
జవాన్‌కు ఘనసన్మానం
మహబూబాబాద్ రూరల్: ఆపరేషన్ సిందూర్‌లో పాల్గొని వచ్చిన జవాన్ షేక్ అజహర్‌ను ఎస్పీ సుధీ ర్ రాంనాథ్ కేకన్ జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్పీ జవాన్ కుటుంబ యోగక్షేమాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం జవాన్ మాట్లాడుతూ ఆపరేషన్ సిందూర్‌లో పాల్గొనడం జిల్లా వాసిగా గర్వంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్బీ ఇన్‌స్పెక్టర్ చంద్రమౌళి, టౌన్ సీఐ దేవేందర్, ఏఆర్ ఆర్‌ఐ భాస్కర్, మరిపెడ ఎస్సై సతీష్, జవాన్ అజహర్ తల్లిదండ్రులు ఖాసీం, యాకూబ్ బీ, నాగుల మీరా, సోనీ తదితరులు పాల్గొన్నారు.