
ఉపాధ్యాయుల చేతుల్లోనే విద్యార్థుల భవిష్యత్
మహబూబాబాద్ అర్బన్: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల భవిష్యత్ ఉపాధ్యాయుల చేతుల్లో ఉందని డీఈఓ రవీందర్ రెడ్డి అన్నారు. జిల్లాలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల ఉపాధ్యాయులకు రెండో విడత శిక్షణ తరగతులు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా డీఈఓ శిక్షణ తరగతులను సందర్శించి మాట్లాడారు. ప్రతీరరోజు క్రమం తప్పకుండా సయమానికి ఉపాధ్యాయులు శిక్షణకు హాజరు కావాలన్నారు. అనంతరం రాష్ట్ర విద్యాశాఖ సెక్రటరీ యోగితా రానా వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఉపాధ్యాయులు శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకొని విద్యార్థుల బంగారు భవిష్యత్‌కు బాటలు వేయాలని కోరారు. కార్యక్రమంలో ఏసీజీఈ శ్రీరాములు, సైన్స్ అధికారి అప్పారావు, క్వాలిటీ కోఆర్డినేటర్ ఆజాద్, రిసోర్స్ పర్సన్లు తదితరులు పాల్గొన్నారు.