
అత్యాధునిక సౌకర్యాలతో రైల్వేస్టేషన్లు
ఖిలా వరంగల్: ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు స్వీకరించినప్పటినుంచి ఇతర దేశాలతో పోటీ పడే విధంగా రైల్వేస్టేషన్లలో అంతర్జాతీయ ప్రమాణాలతో సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర భారీ ఉక్కు పరిశ్రమలశాఖ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు. అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా రూ.25.41 కోట్ల వ్యయంతో పునరాభివృద్ధి చేసిన వరంగల్ రైల్వేస్టేషన్‌ను గురువారం రాజస్థాన్‌లోని బికినీర్ నుంచి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్చువల్‌గా పునఃప్రారంభించారు. ఈసందర్భంగా వరంగల్ రైల్వేస్టేషన్ ప్రాంగణంలో రైల్వేశాఖ దక్షిణమధ్య రైల్వే అడిషనల్ జనరల్ మేనేజర్ నీరజ్ అగర్వాల్ అధ్యక్షతన ప్రారంభోత్సవ సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా కేంద్ర భారీ ఉక్కు పరిశ్రమల శాఖ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ హాజరై మాట్లాడారు. అత్యాధునిక, సాంకేతిక పరిజ్ఞానంతో అమృత్ భారత్ పథకంలో స్టేషన్లు అభివృద్ధి చెందాయన్నారు. రూ.25 కోట్లతో కాజీపేట రైల్వేస్టేషన్ ఆధునికీకరణ పనులకు జరుగుతున్నాయని, కోచ్ ఫ్యాక్టరీ, ట్రైబల్ యూనివర్సిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అత్యాధునిక హుంగులతో రానున్న 30 సంవత్సరాల్లో రైల్వేలను ఆధునికీకరించే విధానంలో వృద్దులు, దివ్యాంగులకు టాయిలెట్స్, వెయిటింగ్ రూమ్స్, ఎస్కలేటర్స్, ఫుట్‌ఓవర్ బ్రిడ్జి, లిఫ్ట్‌లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో బుల్లెట్ రైలు తీసుకురావడానికి భారత ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మామునూరు ఎయిర్‌పోర్ట్ రన్‌వే విస్తరణ కోసం భూమిని కేటాయించిన వెంటనే పనులు ప్రారంభిస్తామని స్పష్టం చేశారు.
కళావైభవం ఉట్టిపడేలా స్టేషన్ : శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్
అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా రూ.25.41 కోట్ల వ్యయంతో కాకతీయ కళావైభవం ఉట్టిపడేలా వరంగల్ రైల్వేస్టేషన్‌ను తీర్చిద్దిదడం సంతోషకరమన్నారు. రాష్ట్రంలో 40 రైల్వే స్టేషన్లకు మాత్రమే కాకుండా అన్ని స్టేషన్లను అమృత్ భారత్ పథకంలో భాగంగా అభివృద్ధి చేయాలని కోరారు.
రూ.425 కోట్లతో చర్లపల్లి నిర్మాణం : ఎంపీ ఈటల రాజేందర్
ప్రధాని మోదీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల్లో సమపాళ్లలో అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. రూ.425 కోట్ల వ్యయంతో చర్లపల్లి టర్మినల్‌ను అత్యాధునిక హంగులతో నిర్మించినట్లు తెలిపారు.
కాజీపేటను రైల్వే డివిజన్‌గా ప్రకటించాలి: ఎంపీ కడియం కావ్య
కాకతీయుల కళలు ప్రతిభింబించేలా వరంగల్ రైల్వేస్టేషన్ నిర్మించడం అభినందనీయమన్నారు. అమృత్ భారత్ పథకం కింద కాజీపేట రైల్వేస్టేషన్ పునరుద్దరణ పనులు కొనసాగుతున్నాయని, త్వరలో ప్రారంభించుకుంటామన్నారు. కాజీపేట రైల్వే డివిజన్‌గా ప్రకటించాలని, రైల్వేశాఖ ద్వారా బస్‌స్టేషన్ నిర్మించాలని కోరారు.
103 స్టేషన్లు దేశానికి అంకితం: ఎంపీ డీకే అరుణ
అమృత్ భారత్ పథకం కింద దేశవ్యాప్తంగా 103 స్టేషన్లను మౌలిక సదుపాయాలు, సకల సౌకర్యాలు కల్పించి ప్రధాని చేతుల మీదుగా వర్చువల్‌గా ప్రారంభించుకొని దేశానికి అంకితం చేసినట్లు తెలిపారు.
ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
వరంగల్ రైల్వేస్టేషన్ ప్రారంభోత్సవంలో ప్రదర్శించిన వివిధ సాంస్కృతిక నృత్యాలు ఆకట్టుకున్నాయి. భద్రకాళి అమ్మవారి గీతం, సిందూర్ ప్రత్యేక గీతానికి సైనిక దుస్తుల్లో కళాకారులు చేసిన నృత్యాలు అలరించాయి.
శిలాఫలకాన్ని ఆవిష్కరించిన కేంద్ర మంత్రి
శ్రీనివాసవర్మ
వరంగల్ రైల్వేస్టేషన్‌ను గురువారం రాజస్థాన్‌లోని బికినీర్ నుంచి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్చువల్‌గా పునఃప్రారంభించగా.. కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం రైల్వే అధికారులు ఇటీవల నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ ప్రశంసాపత్రాలను అందజేసి అభినందించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ సారయ్య, ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్‌రెడ్డి, కేఆర్ నాగరాజు, నాయిని రాజేందర్‌రెడ్డి, యశస్విని రెడ్డి, కలెక్టర్ సత్యశారద, బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు, వన్నాల శ్రీరాములు, ప్రేమేందర్‌రెడ్డి, మాజీ మేయర్ రాజేశ్వర్‌రావు, బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్, స్థానిక కార్పొరేటర్ చింతకాల అనిల్, రైల్వే అధికారులు పాల్గొన్నారు.
కేంద్ర భారీ ఉక్కు పరిశ్రమల శాఖ మంత్రి
భూపతిరాజు శ్రీనివాసవర్మ
వరంగల్ రైల్వేస్టేషన్‌ను వర్చువల్‌గా
పునఃప్రారంభించిన ప్రధాని మోదీ
హాజరైన రాష్ట్ర మంత్రి పొంగులేటి, ఎంపీలు,
ఎమ్మెల్యేలు
వ్యాసరచన పోటీల్లో ప్రతిభ కనబరిచిన
విద్యార్థులకు ప్రశంస పత్రాల ప్రదానం
స్టేషన్ల ఆధునికీకరణ
అభినందనీయం: మంత్రి
పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
రాష్ట్రంలోని బేగంపేట, వరంగల్, కరీంనగర్ రైల్వేస్టేషన్లను ఆధునికీకరించి ప్రారంభించినందుకు ప్రధాని మోదీకి రాష్ట్రం తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచంలోనే హైదరాబాద్ ఎలా అభివృద్ధి చెందిందో అదే విధంగానే వరంగల్ నగరం అభివృద్ధి సాధించాలని అన్నారు. ఉత్తర, దక్షిణ భారతాన్ని కలుపుతున్న కాజీపేట జంక్షన్‌ను డివిజన్‌గా ప్రకటించాల్సిన అవసరం ఉందని అన్నారు.

అత్యాధునిక సౌకర్యాలతో రైల్వేస్టేషన్లు

అత్యాధునిక సౌకర్యాలతో రైల్వేస్టేషన్లు