
‘భరోసా’ సేవలు అభినందనీయం
మహబూబాబాద్ రూరల్: భరోసా సెంటర్ సేవలు అభినందనీయమని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ అన్నారు. జిల్లా కేంద్రంలో భరోసా సెంటర్ ఏర్పా టు చేసి మూడేళ్లు పూర్తయింది. ఈమేరకు సెంటర్‌లో మంగళవారం ఎస్పీ కేక్ కట్ చేసి మాట్లాడారు. భరోసా సెంటర్‌లో బాధితులకు అన్ని రకాల సహాయ సహకారాలు, అత్యవసర పరిస్థితుల్లో ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందన్నారు. వార్షికోత్సవం సందర్భంగా భరోసా సెంటర్ తరఫున నలుగురు బాధితులకు తక్షణ సహాయం కింద రూ.30వేలు అందజేశారు. డీఎస్పీ తిరుపతిరావు, ఎస్బీ సీఐ చంద్రమౌళి, టౌన్, రూరల్ సీఐలు దేవేందర్, సర్వయ్య, రూరల్ ఎస్సై దీపిక, భరోసా సెంటర్ ఎస్సై ఝాన్సీ, షీ టీం ఎస్సై సునంద, డీడబ్ల్యూఓ ధనమ్మ, సీడబ్ల్యూసీ చైర్‌పర్సన్ నాగవాణి, భరోసాసెంటర్, సఖి, షీ టీమ్ సిబ్బంది ఉన్నారు.
ఎస్పీ సుధీర్‌రాంనాథ్ కేకన్