసిన తరుణ్.. కూకట్‌పల్లిలోని ఓ కోచింగ్ సెంటర్లో లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకున్నాడు. ప్రస్తుతం విడుదలైన ఎప్‌సెట్ ఫ లితాల్లో 325 ర్యాంకు సాధించి సహ విద్యార్థులకు ఆదర్శంగా నిలిచాడు. కాగా, సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కావాలన్నదే తన లక్ష్యమని తరుణ్ పేర్కొన్నాడు. ఏజేఆర్ ఆటోమోటివ్స్ షోరూం ప్రారంభం కరీంనగర్: కరీంనగర్‌లోని విట్స్ కళాశాల ఎదుట ఏర్పాటు చేసిన బుల్ కన్స్ట్రక్షన్స్ ఎక్విపెమెంట్ ఏజేఆర్ ఆటోమోటివ్స్ షోరూంను ‘సుడా’ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, బుల్ మిషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సౌత్ జోన్ హెడ్ వి.సోమసుందరం, స్టేట్హెడ్ ఎన్.సురేశ్ బాబు, షోరూం డీలర్ అంబటి జోజిరెడ్డి ఆదివారం ప్రారంభించారు. బుల్ కంపెనీకి సంబంధించి స్టాండర్డ్ పోర్ట్, స్టాండర్డ్ క్వాలిటీ, సూపర్ ఫర్ఫార్మెన్స్ ఉంటుందన్నారు. బుల్ కన్స్ట్రక్షన్స్ ఎక్విప్మెంట్ ద్వారా గంటకు లీటర్ డీజిల్ ఆదా అవుతుందన్నారు. సర్వీస్ విషయంలోనూ 100శాతం క్వాలిటీ అందిస్తామని తెలిపారు. కాంట్రాక్టర్ జగ్గారెడ్డి, ఫాదర్ సంతోశ్ పాల్గొన్నారు. ప్రతీ విద్యార్థికి ఉపాధి కల్పిస్తాం హసన్‌పర్తి: కళాశాలలో ప్రవేశం పొందిన ప్రతీ విద్యార్థికి ఉపాధి కల్పిస్తామని ఎస్వీఎస్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ ఎర్రబెల్లి తిరుమల్‌రావు అన్నారు. అల్లాడి క్లౌడ్ సొల్యూషన్ కంపెనీ నిర్వహించిన క్యాంపస్ ఇంటర్వ్యూల్లో ఉద్యోగాలు సాధించిన ఐదుగురు విద్యార్థినులకు ఆదివారం నియామక పత్రాలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళాశాలలో వివిధ కంపెనీలను ఆహ్వానించి క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నామని, ఈఏడాది 234 మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించారని వివరించారు. వారిని తిరుమల్‌రావు అభినందించారు. కార్యక్రమంలో కళాశాల ఫ్రిన్సిపాల్, ఎస్వీఎస్ విద్యాసంస్థ ల డైరెక్టర్లు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు ● ఎస్వీఎస్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ ఎర్రబెల్లి తిరుమల్‌రావు -
ప్రజలు హక్కుల కోసం పోరాడాలి
నయీంనగర్: తమ జీవనవిధానానికి భంగం కలిగినప్పు డు ప్రజలు హక్కుల కోసం పోరాడాలని తెలంగాణ పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్ అన్నారు. ఆదివారం హనుమకొండ ప్రెస్ క్లబ్లో పౌరహక్కుల సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా 3వ మహాసభ పి.రమేశ్ చందర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సభలో లక్ష్మణ్ మాట్లాడుతూ ఆదివాసీల సహజ జీవనవిధానాన్ని బలవంతంగా మార్చుకోవాలని వారిపై దాడులు, అక్రమ అరెస్ట్‌లు చేయడం వారికి రాజ్యాంగం కల్పించిన జీవించే హక్కును కాలరాయడమేనన్నారు. ప్రజా ఉద్యమాలపై జరుగుతున్న అణిచివేతను ప్రశ్నించడమే పౌర హక్కుల సంఘం ప్రధాన లక్ష్మం, కర్తవ్యమన్నారు. ఆపరేషన్ కగార్‌ను నిలిపి శాంతి చర్చలు కొనసాగించాలని కోరారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్.నారాయణరావు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి బిఎస్.పాణి, హైకోర్టు అడ్వకేట్ వి.రఘునాథ్, గుంటి రవి, టీపీఎఫ్ నాయకురాలు బి.రమాదేవి , తదితరులు పాల్గొన్నారు.తాటిచెట్టుపైనుంచి పడి గీత కార్మికుడి మృతినెల్లికుదురు: తాటిచెట్టుపైనుంచి పడి ఓ గీత కార్మి కుడు మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం ఆలేరులో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన చీకటి ప్రభాకర్ గౌడ్ (48) రోజుమాదిరిగానే తాటిచెట్టు ఎక్కి కల్లు గీసిన అనంతరం కిందికి దిగుతున్నాడు. ఈ క్రమంలో జారి కిందపడగా తీవ్ర గాయాలయ్యాయి. అటువైపుగా వెళ్తున్న ఓ వ్యక్తి చూసి సమాచారం అందించగా కుటుంబ సభ్యులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని చూడగా అప్పటికే మృతి చెందాడు. ప్రభాకర్‌గౌడ్‌కు భార్య, ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నాడు.కుటుంబ కలహాలతో యువకుడి ఆత్మహత్యకురవి: కుటుంబ కలహాలు, ఆర్థిక సమస్యలతో ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన కురవి మండలం గుండ్రాతిమడుగులో చోటు చేసుకుంది. పీఎస్సై కృష్ణారెడ్డి కథనం ప్రకారం.. కరీంనగర్‌కు చెందిన గుంజె లక్ష్మ ణ్(34)కు కురవి మండలం గుండ్రాతిమడుగు(విలేజి) గ్రామానికి చెందిన కల్పనతో కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. లక్ష్మణ్ నెల రోజుల క్రితం గుండ్రాతిమడుగు(విలేజీ)కు వచ్చాడు. ఈ క్రమంలో కుటుంబకలహాలు, ఆర్థిక సమస్యలతో శనివారం రాత్రి పురుగుల మందు తాగి రైల్వే ట్రాక్ పక్కన ధాన్యం కొనుగోలు కేంద్రం సమీపంలో పడుకుని ఉన్నాడు. ఆదివారం ఉదయం కొనుగోలు కేంద్రానికి వచ్చిన కొందరు రైతులు లక్ష్మణ్ పడుకుని ఉన్న విషయాన్ని కుటుంబీకులకు తెలిపారు. వారు ఘటనాస్థలికి చేరుకుని చూడగా అప్పటికే మృతి చెంది కనిపించడంతో పోలీసులకు సమాచారం అందజేశారు. మృతుడి తమ్ముడు రాము ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతదేహాన్ని లక్ష్మణ్ కుటుంబీకులు కరీంనగర్ తరలించారు.అమ్మమ్మతాతయ్య మందలించారని గొల్లపల్లిలో మరో యువకుడు..నెక్కొండ: అమ్మమ్మతాతయ్య అకారణంగా మందలించారనే మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఆదివారం మండలంలోని గొల్లపల్లిలో జరిగింది. ఎస్సై మహేందర్ కథనం ప్రకారం... గ్రామానికి చెందిన బట్టు అజయ్ (21) తల్లి చిన్నతనంలో మృతి చెందింది. దీంతో అజయ్‌ని అమ్మమ్మతాతయ్య పెంచిపెద్ద చేశారు. అజయ్ తాపీ మేసీ్త్ర పని చేస్తుండగా ఈ నెల 10న సాయంత్రం ఇంటి వచ్చాడు. ఎక్కడకి వెళ్లావని, కాళ్లు కడుక్కుని ఇంట్లోకి రావాలని మందలించారు. దీంతో తనను చిన్న విషయాలకే అకారణంగా మందలిస్తున్నారని, స్వేచ్ఛ లేదని అజయ్ మనస్తాపానికి గురయ్యాడు. క్షణికావేశంలో ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి సోదరి శిరీష ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. -
టీజీఎప్‌సెట్‌లో ‘షైన్’ విజయకేతనం
హన్మకొండ: టీజీఎప్‌సెట్–2025 ఫలితాల్లో షైన్ విజయకేతం ఎగురవేసింది. రాష్ట్ర స్థాయిలో 181, 277, 1279 ర్యాంకులు సాధించి కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా ఫలితాలు సాధించిందని షైన్ విద్యా సంస్థల చైర్మన్ మూగల కుమార్ యాదవ్, డైరెక్టర్లు మూగల రమ, మూగల రమేశ్ తెలిపారు. షైన్ విద్యాసంస్థలు మొదటి నుంచి జే.ఈ.ఈ. మెయిన్స్, నీట్, ఈఏపీసీఈటీలో అత్యుత్తమ శిక్షణ వరంగల్‌లో అందిస్తున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులను సైతం చక్కటి అకడమిక్ ప్రోగ్రామింగ్, ప్రణాళిక ద్వారా ఆణిముత్యాలుగా తీర్చిదిద్దుతూ రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధిస్తున్నామని తెలిపారు. టీజీఎప్‌సెట్ అగ్రికల్చర్ కేటగిరీలో డి.ఇందు 181 ర్యాంకు సాధించిందని తెలిపారు. కె.సహస్ర 277, బి.సంధ్య 2,227, ఎం.రమ్య 2,963, ఇ.సాహితీ 4,879, ఇంజనీరింగ్ కేటగిరీలో పి.శ్రీ మహేశ్ 1,279, ఎం.వరుణ్ 3,153, సి.హెచ్.సరిసహస్ర 4,133, కె.కస్తూరి 5,741, కె.చాణక్య 5,962, కె.విష్ణు 6,915, జి.నిగమ 7,009, ఎస్.శ్రీచైతన్య 8,162, ఎం.సుశాంత్ 8,795 ర్యాంకు సాధించారని వివరించారు. వీరితో పాటు అగ్రికల్చర్ కేటగిరీలో 23 మంది విద్యార్థులు 20 వేల లోపు ర్యాంకులు, ఇంజనీరింగ్ కేటగిరీలో 31 మంది విద్యార్థులు 20 వేల లోపు ర్యాంకులు సాధించారని చైర్మన్ తెలిపారు. ఆదివారం కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ర్యాంకు సాధించిన విద్యార్థులను అభినందించారు. కార్యక్రమములో షైన్ విద్యా సంస్థల కళాశాలల ప్రిన్సిపాళ్లు మారబోయిన రాజు గౌడ్, శ్రీనివాస్ గౌడ్, సంధ్య, ప్రశాంత్, అధ్యాపకులు పాల్గొన్నారు. -
‘రెజోనెన్స్’ విద్యార్థుల ప్రతిభ
హన్మకొండ: టీజీఎప్‌సెట్–2025 ఫలితాల్లో రెజోనెన్స్ విద్యాసంస్థల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. తమ విద్యార్థులు రావుల ఇక్షవర్ 265వ ర్యాంకు, ఎ.సాయి రోహన్ 467, ఎ.నాగసాయి 806 ర్యాంకు సాధించారని రెజోనెన్స్ విద్యా సంస్థల చైర్మన్ లెక్కల రాజిరెడ్డి తెలిపారు. 272 మంది విద్యార్థులు 10,000 కంటే తక్కువ ర్యాంకులు సాధించారన్నారు. విద్యార్థులు ఉజ్వల భవిష్యత్ కోసం తమ విద్యాసంస్థ కృషి చేస్తోందన్నారు. తమ అధ్యాపకుల అంకితభావం, విద్యార్థుల అవిశ్రాంత కృషి, వారి తల్లిదండ్రుల నిరంతర సహకారంతో ఈ విజయం సాధ్యమైందన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్లు లెక్కల మహేందర్ రెడ్డి, మాదిరెడ్డి దేవేందర్ రెడ్డి, సీఏఓ లెక్కల రమ్య రాజిరెడ్డి పాల్గొన్నారు. -
నిరంతరం విద్యుత్ కాంతులు
కాళేశ్వరం: కాళేశ్వరంలో మే 15 నుంచి 26వ తేదీ వరకు జరగనున్న సరస్వతీనది పుష్కరాల్లో విద్యుత్ కాంతులు నిరంతరాయంగా అందించేందుకు టీజీ ఎన్పీడీసీఎల్ అఽధికారులు, సిబ్బంది రాత్రిపగలు శ్రమిస్తున్నారు. ఎస్ఈ మల్చూర్ నాయక్, డీఈ పాపిరెడ్డి, ఏడీఈ నాగరాజు, ఏఈ శ్రీకాంత్, కాళేశ్వరం లైన్ఇన్స్పెక్టర్ సదానందం నిరంతరం అందుబాటులో ఉంటూ పనులు త్వరితగతిన చేయిస్తున్నారు. రూ.కోటిన్నరతో కాళేశ్వరంలో మొత్తం 500 వరకు స్తంభాలు, రూ.2 కోట్లతో సబ్‌స్టేషన్‌లో రెండు ఎంవీఐ ట్రాన్స్ఫార్మర్లు, 100 కేవీఏ, 25కేవీఏ ట్రాన్స్ఫార్మర్లు 20 వరకు అమర్చారు. దీంతో కాళేశ్వరం అంతటా 24 గంటల త్రీఫేజ్ ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే రోజుకు 50 మంది సిబ్బంది పనులు చేస్తుండగా, పుష్కరాల సందర్భంగా 80 వరకు పెంచుతున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. -
మళ్లీ సాయంత్రం బడులు
హసన్‌పర్తి: సంపూర్ణ అక్షరాస్యత కోసం ప్ర భుత్వం మళ్లీ సాయంత్రం బడులు ప్రారంభించనుంది. సామాజిక చైతన్య కేంద్రాల పేరిట ఈ కార్యక్రమాన్ని ని ర్వహించనుంది. గతంలో వయోజన కేంద్రాల ద్వారా సాయంత్రం బ డులు నిర్వహించారు. గ్రామంలో 19 ఏళ్ల పైబడి ఉండి చదువు రాని వారు ఈ కేంద్రాలకు వచ్చి చదువుకునేవారు. ఇందుకు ప్రత్యేక వలంటీర్లను నియమించారు. 20 ఏళ్ల క్రితం ఈ కేంద్రాలు రద్దయ్యాయి. సామాజిక చైతన్య కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం వయోజన విద్య కేంద్రాల స్థానంలో సామాజిక చై తన్య కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. ఇందుకు మార్గదర్శకాలు జా రీ చేసింది. మండల స్థాయిలో ఎంఈఓ కన్వీనర్‌గా, ఇందిరా క్రాంతి పథం ఏపీఓ కోకన్వీనర్‌గా వ్యవహరించనన్నారు. గ్రామస్థాయిలో ప్రఽ దానోపాధ్యాయుడు కన్వీనర్‌గా, పీఏసీఎస్ చైర్మన్ కోకన్వీనర్‌గా, స్వయం సహాయక సంఘం సభ్యురాలు, విశ్రాంత ఉపాధ్యాయుడు, స్వచ్ఛంద సంస్థ సభ్యుడి సభ్యులుగా వ్యవహరిస్తారు. ఈనెల 12 తర్వాత అర్హుల గుర్తింపు ప్రక్రియ చేపట్టనున్నారు. ‘ఉల్లాస్’ యాప్‌లో.. చదువురాని వయోజనులను గుర్తించి వారి పేర్లను ఉల్లాస్ యాప్‌లో నమోదు చేయనున్నట్లుఽ అధికారులు వెల్లడించారు. దీంతో గ్రామాల్లో ఎంతమంది నిర్లక్ష్యరాస్యులు ఉన్నారో స్పష్టం కానుంది. నేడు గ్రామస్థాయి సమావేశాలు.. ఈనెల 12న గ్రామస్థాయి సమావేశాలు నిర్వహించనున్నారు. స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడి అధ్యక్షతన ఈ సమావేశం ఉంటుంది. జూన్ 1 నుంచి ప్రారంభం సామాజిక చైతన్య కేంద్రాలు జూన్ 1 నుంచి ప్రారంభించనున్నట్లు ఎంఈఓ రాజిరెడ్డి తెలిపారు. చదువు చెప్పడానికి ముందుకు వచ్చేయ వారికి అవకాశం కల్పిస్తామని పేర్కొన్నారు. గ్రామాల్లో వందశాతం అక్షరాస్యత సాధించే దిశలో కృషి చేయాలని కోరారు. సామాజిక చైతన్య కేంద్రాల ద్వారా విద్యా బోధన జూన్ 1వ తేదీ నుంచి ప్రారంభం నేడు గ్రామస్థాయి సమావేశాలు -
‘శివాని’ విద్యార్థుల సత్తా
విద్యారణ్యపురి: టీజీఎప్‌సెట్ ఫలితాల్లో శివాని జూనియర్ కాలేజీ విద్యార్థులు సత్తా చాటారని ఆ కళాశాల కరస్పాండెంట్ టి. స్వామి, ప్రిన్సిపాళ్లు సురేందర్‌రెడ్డి వి. చంద్రమోహన్ తెలిపారు. డైరెక్టర్లు టి. రాజు, ఎన్. రమేశ్, ఎ. మురళీధర్.వి సురేశ్, ఎస్. సంతోశ్ రెడ్డి ఆదివారం ర్యాంకులు సాధించిన విద్యార్థులను అభినందించారు.అరికిల్ల నిస్సీ 1,309వ ర్యాంకు, ఆరె హాసిని 1,352వ ర్యాంకు, మార్గం హారిక 1,852వ ర్యాంకు, కోరె ఓం చందర్ 2,592వ ర్యాంకు, పాడి శ్రీవాణి 2,785వ ర్యాంకు, గుగులోత్ తరుణ్ 3,299వ ర్యాంకు, గుగులోత్ రమేశ్ 3,988వ ర్యాంకు, సల్మా4,527వ ర్యాంకు, మారం లక్ష్మణ్ 4,533వ ర్యాంకు, తమ్మడబోయిన అభిరామ్ 5,678వ ర్యాంకు సాధించారని వారు తెలిపారు. -
పూర్వం గుహలో సరస్వతి అమ్మవారు..
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వరముక్తీశ్వరస్వామి ఆలయ అనుబంధదేవాలయం శ్రీసరస్వతి అమ్మవారు పూర్వం సొరంగలోని ఓ గుహలో ప్రతిష్ట చేసి ఉండేదని పురాణాల ద్వారా తెలిసింది. సొరంగ మార్గంలో వెళ్లి అమ్మవారిని దర్శించుకునేవారట. ఆ కాలంలో విద్యుత్ వెలుగులు లేకపోవడంతో సూర్యరశ్మి, నూనె దీపాల వెలుగుల్లో వెళ్లి దర్శించుకునేవారు. ఆ అమ్మవారి విగ్రహం భిన్నమై, ఆలయం శిథిలావస్థకు చేరింది. శృంగేరి పీఠాధిపతులు, శారదపీఠాధిపతులు దక్షిణ భారతదేశం పర్యటనలో కాళేశ్వరం మీదుగా వచ్చినప్పుడు గ్రామస్తుల ద్వారా తెలిసినట్లు ఆధారాలు ఉన్నాయి. 1976 తర్వాత జీర్ణోద్దరణ జరిగిన అనంతరం అప్పటి రవాణాశాఖ మంత్రి జువ్వాడి చొక్కారావు చొరవతో దినదినాభివృద్ధి చెందుతోంది. నిత్యం పూజలు చేస్తున్నారు. ప్రతీ వసంత పంచమి రోజు ప్రత్యేక అభిషేక కార్యక్రమాలు జరుగుతాయి. కాగా, దేశంలో సరస్వతి ఆలయాలు కాళేశ్వరంలోని మహాసరస్వతి, బాసరలోని జ్ఞానసరస్వతి, కాశ్మీర్‌లోని బాలసరస్వతి విశిష్టత కలిగినవి. ఈ క్రమంలో మే 15 నుంచి 26వ తేదీ వరకు జరగనున్న సరస్వతీనది పుష్కరాల సందర్భంగా అమ్మవారి దర్శనం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. -
మెరిసిన రైతు బిడ్డ..
● స్టేట్ 404వ ర్యాంకు సాధించిన స్వాతి నెల్లికుదురు: తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన టీజీ ఎప్‌సెట్ ఫలితాల్లో రైతు బిడ్డ మెరిసింది. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం ఎర్రబెల్లిగూడెం గ్రామానికి చెందిన బొమ్మెర స్వాతి 97.26 మార్కులు సాధించి స్టేట్ 404 ర్యాంకర్‌గా నిలిచింది. గ్రామానికి చెందిన బొమ్మెర ఉప్పలయ్య, సారమ్మ దంపతులకు కుమారుడు, కూతురు ఉన్నారు. తమకున్న ఎకరం భూమిలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. స్వాతి 10వ తరగతి కల్లెడలోని ఆర్డీఎఫ్ హైస్కూల్లో, ఇంటర్మీడియట్ కల్లెడలోని వీఏపీవి కళాశాలలో చదివింది. కాగా, డాక్టర్ కావడమే తన లక్ష్యమని స్వాతి తెలిపింది. కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు స్వాతిని అభినందించారు. -
పుష్కరఘాట్ పులకించేలా..
కాళేశ్వరం: సరస్వతీ పుష్కరాలకు పుష్కరఘాట్ వద్ద పనులు చకచకా జరుగుతున్నాయి. పుష్కరఘాట్ వద్ద ఏర్పాటు చేసిన సరస్వతీమాత విగ్రహానికి డెకరేషన్ చేస్తున్నారు. పుష్కరఘాట్ పొడువునా భారీగా సెట్టింగ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. శివుడి విగ్రహం, దాని ఎదుట నంది విగ్రహం ఏర్పాటు చేస్తున్నారు. కాశీపండితులతో ఏడు హారతులు ఇచ్చే సభాస్థలి వద్ద ప్రత్యేకంగా హైదరాబాద్‌కు చెందిన కేంఎంకే గ్లోబల్ లిమిటెడ్ ప్రైవేట్ సంస్థ పనులు చేపడుతుంది. దీంతో పుష్కరఘాట్ పులకించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయనే చర్చ జరుగుతోంది. -
టీజీఎప్‌సెట్‌లో ‘ఎస్ఆర్’ ప్రభంజనం
విద్యారణ్యపురి: టీజీఎప్‌సెట్– 2025 ఫలితాల్లో ఎస్ఆర్ విద్యా సంస్థల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారని, ఎంపీసీ విభాగంలో రాష్ట్రస్థాయిలో వి.నాగసిద్ధార్థ 32వ ర్యాంకు సాధించారని ఎస్ఆర్ విద్యాసంస్థల చైర్మన్ ఎ.వరదారెడ్డి, డైరెక్టర్లు మధుకర్‌రెడ్డి, సంతోశ్‌రెడ్డి తెలిపారు. ఎంపీసీ విభాగంలో మేధాకార్తీక్ 234వ ర్యాంకు, జోగు అఽభిరామ్ 471వ ర్యాంకు, బీపీసీ విభాగంలో ఎం. వినయ్ 149వ ర్యాంకు, ఎండి. అబ్దుల్లా మొహీనుద్దీన్ 162వ ర్యాంకు సాధించారని తెలిపారు. రాష్ట్రంలో ఎస్ఆర్ విజయపథాన్ని ఎగురవేశారని వివరించారు. కె. అంజనాసంతోషి 178 ర్యాంకు, పి.సాయిదివ్యాన్ 183వ ర్యాంకు, కె.సాయికిరణ్ 200వ ర్యాంకు, జి. సాయిహర్షిణి 268వ ర్యాంకు, వై. స్నేహితారెడ్డి 390వ ర్యాంకు, కె. ఏంజెల్ 412వ ర్యాంకు, వి. ప్రత్యున్నారెడ్డి, 475వ ర్యాంకు, తోట ప్రణయా 496వ ర్యాంకు, మహ్మద్‌షాహిద్ రెహాన్ 513వ ర్యాంకు, చల్లా అన్సికా 539వ ర్యాంకు సాధించారని తెలిపారు. ప్రస్తుత కాలంలో విద్యావ్యవస్థలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు గమనిస్తూ వాటిని ఆచరిస్తూ తమ విద్యాసంస్థల విద్యార్థులకు సృజనాత్మకతతోకూడిన విద్యనందిస్తున్నామని వారు తెలిపారు. -
కొడుకు చెప్పగానే ఒప్పేసుకున్న తల్లి..
ఖానాపురం: దేశంపై ఎనలేని ప్రేమ.. వ్యవసాయం చేస్తూ ఇరువురు కుమారులను పెంచింది.. డిగ్రీ వరకు చదివించింది.. కుమారుడు సైన్యంలోకి వెళ్తానంటే ఒప్పుకుంది.. వెన్నంటి ప్రోత్సహిస్తూ ఆదర్శంగా నిలిచింది వరంగల్ జిల్లా ఖానాపురం మండలంలోని అశోక్‌నగర్ గ్రామానికి చెందిన ఎల్ది పద్మ. దేశరక్షణలో భాగస్వామి కావాలని కుమారుడు ఎలేందర్‌గౌడ్‌కు సూచించింది. మొదటి ప్రయత్నంలో రాకపోవడంతో కొంత నిరుత్సాహపడ్డాడు. మళ్లీ ఎలేందర్‌గౌడ్‌ను తల్లి పద్మతోపాటు అన్న మురళి ప్రోత్సహించారు. రెండో ప్రయత్నంలో ఆర్మీలో ఉద్యోగం సాధించాడు. ప్రస్తుతం దేశరక్షణలో భాగంగా రాజస్థాన్‌లో విధులు నిర్వరిస్తున్నాడు. పాకిస్థాన్‌తో శనివారం వరకు జరిగిన యుద్ధంలో పాల్గొన్నాడు. శత్రువులతో పోరాడాడని తల్లి సంతోషం వ్యక్తం చేసింది. -
వివాహ వేడుకకు వెళ్లొస్తూ.. అనంతలోకాలకు
బచ్చన్నపేట : స్నేహితుడి అ న్న వివాహ వేడుకకు వెళ్లొస్తూ ఓ విద్యార్థి అనంతలోకాల కు చేరాడు. కారు అదుపు తప్పడంతో దుర్మరణం చెందాడు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరి కి గాయాలయ్యాయి. ఈ ఘ టన శుక్రవారం రాత్రి మండలంలోని బచ్చన్నపేట– ఆలేరు రోడ్డులోని పది మోటల బావి వద్ద జరి గింది. కుటుంబీకులు, ఎస్సై అబ్దుల్ హమీద్ కథ నం ప్రకారం.. మండలంలోని పోచన్నపేటకు చెందిన పేరిణి ఉమ, దేవేందర్ దంపతుల పెద్ద కుమారుడు గౌతమ్ (19) హైదరాబాద్ ఘట్కేసర్లోని సాంస్కృతి ఫార్మసీ కాలేజీలో బీ ఫార్మసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. శుక్రవారం గ్రామా నికి చెందిన తన స్నేహితుడి అన్న వివాహం ఉండగా స్నేహితులు దేవరాయ శ్రీకాంత్, తమ్మిడి అఖిల్‌తో కలిసి కారులో బచ్చన్నపేట (వివాహం జరిగిన ప్రాంతం) కు బయలుదేరాడు. వివాహ వేడుక అ నంతరం బచ్చన్నపేట నుంచి పోచన్నపేటకు వెళ్తున్నారు. ఈ క్రమంలో శ్రీకాంత్ కారును అజాగ్రత్తగా నడపడంతో మండలంలోని పది మోటల బావి వద్ద అదుపు తప్పి రోడ్డు కిందకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో గౌతమ్ అక్కడికక్కడే మృతి చెందగా శ్రీ కాంత్, అఖిల్‌కు గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి గౌతమ్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కుటుంబీకులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. కారు అదుపు తప్పి విద్యార్థి దుర్మరణం బచ్చన్నపేట, ఆలేరు రోడ్డులో ఘటన -
రామప్పలో రెండున్నర గంటల పర్యటన
వెంకటాపురం(ఎం): యునెస్కో గుర్తింపు పొందిన ములుగు జిల్లా వెంకటాపురం(ఎం) మండలంలోని రామప్ప దేవాలయాన్ని ఈ నెల 14న 35 దేశాలకు చెందిన మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు సందర్శించనున్నారు. ఈ నేపథ్యంలో వారి పర్యటన షెడ్యూల్‌ను అధికారులు ఖరారు చేశారు. 14న సాయంత్రం 5.15 గంటలకు ఆలయానికి మిస్ వరల్డ్ టీం బస్సులో చేరుకుంటుంది. 5.20 గంటలకు రామప్పలో ఏర్పాటు చేసిన స్టాల్ వద్ద పూజాసామగ్రి కొనుగోలు చేస్తారు. 5.25 గంటలకు ఆలయం వద్ద గిరిజన నృత్యంతో కళాకారులు స్వాగతం పలుకుతారు. 5.30 గంటలకు పూజారులు పూర్ణకుంభంతో వారికి స్వాగతం పలికి ఆలయంలోకి ఆహ్వానిస్తారు. 5.35 నుంచి 6:25 గంటల వరకు రామలింగేశ్వరస్వామివారిని దర్శించుకుని ఆలయ శిల్పకళ సంపదను తిలకిస్తారు. ఆలయ విశిష్టత గురించి వారికి టూరిజం గైడ్లు వివరిస్తారు. సాయంత్రం 6.30 గంటలకు రామప్ప గార్డెన్లో ఏర్పాటు చేసిన వేదిక వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. 6.33 గంటలకు అలేఖ్య పుంజాల బృందంతో క్లాసికల్ డ్యాన్స్, రాత్రి 7.08 గంటలకు పేరిణి నృత్య ప్రదర్శన, 7.25 గంటలకు మిస్‌వరల్డ్ టీం కంటెస్టెంట్లకు ప్రముఖులతో సత్కారం ఉంటుంది. 7.35 గంటలకు ముఖ్య అతిథి ప్రసంగం, 7.42 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు ముగుస్తాయి. రామప్పలో రెండున్నర గంటల పాటు పర్యటించిన అనంతరం సుందరీమణులు డిన్నర్ చేసి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం కానున్నారు. కాగా, మిస్‌వరల్డ్ కంటెస్టెంట్లు హిందూ సంప్రదాయ దుస్తుల్లో రామప్పను సందర్శించనున్నట్లు సమాచారం. మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ షెడ్యూల్ ఖరారు చేసిన అధికారులు -
పొట్టకూటి కోసం వచ్చి మృత్యుఒడికి..
వర్ధన్నపేట : పిడుగుపాటుకు ఓ బిహార్ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన శనివారం మండలంలోని కోనాపురంలో చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. వర్ధన్నపేట పీఏసీఎస్ ఆధ్వర్యంలో కోనాపురంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో బిహార్‌కు చెందిన బిట్టువిండ్(31) హమాలీగా పనిచేస్తున్నాడు. శనివారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. ఈ సమయంలో బిట్టువిండ్ వర్షం పడుతుండగా చెట్టుకిందికి వెళ్లాడు. కొద్ది సమయం తర్వాత సమీపంలో పిడుగు పడడంతో బిట్టువిండ్ అక్కడికక్కడే మృతిచెందాడు. బిట్టువిండ్ కొంతకాలంగా వర్ధన్నపేటలోని ఓ రైస్‌మిల్లులో హమాలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈక్రమంలో ఇటీవల పీఏసీఎస్ ఆధ్వర్యంలో కోనాపురంలో కొనుగోలు కేంద్రం ప్రారంభం కాగా అక్కడ విధులు నిర్వర్తిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. కాగా, బిట్టువిండ్ మృతదేహాన్ని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు సందర్శించారు. మృతుడి బంధువులకు రూ.15 వేల ఆర్థికసాయం అందజేశారు. పిడుగుపాటుకు విద్యార్థికి అస్వస్థత వర్ధన్నపేటలోని కొనుగోలు కేంద్రంలో ధాన్యం ఆరబోసి కుప్పలు చేస్తున్న క్రమంలో సమీపంలో పిడుగు పడడంతో వెంకటేశ్వర తండాకు చెందిన మాడావత్ వెంకన్న కుమారుడు గణేశ్ అస్వస్థతకు గురయ్యాడు. గణేశ్ ఇటీవల పదో తరగతి పాసయ్యాడు. అస్వస్థతకు గురైన గణేశ్‌ను కుటుంబీకులు ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పిడుగుపాటుకు బిహార్ యువకుడి మృతి కోనాపురంలో ఘటన -
ఎడ్లబండ్ల నుంచి హెలికాప్టర్ దాకా..
కాళేశ్వరం : కాళేశ్వరం.. గతంలో కాకులు దూరని కారడవి. దండకారణ్యం కావడంతో గతంలో ఎలాంటి రవాణా సదుపాయాలు ఉండేవి కావు. ఈక్రమంలో 1982లో జీర్ణోద్ధరణ జరిగిన తర్వాత దినదినాభివృద్ధి చెందుతోంది. అప్పుడు ఆర్టీసీ బస్సులు దిక్కు. ప్రైవేట్ వాహనాలు కూడా అంతంతే. భక్తుల సంఖ్య కూడా తక్కువే. 2013లో జరిగిన సరస్వతీపుష్కరాల వరకు కాళేశ్వరానికి ఆర్టీసీ బస్సుల్లో భక్తులు తరలివచ్చేవారు. ఈ సమయంలో బస్టాండ్ నుంచి గోదావరి ఘాట్ వరకు వెళ్లాలంటే ఎడ్ల బండ్లే దిక్కు. లేదంటే కాలినడకనే శరణ్యం. ఈ క్రమంలో 2016 డిసెంబర్లో మహారాష్ట్ర–తెలంగాణ రాష్ట్రాలను కలుపుతూ మహారాష్ట్ర ప్రభుత్వం అక్కడి నిధులు రూ.250 కోట్ల వ్యయంతో గోదావరిపై అంతర్రాష్ట్ర వంతెన నిర్మాణం చేపట్టింది. దీంతో ఇరు రాష్ట్రాల మధ్య రవాణా పెరిగింది. దీనికితోడు మంచిర్యాల జిల్లా రాపన్‌పల్లి, సిరొంచ మధ్య రూ.170 కోట్ల వ్యయంతో ప్రాణహిత నదిపై మహారాష్ట్ర ప్రభుత్వం 2018లో మరో అంతర్రాష్ట్ర వంతెన నిర్మాణంతో రవాణా మరింత పెరిగి కాళేశ్వరాలయానికి భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం వేల సంఖ్యలో ప్రైవేట్ వాహనాలు రయ్రయ్ మంటూ తిరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ నెల15 నుంచి 26వ తేదీ వరకు జరగనున్న సరస్వతీనది పుష్కరాలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు ప్రత్యేక దృష్టితో జాయ్‌రైడ్స్ ఏర్పాటు చేస్తున్నారు. కన్నెపల్లిలో మూడు, సీఎం తరహా వీవీఐపీల కోసం ఘాట్ సమీపంలో ఒకటి హెలిపాడ్లు సిద్ధం చేశారు. దీంతో ఎడ్లబండ్లపై తిరిగిన భక్తులు ఈసారి జాయ్‌రైడ్స్‌తో (హెలికాప్టర్) ఎంజాయ్ చేయనున్నారు. కాలినడక, ఎడ్లబండ్లు, ఆటోలు, కార్లలో ప్రయాణం చేసిన ప్రయాణికులు ప్రస్తుతం హెలికాప్టర్లలో చక్కర్లు కొట్టనున్నారు. అంతర్రాష్ట్ర వంతెనలతో కాళేశ్వరానికి పెరిగిన రవాణా -
పుష్కరాలకు పోలీసు సైన్యం..
కాళేశ్వరం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో ఈ నెల 15 నుంచి 26వ తేదీ వరకు జరగనున్న సరస్వతీనది పుష్కరాల్లో విధులు నిర్వర్తించేందుకు పోలీసు సైన్యం రెడీ అయ్యింది. ఎస్పీ కిరణ్‌ఖరే ఆధ్వర్యంలో 1,678 మంది సిబ్బంది పుష్కర విధుల్లో పాల్గొననున్నారు. వివిధ ప్రదేశాల్లో 12 రోజుల పాటు భద్రత నిర్వహించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సరస్వతీనది పుష్కరాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని రూ.25కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపట్టింది. తరలిరానున్న ప్రముఖులు.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీ స్‌గఢ్ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి లక్షలాదిగా 12 రోజుల పాటు రోజుకు 50 నుంచి 60వేల వరకు భక్తులు తరలిరానున్నారు. వీరితో పాటు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి 15న పుష్కరాల ప్రారంభానికి రానుండడంతో పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. పీఠాధిపతులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, సినీ పెద్దలు, ప్రముఖ వ్యాపారవేత్తలు రానున్నారు. వీరందరితో పాటు సామాన్య భక్తజనానికి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. పుష్కరాల విధుల్లో పాల్గొనే పోలీసుల వివరాలు .. డీఎస్పీలు 24, సీఐలు 60, ఎస్సైలు 196, ఏఎస్సైలు, హెడ్‌కానిస్టేబుళ్లు 214, కానిస్టేబుళ్లు 442, హోంగార్డులు, 280, మహిళ హెడ్‌కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు 100, మహిళా హోంగార్డులు 16, ఇతర రోప్‌పార్టీలు, బాంబ్స్క్వాడ్లు, డాగ్‌స్క్వాడ్‌లు ఇతర పోలీసులు విధులు నిర్వర్తిస్తారు. విధులు ఇలా.. కాళేశ్వరాలయం, పలుగుల ఎక్స్, గంగారం ఎక్స్, వీఐపీ ఘాట్, మెయిన్ఘాట్, నాలుగు పార్కింగ్ స్థలాలు, వంతెన చెక్‌పోస్టు, ఇప్పలబోరు జంక్షన్, పోలీసుస్టేషన్, తదితర ప్రాంతాల్లో పోలీసులు విధులు నిర్వర్తిస్తారు. విధుల్లో 1,678 మంది సిబ్బంది వివిధ ప్రదేశాల్లో 12 రోజుల పాటు భద్రత -
టీజీఆర్జేసీ సెట్ ప్రశాంతం..
విద్యారణ్యపురి: తెలంగాణ రాష్ట్రంలోని రెసిడెన్షి యల్ జూనియర్ కళాశాలల్లో ఈ విద్యాసంవత్సరం 2025–2026లో ప్రవేశాలకు గాను శనివారం నిర్వహించిన టీజీఆర్జేసీ సెట్ ప్రశాంతంగా జరిగింది. ఉమ్మడి వరంగల్ జిల్లా కేంద్రంలో 32 కేంద్రాల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష నిర్వహించారు. మొత్తం 7,564 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకావాల్సిండగా అందులో 6,360 మంది (84.08శాతం) హాజరుకాగా 1,204మంది గైర్హాజరయ్యారని టీజీఆర్జేసీ సెట్ హనుమకొండ జిల్లా కోఆర్డి నేటర్ కె. ఇందుమతి తెలిపారు. ఎంపీసీ గ్రూప్‌నకు 4,708 మంది విద్యార్థులకుగాను 3,986 మంది, బీపీసీ గ్రూప్‌నకు 2,668 మందికిగాను 2,237మంది, ఎంఈసీ గ్రూప్‌నకు 188 మందికిగాను 137మంది హాజరయ్యారని తెలిపారు. ఆక్స్ఫర్డ్ పరీక్ష కేంద్రాన్ని టీజీఆర్‌జేసీసెట్ జిల్లా కోఆర్డినేటర్ కె.ఇందుమతి, జిల్లా విద్యాశాఖ ఏసీజీఈ భువనేశ్వరి సందర్శించి పరీక్ష నిర్వహణ తీరును పరిశీలించారు. ఆ పరీక్ష కేంద్రం మార్పుతో ఇబ్బందులు టీజీఆర్జేసీసెట్కు హనుమకొండలో 32 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందులో కిషన్‌పురలో చైతన్యహైస్కూల్లో ఓ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. విద్యార్థులకు ఆ పరీక్ష కేంద్రం పేరుమీదే హాల్‌టికెట్లు జారీ అయ్యాయి. అయితే ఆ పరీక్ష కేంద్రంలోని విద్యార్థులకు హనుమకొండలోని ఆక్స్ఫర్డ్ స్కూల్లో పరీక్ష కేంద్రంగా మార్పుచేశారు. ఇది తెలియని కొందరు విద్యార్థులు చైతన్య హైస్కూల్ వద్దకు వచ్చారు. ఇక్కడ కాదు ఆక్స్ఫర్డ్ స్కూల్ పరీక్ష కేంద్రానికి వెళ్లాలని తెలపడంతో ఆయా వారు కొంత ఇబ్బందులు పడ్డారు. కాగా, అనివార్య పరిస్థితుల్లోనే ఆ పరీక్ష కేంద్రాన్ని మార్పు చేశామని టీజీఆర్జేసీ సెట్ జిల్లా కోఆర్డినేటర్ కె.ఇందుమతి తెలిపారు. 84.08 శాతం మంది విద్యార్థుల హాజరు -
బస్సు ఢీకొని వ్యక్తి దుర్మరణం
మహబూబాబాద్ రూరల్ : ప్రైవేట్ కళాశాల బస్సు ఢీకొని ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ ఘటన జిల్లా కేంద్రంలోని జగ్జీవన్ రామ్ కాలనీ సమీపంలో చోటు చేసుకుంది. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం ఎల్లాయిగూడెం గ్రామానికి చెందిన కొర్ర ధర్మ (55) శుక్రవారం భవన నిర్మాణ పని నిమిత్తం మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి వచ్చాడు. శనివారం ఉదయం పని నిమిత్తం జగ్జీవన్ రామ్ కాలనీ ప్రాంతం మీదుగా నడిచి వెళ్తున్నాడు. అదే సమయంలో నర్సంపేట అశోక్ నగర్ ప్రాంతానికి చెందిన బిట్స్ కళాశాల బస్సు జగ్జీవన్ రామ్ కాలనీ సమీపంలో వెనుకకు వస్తోంది. ఈ క్రమంలో ధర్మ నడిచి వచ్చే విషయాన్ని బస్సు డ్రైవర్ మల్లెపాక ఐలయ్య గుర్తించలేదు. దీంతో బస్సు ఢీకొని ధర్మకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. అవుట్ పోస్ట్ కానిస్టేబు ల్ మధు టౌన్ పోలీసులకు సమాచారం అందజే యగా టౌన్ ఎస్సై అలీంహుస్సేన్, హెడ్ కానిస్టేబు ల్ దామోదర్ ఘటనాస్థలిలో విచారణ చేపట్టారు. -
వారసులు తిరగబడుతున్నారని ఆందోళన
హసన్‌పర్తి: ‘20 ఏళ్ల క్రితం ప్లాట్లు కొనుగోలు చేశాం. పట్టాదారులు వచ్చి రి జిస్ట్రేషన్ చేశారు. రిజిస్ట్రేషన్ చేసిన వా రు లేరు. వారి వారసులు మాత్రం భూ మి అమ్మలేదని తిరుగబడుతున్నారు’ అని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈమేరకు శనివారం బాధితులు కేయూ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. భీమారం శివారు సర్వే నంబర్ 520, 521, 522, 523, 524లో 20 ఏళ్ల క్రితం పట్టాదారులు ఓ వెంచర్ చేశారు. అందులో ఆయా ప్రాంతాలకు చెందిన కింది స్థాయి ఉద్యోగులు, చిరువ్యాపారులు 75 ప్లాట్లు కొనుగోలు చేశారు. 51 ప్లాట్లను పట్టాదారుల నుంచి ఖరీదు చేయగా, మరో 24 ప్లాట్లు జీపీఏ పొందిన వడ్డేపల్లికి చెందిన పాండురాల శ్రీదేవి, పాండురాల సంపత్‌కుమార్, జూలైవాడకు చెందిన బూర జంపయ్యల నుంచి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అప్పటి నుంచి ప్లాటుదారులు మోకాపైకి రాలేదు. ఇళ్ల నిర్మాణం కోసం ప్లాట్ల వద్దకు వెళ్తే పట్టాదారుల వారుసులు బొక్క కిరణ్, కట్టెపోగుల కుమార్, సంగాల రమేశ్, సంగాల శంకర్, రేనుకుంట్ల సురేశ్, నమిండ్ల జోసెఫ్, డాక్టర్కుమార్, నమిండ్ల థామస్, నమిండ్ల రామస్వామి, ఉదయ్, నమిండ్ల సురేశ్, సందెల రజనీకాంత్ అసలు భూమినే విక్రయించలేదని తిరుగబడుతున్నారని చెప్పారు. వారితో పాటు జీపీఏ ద్వారా రిజిస్ట్రేషన్ చేసిన శ్రీదేవి, సంపత్, బూర జంపయ్య కూడా పట్టాదారులకు సహకరిస్తున్నారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్లాట్ల వద్దకు వెళ్తే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు పెడతామని బెదిరిస్తున్నట్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఈసందర్భంగా ఖరీదు చేసిన డాక్యుమెంట్లను ప్రదర్శించారు. న్యాయం జరగకపోతే ఆత్మహత్యలే.. ‘పైసా.. పైసా కూడబెట్టి ప్లాట్లు కొనుగోలు చేశాం. కూతుళ్ల పెళ్లిళ్లకు పనికొస్తాయమని భావించాం. ఇప్పుడున్న ప్లాట్లు కబ్జాకు గురవుతున్నాయి. న్యాయం జరగకపోతే కుటుంబంతో సహా ఆత్మహత్యలే శరణ్యం’ అని బాధితులు తెలిపారు. -
28 మందిపై రౌడీషీట్ ఎత్తివేత
● ప్రకటించిన డీఎస్పీ తిరుపతిరావుమహబూబాబాద్ రూరల్: రౌడీషీటర్లు సత్ప్రవర్తన కలిగిఉంటే వారిపైఉన్న రౌడీషీట్ తొలగిస్తామని డీఎస్పీ తిరుపతిరావు అన్నారు. ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ ఆదేశాల మేరకు మహబూబాబాద్ సబ్ డివిజన్ పరిధిలో సత్ప్రవర్తన కలిగిన 28 మందిపై రౌడీషీట్ తొలగించారు. సబ్ డివిజన్ పరిధిలో సత్ప్రవర్తన కలిగినవారిపై రౌడీషీట్ తొలగింపు మేళా శనివారం మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ తిరుపతిరావు మాట్లాడుతూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించకుండా సాధారణ జీవి తం గడుపుతున్న వారిపై రౌడీ షీట్లను ఎత్తివేస్తున్నట్లు తెలిపారు. రౌడీషీట్ తొలిగించినవారు భవి ష్యత్‌లో ఎలాంటి నేరాలకు పాల్పడొద్దని తెలిపా రు. అలాగే ఎక్కడైనా ఏదైనా నేరం జరిగితే పోలీసులకు సమాచారమందించే బాధ్యతాయుత పౌరులుగా పోలీసులకు సహకరిస్తారని ఆశిస్తున్నట్లు చె ప్పారు. కార్యక్రమంలో టౌన్, డోర్నకల్, బయ్యా రం సీఐలు దేవేందర్, రాజేష్, రవి, ఎస్సైలు సతీష్, తిరుపతి, దీపిక, మురళీధర్ రాజు పాల్గొన్నారు. -
అంబేడ్కర్ ఆశయ సాధనకు కృషి
గూడూరు: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ ఆశయ సాధనకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు జాటోతు హుస్సేన్‌నాయక్ అన్నారు. మండల కేంద్రంలోని బస్టాండ్ సెంటర్లో అంబేడ్కర్ కమిటీ ఏర్పాటు చేసిన అంబేడ్కర్ విగ్రహాన్ని ఆయన శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అంబేడ్కర్ విగ్రహావిష్కరణ కమిటీ కన్వీనర్ కత్తి స్వామి అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడారు. పేద వర్గాలు, వెనుకబడిన తరగతుల అభ్యున్నతికి అవసరమైన అంశాలను అంబేడ్కర్ ఆనాడే రాజ్యాంగంలో పొందుపరిచారని అన్నారు. అంబేడ్కర్ కల్పించిన హక్కులతోనే తనకు నేడు జాతీయ ఎస్టీ కమిషన్‌లో సభ్యుడిగా అవకాశం వచ్చిందన్నారు. గూడూరు మండలాన్ని డీ లిమిటేషన్‌లో డివిజన్ కేంద్రంగా మారేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రాజకీయాలకు అతీతంగా తనతో అభివృద్ధి పనులు చేయించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అంబేడ్కర్ విగ్రహావిష్కరణ కమిటీ, హిందూ ఉత్సవ సమితి అధ్యక్షుడు పింగిళి శ్రీనివాస్, అంబేడ్కర్ యువజన సంఘం అధ్యక్షుడు వీరస్వామి, వాంకుడోతు కొమ్మాలు, డాక్టర్ ఏపూరు రవీందర్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ లింగారెడ్డి, మాజీ సర్పంచ్ రమేష్‌నాయక్, రాధ, తహసీల్దార్ చంద్రశేఖర్‌రావు, తదితరులు పాల్గొన్నారు. జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు హుస్సేన్‌నాయక్ -
డిగ్రీ ఫెయిల్ అయ్యానని ఆత్మహత్యాయత్నం..
● చికిత్స పొందుతున్న విద్యార్థి మృతి కేసముద్రం: డిగ్రీ ఫెయిల్ అయ్యాననే మనస్థాపంతో ఓ విద్యార్థి గడ్డిమందు తాగి ఆత్మహత్యకు యత్నించి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం భుక్యారాంతండా జీపీ శివారు అవుసలితండాలో చోటుచేసుకుంది. ఎస్సై రవికిరణ్ కథనం ప్రకారం..తండాకు చెందిన జాటోత్ వాల్యా, సువాలి దంపతుల చిన్నకుమారుడు మోహన్(22) వరంగల్‌లోని ఓ కాలేజీలో డిగ్రీ(ఎంపీసీఎస్) చదివాడు. ఈ క్రమంలో వార్షిక పరీక్షలు రాయగా, ఇటీవల ఫలితాలు విడుదలయ్యాయి. ఇందులో ఫెయిల్ అయ్యాడు. దీంతో అప్పటి నుంచి మనస్తాపం చెందుతున్నాడు. ఈ క్రమంలో ఈనెల 6న ఇంటికి వచ్చిన మోహన్ తమ వ్యవసాయ భూమి వద్ద గడ్డిమందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన కుటుంబ సభ్యులు మానుకోట జనరల్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. యథావిధిగా కేయూ డిగ్రీ పరీక్షలు కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆది లాబాద్ జిల్లాలో డిగ్రీ కోర్సుల బీఏ, బీకాం, బీబీఏ, బీఎస్సీ , బీసీఏ, బీ ఒకేషనల్ తదితర కోర్సుల 2, 4, 6 సెమిస్టర్ పరీక్షలు, అలాగే డిగ్రీ కోర్సుల బ్యాక్లాగ్ మొదటి, మూడు, ఐదో సెమిస్టర్ పరీక్షలు ఈనెల 14 నుంచి యథావిధిగా నిర్వహించనున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి కె. రాజేందర్ శనివారం తెలిపారు. పరీక్షలు వాయిదాపడినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోందని, అది అవాస్తవమన్నారు. ఇటీవల ప్రకటించిన డిగ్రీ కోర్సుల ఆయా సెమిస్టర్ల పరీక్షలు టైంటేబుల్ ప్రకారం జరగనున్నాయన్నారు. కాగా, ఫీజులు చెల్లించిన కాలేజీల విద్యార్థులకే పరీక్షలు నిర్వహించబోతున్నామని తెలిపారు. ఇంకా పరీక్ష ఫీజులు చెల్లించని ప్రైవేట్ డిగ్రీ కాలేజీలు కూడా ఎక్కువగానే ఉన్నాయన్నారు. ఆయా కాలేజీల యాజమాన్యాలు ఈనెల 12వతేదీ వరకు పరీక్ష ఫీజులు చెల్లిస్తాయని భావిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే రెండుసార్లు పరీక్షలు వాయిదా వేశామని, ఇక వాయిదావేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. పూర్తి వివరాలు సంబంధిత కేయూ వెబ్సైట్లో ఉన్నాయని తెలిపారు. త్వరలోనే విద్యార్థులకు హాల్‌టికెట్లు జారీచేస్తామని పేర్కొన్నారు. -
ధాన్యాన్ని కాంటాలు వేసి త్వరగా తరలించాలి
దంతాలపల్లి: కొనుగోలు కేంద్రాల్లోని తమ ధాన్యాన్ని త్వరగా కాంటాలు వేసి మిల్లులకు తరలించాలని అన్నదాతలు కోరుతున్నారు. మండలంలోని తూర్పుతండా గ్రామపంచాయతీలో ధాన్యం కాంటాలు నిర్వహించి తరలించకుండా రోజుల తరబడి నిల్వ ఉంచుతున్నారని తమకు న్యాయం చేయాలని గ్రామస్తులు శని వారం గొడవకు దిగారు. తండావాసులు తెలిపి న వివరాల ప్రకారం.. మహిళా సంఘం ఆధ్వర్యంలో తండాలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అక్కడ రైతులకు ధాన్యం కాంటాలు పెట్టకుండా.. బస్తాలు తరలించకుండా ఎవరు కాసులిస్తే వారి ధాన్యం కాంటాలు నిర్వహించి దాన్యాన్ని తరలిస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం తండాకు చెందిన మాలోత్ మోహన్ 135 బస్తాలు, గుగులోత్ వెంకన్న 190 బస్తాలు కాంటాలు నిర్వహించి కొనుగోలు కేంద్రంలోనే నిల్వ ఉంచారు. నిర్వాహకులకు చెందిన నర్సింహులపే ట మండలం నాగారం గ్రామానికి చెందిన రై తు ధాన్యం కాంటాలు నిర్వహించి శనివారం వెంటనే లారీలో మిల్లుకు తరలించే ప్రయత్నం చేయగా.. తండావాసులు అడ్డుకున్నారు. ధాన్యంపై కప్పేందుకు ప్రభుత్వం ఇచ్చి న పట్టా(పరదాలు)ను సైతం నిర్వాహకులు తమ కు ఇవ్వకుండా వారి ఇళ్లలోనే దాచి ఉంచా రని రైతులు వాపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని రైతుల ను సముదాయించారు. పోలీస్‌ల జోక్యంతో శాంతించిన రైతులు ఉన్నతాధికారులు విచారణ జరిపి న్యాయం చేయాలని కోరారు.స్పాట్ కౌన్సెలింగ్మహబూబాబాద్ అర్బన్: గిరిజన గురుకుల జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ప్రథ మ సంవత్సరంలో ప్రవేశానికి స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు రీజినల్ కోఆర్టినేటర్ గిరిజ నశాఖ కార్యాలయం ఆర్సీఓ టి.హరిసింగ్ శని వారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 15వ తేదీన ములుగు జిల్లాలో ఏటూరునాగారం స్పోర్ట్స్ స్కూల్లో బాలురకు, ఈ నెల 16 తేదీ న ఏటూరునాగారం న్యూఆర్జేసీలో బాలికల కు ఉదయం 10 గంటల నుంచి కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆసక్తి, అర్హత కలిగిన విద్యార్థులు పదో తరగతి మెమో, టీసీ, స్టడీ సర్టిఫికెట్, కుల, ఆదాయం, నివాసం ఒరిజిల్ సర్టిఫికెట్లు, నాలుగు పాస్ ఫొటోలు, 2 సెట్ల జిరాక్స్‌తో కౌన్సిలింగ్‌కు హాజరుకావాలని సూచించారు. ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్ఈసీ గ్రూప్‌ల్లో అవకాశం ఉందని, విద్యార్థులు అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.9 నెలల తర్వాత కుటుంబం చెంతకు..ఖమ్మం అర్బన్: మతిస్థిమితం కోల్పోయిన ఓ వ్యక్తికి సపర్యలు చేసి కోలుకున్నాక ఆచూకీ తెలుసుకోవడంతో తొమ్మిది నెలల అనంతరం కుటుంబం చెంతకు చేరాడు. మతిస్థిమితం లేని వ్యక్తి ఖమ్మం నూతన కలెక్టరేట్ వద్ద పడిఉండగా, పోలీసులు ఇచ్చిన సమాచారంతో అన్నం ఫౌండేషన్ బాధ్యులు తమ ఆశ్రమంలో ఆశ్రయం కల్పించారు. చికిత్స అనంతరం కోలుకున్న సదరు వ్యక్తి తనది మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం చెట్లముప్పారం అని తన పేరు కాలేరు ప్రవీణ్ అని చెప్పడంతో ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాసరావు అంబులెన్స్‌లో శనివారం స్వగ్రామానికి తీసుకెళ్లారు. అయితే, ఆయన తల్లిదండ్రులు చికిత్స నిమిత్తం వరంగల్‌కు వెళ్లగా బాబాయ్ వీరేశంకు అప్పగించారు. గత వర్షాకాలంలో ప్రవీణ్ ఇంటి నుంచి తప్పిపోయాడని, మళ్లీ రావడంతో వారు హర్షం వ్యక్తం చేశారు. -
వడదెబ్బతో ఎఫ్ఏ మృతి
నర్సింహులపేట: వడదెబ్బతో ఓ ఫీల్డ్ అసిస్టెంట్ మృతి చెందాడు. ఈ ఘటన మండల కేంద్రంలో చోటు చేసు కుంది. నర్సింహులపేటకు చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ తూ డి మాణిక్యం(52) శుక్రవారం పెద్దగుట్ట, చిత్తుకుంటలో జరిగిన ఉపాధి హామీ పనులను పరిశీలించారు. ఈ సమయంలో ఎండ వేడిమికి అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే కూలీలు స్థానిక వైద్యుడి వద్దకు తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో 108లో మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. మృతుడి భార్య కల్యాణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సురేశ్ తెలిపారు. -
దేశరక్షణకు పిల్లలను సైన్యంలోకి పంపిన ఓరుగల్లు తల్లులు
ఎవరెస్టు కన్నా ఎత్తయినవి ఆమె ఊహా శిఖరాలు. సిందూరంకన్నా ఎరుపెక్కినవి ఆమె హృదయ జ్వాలలు. తనువును మోస్తున్న నేలకు, ఊపిరిలూదిన గాలికీ.. స్వేచ్ఛావాయువుల్నిచ్చిన భరత భూమికి సేవ చేయాలన్నదే ఆ తల్లుల సంకల్పం. అందుకనుగుణంగా వారి బిడ్డల్ని తీర్చిదిద్దారు. నిలువెల్లా దేశభక్తిని నూరిపోశారు. దేశసేవ కోసం సైన్యంలోకి పంపించిన ఓరుగల్లు మాతృమూర్తులే ఒక సైన్యం. నేడు(ఆదివారం) అంతర్జాతీయ మాతృదినోత్సవం సందర్భంగా దేశ సేవకు బిడ్డలను పంపిన పలువురు తల్లులపై ‘సాక్షి’ ప్రత్యేక కథనాలు..ఇద్దరు పిల్లలను ఆర్మీలోకి ..స్టేషన్‌ఘన్‌పూర్: ఇప్పగూడెం గ్రామానికి చెందిన జిట్టెబోయిన రాజు, శ్రీకాంత్ భారత ఆర్మీలో సేవలు అందిస్తున్నారు. సుభద్ర, వెంకటయ్య దంపతులకు ఇద్దరు కొడుకులు, ముగ్గురు కుమార్తెలు. వ్యవసాయం చేస్తూ పిల్లలను చదివించి వివాహం చేశారు. కాగా పిల్లలకు తల్లి చిన్నప్పటి నుంచే దేశభక్తిని నూరిపోసింది. దేశ రక్షణకు మించిన సేవ లేదని చెప్పిన మాతృమూర్తి కోరిక మేరకు కొడుకులిద్దరూ డిగ్రీ వరకు చదివి పదేళ్ల క్రితం భారత ఆర్మీకి సెలక్ట్ అయ్యారు. ప్రస్తుతం వారు ఢిల్లీలో విధులు నిర్వహిస్తున్నారు. ‘మా పిల్లలు రాజు, శ్రీకాంత్ చిన్నవయస్సు నుంచే భారత సైన్యం అంటే ఇష్టపడేవారు. ప్రస్తుతం పాకిస్తాన్‌తో యుద్ధం ఆందోళనగా ఉంది. మా పిల్లలతోపాటు భారత ఆర్మీలో ఉన్నవారంతా క్షేమంగా ఉండాలని ఆదేవుడిని ప్రార్థిస్తున్నాం.’ అని తల్లి సుభద్ర తెలిపింది.ఆశయానికి ‘అమ్మ’ అండ..జనగామ: ‘నేను సైనికున్నవుతా.. దేశ శుత్రువులను కాల్చి చంపేస్తా’ అంటూ చదువుకునే రోజుల నుంచి దేశ భక్తి కలిగిన జనగామ పట్టణానికి చెందిన మాదాసు అన్నపూర్ణ, ఎల్లయ్య దంపతుల కుమారుడు శ్రీనాథ్ సైన్యంలో చేరి చిన్న నాటి కోర్కెను తీర్చుకున్నాడు. కొడుకు ఆశయానికి తల్లి అండగా నిలిచి కొండంత భరోసా ఇచ్చింది. 13 సంవత్సరాల క్రితం సైన్యంలో చేరి మెటాలజికల్(వాతావరణ శాఖ) కేటగిరి ఎయిర్ ఫోర్స్ వింగ్‌లో బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. అత్యంత ప్రమాదకరమైన సియాచిన్‌లో మొదట బాధ్యతలు స్వీకరించాడు. ప్రస్తుతం సిందూర్–2 యుద్ధంలో సేవలు అందిస్తున్నాడు. ఆడపిల్లల నుదిటి బొట్టు తుడిచేసిన ఉగ్రమూకలను తుదముట్టించే విధుల్లో తన కొడుకు భాగస్వామిగా ఉండడం పూర్వజన్మ అదృష్టంగా భావిస్తున్నామని తల్లి అన్నపూర్ణ గర్వంగా చెబుతున్నారు. -
అమ్మ భయపడితే.. నచ్చజెప్పా..
మహబూబాబాద్ అర్బన్: నా చిన్నతనం నుంచే పోలీస్, ఆర్మీలో చేరాలన్నది నా కల. 2012లో ఆర్మీ ఉద్యోగానికి ఎంపికయ్యాను. ఆడపిల్లవు, ఆర్మీ అంటే ప్రాణాలతో చెలగాటం.. అని అమ్మ భయపడింది. కానీ, ఈరోజుల్లో ఆడపిల్లలు విమానాలు, రాకెట్లు నడపుతున్నారు.. దేశాలు దాటి అమ్మాయిలు ఉద్యోగాలు చేస్తున్నారు.. నేను దేశంలోనే ఉంటూ దేశంకోసం పనిచేస్తానని అమ్మకు నచ్చజెప్పా. గుజరాత్, జమ్మూకాశ్మీర్, న్యూఢిల్లీలో పనిచేశా. ప్రస్తుతం హైదరాబాద్‌లో రాపిడ్యాక్షన్ ఫోర్స్‌లో విధులు నిర్వహిస్తున్నాను. – ఎడ్ల ఝాన్సీ, మానుకోట -
పనులు శరవేగంగా చేపట్టాలి
● కలెక్టర్ రాహుల్‌శర్మ కాళేశ్వరం : కాళేశ్వరంలో ఈ నెల 15 నుంచి 26వ తేదీ వరకు జరగనున్న సరస్వతీ పుష్కరాల పనులు శరవేగంగా చేపట్టాలని కలెక్టర్ రాహుల్‌శర్మ ఆదేశించారు. ఈమేరకు శనివారం ఎస్పీ కిరణ్ ఖరేతో కలిసి ఘాట్, సరస్వతి మాతావిగ్రహం, జ్ఞాన దీపం, స్టాళ్లు, పుష్కర స్నానాలు ఆచరించే నది ప్రాంతం, పారిశుద్ధ్య ఏర్పాట్లు, విద్యుత్ సరఫరా, తాగునీరు, మరుగుదొడ్ల ఏర్పాట్లు పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పుష్కరాలకు సమయం తక్కువగా ఉందని, పనులు శరవేగంగా చేపట్టాలని అధికారులు, కాంట్రాక్టర్లును ఆదేశించారు. భక్తులు నదిలోకి వెళ్లకుండా ప్రమాద హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని విభాగాల సమన్వయంతో ఏర్పాట్లు వేగంగా పూర్తిచేయాలని పేర్కొన్నారు. పుష్కరాలను విజయవంతంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధంగా ఉందని తెలిపారు. -
బిడ్డకు ఆశీర్వాదం
జనగామ: ‘బిడ్డా దేశం నీకోసం ఎదురు చూస్తుంది.. తుపాకీ ఎక్కుపెట్టు.. భరత మాత జోలికి వచ్చే ఉగ్రమూకల భరతం పట్టాలి’ అంటూ బచ్చన్నపేట మండలం ఇటికాలపల్లికి చెందిన జవాన్ బేజాటి వెంకట్‌రెడ్డిని అతడి తల్లి నాగలక్ష్మి నిండు మనసుతో ఆశీర్వదించి సాగనంపారు. సెలవులపై గత నెల 30న స్వగ్రామానికి వచ్చిన వెంకట్‌రెడ్డి.. పాకిస్తాన్‌తో యుద్ధం నేపథ్యంలో ఆర్మీ హెడ్ క్వార్టర్ నుంచి పిలుపు రావడంతో శనివారం శంషాబాద్ ఎయిర్ పోర్టు మీదుగా కశ్మీర్‌కు బయలు దేరాడు. 2005లో సెంట్రల్ ఆర్ముడ్ ఫోర్స్‌కు ఎంపికై న వెంకట్‌రెడ్డికి 2007లో మొదటి పోస్టింగ్‌లో జమ్మూకశ్మీర్ శాంతి భద్రతల విభాగంలో బాధ్యతలు అప్పగించారు. 2009–15 వరకు అస్సాంలో విధులు నిర్వహించగా.. ఉత్తమ సేవలకు 2014లో కామెండేషన్ డిస్క్‌తో సత్కరించారు. 140 కోట్ల భారత ప్రజలకు కాపలా ఉండే అవకాశం మా ఇంట్లో నుంచి కొడుక్కు రావడం తల్లిగా గర్విస్తున్నానంటూ ఆనంద భాష్పాలతో నాగలక్ష్మి తనలోని సంతోషం.. ఆనందాన్ని వ్యక్తం చేశారు. -
మన సంస్కృతీసంప్రదాయాలు ఉట్టిపడేలా..
వెంకటాపురం(ఎం)/ఖిలావరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ నెల14న పర్యటించనున్న ప్రపంచ అందాలభామలకు మన సంస్కృతీసంప్రదాయాలు తెలిసేలా సాంస్కృతిక కార్యక్రమాలకు అధికారులు రూపకల్పన చేశారు. మొత్తంగా 116 దేశాల సుందరీమణులు ముందుగా హనుమకొండలోని హరిత హోటల్లో కొద్దిసేపు సేదదీరాక.. వేయిస్తంభాల దేవాలయం చేరుకుని రుద్రేశ్వర స్వామిని దర్శించుకుంటారు. అక్కడినుంచి రెండు బృందాలుగా విడిపో యి.. ఒక బృందం నేరుగా ములుగు జిల్లా రామప్ప చేరుకోనుంది. మరోబృందం కాకతీయు రాజధాని ఖిలా వరంగల్ మధ్యకోటకు వెళ్తుంది. యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయాన్ని సుందరీమణులు హిందూ సంప్రదాయ దుస్తుల్లోనే సందర్శించనున్నట్లు సమాచారం. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో రామప్ప ఆలయం వద్దకు చేరుకున్న వారికి గిరిజన నృత్యంతో కళాకారులు స్వాగతం పలుకుతా రు. కొమ్ముకోయ నృత్యాన్ని ప్రదర్శిస్తూ అలరిస్తారు. వివిధ పూజా, ఇతరత్రా కార్యక్రమాల తర్వాత గార్డెన్లో ఏర్పాటు చేసిన వేదిక వద్ద సాంస్కృతిక ప్రదర్శనలు ఉండనున్నాయి. అలేఖ్య పుంజాల బృందంతో క్లాసికల్ డ్యాన్స్, పేరిణి నృత్య ప్రదర్శన ఉంటుందని అధికారులు వెల్లడించారు. కాకతీయుల కళా సంస్కృతిని చాటేలా.. ఖిలావరంగల్ కోటలోని శిల్పాల ప్రాంగణంలో పర్యాటకశాఖ ఆధ్వర్యంలో గజ్జల రంజిత్‌కుమార్ నేతృత్వంలో 5 నిమిషాల నిడివిగల పేరిణి శివ తాండవ నృత్యాన్ని ప్రదర్శించనున్నారు. కాకతీయుల కళా సంస్కృతిని ప్రపంచానికి చాటే విధంగా అద్భుతమైన ప్రదర్శన చేయనున్నారు. ఇందుకు కావాల్సిన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి.అందాలభామలను అబ్బురపర్చేలా ప్రదర్శనలు రామప్ప వద్ద గిరిజన, కొమ్ముకోయ నృత్యాలు ఖిలావరంగల్ కోటలో పేరిణి శివతాండవం ఏర్పాట్లు చేస్తున్న టూరిజం, జిల్లాల అధికారులు సంప్రదాయ దుస్తుల్లో రామప్పకు సుందరీమణులు -
పనులకు వెళ్లొస్తూ పరలోకాలకు..
రాయపర్తి: మహిళా కూలీలతో వస్తున్న ఓ ఆటోను బొలెరో ఢీకొంది. ఈ ప్రమాదంలో ఓ కూలీ మృతిచెందగా మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన శనివారం మండలంలోని కొలన్‌పల్లి శివారులో చోటు చేసుకుంది. ఎస్సై శ్రవణ్‌కుమార్ కథనం ప్రకారం.. రాయపర్తి మండలంలోని కొలన్‌పల్లి శివారు జయరాంతండా(కె) గ్రామానికి చెందిన లావుడ్య బిచ్చాని(45), లావుడ్య చావ్లి, లావుడ్య బికీ, లావుడ్య సువాలి కూలీ పనుల నిమిత్తం పాలకుర్తి వెళ్లారు. పనులు పూర్తయిన అనంతరం గ్రామానికి వస్తున్న క్రమంలో కొలన్‌పల్లి శివారులో బొలెరో ఎదురుగా ఆటోను ఢీకొంది. ఈ ఘటనలో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో బిచ్చాని మృతి చెందింది. ముగ్గురు క్షతగాత్రులను వర్ధన్నపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై బాధిత కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రవణ్‌కుమార్ తెలిపారు. ఆటోను ఢీకొన్న బొలెరో.. మహిళా కూలీ మృతి ముగ్గురికి గాయాలు -
రాజీమార్గంలో కేసులు పరిష్కరించుకోవాలి
తొర్రూరు: రాజీమార్గంలో కేసులు పరిష్కరించుకోవాలని తొర్రూరు జూనియర్ సివిల్ కోర్టు జడ్జి ధీరజ్‌కుమార్ తెలిపారు. రాజీ మార్గంలో కేసుల పరిష్కారంపై శుక్రవారం డివిజన్ కేంద్రంలోని జూనియర్ సివిల్ కోర్టులో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా జడ్జి మాట్లాడుతూ ఈ నెల 19 వరకు చెక్ బౌన్స్ కేసులపై కక్షిదారులతో చర్చిస్తామన్నారు. జూన్ 9 నుంచి 14వ తేదీ వరకు ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించి కేసులు పరిష్కారమయ్యేలా కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో బార్ అధ్యక్షుడు ముకుందారావు, వైస్ ప్రెసిడెంట్ రామకృష్ణ, ప్రతినిధులు మధుసూదన్, ఐలోని, ఏజీపీ లింగాల శ్రీనివాస్ పాల్గొన్నారు. జూనియర్ సివిల్ కోర్టు జడ్జి ధీరజ్‌కుమార్