
పుష్కరఘాట్ పులకించేలా..
కాళేశ్వరం: సరస్వతీ పుష్కరాలకు పుష్కరఘాట్ వద్ద పనులు చకచకా జరుగుతున్నాయి. పుష్కరఘాట్ వద్ద ఏర్పాటు చేసిన సరస్వతీమాత విగ్రహానికి డెకరేషన్ చేస్తున్నారు. పుష్కరఘాట్ పొడువునా భారీగా సెట్టింగ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. శివుడి విగ్రహం, దాని ఎదుట నంది విగ్రహం ఏర్పాటు చేస్తున్నారు. కాశీపండితులతో ఏడు హారతులు ఇచ్చే సభాస్థలి వద్ద ప్రత్యేకంగా హైదరాబాద్‌కు చెందిన కేంఎంకే గ్లోబల్ లిమిటెడ్ ప్రైవేట్ సంస్థ పనులు చేపడుతుంది. దీంతో పుష్కరఘాట్ పులకించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయనే చర్చ జరుగుతోంది.