
‘గిరి జలవికాసం’ అమలుకు చర్యలు
మహబూబాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిర సౌర గిరి జలవికాసం పథకం అమలుకు జిల్లాలో పకడ్బందీ చర్యలు తీసుకుంటామని కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్ అన్నారు. కలెక్టర్ కార్యాలయం ఎన్‌ఐసీ వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో ఐటీడీఏ ఏటూరునాగారం ప్రాజెక్ట్ డైరెక్టర్ చిత్రామిశ్రా, డీఎఫ్‌ఓ విశాల్ సంబంధిత అధికారులతో కలిసి కలెక్టర్ గిరిజల వికాసం పథకంపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అర్హత కలిగిన ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టాదారులను మండలస్థాయి కమిటీ ద్వారా గుర్తించి భూగర్భజల సర్వేను నిర్వహించాలన్నారు. బోరు బావులు నిర్మించి సోలార్ సిస్టం ద్వా రా మోటార్లను వినియోగంలోకి తీసుకొచ్చి డ్రిప్ ఇరిగేషన్ ద్వారా సాగు చేపట్టాలన్నారు. ప్రభుత్వ సూచనల ప్రకారం క్షేత్రస్థాయిలో ట్రైబల్ వెల్ఫేర్, అటవీశాఖ, గ్రౌండ్ వాటర్, హార్టికల్చర్, సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నా రు. ప్రత్యేక గ్రామ సభలు నిర్వహించి ఆసక్తి గల ట్రైబల్ రైతులకు పథకం ఆవశ్యకతను వివరించాలన్నారు. ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా మాట్లాడుతూ.. ప్రభుత్వ జీఓ ప్రకారం గిరిజన రైతులను గుర్తించి వారి అభ్యున్నతికి కృషి చేయాలన్నారు.
సద్వినియోగం చేసుకోవాలి
డిజిటల్ ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్చేంజ్ పథకాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్ అన్నారు. కలెక్టరేట్‌లోని కలెక్టర్ చాంబర్‌లో మంగళవారం జిల్లా పెట్టుబడుల ప్రోగ్రాం కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 58మంది ఎస్టీ, ఎస్సీ లబ్ధిదారులకు సబ్సిడీ రాయితీ మంజూరు చేసినట్లు చెప్పారు. యువతకు ప్రైవేట్ ఇండస్ట్రీయల్‌లో ఉపాధి కల్పించడానికి డిజిటల్ ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్చేంజ్ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు చెప్పారు. జిల్లా పరిశ్రమల శాఖ జీఎంశ్రీమన్నారాయణరెడ్డి, అధికారులు పాల్గొన్నారు.
వైద్యులు అందుబాటులో ఉండాలి
నెహ్రూసెంటర్: ఆస్పత్రికి వస్తున్న రోగులు, ప్రజ లకు వైద్యులు అందుబాటులో ఉంటూ వైద్య సేవలు అందించాలని కలెక్టర్ అధ్వైత్‌కుమార్‌సింగ్ సూ చించారు, జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిని మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..రోగులకు నిరంతర వైద్య సేవలు అందించాలని తెలిపారు. వైద్యులు, సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించారు. సదరం క్యాంపుల నిర్వహణకు ఆస్పత్రిలో అనువైన ప్రదేశంలో సేవలు అందించేలా బ్లాక్ నిర్మాణ ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించారు. మానసిక, కంటి, చెవి, ముక్కు, దంత, వినికిడి విభాగాలకు సంబంధించిన పరీక్షల కోసం ప్రత్యేక ఏర్పాటు చేయాలన్నారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీనివాసరావు, ఆర్‌ఎంఓ జగదీశ్వర్, వైద్యులు, సిబ్బంది, డీఆర్‌డీఓ మధుసూదన్‌రాజు, డీఈ, ఏఈ, శంకర్ ఉన్నారు.
కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్