
ట్రాలీ అడుగును అరలుగా మార్చి..
సాక్షి, వరంగల్ : ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం అడవి అన్నవరం గ్రామం నుంచి హైదరాబాద్‌కు ట్రాక్టర్ ట్రాలీ అడుగు భాగంలో అరలుగా(చిన్నపాటి గదుల్లా) తయారుచేసి అందులో నిషేధిత ఎండు గంజాయి ప్యాకెట్లని తరలిస్తున్న నలుగురు నిందితులను వరంగల్ యాంటి నార్కొటిక్స్ బ్యూరో పోలీసులు అరెస్టు చేశారు. టోల్ ఫ్రీ నంబర్ 1908 ద్వారా వచ్చిన విశ్వసనీయ సమాచారంతో డీఎస్పీ కె.సైదులు, ఇన్‌స్పెక్టర్ రవీందర్ నేతృత్వంలో 17 మంది సభ్యుల బృందం వరంగల్ ఉర్సుగుట్ట జంక్షన్‌లో నిఘా పెట్టి ముందు ఎస్కార్ట్‌గా వస్తున్న స్విఫ్ట్ కారుతో పాటు గంజాయితో వస్తున్న ట్రాక్టర్‌ను ఆపారు. తనిఖీ చేస్తే రూ.1,05,38,000ల విలువ చేసే 210 కిలోల 760 గ్రాములు (105 ప్యాకెట్లు) దొరికాయి. నలుగురు నిందితుల నుంచి సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ములుగురోడ్డులోని వరంగల్ యాంటీ నార్కోటిక్స్ పోలీస్ స్టేషన్‌లో డీఎస్పీ కె.సైదులు మీడియాకు శుక్రవారం వివరాలు వెల్లడించారు.
రూ.పది వేలకు ఆశపడి..
400 కిలోమీటర్లకు పైగా నడిపి..
ఏపీలోని అడవి అన్నవరానికి చెందిన తల్లిబాబు, నర్సీపట్నానికి చెందిన గోవిందమ్మ గంజాయి రవాణా చేస్తుంటారు. ఈ క్రమంలో మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ధర్మారం తండాకు చెందిన గుగులోత్ భాస్కర్, కంబాలపల్లి గ్రామం పూరి తండాకు చెందిన కొర్ర వినోద్ కుమార్‌కు తల్లిబాబుతో పరిచయం ఏర్పడింది. అప్పటికే నల్లగొండ జిల్లా నేరేడుగొమ్ము మండలం పెద్దమునిగేడు గ్రామానికి చెందిన కేతావత్ రాము నాయక్‌కు గుగులోతు భాస్కర్ పరిచయం ఉండడంతో ఈ గంజాయి అక్రమ రవాణాకు ప్లాన్ వేశారు. ఇందుకోసం రాము నాయక్ నెలన్నర క్రితం రూ1.60 లక్షలకు ఓ ట్రాక్టర్‌ను కొనుగోలు చేశాడు. కిలో గంజాయి రూ.3,500లకు తల్లిబాబు, గోవిందమ్మ వద్ద కొనుగోలు చేసి హైదరాబాద్‌లోని శ్రీకాంత్‌కు కిలోకు రూ.పదివేల చొప్పున అమ్మేందుకు ట్రాక్టర్ ట్రాలీ కింది భాగాన అరలుగా తయారుచేసి 105 ప్యాకెట్లను అమర్చి మూడ్రోజుల క్రితం అన్నవరం నుంచి బయలుదేరాడు. అయితే ఈ లోడ్‌ను హైదరాబాద్‌కు చేరవేస్తే రూ.10వేలు ఇస్తామని చెప్పడంతో అనకాపల్లి జిల్లా నీతవరం వలసంపేటకు చెందిన విరోధుల శీను ట్రాక్టర్ డ్రైవర్‌గా ఒప్పుకున్నాడు. సుమారు 400 కిలోమీటర్లకుపైగా ప్రయాణించిన ట్రాక్టర్‌లో ఏమీ లేకపోవడంతో ఎక్కడా చెక్ పోస్టుల వద్ద పోలీసులకు అనుమానం రాలేదు. ఈ ట్రాక్టర్‌కు ముందు భాస్కర్ స్నేహితుడి కారు పై లటింగ్ ఉపయోగించారు. టోల్ ఫ్రీ నంబర్ 190 8కు సమాచారం రావడంతో అప్రమత్తమైన వరంగల్ నార్కొటిక్ పోలీసులు ఉర్సుగుట్ట జంక్షన్ వద్ద భాస్కర్, రాము, వినోద్ కుమార్, విరోధుల శ్రీను ను అరెస్టు చేశారు. వీరిని పట్టుకోవడంతో ప్రతిభ చూపిన ఇన్‌స్పెక్టర్ రవీందర్, ఎస్సైలు శ్రీ కాంత్, రాజు, మొగిలి, హెడ్ కానిస్టేబుళ్లు రంగ య్య, నిరంజన్, సోమలింగం, శ్రీనివాస్, కానిస్టేబుళ్లు ఏ.రా జు, కె.శ్రీనివాస్, బి.శ్రీనివాస్, ఎం.రాజేష్, పి.విజ య్, రహీం, కుమారస్వామి, సంపత్, సతీష్, సునీ ల్‌లను డీఎస్పీ సైదులు అభినందించారు. అయితే ఈ మీడియా సమావేశానికి ప్రధాన నిందితుడు భాస్కర్‌ను తీసుకొస్తుండగా పారిపోయే ప్రయత్నం చేయగా పోలీసులు వెంటనే అతడిని లోపలికి తీసుకెళ్లారు.
400 కిలోమీటర్లు..
105 గంజాయి ప్యాకెట్లు
210 కిలోల 760 గ్రాముల
గంజాయి స్వాధీనం
వివరాలు వెల్లడించిన వరంగల్
యాంటీ నార్కొటిక్స్ బ్యూరో డీఎస్పీ సైదులు

ట్రాలీ అడుగును అరలుగా మార్చి..

ట్రాలీ అడుగును అరలుగా మార్చి..

ట్రాలీ అడుగును అరలుగా మార్చి..

ట్రాలీ అడుగును అరలుగా మార్చి..

ట్రాలీ అడుగును అరలుగా మార్చి..