
పకడ్బందీ చర్యలు చేపట్టాలి
మహబూబాబాద్ రూరల్: రైతులకు ఎలాంటి ఇ బ్బందులు లేకుండా కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అ ద్వైత్ కుమార్ సింగ్ అన్నారు. మహబూబాబాద్ మండలంలోని కంబాలపల్లి గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రిజిస్టర్లను పరిశీలించారు. కొనుగోలు చేసిన ధా న్యం, రైస్ మిల్లులకు తరలింపు, మద్దతు ధర చెల్లించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేంద్రానికి వచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేసి వెంటనే మిల్లులకు తరలించాలని ఆదేశించారు. లారీలు, గోనె సంచుల సమాచారంపై రైతులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరంలేదని, అధికారులు ధాన్యాన్ని మిల్లులకు సకాలంలో తరలించి రైతులకు ఎటువంటి సమస్యలు లేకుండా క్షేత్రస్థాయిలో పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. వాతావరణ మార్పుల దృష్ట్యా అకాల వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడవకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని సూచించారు.
ధాన్యాన్ని సకాలంలో మిల్లులకు తరలించాలి
చిన్నగూడూరు: ధాన్యాన్ని సకాలంలో మిల్లులకు తరలించాలని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఆదేశించారు. సోమవారం మండలంలోని చిన్నగూడూరు, విస్సంపల్లి, ఉగ్గంపల్లి కొనుగోలు కేంద్రాలను సందర్శించి ధాన్యం కొనుగోలు రిజిస్టర్లను పరిశీలించారు. ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయిల్లో తనిఖీలు చేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ మహబూబ్ అలీ, కొనుగోలు కేంద్రం నిర్వాహకులు, రైతులు ఉన్నారు.
కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్
ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిశీలన