ధాన్యం కొనుగోళ్లకు కంట్రోల్‌ రూం ఏర్పాటు | - | Sakshi
Sakshi News home page

ధాన్యం కొనుగోళ్లకు కంట్రోల్‌ రూం ఏర్పాటు

May 21 2025 1:45 AM | Updated on May 21 2025 1:45 AM

ధాన్య

ధాన్యం కొనుగోళ్లకు కంట్రోల్‌ రూం ఏర్పాటు

మహబూబాబాద్‌: ధాన్యం రైతుల సౌకర్యార్థం కలెక్టర్‌ కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్‌ రూం ఏర్పాటు చేశామని డీసీఎస్‌ఓ ప్రేమ్‌కుమార్‌, సివిల్‌ సప్లయీస్‌ డీఎం కృష్ణవేణి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ధాన్యం కొనుగోళ్లు, రవాణా, కేంద్రాల నిర్వహణ తదితర అంశాలపై రైతులు టోల్‌ ఫ్రీ 7995050789 నంబర్‌కు కాల్‌ చేయవచ్చన్నారు. సమస్యలను తమ అధికారుల దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించుకోవాలన్నారు.

లేబర్‌కోడ్‌లు

రద్దు చేసే వరకు పోరాటాలు

కార్మిక సంఘాల నేతల పిలుపు

నెహ్రూసెంటర్‌: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్‌కోడ్‌లు రద్దు చేసే వరకు పోరాటాలు నిర్వహిస్తామని కార్మిక సంఘాల నేతలు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌ వద్ద కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి కుంట ఉపేందర్‌, ఏఐటీయూసీ జిల్లా సహాయ కార్యదర్శి వరిపెల్లి వె వెంకన్న, ఐఎఫ్‌టీయూ జిల్లా అధ్యక్షుడు పర్వత కోటేష్‌, టీయూసీఐ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి రవి, ఎస్‌కె.మదార్‌ మాట్లాడారు. కార్మిక హక్కుల రక్షణ, చట్టాల అమలు, కనీస వేతన చట్టం అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, సంఘటిత, అసంఘటిత రంగంలో పని చేస్తున్న కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఆకుల రాజు, అల్వాల వీరయ్య, సమ్మెట రాజమౌళి, దార స్నేహబిందు, హలావత్‌ లింగన్న, లక్ష్మయ్య, సురేష్‌, బిల్లకంటి సూర్యం, భాస్కర్‌రెడ్డి, కార్మికులు పాల్గొన్నారు.

పెండింగ్‌ వేతనాలు

విడుదల చేయాలి

మహబూబాబాద్‌: మున్సిపల్‌ కార్మికుల పెండింగ్‌ వేతనాలు వెంటనే విడుదల చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆకుల రాజు డిమాండ్‌ చేశారు. సీఐటీయూ అనుబంధ తెలంగాణ మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో మంగళవారం మున్సిపల్‌ కార్యాలయం ఎదుట ఆందోళన చేసి మేనేజర్‌ శ్రీధర్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆకుల రాజు మాట్లాడుతూ.. కార్మికులంతా దళిత, బడుగు, బలహీన వర్గాలకు చెందిన వారే ఉన్నారని, ఐదు నెలలుగా వేతనాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికా రుల నిర్లక్ష్యంతోనే వేతనాలు విడుదల కావడం లేదన్నారు. కనీస వేతనం రూ.26,000 ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈనెల 26లోపు వేతనాలు చెల్లించాలని, లేని యెడల 27నుంచి కార్మికులు పనులు నిలిపివేస్తారని హెచ్చరించారు. కార్యక్రమంలో కుమ్మరికుంట్ల నాగన్న, సమ్మెట రాజమౌళి, తోట శ్రీనివాస్‌, కాంపెల్లి శ్రీనివాస్‌, శ్రీను, విజయ్‌, పుష్పరాజ్‌, చిరంజీవి, వీరన్న, సుజాత, లక్ష్మి పాల్గొన్నారు.

ఏఐటీయూసీ ఆధ్వర్యంలో వినతి

మున్సిపల్‌ కార్మికుల వేతనాలు చెల్లించాలని ఏఐటీయూసీ అనుబంధ యూనియన్‌ ఆధ్వర్యంలో మున్సిపల్‌ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి రేషపల్లి నవీన్‌ రమణ, విజయ్‌, మధుసూదన్‌, నాగేశ్వర్‌రావు, శ్రీను పాల్గొన్నారు.

ధాన్యం కొనుగోళ్లకు  కంట్రోల్‌ రూం ఏర్పాటు  1
1/1

ధాన్యం కొనుగోళ్లకు కంట్రోల్‌ రూం ఏర్పాటు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement