డిగ్రీ ఇయర్‌వైజ్ పరీక్షల ఫలితాల వెల్లడి
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిఽధి లో ఈ ఏడాది మార్చిలో నిర్వహించిన డిగ్రీ కోర్సు ల బీఏ, బీకాం, బీబీఏ, బీఎసీ కోర్సుల (ఇయర్‌వైజ్ బ్యాక్‌లాగ్స్) మొదటి, ద్వితీయ, ఫైనలియర్ పరీక్ష ల ఫలితాలను శనివారం వీసీ కె.ప్రతాప్‌రెడ్డి.. రిజి స్ట్రార్ వి.రామచద్రంతో కలిసి విడుదల చేశారు. మొత్తం 1,832మంది విద్యార్థులు పరీక్షలకు హా జరుకాగా అందులో1,370మంది (74.38శాతం)ఉత్తీర్ణత సాధించినట్లు పరీక్షల నియంత్రణాధికారి కె. రాజేందర్ తెలిపారు. ఈ ఫలితాలను కేయూ వెబ్‌సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.కాకతీయ.ఏసి.ఇన్‌లో చూడొచ్చని తెలిపారు. ఈ ఫలితాల విడుదల కార్యక్రమంలో అదనపు పరీక్షల నియంత్రణాధికారులు ఎం. తిరుమలాదేవి, పి. వెంకటయ్య, క్యాంప్ ఆఫీసర్ ఎన్. సమ్మయ్య, తదితరులు పాల్గొన్నారు.
పీహెచ్‌డీ పట్టాలకు అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి
కేయూ క్యాంపస్: కేయూ 23వ స్నాతకోత్సవం జూలై 7వ తేదీన నిర్వహించనున్నారు. పీహెచ్‌డీ పొందిన అభ్యర్థులు స్నాతకోత్సవంలో డాక్టరేట్ పట్టాలు పొందాలనుకునే వారు రూ. వెయ్యి చొప్పు న యూనివర్సిటీకి ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించి డబ్ల్యూ డబ్ల్యూడబ్ల్యూ.కేయూఆన్‌లైన్.కో.ఇన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని పరీక్షల నియంత్రణాధికారి రాజేంద ర్ శనివారం తెలిపారు. కేయూలో 2020 జనవరి 1 నుంచి 2025 మే 31వరకు పీహెచ్‌డీ పొందిన అ భ్యర్థులు 573 మంది ఉన్నారు. ఆర్ట్స్, సోషల్ సైన్స్, సైన్స్, కామర్స్‌అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్, ఫార్మసీ, ‘లా’, ఇంజనీరింగ్ కోర్సుల్లో పీహెచ్‌డీ పూర్తిచేసి న అభ్యర్థులు పట్టాలు పొందేందుకు రిజిస్ట్రేషన్ చే సుకోవాలన్నారు. కాగా,2016, 2017, 2018, 201 9, 2020, 2021 సంవత్సరాల్లో వివిధ కోర్సుల్లో గోల్డ్‌మెడల్స్ సాధించిన 564 మందికి కూడా స్నాతకో త్సవంలో గోల్డ్‌మెడల్స్ ప్రదానం చేస్తారన్నారు.


